గాలి బీభత్సం బాధితులను పరామర్శించిన పాలకుర్తి ఎమ్మెల్యే
పాలకుర్తి నేటిధాత్రి
పాలకుర్తి మండల కేంద్రంలో గాలి బీభత్సం కారణంగా కిరాయి ఇంటిలో నివాసముంటున్న రాపర్తి లక్ష్మీ, భర్త రామచంద్రయ్య తీవ్రంగా బాధపడ్డారు. గత కొన్ని రోజులుగా కిరాయికి ఓ చిన్న ఇంటిలో నివసిస్తున్న ఈ కుటుంబానికి, రాత్రి వచ్చిన బలమైన గాలికి ఇంటి పై భాగంలో ఉన్న రేకులు పూర్తిగా ఎగిరిపోయాయి. విషయం తెలుసుకున్న పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి బాధిత కుటుంబాన్ని వెంటనే పరామర్శించారు. ఎమ్మెల్యే వారి నివాసానికి స్వయంగా వెళ్లి, రాపర్తి లక్ష్మీ ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి పరిస్థితిని పూర్తిగా తెలుసుకున్నారు. తక్షణ సహాయం కింద ఎమ్మెల్యే స్వయంగా నిత్యావసర సరుకులు కొనిచ్చి బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబాన్ని ఓదార్చుతూ, ప్రభుత్వం వారి సంక్షేమానికి అంగీకరంగా ఉన్నదని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి యశస్విని రెడ్డి మాట్లాడుతూ రాపర్తి లక్ష్మీకి ఇప్పటివరకు ఇంటి స్థలం లేకపోవడం వల్ల డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరవలేదు. అయితే తదుపరి విడతలో ప్రభుత్వం ద్వారా ఆమెకు ఇంటి స్థలం మంజూరు చేయించి, డబుల్ బెడ్రూం ఇల్లు కట్టించి ఇస్తానని హామీ ఇచ్చారు. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రజలెవరూ ఒంటరిగా ఉండకుండా చూడటమే మా బాధ్యత అని అన్నారు. ఎమ్మెల్యే వెంట బ్లాక్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, మండల అధ్యక్షులు గిరగాని కుమారస్వామి, ప్రధాన కార్యదర్శి భార్గవ్, పట్టణ అధ్యక్షులు నాగన్న, మాజీ సర్పంచ్ యకంత రావు, మండల యూత్ అధ్యక్షులు హరీష్, రమేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, బాధిత కుటుంబం ఎమ్మెల్యే చర్యలను చూసి హర్షం వ్యక్తం చేస్తూ, వెంటనే స్పందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.