
కొమురవెల్లి నేటి ధాత్రి :
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవస్థానంలో స్వామివారి కల్యాణోత్సవం ఈ నెల 7వ తేదీన జరుగనుంది. కావున ఏర్పాట్లు ను స్థానిక ఎమ్మెల్యే పల్లె రాజేశ్వర్ రెడ్డి అధికారులతో పర్యటించి సలహాలు సూచనలు చేశారు. జాతర ఏర్పాట్లు పర్యవేక్షించారు..ఈ సందర్బంగా జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేయాలని సూచించారు.కొమరవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవ సందర్భంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి పోలీస్ అధికారులకు ఎండోమెంట్, ఎలక్ట్రిసిటీ, ఆర్ అండ్ బి, ఆర్డబ్ల్యూ, గ్రామపంచాయతీ అధికారులకు సిబ్బందికి భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. అడిషనల్ డీసీపీ అడ్మిన్ అందె శ్రీనివాసరావు, కళ్యాణము జరుగు తోట బావి, శీగ్రదర్శనం, స్పెషల్ దర్శనం, జనరల్ దర్శనం ఏర్పాటుచేసిన క్యూ లైన్ లను మరియు కళ్యాణ కట్ట వద్ద విఐపి గ్యాలరీ, జనరల్ గ్యాలరీ, కళ్యాణం జరిగిన తర్వాత భక్తులు సందర్శించే ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ప్రదేశాలను విఐపి పార్కింగ్ జనరల్ పార్కింగ్ ప్రదేశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి భక్తులకు ఎలాంటి అసౌకర్యము కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సిబ్బందికి సూచించారు. ప్రత్యేకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పోలీస్ కంట్రోల్ రూమ్ ను కమ్యూనికేషన్ గురించి విహెచ్ఎఫ్ సెట్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఏసీపీ సతీష్, టెంపుల్ ఈవో బాలాజీ, అసిస్టెంట్ ఈవో అంజయ్య, చేర్యాల సిఐ సత్యనారాయణ, కొమురవెల్లి ఎస్ఐ నాగరాజు, మద్దూర్ ఎస్ఐ యూనిస్ హైమద్ అలీ, వివిధ డిపార్ట్మెంట్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.