
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో సోమవారం రోజున అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ యువజన సంఘం ఆవిర్భవించి 48 సంవత్సరాలు పూర్తి చేసుకుని 49 వ సంవత్సరంలోకి అడుగు పెట్టిన సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం* చేయడం జరిగిందనితెలంగాణా రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్యతెలిపారు.
ఈ సందర్భంగా మల్లయ్య మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ రచయిత బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలతో పాటు మహానీయుల సిద్ధాంతాలను లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లాలన్నారు దళితులైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కులాల వారు సంఘటితంగా ఏకం కావాలన్నారు అలాగే 1976లో అంబేద్కర్ సంఘం ఏర్పడిందని , నేటి వరకు 48 సంవత్సరాలు పూర్తి చేసుకున్నదని . 48వ వార్షికోత్సవ సభలో బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి రాజ్యాధికారం చేపట్టాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు సరిగోమ్ముల రాజేందర్ జిల్లా సాంస్కృతిక కార్యదర్శి జన్నే యుగేందర్ మండల ఉపాద్యక్షులు కట్కూరి శ్రీనివాస్ నాయకులు గుర్రపు రాజమౌళి, పుల్ల ప్రతాప్ కనకం తిరుపతి,గురుకుంట్ల కిరణ్ ,పర్లపెల్లి కుమార్ పాముకుంట్ల చందర్ గుర్రపు తిరుపతి తదితరులు పాల్గొన్నారు.