ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:
ఓదెల మండలంలోని ఇందుర్తి గ్రామంలో బుధవారం రోజున సీఎం రేవంత్ రెడ్డి,పెద్దపల్లి శాసనసభ్యులు విజయరమణారావు ల చిత్రపటాలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు రెండు హామీలను నెరవేర్చగా ఫిబ్రవరి 27 తేదీన ఇచ్చిన హామీ మేరకు మరొక రెండు హామీలైన గృహ జ్యోతి పథకం తో పాటు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ హామీలను ప్రారంభించినందుకు సీఎం, శాసనసభ్యులకు తెలిపి చిత్రపటాలకు పాలాభిషేకం చేసినట్లు తెలిపారు.నాయకులు బండారి శ్రీనివాస్,తుమ్మ సదానందం, గోపగాని గణేష్ ,కంకణాల సాయి రెడ్డి,అంబాల రాజు, పరుపాటి శివాజీ రెడ్డి,బండారి వర్షిత్,వినయ్, ఉమాపతి తదితరులు పాల్గొన్నారు.