చందుర్తి, నేటిదాత్రి:
రాజన్న సిరిసిల్ల చెందుర్తి మండల కేంద్రంలో ఈరోజు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మరియు బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫోటోలకు చందుర్తి మండల రజక సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. శాసనసభలో రేవంత్ రెడ్డి మాట ఇచ్చిన ప్రకారం తెలంగాణ ఆడపడుచు తొలి తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు అయినటువంటి చాకలి చిట్యాల ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన ప్రభుత్వం ప్రతిష్టిస్తుందని సీఎం తెలియజేయడం పట్ల రజక సంఘం సభ్యులు మరియు బడుగు బలహీన వర్గాలందరూ హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో చందుర్తి రజక సంఘం మండల అధ్యక్షులు సుద్దాల నర్సయ్య, చందుర్తి రజక సంఘం అధ్యక్షులు లింగంపల్లి రాములు, మండల ప్రధాన కార్యదర్శి వనపర్తి సతీష్, కోశాధికారి కొడగంటి గంగాధర్, జిల్లా రజక సంఘం ప్రధాన కార్యదర్శి లింగంపల్లి దేవయ్య మడేల్, పులి రేణుక సత్యం ఎంపీటీసీ, లింగంపల్లి వెంకట్, లింగంపల్లి తిరుపతి, లింగంపల్లి రాములు, లింగంపల్లి లచ్చయ్య, నరసయ్య, లింగంపల్లి మల్లయ్య, లింగంపల్లి లక్ష్మీరాజం, లింగంపల్లి రాజయ్య, సుద్దాల రామచంద్రం, పొలాస ప్రమోద్, కొడగంటి దేవయ్య తదితరులు పాల్గొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ఫోటోకు పాలాభిషేకం
