https://epaper.netidhatri.com/
ప్రచార సరళిపై జనగామ బిఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి, నేటిధాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావు తో చెప్పిన వివరాలు… ఆయన మాటల్లోనే.
`అన్ని వర్గాల ప్రజల ఆదరణ.
`ఎక్కడికెళ్లినా ఘనంగా స్వాగతాలు.
`మంగళహారతులతో మహిళల దీవెనలు.
`పెద్ద ఎత్తున పల్లాతో ప్రచారంలో ప్రజలు.
`నిర్విరామంగా నాయకుల ప్రచార జోరు.
`ప్రభుత్వ పథకాలపై విసృత ప్రచారం.
`ప్రతిపక్షాలను ఎండగడుతూ ముందుకు సాగుతున్న వైనం.
`తెలంగాణ ఉద్యమ ద్రోహి కొమ్మూరి.
`తెలంగాణ పేరు మీద గెలిచి పక్క చూపులు చూసిన అవకాశవాది.
`వ్యాపారాల కోసం ఉద్యమం తాకట్టు పెట్టిన కొమ్మూరి.
`కాంగ్రెస్ ను నమ్మితే జనగామ అభివృద్ధి కుంటుపడుతుంది.
`కాంగ్రెస్ తో కరంటు కష్టాలొస్తాయి.
`అయ్యో అంటే.. కన్నీళ్లు మిగులుతాయి.
`పాత రోజులొస్తాయి.
`రైతు గోసలు మొదలౌతాయి.
`నేను గెలిస్తే జనగామను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తా!
`ఆశీర్వదించి అసెంబ్లీకి పంపండి.
హైదరాబాద్,నేటిధాత్రి:
జనగామ బిఆర్‌ఎస్ అభ్యర్ది పల్లా రాజేశ్వరరెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. జనగామ నియోజకవర్గంలో బిఆర్‌ఎస్ పార్టీ ఎంతో బలంగా వుంది. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి జనగామ పెద్దఎత్తున పోరాటాలను సాగించింది. ఉద్యమ సమయంలో అనేక సంఘటలను జనగామలో జరిగాయి. తెలంగాణ ప్రకటన చేసి, కేంద్రం వెనక్కి తీసుకున్న తర్వాత మొదలైన దీక్షలు తెలంగాణ వచ్చేదాకా జరిగాయంటే జనగామలో బిఆర్‌ఎస్ ఎంత బలంగా వుందో అర్దం చేసుకోవచ్చు. 2014 తెలంగాణ వచ్చిన తర్వాత ఆ పార్టీ జనగామలో మరింత బలంగా మారింది. జనగామ ఒకప్పుడు కరువు విలయతాండవమాడిన ప్రాంతం. చుక్క మంచినీటికి కూడా విలవిలలాడిన ప్రాంతం. ప్లోరైడ్ నిండి, ప్రజలు చిన్న వయసులోనే నడుములు వంగి , పండ్లు ఊడిపోయి అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనేవారు. నిత్యం కొన్ని లక్షలరూపాయల నీటి వ్యాపారం సాగేది. ఇప్పుడు జనగామ సస్యశ్యాలమైన ప్రాంతం. గత రెండు ఎన్నికల్లో బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మంచి మెజార్టీతో గెలుపొందారు. ఈసారి పోటీ చేస్తున్న పల్లారాజేశ్వరరెడ్డి కూడా మంచి మెజార్టీతోనే విజయం సాధించే అవకావాలు కనిపిస్తున్నాయి. జనగామలో ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోటగా వుండేది. తర్వాత కాంగ్రెస్‌కూడా కొన్ని సార్లు విజయం సాదిస్తూ వచ్చేది. కాని తెలంగాణ ఉద్యమం తర్వాత జనగామలో కాంగ్రెస్ కనుమరుగైపోయింది. వామపక్షాల జడా లేకుండాపోయింది. వున్నది ఇక ఏకైక పార్టీ బిఆర్‌ఎస్ మాత్రమే. అది కూడా ఎవరికీ అందనంత ఎత్తులో వుంది. తెలంగాణ ఉద్యమ కారులు, ఇతర పార్టీలకు చెందిన వాళ్లు కూడా ఆ సమయంలో బిఆర్‌ఎస్ పెద్ద ఎత్తున చేరారు. ఇతర పార్టీలు ఖాళీ అయ్యాయి. బిఆర్‌ఎస్‌లో నవతరం నాయకత్వం మెండుగా వుంది. బలంగా వుంది. అందుకే జనగామ నియోజవర్గంలో బిఆర్‌ఎస్ కదిలించలేనింత శక్తివంతంగా వుంది. గతంలో జనగామ పల్లెల్లో పెద్ద గా రాజకీయాలు కనిపించేవి కాదు. కాని ఇప్పుడు బిఆర్‌ఎస్ పార్టీ రాకతో పల్లెల్లో కూడా గులాబీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. జనగామ జిల్లాలో వున్న సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, ఎంపిపిలు, జడ్పీటీసిలు అంతా బిఆర్‌ఎస్ చెందిన వాళ్లే వున్నారు. పల్లెల్లో కూడా అనేక గ్రామ కమిటీలున్నాయి. జనగామ నియోజకవర్గ పరిధిలోని మండలాలు, మేజర్ గ్రామ పంచాయితీల్లో కూడా బిఆర్‌ఎస్ ఎంతో బలంగా వుంది. అటు జనగామ నుంచి, ఇటు చేర్యాల వరకు బిఆర్‌ఎస్‌కు వ్యతిరేకత లేదు. చేర్యాల ఒకప్పుడు నియోజకవర్గం. ఇప్పుడు జనగామలో బాగస్వామ్యం. ఆ ప్రాంతం సిద్దిపేటకు అత్యంత సమీపంలో వుంటుంది. ఆ ప్రాంతంలో అటు ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రభావం, మంత్రి హరీష్ ప్రభావం బాగా వుంటుంది. అందువల్ల జనగామ బిఆర్‌ఎస్ కంచుకోటగా మారింది. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న పల్లా రాజేశ్వరరెడ్డి ప్రచారం ఎలా సాగుతున్నందన్న విషయాన్ని నేటి దాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావుకు వివరించారు. ఈ వివరాలు ఆయన మాటల్లోనే …
జనగామ నియోజకవర్గ పరిధిలోని ఏ గ్రామానికి ప్రచారానికి వెళ్లినా ప్రజలు ఎంతో ఆదరంగా స్వాగతం పలుకుతున్నారు.
అడుగడుగునా స్వాగత తోరణాలు ఏర్పాటు చేస్తున్నారు. తాను ప్రచారానికి వస్తున్నానని తెలిసి ప్రజల పెద్దఎత్తున హజరౌతున్నారు. గ్రామ పొలిమేరల్లోనే పెద్దఎత్తున జనం స్వాగతం పలికి నాతోపాటే ప్రచారంలో పాల్గొంటున్నారు. డప్పు చపళ్ల స్వాగతంలో ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక మహిళలు, పార్టీ నాయకులు పెద్దఎత్తున మంగళహారతులతో స్వాగతం పలుకుతున్నారు. గ్రామంలోకి అడుగుపెట్టగానే బొట్టుపెట్టి ఆశీర్వదిస్తున్నారు. గ్రామాల్లో ఇళ్లిళ్లు తిరుగుతుంటే వాళ్లే నాకు భరోసా ఇస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్లతో తాము సంతోషంగా వున్నామని చెబుతున్నారు. నన్ను ఎంతో ఆదరిస్తున్నారు. తప్పకుండా గెలిపించుకుంటామని దీవిస్తున్నారు. ఇక రైతులు ఏ గ్రామానికి వెళ్లిన గతం తాలుకు బాధలు గుర్తు చేస్తూ, ఇప్పుడు తాము ఎంత సంతోషంగా వున్నారో వివరిస్తున్నారు. నీళ్ల విషయంలో ప్రజలు ఎంతో సంతృప్తిగా వున్నారు. ఒకప్పుడు ఎండిపోయిన చెరువుతో, ఊరంతా ఒట్టిపోయి వుండేది. కూలీ చేసుకోవడానికి కూడా పనులు లేకుండాపోయేవి. కాని ఇప్పుడు ఊరంతా పండుగ వాతావరణం కనిపిస్తోంది. పల్లె పచ్చగా మారింది. ఎక్కడ చూసినా పొలాలే కనిపిస్తున్నాయి. ఇక కరంటు కూడా రైతులకు ఎంతో భరోసానిచ్చింది. ఇరవై నాలుగు గంటల కరంటుతో రైతు ఎంతో సంతృప్తి కరంగా వున్నారు. రైతు బంధు అన్నది రైతుల్లో కొండంత ధైర్యం నింపిందనే విషయాన్ని ప్రజలే చెబుతుంటే ఎంతో ఆనందం కల్గుతోంది. ఒకప్పుడు సాగు బాటు రోజున చేతిలో చిల్లిగవ్వలేక రైతు దిగాలు పడేవారు. కాని నేడు తొలకరి చినుకు పడేలోగానే రైతు బంధు వస్తోంది. విత్తనాలకు కొదవలేకుండాపోతోంది. ఎరువులకు కూడా సరిపోతున్నాయి. ఒకప్పుడు మంచినీటి కోసం పల్లెలు అరిగోస పడ్డ సందర్భం వుంది. ఎండాకాలంలో ఊళ్లలో బోర్లు ఎండిపోయి,మంచినీటి కూడా ఇబ్బందులు పడిన కాలం చూశారు. మరి ఇప్పుడు నిత్యం సురక్షితమైన మంచినీరు మిషన్ భగీరధ ద్వారా అందుతున్నాయి. పల్లెల్లో ప్రతి ఇంటికి ఏదో ఒక ప్రభుత్వ పధకం అంది వుంది. కళ్యాణ లక్ష్మి కూడా చాలా కుటుంబాలకు అందాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పథకం ఏదో రూపకంగా కుటుంబాలలో వెలుగులు నింపుతున్నాయి. అందుకే ప్రజలు ఎంతో నమ్మకంగా చేతిలో చెయ్యేసి చెబుతున్నారు. నేను ప్రచారానికి వెళ్తున్న గ్రామాలు, వీ ధుల్లో అప్పటికప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా తీర్మాణాలు చేసుకుంటున్నారు. నాకు కొండంత ధైర్యాన్ని ఇస్తున్నారు.
ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే జనగామలో ఆపార్టీకి స్ధానమేలేదు.ప్రధానంగా ప్రత్యర్ధి కొమ్మూరి ప్రతాపరెడ్డి తెలంగాణ ద్రోహి. ఈ విషయం ప్రజలకు బాగా తెలుసు. తెలంగాణ ఉద్యమం సాగుతున్న సమయంలో ముఖ్యమంత్రి కేసిఆర్ ఆయనకు ఎంతో సముచితమైన స్ధానం కల్పించారు. కాని దాన్ని ఆయన నిలబెట్టుకోలేదు. రాజకీయాల కోసం, ఆధిపత్యం కోసం తన వ్యాపారాల కోసం పార్టీకి ద్రోహం చేశాడు. తెలంగాణ పేరు మీద గెలిచి, పక్క చూపులు చూశాడు. 2009లో ఓడిపోయిన తర్వాత అప్పటి కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మి, ఆ పార్టీ వైపు వెళ్లాడు. తర్వాత మరోపార్టీలో చేరాడు. ఇప్పుడు కాంగ్రెస్‌నుంచి పోటీలో వున్నారు. కొమ్మూరి పచ్చి రాజకీయ అవకాశవాది. అందుకే ప్రజలు ఆయనను దూరంపెట్టారు. ఆయనకు జనగామ రాజకీయాల్లో స్ధానం లేదు. అసలు కాంగ్రెస్‌పార్టీకే తెలంగాణలో చోటు లేదు. కొమ్మూరికి అసలే లేదు. తన వ్యాపారాల కోసం ఉద్యమాన్ని తాకట్టు పెట్టాడు. అలాంటి నాయకుడిని ప్రజలు ఏమాత్రం విశ్వసించరు. కాంగ్రెస్‌పార్టీ చెప్పే అబద్దాలను ప్రజలు ఎట్టిపరిస్ధిత్లో నమ్మరు. తెలంగాణ సమాజం ఎంతో చైతన్యవంతమైంది. పగటి కలలు కంటున్న కాంగ్రెస్ ప్రజల్లో విశ్వాసాన్ని నింపాల్సిన సమయంలోనే వ్యవసాయానికి మూడుగంటలు సరిపోతుందని చెబుతుంటే, భవిష్యత్తుల రైతులను ఎంత గోస పెట్టాలని చూస్తుందో అర్ధం చేసుకోవచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రయోజనాలు ఏనాడు పట్టని కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ప్రేమ పొంగుకొస్తోంది. అంటే అది తెలంగాణ మీద ప్రేమ కాదు. అధకారంకోసం ఆరాటం. పదవీ వ్యామోహం. పెత్తనం కోసం. అంతే తప్ప ప్రజల కోసం కాదు. తెలంగాణ ప్రయోజనాల కోసం కాదు. అందుకే ప్రజలు కాంగ్రెస్ ప్రచారాన్ని పెద్దగా విశ్వసించడం లేదు. కర్నాకటకు చెందిన డికే.శివకుమార్ ఏం చెప్పారో తెలంగాణ ప్రజలంతా విన్నారు. ముఖ్యంగా ఒకప్పుడు నిరంతరం కరువును చూసిన జనగామ ప్రాంతం ఇప్పుడిఫ్పుడే కోలుకుంటోంది. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ మాటలు నమ్మితే కరంటు కష్టాలు తప్పవు. కన్నీళ్లు తప్పవు. అందుకే జనగామ మరింతగా అభివృద్ది చెందాలంటే బిఆర్‌ఎస్సే గెలవాలి.తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేది ఒక్క ముఖ్యమంత్రి కేసిఆర్ మాతమ్రే. అందుకే తనను గెలిపిస్తే జనగామాను అన్ని రంగాల్లో అభివృ ద్దిచేస్తా…మీ పెద్దకొడుకుగా మీకు సేవలందిస్తా…