నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి :
చట్టసభలలో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని ఎమ్మెల్సీ, మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత ఎనలేని పోరాటం చేయగా అందుకు స్పందించిన కేంద్ర ప్రభుత్వం కేబినెట్ లో ఆ బిల్లుకు ఆమోదం తెలిపి పార్లమెంట్ లో ప్రవేశ పెట్టింది.అందుకు గాను బుదవారం మహిళా జాగృతి వరంగల్ జిల్లా అధ్యక్షురాలు తాల్లపెళ్లి సాంబలక్ష్మి అధ్వర్యంలో దుగ్గొండి మండలంలోని గిర్నివావి వద్ద ఎమ్మెల్సీ కవిత చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా సాంబలక్ష్మి మాట్లాడుతూ మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని గత మార్చి 10 ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన దీక్ష ఫలితమే నేడు కేంద్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో దుగ్గొండి మండల కన్వీనర్ అనుముల పద్మ,కో కన్వీనర్ బృంగిమటం సంధ్యారాణి,బొడికుంట్ల రజిత, డోకుల రమాదేవి,కోరే లక్ష్మి,ఇనుముల వసంత, కంత్రి రాధ తదితరులు పాల్గొన్నారు.