
పాలకుర్తి నేటిధాత్రి
పాలకుర్తి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని ఝాన్సీ రెడ్డి వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో డీఈ లు, ఏఈ లు, రెవిన్యూ, వివిధ శాఖల సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమీక్ష లో అధికారులతో నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి చర్చ జరిపారు. ముఖ్యంగా పాలకుర్తి మండలంలోని పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ అభివృద్ది, వివిధ మండలాల్లోని గ్రామాలలో అంతర్గత రోడ్ల నిర్మాణం, నూతన గ్రామపంచాయితీ భవనాలపై, త్రాగు నీరు, సాగు నీరు, గ్రామాల్లో నెలకొన్న సమస్యలతో పాటు పలు అభివృద్ధికి సంబంధించి అధికారులతో చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నదని, అందుకు అధికారులు బాధ్యతతో పనిచేయాలని ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి అధికారులకు సూచించారు.