
జమ్మికుంట: (టౌన్) నేటి ధాత్రి
*హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ప్రణవ్ ఇటీవల టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ కు వచ్చిన నాయకులను ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు*
**ప్రణవ్ పోటీ చేసిన సమయంలో ప్రత్యర్థి పార్టీలో ఉండి అతని ఓటమికి కారకులైనటువంటి నాయకులను చేరదీస్తూ
జెండా మోసి కష్టపడ్డ నాయకులను విస్మరిస్తున్నారని
అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు**
*ఇప్పటికైనా అతని తీరు మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో పార్టీ ఇన్చార్జినే మార్పు కోసం ఒత్తిడి తెస్తామని హెచ్చరించారు*
జమ్మికుంట పట్టణంలోని ఒక ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీనియర్ నాయకులు మీడియా మాట్లాడుతూ కష్టనష్టాలకు ఓర్చుకొని కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన నాయకులను కాంగ్రేసు పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇంచార్జి ఓడితల ప్రణవ్ గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో జరిగిన ఉపఎన్నికలలో ఎన్ ఎస్ యు ఐ నాయకులు బల్మూరు వెంకట్ కు అధిష్టానం హుజూరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్లె అభ్యర్థిగా టికెట్ ఇస్తే గెలుపుకోసం కష్టపడ్డామని గుర్తు చేశారు. వెంకట్ ఓటమి పాలైన కాని నియోజకవర్గంలో పర్యటిస్తూ శుభ కార్యాలకు,అశుభ కార్యాలయాలకు హాజరై తవంతు సహాయాన్ని అందిందిస్తూ పార్టి బలోపేతానికి ఇంటికి ఒక కార్యకర్తను తయారు చేసారని చెప్పారు.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వొడితల ప్రణవ్ కు ఎమ్మెల్యే అభ్యర్థిగా అధిష్టానం టికెట్ ఇస్తే అతని గెలుపుకోసం కార్యకర్తలo అహర్నిశలు కృషి చేశామని చెప్పారు.ఆకృషి ఫలితమే అధిక ఓట్లు వచ్చి ప్రత్యర్థి పై స్వల్ప ఓట్ల తో ఓటమి పాలైన విషయాన్ని గుర్తు చేశారు.అధిక ఓట్లు రావడానికి కాంగ్రెస్ పార్టీ బలపడటానికి బల్మురి వెంకట్ బలగం సీనియర్ కార్యకర్తలు కారణమని చెప్పారు. పార్టి బలోపేతానికి అహర్నిశలు కృషి చేసిన సీనియర్ నాయకులను ప్రణవ్ విస్మరిస్తూ పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బీ ఆర్ ఎస్ నాయకులకు అందలం ఎక్కిస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికలలో ఓటమికి కారకులైన బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులను కాంగ్రెస్ పార్టీలో చేర్పిస్తూ కరడు గట్టిన కాంగ్రెస్ కార్యకర్తలను విస్మరిస్తూ మనోభావాలను దెబ్బతీసేలా ప్రణవ్ ప్రవర్తిస్తున్నారని అన్నారు. పార్టీలో పనిచేస్తూ జెండాలు మొస్తే కార్యకర్తల భాద ఏమిటో తెలుసేదని అన్నారు.సీనియర్ నాయకులను,కార్యకర్తలను విస్మరిస్తున్నారని అధిష్టానానికి తెలిసేలా చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమములో పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు