అంబేద్కర్ యువజన సంఘం మొగుళ్ళపల్లి మండల అధ్యక్షులు మంగళపల్లి శ్రీనివాస్
మొగుళ్ల పెళ్లి నేటి ధాత్రి
అంబేద్కర్ యువజన సంఘం ఆవిర్భవించి 48 సంవత్సరాలు పూర్తి చేసుకుని 49 వ సంవత్సరంలోకి అడుగు పెట్టిన సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగిందని.
జయశంకర్ భూపాలపల్లి జిల్లామొగుళ్ళపల్లి మండల కేంద్రంలో AYS మండల అధ్యక్షుడు మంగళపల్లి శ్రీనివాస్ అద్యక్షతన అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేయడం జరిగింది. అలాగే మొగుళ్ళపల్లి
అంబేద్కర్ యువజన సంఘం గ్రామ శాఖ అధ్యక్షులు బండారు కుమార్ పూలమాలవేసి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు మంగళపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ రచయిత బాబా సాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలతో పాటు మహానీయుల సిద్ధాంతాలను లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లాలన్నారు దళితులైన SC,ST, BC మైనారిటీల కులాల వారు సంఘటితంగా ఏకం కావాలన్నారు అలాగే 1976లో అంబేద్కర్ సంఘం ఏర్పడిందని , నేటి వరకు 48 సంవత్సరాలు పూర్తి చేసుకున్నదని చెప్పారు. *48వ వార్షికోత్సవ సభలో పాల్గొన్నామని చెప్పారు. బాబా సాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి రాజ్యాధికారం చేపట్టాలని కోరారు. నిమ్న జాతి అభివృద్ధి చెందుటకు ఎంతో కృషి చేశారని ఆయన అన్నారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాయకుంటే మన బతుకులు దారుణంగా ఉండేవని తెలిపారు. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత భారతదేశ ప్రజలపై ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో
అంబేద్కర్ యువజన సంఘం మండల ఉపాధ్యక్షులు రేణుకుంట్లచందర్ మండల నాయకులు బండారి రామస్వామి, నేర్పటి శ్రీనివాస్, శనిగరపు రామస్వామి,, , మొగుళ్ళపల్లి గ్రామ శాఖ కోశాధికారి బండారి కుమార్, మొగుళ్ళపల్లి గ్రామ ఉపాధ్యక్షులు బండారి సదా రాజు ,గోనెల రమేష్, గొల్లపల్లి శ్రీనివాస్, వీరస్వామి, బొచ్చు సురేందర్, తదితరులు పాల్గొన్నారు