Panchayat Staff Greets Mancherial Collector
జిల్లా కలెక్టర్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన పంచాయతీ శాఖ ఉద్యోగులు
మంచిర్యాల,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులు.జిల్లా పంచాయతీ అధికారి డి.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మంచిర్యాల,బెల్లంపల్లి డివిజనల్ పంచాయతీ అధికారులు ధర్మారాణి,కొమ్మెర సతీష్, జిల్లా పంచాయతీ కార్యాలయ సిబ్బంది,మండల పంచాయతీ అధికారులు,పంచాయతీ కార్యదర్శులు,ఐ డి ఓ సి మంచిర్యాల లో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం కేక్ కటింగ్ చేసి పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన రెండవ సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించినందుకు అందరిని అభినందించారు.రాబోయే ఎన్నికలలో కూడా ఇలాగే నిబంధతతో నిర్వహించి విజయవంతం చేయాలని సూచించారు.అలాగే డిపిఓ కార్యాలయంలో కేక్ కట్ చేసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ అధికారులు శ్రీపతి బాపూరావు,అజ్మత్,ఎస్.కె సఫ్తర్ అలీ,శ్రీనివాస్,ఎం. సత్యనారాయణ,అనిల్ కుమార్,విజయ్ ప్రసాద్, వెంకటేష్,మహేష్,డిపిఓ కార్యాలయ సిబ్బంది ప్రజ్ఞ, వెంకటేష్,పంచాయతీ కార్యదర్శులు పూదరి నరేందర్,బొడ్డు శ్రావణ్, సుమన్,నాగరాజు,మల్లేష్, వంశీకృష్ణ,రాజశేఖర్,రాకేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
