
గంగారం, నేటిధాత్రి :
ములుగు జిల్లా తాడ్వాయి మండలం లోని మేడారం గ్రామం లో సమ్మక్క సారక్కల జాతర మొదటి గట్టం ప్రారంభం అయింది మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం లోని పునుగొండ్ల గ్రామం లో ప్రజలంత తమ తమ ఇళ్లకు మట్టి తో పూయడం కొత్త రంగులు ముగ్గులు వేసుకోవడం స్వామి వారిని పగిడిద్దరాజు ను పెనక వంశీయిల ఇంటి నుంచి తీసుకోని వచ్చి గుడిలో ప్రతిశిష్టిస్తారు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పడిగా రూపంలో ఉన్న పగిడిద్దరాజు డప్పు సప్పులతో డోలుసాన్నాయి వాయిద్యల్తో శివాసత్తులతో గ్రామం లో ఊరేగిస్తారు అనంతరం పడగా రూపంలో ఉన్న స్వామి ప్రతిమను తీసుకోని ఆదివాసీ లు అటవీ మార్గంలో కాలినడకన సుమారు 80 కిలోమీటర్లు నడక సాగిస్తారు తాడ్వాయి మండలం లోని లక్ష్మిపురంలోని పెనక వంశీయుల ఇంట్లో రాత్రికి బస చేసి ఉదయమే మళ్ళీ కాలినడక కొనసాగిస్తారు బుధవారం రాత్రి వరకు మేడారం సమ్మక్క గద్దె కు చేరుకుంటారు కన్నెపల్లి గ్రామం నుంచి సారక్క కొండాయి గ్రామం నుంచి గోవిందా రాజు సైతం మేడారం గద్దె లకు చేరుకుంటారు అక్కడ ఆదివాసీ పూజారులు సంప్రదాయం పద్ధతి లో పూజలు నిర్వహించి దేవతలను గద్దెలపై ప్రతిష్టి స్తారు…