బోయినిపల్లి,నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిని పల్లి మండలం ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి బోయినిపల్లి మండల రెడ్డి సంఘం తరుపున బోయినిపల్లి మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయటం జరిగింది.
ఈ సందర్బంగా రెడ్డి ఐక్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంధి తిరుపతి రెడ్డి మరియు వన్నెల రమణ రెడ్డి మాట్లాడుతూ
గత పది సంవత్సరాలనుండి రెడ్డి కార్పొరేషన్ కోసం అలుపెరుగని పోరాటం చేసాం గత రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంత పోరాటం చేసిన ఎన్ని వినతిపత్రలు ఇచ్చిన కార్పొరేషన్ ప్రకటించలేదు
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది
రెడ్డి కులం లో కూడా నీరు పేదలు చాలా మంది ఉన్నారు వారిని దృష్టిలో ఉంచుకొని కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మరియు ఇందుకు సహకరించిన మంత్రి వర్గానికి రెడ్డి సంఘం తరుపున ధన్యవాదములు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రెడ్డి ఐక్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంధి తిరుపతి రెడ్డి, వన్నెల రమణ రెడ్డి,నిమ్మ భారత్ రెడ్డి, గుడి శేఖర్ రెడ్డి,నిమ్మ వినోద్ రెడ్డి, పోరెడ్డి మల్లారెడ్డి , డబ్బు వెంకట్ రెడ్డి,గడ్డం తిరుపతి రెడ్డి,ఏమిరెడ్డి సురేందర్ రెడ్డి, పెండ్యాల శ్రీనివాస్ రెడ్డి,నారాయణ రెడ్డి, మాధవ రెడ్డి ,అనుముల లక్ష్మరెడ్డి, గుడి శ్రీనివాస్ రెడ్డి ,వంచ దినేష్ రెడ్డి,నరేందర్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.