-గృహలక్ష్మి కింద అర్హులందరికీ ఇళ్లిస్తా..
-స్వాగతించిన తండా వాసులు
*దూలిమిట్ట నేటిధాత్రి..
ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం జనగామ బీఆర్ ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి దూలిమిట్ట మండలం రెడ్యానాయక్ తండా వాసులు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ గృహలక్ష్మి కింద కొందరికి ఇళ్లు వచ్చాయని, అర్హులందరికీ ఇళ్లతో పాటు పింఛన్లు ఇప్పిస్తానని హామీ ఇవ్వడంలో గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు. గతంలో ఎమ్మెల్సీ నిధుల నుంచి తండాల అభివృద్ది కోసం నిధులు ఇచ్చానని, మౌళిక వసతుల కల్పన కోసం ఇంకా నిధులు తెచ్చి తండాను అభివృద్ధి చేసే బాధ్యతను నేనే తీసుకుంటానని చెప్పడంతో తండా వాసులంతా చప్పట్లతో స్వాగతించారు.