
MLA Amar
*పలమనేరుకు తలమానికమైన పెద్ద చెరువును పరిరక్షించాలని
*అధికారులను
అదేశించిన ఎమ్మేల్యే అమర్..
పలమనేరు(నేటిధాత్రి)అగస్టు19:
పలమనేరుకు తలమానికమైన పెద్ద చెరువును పరిరక్షించాలని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆక్రమణదారుల కోసం అధికారులు చెరువుకు గండి కొట్టి చెరువులోని నీటిని రైతుల పంట పొలాల్లోకి వదిలేసారని పత్రికలలో రావడంపై ఆయన ఘాటుగా స్పందించారు. దీంతో మున్సిపల్ రెవిన్యూ మరియు ఇరిగేషన్ అధికారులతో మంగళవారం ఆయన సమావేశం నిర్వహించారుఈ సందర్భంగా చెరువుకు గండి కొట్టడానికి గల కారణాన్ని మున్సిపల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.చెరువు ఆయకట్టు ప్రాంతంలోని పలువురి ఇళ్లలోకి నీరు చేరి ఇబ్బందులు ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతో నీటిని మళ్లించినట్లు తెలిపారు. అయితే దీనిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నీటిని మల్లించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పటికీ కట్టను తవ్వేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. పట్టణ ప్రజలకు మరియు ఆయకట్టు రైతులకు ఇబ్బంది కలగకుండా వెంటనే కట్ట మరమ్మతు పనులు పునరుద్ధరించి సప్లై ఛానల్ ద్వారా నీటిని తరలించే చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. అందుకోసం అవసరమైన నిధులను వెంటనే తెప్పించేందుకు కృషి చేస్తానని ఆ దిశగా రెవిన్యూ అధికారుల సహకారంతో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇక చెరువు ఆక్రమణలకు గురి కాకుండా వెంటనే హద్దులను గుర్తించి పరిరక్షించాలన్నారు.ఈ సమావేశంలో తహసిల్దార్, ఇన్బనాధన్, మున్సిపల్ కమిషనర్ ఎన్వీ. రమణారెడ్డి, ఇరిగేషన్ డిఈ చొక్కల నాయక్, ఏఈ లక్ష్మీనారాయణ లతో పాటు మున్సిపల్,రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.