పరకాల పట్టణం నుండి పలువురు బి.ఆర్.ఎస్.లో చేరిక
పరకాల నేటిధాత్రి
పరకాలలో గులాబీ జెండా ఎగరేసి బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ సాధించడం తథ్యమని పరకాల బిఆర్ఎస్ అభ్యర్థి,ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పరకాల టౌన్ 3వ వార్డుకు చెందిన ఇతర పార్టీల కార్యకర్తలు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో హనుమకొండలోని వారి నివాసంలో గులాబీ కండువా కప్పుకున్నారు.పార్టీలో చేరిన వారిలో ఎండి అఫ్రోజ్,గడ్డం అనిల్,ఓ అశోక్,ఎస్ అఖిల్,పి శివకుమార్,ఎండి ఉమర్ పాషా,టి దేవేందర్,గడ్డం విష్ణు లతో పాటు పలువురు చేరారు.ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.