కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితులకు ప్రత్యేక ప్రాధాన్యత
ఎస్సి విభాగం అధ్యక్షులు బొమ్మకంటి చంద్రమౌళి
పరకాల నేటిధాత్రి
తెలంగాణ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీకి దళిత జాతికి చెందిన ప్రొఫెసర్ యాదగిరికి మరియు నియామకమైన వారు దళిత జాతికి చెందిన వారిని వైస్ ఛాన్సలర్ గా ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో ఎస్సి విభాగం అధ్యక్షులు బొమ్మకంటి చంద్రమౌళి ఆధ్వర్యంలో బస్టాండ్ కూడలి వద్ద ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మరియు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చిత్రపటాలకు ఘనంగా పాలాభిషేకం చేయడం జరిగింది.ఈ సందర్బంగా చంద్రమౌలి మాట్లాడుతూ దళితుల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నటువంటిరాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి బడుగు బలహీన వర్గాల కోసం ప్రజాసంక్షేమ పథకాలతో మరియు ఎస్సీ సంక్షేమం కోసం మంచి పనులు చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే దళితులకు ప్రాధాన్యతనిస్తూ,ఇకముందు కూడా ప్రజా పాలనతో ప్రజా సంక్షేమం కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుందని, ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ద్వారానే త్వరలో రాబోయే రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు మరియు ఇతర సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో పరకాల నియోజకవర్గం ఎస్టీ సెల్ కన్వీనర్ పాలకుర్తి శ్రీనివాస్,కాంగ్రెస్ నాయకులు పూరెల్ల సూర్యం,గోవింద సురేష్,ఒంటీరు వరుణ్, మడికొండ సంపత్,ఒంటేరు సుధాకర్,మడికొండ చంగల్, మేకల దేవరాజ్,తిక్క రామకృష్ణ,బొచ్చు రవికుమార్, ఎం.డి యాకూబ్ పాషా, రబ్బాని తదితరులు పాల్గొన్నారు.