కేంద్రమంత్రి బండి సంజయ్ గారికి పాలాభిషేకం

జమ్మికుంట నేటి ధాత్రి

ఈ రోజు జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది అనంతరం నాయకులు మాట్లాడుతూ జమ్మికుంట యూత్ కాంగ్రెస్ నాయకులు గౌరవనీయులు బండి సంజయ్ గారి దిష్టి బొమ్మ దగ్ధం చేయడం సిగ్గు చేత చర్యగా భావిస్తున్నాం దీన్ని వ్యతిరేకిస్తూ జమ్మికుంట Bjym ఆధ్వర్యంలో శ్రీ బండి సంజయ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది
ఇట్టి విషయాన్ని తెలుపుతూ Bjym కరీంనగర్ జిల్లా అధికార ప్రతినిధి మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు బండి సంజయ్ అన్న ని విమర్శలు చేసే స్థాయి నీది కాదు అని ఇలాంటి చిల్లర వేషాలు మానుకోవాలని లేదంటే పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో కాంగ్రెస్ నాయకులను అడ్డుకుంటాం అని హెచ్చరించారు మరియు
Bjym జమ్మికుంట టౌన్ ప్రెసిడెంట్ ప్రశాంత్ మాట్లాడుతూ అస్సలు ఉద్యమ కారుడైన గద్దర్ మీద కేసులు పెట్టిన వారు మీరు కదా 2005 లో వైస్ రాజశేఖర్ ఆధ్వర్యంలో గద్దర్ గారి మీద కేసులు పెట్టింది మీ కాంగ్రెస్ పార్టీ కదా 30 సంవత్సరాల నుండి దళిత జాతి అభ్యుదయం గురించి కొట్లాడే మంద కృష్ణ మాదిగ గారికి కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ అవార్డు ప్రకటించడం మాకు ఎంతో హర్షణీయం అని అన్నారు
మీరు ఏదైతే ఉద్యమ కారులకు అన్యాయం అని మీరు అంటున్నారో తెలంగాణ ఉద్యమ సమయంలో వారిని ఎక్కడి అక్కడికి అణిచి వేసింది మీరు కదా అని ప్రశ్నించారు
కేంద్ర ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి కూడా రావడం లేదు అని అనడం కాదు కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం శ్వేతా పత్రం విడుదల చేసే దమ్ము ఉంద అని ప్రశ్నించారు ఉంటే శ్వేతా విడుదల చేసి తరువాత మీరు మాట్లాడితే బాగుంటుంది అని హితవు పలికారు
ఇట్టి కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా అధికార ప్రాధినిది కైలాసకోటి గణేష్. జమ్మికుంట Bjym పట్టణ అధ్యక్షుడు రాచపల్లి ప్రశాంత్ మరియు OBC మోర్చా పట్టణ అధ్యక్షుడు బురుగుపల్లి రాము గారు bjym పట్టణ ప్రధాన కార్యదర్శి దేవులపల్లి నవీన్ ఉపాధ్యక్షుడు శ్రీవర్తి అఖిల్.Bjym నాయకులు పసునూటి శివనగరాజు శ్రీవర్తి ప్రవీణ్ .సిరియాల విజయ్.పాచిమట్లా శ్రీకాంత్. గణేష్.మనోజ్.సాయి.అక్షయ్.రోషన్.వెంకటేష్. సుమన్.సాయి తదితరులు పాల్గొన్నారు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!