పామాయిల్ సాగు రైతును రాజును చేస్తోంది
భద్రాద్రి కొత్తగూడెం హార్టికల్చర్ అధికారి కిషోర్
డివిజన్ అధికారి రాధాకృష్ణ
చర్ల నేటి ధాత్రి:
చర్ల మండలం దానవాయిపేట గ్రామంలో ఆయిల్ ఫెడ్ అధికారుల ఆధ్వర్యంలో పామ్ ఆయిల్ మొక్కల పంపిణీ చేశారు
మెగా ప్లాంటేషన్ డే సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హార్టీ కల్చర్ అధికారి కిశోర్ మరియు డివిజన్ అధికారి రాధాకృష్ణ పిలుపుమేరకు ఆయిల్ ఫెడ్ అధికారులు చర్ల మండలంలోని రైతులకు పూర్తి సబ్సిడీ పై పామ్ ఆయిల్ మొక్కల పంపిణీ మరియు మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు చర్ల మండలంలో దాదాపు 300 ఎకరాలు సాగు లో ఉండగా విస్తీర్ణం భారీగా పెంచేందుకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ లను వినియోగించుకోవాలని ఆయిల్ ఫెడ్ అధికారులు పిలుపునిచ్చారు మొక్కలకే కాకుండా డ్రిప్ ఇరిగేషన్ పరికరాల పై కూడా సబ్సిడీ వస్తుందనీ తెలియజేశారు అంతే కాకుండా ఎకరానికి రూ 4200 రూపాయలు చొప్పున ప్రోత్సాహకం ఇవ్వటం జరుగుతుంది అంతర్గత పంటలపై అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ అధికారులు వికాస్ సత్యనారాయణపురం ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ ఎమ్ శ్రీనివాసరాజు ఆదర్శ రైతు సాగి శ్రీనివాసరాజు మరియు రైతులు చలపతి వెంకటేశ్వర్లు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు