తాజా మాజీ వైస్ ఎంపీపీ విడిదినేని అశోక్
గణపురం నేటి ధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుద్ధారం గ్రామంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు గారి ఆదేశాల మేరకు తాజా మాజీ వైస్ ఎంపీపీ విడిదినేని అశోక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు లక్ష వరకు ఉన్న రైతులకు రుణమాఫీలు చేస్తున్న శుభ సందర్భంగా రైతులతో కలిసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం అశోక్ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం రైతన్నలకు ఇచ్చిన హామీ ప్రకారం చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని నేడు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయబోతుంది ఇచ్చిన మాట ప్రకారం మాట నిలబెట్టుకుని రైతన్నల రుణాలను మాఫీ చేయబోయే ఈ యొక్క రుణమాఫీ పండుగను బుద్ధారం గ్రామ రైతులు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు యువకులు వైభవంగా సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో బీసీ సెల్ అధ్యక్షులు మాల భద్రయ్య నల్లబేల్లి బాబురావు వల్లపు రాజేందర్ ముదిరాజ్ కుల పెద్ద మల్లవేన రాజు గుళ్ళ భద్రయ్య బిక్కినేని వేణుగోపాల్ రావు బండి రమేష్ డేగల భద్రయ్య నరసింగం తదితర నాయకులు రైతులు పాల్గొన్నారు