అంబరాన్నంటిన పంభాఆరాట్ మహోత్సవం

# వైభవంగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో పంబా ఆరాట్టు ,జలక్రీడలు

# పంభాఆరట్ మహా అన్నదానదాతగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

 

# వేలాదిమంది భక్తులు హాజరు..

# అయ్యప్ప శరణుఘోషతో మారుమ్రోగిన నర్సంపేట పరిసర ప్రాంతం

# కేరళ సాంప్రదాయ పద్ధతిలో పంబ ఆరాట్ మహోత్సవం..

#మంగళ నీరాజనాలతో అయ్యప్పస్వామికి మహిళల స్వాగతాలు.

# నర్సంపేట పట్టణం పురవీధుల్లో ఊరేగింపు వేడుక..

#గరుడపక్షి రూపంలో అయ్యప్ప స్వామి దర్శనం.

#మాదన్నపేట సరస్సులో జలక్రీడలు..

# సన్మార్గంలో అయ్యప్పదీక్షా : మాజీ ఎమ్మెల్యే.


నర్సంపేట, నేటిధాత్రి :

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని శ్రీ ధర్మ శాస్తా అయ్యప్ప స్వామి దేవాలయంలోని మణికంఠుడు ,శ్రీ ధర్మశాస్త అయ్యప్పకు చేసిన పంభాఆరట్,జలక్రీడ వేడుకలు అంబరాన్నంటాయి. కేరళ రాష్ట్రంలోని శబరిమలైలో నిర్వహించే విధంగా అయ్యప్పస్వామికి జలక్రీడలు ఆడించారు.అనంతరం అష్టాభిషేకాలు కన్నుల పండుగగా జరిగాయి. అష్టాభిషేకాలైనా నీరు,తేనె,నెయ్యి, పంచదార, పంచామృతం,జీడిపప్పు ,బాదం, పిస్తా, పాలు, పెరుగు ,విభూది,కుంకుమ,పసుపు చందనం లతోపాటు 24 రకాల అభిషేకాలను వేద పండితులు తాంత్రిక పూజారులు శ్రీమాన్ బ్రహ్మశ్రీ డాక్టర్ వెంకటే శర్మ గురుస్వామి మంత్రోచ్ఛారణలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు.నర్సంపేట పట్టణంలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో 24 వ మండల పూజల మహోత్సవాలలో భాగంగా శనివారం మాధన్నపేట సరస్సులో నిర్వహించిన పంభాఆరాట్ మహోత్సవాన్ని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే,మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది సుదర్శన్ రెడ్డి స్వప్న దంపతులు దాతలుగా అంగరంగ వైభవంగా జరిపించారు.శ్రీధర్మ శాస్తా అయ్యప్ప సేవా చారిటబుల్ ట్రస్టు చైర్మన్ సింగరకొండ మాధవ శంకర్ గుప్తా అధ్వర్యంలో ట్రస్ట్ అధ్యక్షుడు సైపా సురేష్ అధ్యక్షతన కమిటీ సభ్యుల నేతృత్వంలో తాంత్రిక వేత్త, గురుస్వామి,శ్రీమాన్ బ్రహ్మశ్రీ డాక్టర్ వెంకటేష్ శర్మ,ఆలయ ప్రధాన అర్చకులు దేవేష్ మిశ్రాల వేద మంత్రోచ్ఛారణ నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు.రాష్ట్ర మాజీ సివిల్ సప్లై చైర్మన్,బిఅర్ఎస్ రాష్ట్ర నాయకులు, నరంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆ పార్టీ నాయకులతో కలిసి గురుస్వామి వెంకటేష్ శర్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయించి ఆశీర్వదించారు.అనంతరం గర్భగుడిలోని అయ్యప్ప స్వామి మూలవిరాట్ విగ్రహాన్ని గురుస్వామి వెంకటేష్ శర్మ పంబ ఆరాట్ దాత బిఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి అందించగా తలపై మోస్తూ అలంకరించిన స్వామివారి రథంలో ప్రతిష్టించారు.గురుస్వామి వెంకటేష్ శర్మ తో కలిసి ఎమ్మెల్యే పెద్ది అయ్యప్పస్వామి రథాన్ని ఊరేగింపుగా నడుపుతూ ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా అయ్యప్ప మాలదారులు,భక్తుల నుత్యాలు,మహిళల కోలాటాలు, డీజే చప్పుళ్ళు ఎంతగానో ఆనందింపజేశాయి.కేరళ సాంప్రదాయ డప్పు వాయిద్యాలు,మహిషి రాక్షసితో పాటు వివిధ వేషధారణతో చేసిన నృత్యాలు,సన్నివేశాలు పలువురిని ఆకట్టుకున్నాయి.మాదన్నపేట చెరువు నిర్వహించిన పంభా ఆరాట్ ఉత్సవ వేడుక కన్నుల పండుగగా కొనసాగింది.దేవాలయం నుండి పట్టణ పురవీదుల నుండి మాదన్నపేట చెరువు వరకు సాగిన ఊరేగింపులో ప్రజలు, మహిళలు మంగళహారతులతో నీరాజనాలతో స్వామివారికి స్వాగతం పలికారు. ఊరేగింపు జరుగుతున్న తరుణంలో గరుడపక్షి అయ్యప్ప స్వామి రూపంలో దర్శనం ఇవ్వడంతో భక్తులు అయ్యప్ప నామస్మరణతో తిలకించారు.ఈ నేపథ్యంలో అమెరికా, మలేషియా దేశాలతో పాటు ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ నల్గొండ వరంగల్ ఉమ్మడి జిల్లాల నుండి సుమారు 10 వేల మంది భక్తులు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ అయ్యప్ప దీక్షా సన్మార్గంలో నడిపిస్తోందని, దీక్ష నియమ నియమాలు ఉన్నతమైనవని అన్నారు.నియోజకవర్గ ప్రజలు అభివృద్దే ముఖ్యమని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభవృద్ధి చెందేలా ప్రాజెక్టులు నిర్మాణం కేసీఆర్ ప్రభుత్వంలో పూర్తయ్యాయని పాకాల, రంగాయాచెరువు ప్రాజెక్టులతో నర్సంపేట ప్రాంతం అభవృద్ధి చెందనుందని ఆయన పేర్కొన్నారు.
మాదన్నపేట చెరువు ఆధ్యాత్మిక ప్రాంతంగా మారిందని ఇటీవల చెరువుకట్టపైన శ్రీ రామలిగేశ్వరస్వామి దేవాలయం పూర్తయ్యి పూజలు జరుగుతున్నాయని పెద్ది పేర్కొన్నారు.ఎలాంటి ఆటంకాలు లేకుండా 21 వ సారి పంబారాట్టు దాత,మహా అన్నదాన దాతగా అవకాశం వచ్చిందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు.

గతంలో నేను మొదటిసారి పంబ ఆటాట్ మహోత్సవంలో పాల్గొన్న క్రమంలో అయ్యప్పస్వామికి గోదావరి జలాలతో. అభిషేకాలు నిర్వహిస్తానని మాట ఇస్తే గురుస్వామి ఆశ్చర్యానికి లోనయ్యారని నేను ఇచ్చిన మాట ప్రకారంగానే గత మూడు సంవత్సరాలుగా గోదారి జలాలతో అయ్యప్ప స్వామికి జల క్రీడల కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని టిఆర్ఎస్ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వివరించారు. రాబోయే 25వ పంబ ఆరాట్ సిల్వర్ జూబ్లీ మహోత్సవాన్ని తెలంగాణ రాష్ట్రంలో లివ్వరబోయే విధంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తానని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హామీ ఇచ్చారు.గురుస్వామి వెంకటేష్ శర్మ మాట్లాడుతూ నర్సంపేట అయ్యప్ప దేవాలయ పంభారాట్ మహోత్సవం తెలంగాణ రాష్ట్రంలో తలమానికంగా మారిందన్నారు.మహోత్సవంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఏసిపి కిరణ్ కుమార్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.ఈకార్యక్రమంలో అమెరికా మై టెంపుల్ యాత్ర ప్రతినిధి ఎన్నారై చంద్రశేఖర్,నర్సంపేట మున్సిపల్ వైస్ చైర్మన్ మునిగాల వెంకట్ రెడ్డి, అర్ఎస్ఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు రాయిడి రవీందర్ రెడ్డి,కౌన్సిలర్స్ రాయిడి కీర్తి దుష్యంత్ రెడ్డి, నాగిశేట్టి పద్మ ప్రసాద్,బాణాల ఇందిర,మల్లీశ్వరి,దేవోజు తిరుమల సదానందం, గందె రజిత చంద్రమౌళి,
బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనాయణ గౌడ్, మండల శ్రీనివాస్,మాజీ ఎంపిపిలు బానోత్ సారంగపాణి,మోతే కళావతి పద్మనాభరెడ్డి,సుంకరి సంతోష్ రెడ్డి,యూత్ నియోజకవర్గ కన్వీనర్, ఎన్నారై శానబోయిన రాజ్ కుమార్,బండి రమేష్,బాల్నే వెంకన్న గౌడ్,మండల శ్రీనివాస్,సీఐలు రమణ మూర్తి,రమణ సాయి, ఎస్సైలు అరుణ్ రాజు,రవి కుమార్, ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చింతల కమలాకర్ రెడ్డి,కోశాధికారి దొడ్డ రవీందర్ గుప్తా,ఉపాధ్యక్షులు ఇరుకు కోటేశ్వరరావు,పబ్బా రమేష్,ఆర్గనైజింగ్ సెక్రటరీలు,శ్రీరాముల శంకరయ్య,చకిలం కృష్ణమూర్తి,తక్కలపల్లి యుగంధర్ రావు,బండారుపల్లి చెంచారావు,పాలకుర్తి శ్రీనివాస్, జాయింట్ సెక్రెటరీలు బొద్దుల దివాకర్,వజినపెళ్లి శ్రీనివాస్,సహాయ కోశాధికారి అనంతుల రామనారాయణ,ముఖ్య సలహాదారులు దేవునూరి అంజయ్య, మాదారపు చంద్రశేఖర్, వంగేటి గోవర్ధన్, శ్రీరాం ఈశ్వరయ్య,దోమకుంట్ల నందయ్య, దుబ్బా రమేష్,బాల్నే సర్వేశం,చింతల నిరంజన్,బాబురావు,భూపతి లక్ష్మీనారాయణలు,ఆకుల ప్రభాకర్,దొడ్డ వేణు,మల్యాల రాజు,సింగిరికొండ వేణుగోపాల్,రావుల సతీష్,పిన్నం రామనాథం,ఇరుకుల వీరలింగం,శ్రీరాముల కార్తీక్,ప్రచార కమిటీ బాధ్యులు భీరం నాగిరెడ్డి,రాజేంద్రప్రసాద్ రెడ్డి,కందుల శ్రీనివాస్ గౌడ్,మల్యాల వినయ్ కుమార్,గురుస్వాములు సంజీవరావు,
బొట్ల నాగరాజు,యాదగిరి,అనిల్ మహేంద్ర,రాయసాబ్,అంకూస్ గౌడ్,
భరత్ కుమార్,భీరం రవీందర్ రెడ్డి,పుల్లూరి కపిల్ స్వామి గౌడ్,ఆలయ సిబ్బంది దేశి రాము,పోలీస్ శాఖ అధికారులలతో పాటు ప్రజా ప్రతినిధులు,భక్తులు తదతరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!