సిటీ సెంటర్ మల్టీ స్పెషలిటీ హాస్పిటల్ ప్రారంభించిన.

సిటీ సెంటర్ మల్టీ స్పెషలిటీ హాస్పిటల్ ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు

◆ జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ.సురేష్‌కుమార్ శెట్కార్,

◆ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్‌రెడ్డి

◆ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రనాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్‌రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

 

 

జహీరాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంకటి శుక్లవర్ధన్‌రెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన సిటీ సెంటర్ మల్టీ స్పెషలిటీ హాస్పిటల్‌ను జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ.సురేష్‌కుమార్ శెట్కార్,రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.

గిరిధర్‌రెడ్డి,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹ సిద్దం.ఉజ్వల్‌రెడ్డి ప్రారంభించారు.

ఇట్టి ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ టీ జీఐడీసీ చైర్మన్ మహ్మద్ తన్వీర్,సీడీసీచైర్మన్ ముబీన్, మాజీ మున్సిపల్ చైర్మన్ మంకాల్ సుభాష్,కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ నియోజకవర్గ ఆయా మండలాల అధ్యక్షులు పట్లోల్ల రాంలింగారెడ్డి,శ్రీనివాస్‌రెడ్డి, కండెం.

 

Congress leaders

 

 

 

నర్సింహులు,నర్సింహారెడ్డి,మాజీ జెడ్పీటీసీ భాస్కర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు రాజశేఖర్,సీనియర్ నాయకులు భీమయ్య,జమిలాలోద్దిన్,అక్తర్ గోరి,జావిద్,జాఫర్‌,అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాగిరెడ్డి,సీనియర్ నాయకులు మల్లారెడ్డి,శ్రీకాంత్ రెడ్డి,అరుణ్ కుమార్,అక్బర్,అశ్విన్ పాటిల్,హర్షవర్ధన్ రెడ్డి,జి.కిరణ్‌కుమార్‌గౌడ్,నథానెయల్,జగదీశ్వర్ రెడ్డి,మల్లికార్జున్,నర్సింహా యాదవ్‌,సునీల్,రాజు,జుబేర్,ఇమామ్‌ పటేల్‌ మరియు తదితరులు పాల్గొన్నారు.

ఈ నెల 9న దేశవ్యాప్తంగా సమ్మెను విజయవంతం చేయాలి.

ఈ నెల 9న దేశవ్యాప్తంగా సమ్మెను విజయవంతం చేయాలి

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఏఐ ఎఫ్ టియు ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ఏఐ ఎఫ్ టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఎం రాయమల్లు చంద్రగిరి శంకర్ హాజరైనారు అనంతరం వారు మాట్లాడుతూ ఈనెల 9న దేశవ్యాప్తంగా జరిగే సమ్మెలో సింగరేణి కార్మికులు చిరు వ్యాపారవేత్తలు స్వచ్ఛందంగా పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలి
మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నీటిని . ప్రవేట్ పారం చేస్తూ అమ్మి వేస్తూ అంబానీ,ఆదాని లాంటి వ్యాపారవేతలకు దేశవ్యాప్తంగా .బొగ్గు పరిశ్రమలు. అడివిలో ఉన్న అపార ఖనిజ సంపాదను అప్పగించేందుకు ప్రయత్నిస్తుదని ఇందులో భాగంగానే 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కొడ్ లను తీసుకు వస్తుందని బొగ్గు పరిశ్రమరక్షణకోసం సింగరేణిబొగ్గు గనులను కాపాడుకునేందుకు జూలై 9న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మె పరిశ్రమల రక్షణకోసం,ఉద్యోగ భద్రతకోసం,అసంఘటిత కార్మికులకు నెలకు 26వేల రూపాయల వేతనం చెల్లించాలని, లేదా పర్మనెంట్ చేయాలని సుప్రీంకోర్టు తీర్పుప్రకారం సమాన పనికి సమానవేతనాలు చెల్లించాలని 18.86 నుండి. కార్మిక వర్గం అనేక ఉద్యమాలు నిర్మించి తమ ప్రాణాలను అర్పించి సాధించుకున్నా 44 కార్మిక చట్టాలను. నాలుగు కోడ్ లుగా అమలు చేస్తూ కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా. చేసే విధానానికి వ్యతిరేకంగా. ఉద్యమించాలని.
సింగరేణి సంస్థ ను వేలంపాట పేరుతో కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారని. వేలం పాట లేకుండా సింగరేణి సంస్థను సింగరేణికే ఇవ్వాలని
కార్మికులకు సొంతింటి కల సాకారం చేయాలని
కార్మికులకు ఇన్కమ్ టాక్స్.రద్దు చేయాలని.
విజిలెన్స్ లో ఉన్న మారు పేర్ల సమస్యను వెంటనే పరిష్కరించాలని
24.25. సంవత్సరపు. లాభాల వాటా.40 శాతం . వెంటనే కార్మికులకు సీసీపీ
లను. రద్దుచేసి. బొగ్గు బావులను నిర్మించాలని ఏఐ ఎఫ్ టియు రాష్ట్ర కమిటీ డిమాండ్ చేశారు

సిరిసిల్ల ఎమ్మార్వో ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా.

సిరిసిల్ల ఎమ్మార్వో ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా

సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )

 

 

 

 

సిరిసిల్ల జిల్లా ప్రజలందరికీ ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సంబంధించిన ఇసుక మరియు ముడి సరుకుల ధరల్ని ప్రభుత్వం నియంత్రించాలి – అన్నల్ దాస్ గణేష్ సిపిఎం సిరిసిల్ల పట్టణ కార్యదర్శి.

సిపిఎం రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలో ఇసుక కొరత తీర్చాలని ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగినది.

ఈ సందర్బంగా సిపిఎం సిరిసిల్ల పట్టణ కార్యదర్శి అన్నల్ దాస్ గణేష్ మాట్లాడుతూగత 15 రోజులుగా సిరిసిల్ల పట్టణంలో ఇందిరమ్మ ఇండ్లు మరియు ప్రైవేట్ ఇంటి నిర్మాణాలకు ఇసుక అనుమతులు లేకపోవడంతో ఇండ్ల నిర్మాణాలు ఆగిపోయాయి ప్రభుత్వ పనులకు ఇస్తున్న ఇసుక బ్లాక్లో నాలుగు వేల నుండి 5 వేలకు అమ్ముకుంటున్నారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన ఇందిరమ్మ ఇండ్లకు 10 ట్రాక్టర్ల ఇసుక మాత్రమే ఇస్తామని చెబుతున్నారు కానీ సిరిసిల్ల పట్టణంలో నల్ల రేగడి భూములు అయినందున పుటింగులకే పది ట్రిప్పుల ఉష్కే సరిపోని పరిస్థితి ప్రభుత్వం మరొక్కసారి ఆలోచించి ఇసుక ట్రిప్పుల సంఖ్య పెంచాలని అలాగే ప్రైవేట్ ఇంటి నిర్మాణాలకు కూడా ప్రతిరోజు ఇసుక అందించేలా చర్యలు తీసుకోవాలని దానివలన పట్టణంలోని పేద ప్రజల పైన అదనపు భారాన్ని తగ్గించినట్టు అవుతుంది ఇంటి నిర్మాణానికి సంబంధించి ఇతర ముడి సరుకుల ధరల్ని కూడా నియంత్రించాలి ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పనిచెయ్యాలి మైనింగ్ అధికారులు దాడులను ఆపాలి పేదల ఇంటి నిర్మాణాలకు అలాగే ప్రయివేట్ ఇంటి నిర్మాణదారులకు ఇబ్బందులు లేకుండా అధికారులు తక్షణమే చెర్యలు తీసుకోవాలని సిపిఎంసిరిసిల్ల జిల్లా కమిటీగా తహసీల్దార్ వినతిపత్రం అందించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ముషం రమేష్ సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోడం రమణ, ఎగమాంటి ఎల్లారెడ్డి, జవ్వాజి విమల సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సూరం పద్మ, శ్రీరామ్ రమేష్ చంద్ర సిపిఎం సీనియర్ నాయకులు మిట్టపెల్లి రాజమల్లు, రాపెల్లి రమేష్, నక్క దేవదాస్, జిందాం కమలాకర్, బెజగం సురేష్, సిరిమల్లా సత్యం, కోలా శ్రీనివాస్, బింగి సంపత్ సందుపట్ల పోచమల్లు తదితరులు పాల్గొన్నారు.

నిరుపేద విద్యార్థికి సహాయం అందించిన ఎన్నారై.

నిరుపేద విద్యార్థికి సహాయం అందించిన ఎన్నారై

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

సిరిసిల్ల పట్టణనికి చెందిన చేనేత కార్మికుడు కొండి సత్యం కుమార్తె కొండి వర్షిత తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థుల కళాశాలలోఎం.పీ.సీ గ్రూపులో వేయికి గాను సుమారు 976 మార్కులతో కళాశాల తృతీయ స్థానంలో మార్కులు సాధించడం జరిగినది. నిరుపేద విద్యార్థి అయిన వర్షితకు పై చదువుల కోసం ప్రముఖ ఎన్నారై సిరిసిల్ల అశోక నగర్ చెందిన గడ్డం భానుచంధర్(NRI)s/o సత్తయ్య మరియు వివేక వర్ధిని స్కూల్ 10వ తరగతి బ్యాచ్ ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థి కొండి వర్షిత 40 వేల రూపాయలు పై చదువుల కోసం సహాయం అందించడం జరిగినది.ఈ కార్యక్రమంలో సిరిసిల్ల అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు గుగ్గిల్లా అభినయ్ గౌడ్,బద్దెనపల్లి మాజీ సర్పంచ్ గుగ్గిళ్ల అంజయ్య,మాజీ ఎంపీటీసీ సిలువెరీ ప్రసూన-నర్సయ్య, కొండ రాజేశం, కొండ రమేష్ లు పాల్గొన్నారు..

కాజోల్ కోసమే సోనాక్షి వెనక్కి వెళ్ళిందా…

కాజోల్ కోసమే సోనాక్షి వెనక్కి వెళ్ళిందా…

 

 

 

 

 

 

 

కాజోల్ మూవీ మా కు దారి ఇచ్చి తాము వెనక్కి వెళ్ళామని, సోనాక్షి సిన్హా చెబుతోంది, మా, నికితా రాయ్ రెండు సినిమాలు సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ వే కావడం కూడా అందుకు ఓ కారణమని తెలిపింది.

బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరోయిన్ కాజోల్ (Kajol) నటించిన సూపర్ నేచురల్ మూవీ ‘మా’ (Maa) గత శుక్రవారం విడుదలైంది.

ఓపెనింగ్స్ ఆశాజనకంగా ఉన్నా…

సోమవారానికి ఈ సినిమా బాగా డ్రాప్ అయ్యిందని ట్రేడ్ వర్గాలు చెప్పాయి.

చాలా కాలం తర్వాత కాజోల్ నటించిన హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ కావడం, ఆమె ఈ జానర్ లో మొదటి సారి నటించడంతో సహజంగానే దీనిపై అంచనాలు ఏర్పడ్డాయి.

దానికి తగ్గట్టుగా ఓపెనింగ్స్ వచ్చిన…

ఫలితం మాత్రం ఆశాజనకంగా లేకపోయింది.

అయితే… కంగనా రనౌత్ (Kangana Ranaut) నటించిన ‘ఎమర్జెన్సీ’ (Emergency) మూవీ కంటే ‘మా’ బెటర్ గానే బాక్సాఫీస్ బరిలో పెర్ఫార్మ్ చేస్తోందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

అలానే జునైద్ ఖాన్ (Junaid Khan), ఖుషీ కపూర్ (Khushi Kapoor) నటించిన ‘లవ్ యపా’ (Loveyapa) మూవీ కంటే కూడా ‘మా’ ఎక్కువ కలెక్ట్ చేసిందని తెలిపాయి.

ఇదిలా ఉంటే…

‘మా’ మూవీ విడుదలైన జూన్ 27వ తేదీనే సోనాక్షి సిన్హా నటించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీ ‘నికిత రాయ్’ (Nikitha Roy) రిలీజ్ కావాల్సి ఉంది.
కానీ చివరి నిమిషంలో ఈ సినిమా జులై 18కి వాయిదా పడింది.
కాజోల్ అంటే తనకెంతో అభిమానమని, ఆమె చిత్రాలను చూస్తూ పెరిగానని, అనుకోకుండా తమ రెండు చిత్రాలు ఒకే రోజున విడుదల కావాల్సి వచ్చిందని అప్పటి వరకూ చెప్పిన సోనాక్షి సిన్హా…
ఎప్పుడైతే తన సినిమా వాయిదా పడిందో ప్లేట్ మార్చేసింది.
‘మా’, ‘నికితా రాయ్’ రెండు సినిమాలు ఒకే రోజున విడుదల కావడం కరెక్ట్ కాదని తాము భావించామని, అందుకే ‘మా’కు దారి ఇచ్చి తాము వేరే డేట్ ను ఎంచుకున్నామని తెలిపింది.
ఎక్కువ థియేటర్లలో ‘నికితా రాయ్’ను విడుదల చేయడానికి పంపిణీదారుల సలహా మేరకు
ఈ నిర్ణయం తీసుకున్నామని సోనాక్షి వివరణ ఇచ్చింది.
అయితే ఇలా సినిమాల విడుదల వాయిదా పడటం కొత్తేమీ కాదని చెబుతూ, ‘గతంలోనూ అజయ్ దేవ్ గన్ తన చిత్రాన్ని ‘కల్కి 2898 ఎ.డి’ కోసం వాయిదా వేసుకున్నార’ని ఉదాహరించింది.
ఏదేమైనా… ‘మా’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ఆడకపోవడమన్నది, త్వరలో జనం ముందుకు రాబోతున్న ‘నికితా రాయ్’ మీద కూడా పడే ఛాన్స్ ఉంది.
సోనాక్షి ప్రధాన భూమిక పోషించిన ఈ సినిమాతో ఆమె సోదరుడు కుశ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

అల్ఫోర్స్ హై స్కూల్ (సి బి ఎస్ ఈ) వర్ధన్నపేట లో ఘనంగా బోనాల జాతర.

అల్ఫోర్స్ హై స్కూల్ (సి బి ఎస్ ఈ) వర్ధన్నపేట లో ఘనంగా బోనాల జాతర.

వర్దన్నపేట (నేటిధాత్రి):

బోనాల పండుగ తెలంగాణ రాష్ట్రానికి ఒక గొప్ప ప్రతీక అని మరియు మతసామరస్యానికి నాంది పలికేటువంటి విశిష్టమైన పండుగ అని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత & విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ వి. నరేందర్ రెడ్డి స్థానిక అల్ఫోర్స్ హై స్కూల్ వర్ధన్నపేట (సీబీఎస్ఈ) లో వేడుకగా నిర్వహించినటువంటి బోనాల ఉత్సవ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై వారు మాట్లాడారు. ప్రారంభానికి ముందు వారు ప్రాంగణంలో అందంగా అలంకరించినటువంటి అమ్మవారి విగ్రహం వద్ద ఏర్పాటు చేసినటువంటి జ్యోతిని వెలిగించి పూజ కార్యక్రమాన్ని ఆచరించి ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆషాడమాసంలో జరుపుకునేటువంటి ఈ బోనాల పండుగ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నెలరోజుల పాటు దేదీప్యమానంగా వేడుకగా కుటుంబ సభ్యుల ఆనందోత్సవాల మధ్య చాలా ఘనంగా జరుపుకుంటారని గుర్తు చేశారు. ఈ పండుగ తెలంగాణ రాష్ట్రానికి వన్నె తెచ్చే పండుగ అని ఈ పండుగ ద్వారా కుటుంబాలలో సుఖసంతోషాలతో పాటు ఆయురారోగ్యాలు వెళ్లి విరిస్తాయని అభిప్రాయపడ్డారు.మన రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాదులో నెల రోజుల పాటు వేడుకగా జరిగే ఈ సంబరాలు ఆకాశమే హద్దుగా అన్నట్టుగా జరుపుకుంటారని తెలిపారు ఆల్ఫోర్స్ విద్యాసంస్థల్లో సైతం ఈ సంప్రదాయాన్ని క్రమం తప్పకుండా ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు విద్యాసంస్థల మీదనే కాకుండా విద్యార్థుల మీద వారి పరివారాల మీద ఎల్లప్పుడూ పుష్కలంగా ఉండాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తుండడం చాలా హర్షించదగ్గ విషయమని చెప్పారు.వేడుకలలో భాగంగా విద్యార్థుల ప్రదేశించినటువంటి పలు అమ్మవారి నృత్యాలు పోతురాజు వేషాలు చాలా ఆకర్షణంగా నిలిచాయి
ముఖ్యంగా విద్యార్థులు ప్రదేశించినటువంటి గ్రామదేవతల వైభవం నృత్య ప్రదర్శన ఆలోచింపజేసింది.ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది విద్యార్థులు వివిధ ఆకర్షణీయమైన సాంప్రదాయ దుస్తుల్లో విచ్చేసి ప్రాంగణానికి వన్నె తెచ్చారు
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

ఎన్టీఆర్-హృతిక్ ఒకవైపు, రజనీ-నాగ్ మరోవైపు.

ఎన్టీఆర్ – హృతిక్ ఒకవైపు, రజనీ – నాగ్ మరోవైపు. వార్ 2 వర్సెస్ కూలి

 

 

 

 

రెండు మల్టీస్టారర్స్ ఢీ కొట్టబోతున్నాయి.

ఓ సినిమాలో యంగ్ స్టార్స్ – మరో సినిమాలో సీనియర్ స్టార్స్.

రెండూ తెలుగువారి ముందుకు అనువాద రూపంలోనే వస్తున్నాయి.

ఆ రెండు సినిమాలు ఒకే రోజున విడుదల కాబోతూండడంతో థియేటర్ల సమస్య తలెత్తింది.

ఇంతకూ ఆ రెండు మూవీస్ ఏవి? వాటి కథాకమామిషు ఏంటో చూద్దాం.

యంగ్ స్టార్ హీరోస్ హృతిక్ రోషన్ (Hrithik Roshan), జూనియర్ యన్టీఆర్ (Jr NTR) నటించిన ‘వార్ 2’ (War 2) ఓ వైపు, మరోవైపు సీనియర్ స్టార్స్ రజనీకాంత్ (Rajinikanth), నాగార్జున (Nagarjuna) అభినయించిన ‘కూలి’ (Coolie) జనాన్ని అలరించడానికి ముస్తాబయ్యాయి.

ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా మూవీస్ కావడం విశేషం!.

రెండు చిత్రాలు ఆగస్టు 14న దేశవ్యాప్తంగా విడుదలకు సిద్ధమయ్యాయి.

వీటిలో ‘వార్ 2’ ఒరిజినల్ హిందీ కాగా, ‘కూలి’ తమిళ చిత్రం.

రెండు సినిమాలు దక్షిణాది నాలుగు భాషల్లోనూ, హిందీలోనూ విడుదలవుతున్నాయి.

రెండు సినిమాలకు క్రేజ్ నెలకొంది.

దాంతో దేశవ్యాప్థంగా థియేటర్ల పట్టడం మేకర్స్ కు ఛాలెంజ్ గా మారింది.

‘వార్ 2’ మూవీ నిర్మించిన యశ్ రాజ్ ఫిలిమ్స్ వారికి ఉత్తరాదినే కాకుండా, దక్షిణాదిన సైతం పట్టుంది.

దాంతో దేశంలోని 30కి పైగా ఉన్న ఐమాక్స్ స్క్రీన్స్ ను రెండు వారాల పాటు తమ ‘వార్ 2’ కోసం రిజర్వ్ చేసుకున్నారని టాక్.

దీని కోసం యశ్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ ఓ ప్రత్యేక ఒప్పందం కూడా చేయించుకుందని విశేషంగా వినిపిస్తోంది.

ఇక తెలుగునాట యన్టీఆర్ కారణంగా ‘వార్ 2’కే ఎక్కువ థియేటర్లు దొరికే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

‘కూలి’ విషయానికి వస్తే ఈ చిత్రాన్ని నిర్మించిన సన్ పిక్చర్స్ సంస్థకు దక్షిణాదిన మంచి పట్టుంది.

వారు కూడా క్రేజ్ ఉన్న థియేటర్లను ‘కూలి’ కోసం పట్టేసినట్టు సమాచారం.
ఇక్కడే కాదు అబ్రాడ్ లోనూ ఈ రెండు సినిమాలపై ఆసక్తి నెలకొంది.
‘వార్ 2’లో యన్టీఆర్ నటించడం పెద్ద ప్లస్ పాయింట్ కాగా, ‘కూలి’లో రజనీకాంత్ తో కలసి నాగార్జున నటించడం కూడా ఆ సినిమాకు క్రేజ్ ను పెంచింది.
ఇక నిర్మాణ సంస్థల విషయానికి వస్తే ‘యశ్ రాజ్ ఫిలిమ్స్’ది పై చేయిగా సాగుతోంది.
ఎందుకంటే వీరికి దేశంలోనే కాదు విదేశాల్లోనూ తమ సినిమాలను విడుదల చేయడంలో ఎంతో అనుభవం ఉంది.
‘కూలి’ సినిమాకు దర్శకుడు లోకేశ్ కనగరాజ్ పెద్ద అసెట్.
ఇప్పటి దాకా లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన చిత్రాలన్నీ జనాన్ని విశేషంగా అలరించాయి.
లోకేశ్ రూపొందించిన ‘ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో” వంటి చిత్రాలు తెలుగువారినీ ఆకట్టుకున్నాయి.
ఇండియాలోనూ సదరు మూవీస్ మురిపించాయి.
దాంతో లోకేశ్ కనగరాజ్ క్రేజ్ వల్ల ‘కూలి’ , ‘వార్ 2’కు గట్టి పోటీగానే మారిందని చెప్పవచ్చు.

‘వార్ 2’ సినిమా మొదటి భాగంలోనూ హృతిక్ రోషన్ నటించి ఆకట్టుకున్నారు.

 

అయితే ప్రస్తుతం గ్లోబర్ స్టార్ గా జేజేలు అందుకుంటున్న యన్టీఆర్ ఈ చిత్రంలో నటించడం వల్ల ‘వార్ 2’కు మరింత క్రేజ్ పెరిగింది.

దాంతో యశ్ రాజ్ ఫిలిమ్స్ అధినేతలు దేశవ్యాప్తంగా ఈ సినిమాను సొంతగా రిలీజ్ చేసే ప్రయత్నంలోనూ ఉన్నారు.

అయితే ఈ సినిమా డైరెక్టర్ అయాన్ ముఖర్జీకి లోకేశ్ కనగరాజ్ అంత క్రేజ్ లేదు.

అయాన్ తెరకెక్కించిన చిత్రాలలో ‘యే జవానీ. యే దీవానీ’ ఘనవిజయం సాధించింది.

ఇంతకు ముందు ఆయన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’ అంతగా మురిపించలేక పోయింది..

ఈ నేపథ్యంలో ‘వార్ 2’కు హీరోలు ఇద్దరు, హీరోయిన్ కియారా అద్వానీ గ్లామర్ ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి.

ఇక ‘కూలి’లో డైరెక్టర్ తో పాటు రజనీకాంత్, నాగార్జున కాంబో, అలాగే ఉపేంద్ర, సత్యరాజ్ కీలక పాత్రలతోపాటు ఆమిర్ ఖాన్, పూజా హెగ్డే కేమియో అప్పియరెన్స్ కూడా ఆకర్షణగా ఉన్నాయి.

ఇక ఈ చిత్ర సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించారు.

‘వార్ 2’ కు ప్రీతమ్ సంగీతం సమకూర్చారు.

ఏ రీతిన చూసిన ‘కూలి’కి చాలా ప్లస్ పాయింట్స్ కనిపిస్తున్నాయి.

‘వార్ 2’లో యన్టీఆర్ యాక్టింగ్ పెద్ద అసెట్ గా నిలుస్తుందని బాలీవుడ్ టాక్.

మరి ఈ రెండు చిత్రాల్లో ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద హంగామా క్రియేట్ చేస్తుందో, ఏది పైచేయి సాధిస్తుందో, లేక రెండూ తమ బడ్జెట్ కు తగ్గ సక్సెస్ నమోదు చేస్తాయేమో చూద్దాం.

బాహుబలికి రివ్యూ ఇస్తానన్న మిస్‌ వరల్డ్‌.

బాహుబలికి రివ్యూ ఇస్తానన్న మిస్‌ వరల్డ్‌

 

 

 

 

ఓపల్‌ సుచాత (opal suchata ) పేరు ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది.

108 దేశాల బ్యూటీలను వెనక్కి నెట్టి ప్రపంచ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకుందీ థాయ్‌ భామ(Thai beauty) .

ఓపల్‌ సుచాత (opal suchata ) పేరు ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది.

108 దేశాల బ్యూటీలను వెనక్కి నెట్టి ప్రపంచ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకుందీ థాయ్‌ భామ(Thai beauty) .

మిస్‌ వరల్డ్‌ 2025గా విజయం సాధించిన అనంతరం ఆమె నేషనల్‌ మీడియాతో మాట్లాడుతూ ‘‘ఇది నా జీవితంలో ఒక అద్భుతమైన రోజు.

వ్యక్తిగతంగానే కాకుండా థాయ్‌లాండ్‌ ప్రజలకూ ఇదొక మైలు రాయి అనే అనాలి.

నేనెంతో గర్వపడుతున్నా.

మిస్‌ వరల్డ్‌ స్టేజ్‌పై మా దేశానికి గుర్తింపు లభించింది.

మా దేశానికి ఇదే తొలి విజయం. ఇలాంటి ఒక రోజు కోసం మేమంతా 70 ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నాం.

ఈ ప్రయాణం క్లిష్టమైనదని నేను చెప్పను.

ఎందుకంటే, మన హృదయానికి చేరువైన దానిని పొందేందుకు వేేస ప్రతి అడుగుకు ఒక అర్థం ఉంటుంది’’ అని అన్నారు.

ఆ సినిమాపై రివ్యూ ఇస్తా..
 “నాకు బాలీవుడ్‌ నటి అలియాబట్‌ తెలుసు.

నా జర్నీలో ఎంతో మంది సుందరీమణులు నాలో స్ఫూర్తి నింపారు’’ అని అన్నారు.

భారత దేశం నుంచి ప్రపంచ సుందరిగా విజయాన్ని అందుకున్న వారిలో ఎవరంటే మీకు ఇష్టం అని ప్రశ్నించగా..

‘‘ఈ ప్రశ్నకు బదులు చెప్పడం చాలా కష్టం.

నాకెంతో ఇష్టమైన మానుషి చిల్లర్‌ను ఫినాలేలో కలిశాను.

అదే విధంగా నాకు ప్రియాంకా చోరప్రా అంటే ఎంతో ఇష్టం.

ఆమె నుంచి స్ఫూర్తి పొందాను. వీలునప్పుడు సినిమాలు చూస్తుంటా.

బాలీవుడ్‌లో తెరకెక్కిన పలు చిత్రాలు ఇప్పటికే చూశాను.

అలియాభట్‌ నాకు తెలుసు.

ఆమె నటించిన ‘గంగూబాయి కాఠియావాడి’ నాకెంతో నచ్చింది.

ప్రేక్షకులను ఆలోచింప చేేస చిత్రమది.

‘బాహుబలి’ సినిమా గురించి విన్నాను.

కానీ, ఆ సినిమా ఇంకా చూడలేదు.

మిస్‌ వరల్డ్‌ పోటీల్లో భాగంగా కొన్నిరోజుల క్రితం మేమంతా హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌ సిటీ సందర్శించాం.

పోటీలు పూర్తైన తర్వాత తప్పకుండా ఆ సినిమా చూడాలని నాకు నేనే ప్రామిస్‌ చేసుకున్నా.

మళ్లీ నేను ఇక్కడికి వచ్చే నాటికి తప్పకుండా ఆ సినిమాపై రివ్యూ ఇస్తా’’ అని అన్నారు.  

వరలక్ష్మి శరత్‌కుమార్ భర్త నికోలాయ్ సచ్‌దేవ్‌ గురించి.

వరలక్ష్మి శరత్‌కుమార్ భర్త నికోలాయ్ సచ్‌దేవ్‌ గురించి ఈ విషయాలు తెలుసా

 

2024 సంవత్సరం పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలలో వరలక్ష్మీ శరత్ కుమార్ ఒకరు. అంతకు ముందు విశాల్‌తో పెళ్లి పీటల వరకు వెళ్లిన వరలక్ష్మీ శరత్ కుమార్ సడెన్‌గా పెళ్లి వద్దనుకుంది.

ఆ తర్వాత కొంతకాలం కామ్‌గా ఉన్న ఆమె.. తనకు 14 సంవత్సరాలుగా తెలిసిన నికోలాయ్ సచ్‌దేవ్‌‌ని వివాహం చేసుకుంది. ఆమె పెళ్లాడిన నికోలాయ్ సచ్‌దేవ్‌‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.

వరలక్ష్మీ శరత్ కుమార్ అందరికీ పరిచయమే.

ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ నటిగా కొనసాగుతున్న వరలక్ష్మీ..

ఇటీవల నికోలాయ్ సచ్‌దేవ్‌ని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

అంతకు ముందు విశాల్‌తో పెళ్లి పీటల వరకు వెళ్లిన వరలక్ష్మీ..

ఆ తర్వాత పెళ్లే చేసుకోనంటూ స్టేట్‌మెంట్స్ ఇచ్చింది.

కానీ, తనకు 14 సంవత్సరాలుగా పరిచయం ఉన్న నికోలాయ్ సచ్‌దేవ్‌‌‌ని వివాహం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. అసలు అతను ఎవరో కూడా ఎవరికీ తెలియదు. సడెన్‌గా అనౌన్స్ చేసింది.

అలా ప్రకటించిన కొన్ని రోజులలోనే నికోలాయ్‌తో పెళ్లి పీటలు ఎక్కేసింది. దీంతో అతడు ఎవరని అంతా ఆమధ్య తెగ సెర్చ్ చేశారు. ఈ సెర్చింగ్ నికోలాయ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటికి వచ్చాయి.

ఆ విషయాల్లోకి వెళితే.నికోలాయ్ సచ్‌దేవ్ ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరిస్ట్.

అతను ముంబైలో ‘గ్యాలరీ 7’ అనే ఆర్ట్ గ్యాలరీని నడుపుతుంటారు.

ఈ గ్యాలరీని చూసేందుకు తరుచుగా సెలబ్రిటీలు వెళుతుండటంతో.. ముంబైలోనే ప్రసిద్ధి చెందిన గ్యాలరీగా పేరు పొందింది. ప్రముఖ ఆర్ట్ గ్యాలరిస్ట్‌లైన నికోలాయ్ తల్లిదండ్రులు అరుణ్ మరియు చంద్ర ఈ ‘గ్యాలరీ 7’ని స్థాపించారు.

ఇది కాకుండా.. నికోలాయ్ సచ్‌దేవ్ పవర్‌లిఫ్టర్ మరియు ఫిట్‌నెస్ నిపుణుడిగానూ పేరు పొందారు.

అనేక పవర్ లిఫ్టింగ్ పోటీలలో ఆయన విజేతగా నిలిచారు. అలాగే ఆయన టాటూ ప్రేమికుడు కూడా.

ఆ విషయం ఆయనను చూస్తేనే తెలుస్తుంది.

ఇక నికోలాయ్‌కి అంతకు ముందే పెళ్లయింది.

వరలక్ష్మీని రెండో వివాహం చేసుకున్నాడు నికోలాయ్. 2006లో మోడల్ మరియు ఫిట్‌నెస్ శిక్షకురాలైన కవితను నికోలాయ్ పెళ్లి చేసుకున్నారు.

ఈ జంటకు కాషా అనే కుమార్తె కూడా ఉంది.

కాషాకు కూడా నికోలాయ్ ఫిట్‌నెస్ ట్రైనర్‌గానూ, పవర్‌లిఫ్టింగ్‌ శిక్షకుడిగానూ వ్యవహరించారు. ఫలితంగా ఆమె అనేక అవార్డులను సైతం గెలుచుకుంది.

అయితే పెళ్లయిన 13 సంవత్సరాల అనంతరం నికోలాయ్, కవిత విడాకులు తీసుకున్నారు.

2019లో వీరి వివాహ బంధం పూర్తిగా ముగిసింది. అయితే అప్పటికే వరలక్ష్మీ, నికోలాయ్‌కి పరిచయం ఉండటంతో, వారి పరిచయం ప్రేమ వరకు వెళ్లి, చివరికి పెద్దలని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.

ఆసక్తికరంగా తమ్ముడు రిలీజ్‌ ట్రైలర్‌..

ఆసక్తికరంగా తమ్ముడు రిలీజ్‌ ట్రైలర్‌..

 

 

 

 

నితిన్‌ (Nithiin) హీరోగా దర్శకుడు శ్రీరామ్‌ వేణు రూపొందించిన సినిమా ‘తమ్ముడు’. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. లయ, సప్తమీ గౌడ, వర్ష బొల్లమ్మ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ నెల 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రిలీజ్‌ ట్రైలర్‌ (Thammudu Trailer)ను విడుదల చేశారు. అక్కతో ‘తమ్ముడు’ అని పిలిపించుకోవడం కోసం ఎంత సాహసమైన చేసే పాత్రలో నితిన్‌ కనిపించి ఆకట్టుుకున్నారు.

ఐశ్వర్య రాజేష్ చాలా టార్చర్ పెట్టింది.

 ఐశ్వర్య రాజేష్ చాలా టార్చర్ పెట్టింది…

Anil Ravipudi: దర్శకుడు అనిల్ రావిపూడి బుధవారం రాత్రి నిజామాబాద్‌లో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ‘సంక్రాంతికి వస్తునాం’ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అలాగే మూవీ గురించి మరెన్నో ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు చెప్పారు.విక్టరీ వెంకటేష్, బ్లాక్‌బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి, ప్రతిష్టాత్మక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సక్సెస్ ఫుల్ కొలాబరేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’.

ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ఐశ్వర్యా రాజేశ్‌, మీనాక్షి చౌదరి హీరోయిన్లు. భీమ్స్ సంగీతం అందించారు.

బుధవారం రాత్రి నిజామాబాద్ లో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీ అందరినీ చూస్తుంటే పండుగ డైరెక్టుగా మా ఇంటికి వచ్చినట్టుంది. మీ అందరి రాక సంతోషం కలిగిస్తోంది.
ఈ ఫంక్షన్ సజావుగా జరిగేందుకు తోడ్పాటు అందించిన అధికార యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ ను చూశారు. ట్రైలర్ లో మీరు చూసింది కొంచెమే…
సినిమాలో ఇంకా చాలా చాలా ఉంది.
ఈ సినిమా ఒక టిపికల్ జానర్ లో తెరకెక్కించాం. భార్యకు, మాజీ ప్రేయసికి మధ్య నలిగిపోయే పాత్రలో వెంకటేశ్ గారు అద్భుతంగా నటించారు.
ఈ సినిమాలో చాలా థ్రిల్స్, ట్విస్టులు, టర్నులు ఉంటాయి. ఇంటిల్లిపాదీ చూసి ఎంజాయ్ చేసేలా ఈ సినిమా ఉంటుంది.

ఇక దిల్ రాజు, శిరీష్ నిజామాబాద్ లోకల్ బాయ్స్.

వాళ్లతో నాకు ఇది ఆరో సినిమా. నాకు చాలా సపోర్ట్ గా ఉంటారు. ఓ కుటుంబంలాగా నాకు ఎప్పుడూ స్వేచ్ఛనిస్తారు. ఈ సినిమా… ఆడియన్స్ కు కచ్చితంగా పండుగ ఫన్ అందిస్తుంది.

ఈ సినిమాలో వెంకటేశ్ భార్యలా ఐశ్వర్య రాజేశ్ చాలా టార్చర్ పెట్టింది. మాజీ ప్రేయసి పాత్రలో పోలీస్ ఆఫీసర్ గా మీనాక్షి చౌదరి తన గ్లామర్ తో చక్కని పెర్ఫార్మెన్స్ ఇచ్చింది.

విక్టరీ వెంకటేశ్ గారి గురించి ఎన్నిసార్లు చెప్పినా ఒకటే మాట…

మా వెంకీ మామ, మీ అందరికీ నచ్చే వెంకీ మామ…

సినిమా కోసం ప్రాణం పెట్టేస్తారు. ఆయన తన కెరీర్ లో ఎంతో గొప్ప పాత్రలు చేశారు.

ఇక సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో ఆయన పాత్ర చాలా డిఫరెంట్ గా ఉండబోతోంది.

చాలా అద్భుతంగా నటించారు.

ఇందాక ట్రైలర్ లో చూశారు… ప్రతి సినిమాకు ముందు టీజర్ ఉన్నట్టు, ప్రతి మగాడి లైఫ్ లో ఎక్కడో చోట లవర్ ఉంటుంది వంటి డైలాగులు ఈ సినిమాలో చాలా ఉంటాయి.

వెంకటేశ్ గారిలో ఉన్న గొప్ప విషయం ఏమిటంటే… సినిమాకి పనిచేసేటప్పుడు ఎంత ఫ్రీడమ్ ఇస్తారో, సినిమా ప్రమోషన్స్ విషయంలోనూ ఎంతో సపోర్టివ్ గా ఉంటారు.

సినిమాను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లడానికి తన వంతు మద్దతుగా నిలుస్తారు.

జనవరి 14న మా సినిమా థియేటర్లలోకి వస్తోంది మీరందరూ కుటుంబ సమేతంగా రావాలి కడుపుబ్బా నవ్వించి పంపిస్తాం” అంటూ చెప్పారు.

నా కెరీర్‌లో ఇదే బెస్ట్‌ క్యారెక్టర్‌.

నా కెరీర్‌లో ఇదే బెస్ట్‌ క్యారెక్టర్‌…

 

రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. దిల్‌రాజు, శిరీష్‌ నిర్మించారు. ఈనెల 10న తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ అవుతోంది. ఈ సందర్భంగా..

రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. దిల్‌రాజు, శిరీష్‌ నిర్మించారు. ఈనెల 10న తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ అవుతోంది.
ఈ సందర్భంగా సినీ నటి అంజలి మాట్లాడుతూ‘ ఈ సంక్రాంతికి తెలుగులో ‘గేమ్‌ ఛేంజర్‌’, తమిళంలో విశాల్‌ చిత్రం రాబోతున్నాయి. ఈ రెండు చిత్రాలకు మంచి రెస్పాన్స్‌ వస్తుందని ఆశిస్తున్నా.
‘గేమ్‌ ఛేంజర్‌’లో నా పాత్ర పేరు పార్వతి. మా అమ్మ పేరు కూడా పార్వతి. డైరెక్టర్‌ కథ చెప్పినప్పుడు, క్యారెక్టర్‌ చెప్పినప్పుడు మా అమ్మే గుర్తుకు వచ్చారు.
సెట్స్‌ నుంచి వచ్చాక కూడా ఈ పాత్ర చాలా రోజులు నన్ను వెంటాడుతూనే వచ్చింది. నా కెరీర్‌లో ఇదే బెస్ట్‌ క్యారెక్టర్‌. రామ్‌ చరణ్‌ తన కో స్టార్స్‌ని ఎంతో గౌరవిస్తారు.
సెట్స్‌లో అందరితోనూ చక్కగా మాట్లాడతారు.
అప్పన్న, పార్వతీల ప్రేమ, వారి బంధం చాలా గొప్పగా ఉంటుంది.
శంకర్‌, మణిరత్నం చిత్రాల్లో నటించాలని అందరికీ ఉంటుంది.
శంకర్‌ చిత్రంలో నటించే అవకాశం రావడం అనందంగా ఉంది. ‘గేమ్‌ ఛేంజర్‌’ వల్ల నా ఆలోచనాధోరణి మారింది.
ఈ ప్రయాణంలో ఎంతో నేర్చుకున్నా.

పూజతో ప్రారంభం.

పూజతో ప్రారంభం…

 

తమిళ నటుడు విజయ్‌ సేతుపతి కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే.

సోమవారం ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.తమిళ నటుడు విజయ్‌ సేతుపతి కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే సోమవారం.

ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు మేకర్స్‌.

విజయ్‌కుమార్‌, సంయుక్త, టబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఛార్మీ కౌర్‌ సమర్పణలో పూరి జగన్నాథ్‌, జేబీ నారాయణరావు కొండ్రోల్లా సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ప్రేక్షకులకు విభిన్నమైన అనుభూతిని ఈ సినిమా ద్వారా అందిస్తామని మేకర్స్‌ పేర్కొన్నారు.

ఈ నెల నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలు కానుంది.

అల్లరి నరేశ్‌ ఆల్కహాల్‌.

అల్లరి నరేశ్‌ ఆల్కహాల్‌…

హాస్య చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న అల్లరి నరేశ్‌, వైవిధ్యభరితమైన చిత్రాలతోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. అదే కోవలో మరో వైవిధ్యమైన చిత్రంతో…

హాస్య చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న అల్లరి నరేశ్‌, వైవిధ్యభరితమైన చిత్రాలతోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. అదే కోవలో మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడం కోసం సీతార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో చేతులు కలిపారు. ‘ఫ్యామిలీ డ్రామా’ ఫేమ్‌ మెహర్‌ తేజ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ‘ఆల్కహాల్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ ఆకట్టుకుంటోంది. కాగా, అల్లరి నరేశ్‌ సరసన రుహాని శర్మ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నట్లు చిత్రబృందం పేర్కొంది.

హాస్య చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న అల్లరి నరేశ్‌, వైవిధ్యభరితమైన చిత్రాలతోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. అదే కోవలో మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడం కోసం సీతార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో చేతులు కలిపారు. ‘ఫ్యామిలీ డ్రామా’ ఫేమ్‌ మెహర్‌ తేజ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ‘ఆల్కహాల్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ ఆకట్టుకుంటోంది. కాగా, అల్లరి నరేశ్‌ సరసన రుహాని శర్మ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నట్లు చిత్రబృందం పేర్కొంది.

కథలో భిన్న కోణాలుంటాయి.

 కథలో భిన్న కోణాలుంటాయి…

 

తమ్ముడు సినిమాలో కుటుంబ భావోద్వేగాలు, భిన్న కోణాలు ఉంటాయి. ట్రైలర్‌లో కథ ఎలా ఉండబోతుందో చెప్పాం అని అన్నారు దర్శకుడు శ్రీరామ్‌ వేణు. నితిన్‌ హీరోగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తమ్ముడు. దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మించారు.

‘‘తమ్ముడు’ సినిమాలో కుటుంబ భావోద్వేగాలు, భిన్న కోణాలు ఉంటాయి. ట్రైలర్‌లో కథ ఎలా ఉండబోతుందో చెప్పాం’ అని అన్నారు దర్శకుడు శ్రీరామ్‌ వేణు. నితిన్‌ హీరోగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తమ్ముడు’. దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మించారు. ఈ శుక్రవారం థియేటర్లలో విడుదలవుతున్న సందర్భంగా శ్రీరామ్‌ వేణు మీడియాతో మాట్లాడుతూ ‘ఈ చిత్రానికి సెన్సార్‌ వాళ్లు కొన్ని కట్స్‌ చెప్పారు. మేము ఆ కట్స్‌ వద్దనుకున్నాం. సినిమాలో హీరోతోపాటు ఐదుగురు మహిళా క్యారెక్టర్లు బలంగా ఉంటాయి. ‘విక్రమ్‌’లో కమల్‌ హాసన్‌ పాత్ర కథలో ఎలా ట్రావెల్‌ అవుతుందో అలా ఈ చిత్రంలోనూ ఉంటుంది. ఆర్చరీని కథలో చేర్చాలని చాలా సార్లు అనుకున్నాం. ‘తమ్ముడు’లో కుదిరింది. ఆర్చరీ ట్రైనర్‌తో నితిన్‌కు 15 రోజులు శిక్షణ ఇప్పించాం. కథలో ప్రధానంగా బ్రదర్‌ సిస్టర్‌ సెంటిమెంట్‌ ఉన్నా అనేక కోణాల్లో మూవీ సాగుతుంది. ‘కాంతారా’ చూశాక సప్తమి గౌడ మా మూవీలోని క్యారెక్టర్‌కు బాగుంటుందని అనిపించి తీసుకున్నాం. మ్యూజిక్‌ డైరెక్టర్‌ అజనీష్‌ లోకనాథ్‌ మంచి బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ ఇచ్చారు.

ఓ దినపత్రికలో వచ్చిన ఆర్టికల్‌ స్ఫూర్తితో ‘తమ్ముడు’ కథను సిద్ధం చేసుకున్నా. కథ విని దిల్‌రాజు గారు బడ్జెట్‌ గురించి ఆలోచించకుండా నిర్మించారు. ఈ కథకు సరిపోయే హీరో కోసం వెతికాం. నితిన్‌ బాగుంటాడని తీసుకున్నాం. లయ పాత్ర కోసం ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌కి కథ చెప్పాం. ఆమెకు కథ, క్యారెక్టర్‌ నచ్చింది. కానీ ఆమె వ్యక్తిగత కారణాల వల్ల నటించలేదు. అయితే మరోసారి ఇలాంటి క్యారెక్టర్‌ వస్తే తప్పకుండా నటిస్తానని చెప్పారు. నా ప్రతి సినిమా ఒక కొత్త జానర్‌లో ఉంటుంది. నేనెప్పుడూ జానర్‌ రిపీట్‌ చేయలేదు. నా స్ర్కిప్ట్‌లో ఫిమేల్‌ క్యారెక్టర్లకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఇప్పటి దాకా అలా చేస్తూ వచ్చాను. తరవాత సినిమాకు ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేను’ అని అన్నారు.

 స్ట్రీమింగ్ తేదీ వచ్చేసింది.

 స్ట్రీమింగ్ తేదీ వచ్చేసింది…

 

యశ్ రాజ్ ఫిలిమ్స్, నెట్ ఫ్లిక్స్ సంయుక్త నిర్మాణంలో రూపుదిద్దుకున్న వెబ్ సీరిస్ ‘మండల మర్డర్స్’. ఇది జులై 25 నుండి స్ట్రీమింగ్ కాబోతోంది.

ది రైల్వే మ్యాన్’ (The Railway Man) వెబ్ సీరిస్ కు మంచి స్పందన లభించడంతో ఇప్పుడు యశ్ రాజ్ ఫిలిమ్స్ (Yash Raj Films), నైట్ ఫ్లిక్స్ (Netfilx) భాగస్వామ్యంలో మరో వెబ్ సీరిస్ రూపుదిద్దుకుంది.

అదే ‘మండల మర్డర్స్’ (Mandala Murders). వాణీ కపూర్ (Vani Kapoor), సుర్వీన్ చావ్లా ప్రధాన పాత్రలు పోషించిన ఈ వెబ్ సీరిస్ ను గోపీపుత్రన్, మనన్ రావత్ డైరెక్ట్ చేశారు.

వాణీ కపూర్, సుర్వీన్ చావ్లా ఇద్దరూ తెలుగు వారికి సుపరిచితులే. వాణీ కపూర్ హీరో నాని (Nani) సరసన ‘ఆహా కళ్యాణం’లో నటించగా, సుర్వీన్ చావ్లా తన కెరీర్ ప్రారంభంలో ‘రాజు మహరాజు’ చిత్రంలో హీరోయిన్ గా చేసింది.

తాజాగా ఈ డార్క్ మిస్టరీ థ్రిల్లరీ స్ట్రీమింగ్ డేట్ ను ప్రకటించారు. జులై 25 నుండి ఈ వెబ్ సీరిస్ నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కాబోతోంది.

‘మండల మర్డర్స్’ వెబ్ సీరిస్ లో చరణ్‌ దాస్ పూర్ పట్టణంలో ఆచారాల పేరుతో జరిగే హత్యలు, వాటి వెనుక ఉన్న రహస్యాలు, చీకటి కోణాలకు సంబంధించిన సంఘటనలు ఉండబోతున్నాయి.
ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఆ పట్టణం హత్యలతో అట్టుడికిపోతుంది.
ఈ రహస్యాన్ని ఛేదించే డిటెక్టివ్ రియా పాత్రను గ్లామర్ క్వీన్ వాణీ కపూర్ పోషించింది. ఇతర కీలక పాత్రలను వైభవ్ రాజ్ గుప్తా, సామ్మి జోనస్ హెనీ, జమీల్ ఖాన్, శ్రియా పిల్గాన్కర్ పోషించారు.

సిట్ కస్టడీకి చెవిరెడ్డి జైలు వద్ద హల్‌చల్.

సిట్ కస్టడీకి చెవిరెడ్డి జైలు వద్ద హల్‌చల్…

Chevireddy Custody: లిక్కర్ స్కామ్‌లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు చెవిరెడ్డిని సిట్ విచారించనుంది.

విజయవాడ, జులై 1: ఏపీ మద్యం కుంభకోణం కేసులో (AP Liquor Scam) మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (Former MLA Chevireddy Bhaskar Reddy), వెంకటేష్ నాయుడులను సిట్ అధికారులు (SIT Officials) అదుపులోకి తీసుకున్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు చెవిరెడ్డిని విచారించేందుకు ఏసీబీ కోర్టు నిన్న (సోమవారం) ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈరోజు ఉదయమే చెవిరెడ్డితో పాటు వెంకటేష్ నాయుడును కూడా సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకుని సిట్ కార్యాలయానికి తరలించారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు విచారించేందుకు సిట్‌కు కోర్టు అనుమతించింది.అయితే కస్టడీలోకి తీసుకునే సమయంలో మరోసారి జైలు వద్ద చెవిరెడ్డి హల్‌చల్ చేశారు. సిట్ కార్యాలయానికి తరలించే సమయంలో ‘నా పై తప్పుడు కేసు పెట్టారంటూ’ అరుస్తూ వచ్చారు. ఎవ్వరినీ వదిలేది లేదంటూ హెచ్చరిస్తూ చెవిరెడ్డి పోలీసు జీపు ఎక్కారు. లిక్కర్ స్కాంలో చెవిరెడ్డి ఏ 38గా ఉండగా, వెంకటేష్ నాయుడు ఏ 34గా ఉన్నారు. ఐదు రోజుల పాటు చెవిరెడ్డిని కస్టడీకి ఇవ్వాలని సిట్ కోరినప్పటికీ కేవలం మూడు రోజుల పాటు కస్టడీకి మాత్రమే అనుమతి ఇచ్చింది కోర్టు. అలాగే జైలులోని దేవాలయానికి వెళ్లేందుకు చెవిరెడ్డికి పది నిమిషాల పాటు అనుమతి ఇచ్చింది. కానీ బయట ఆహారం పంపాలన్న మాజీ ఎమ్మెల్యే అభ్యర్థనను మాత్రం న్యాయస్థానం తోసిపుచ్చింది.

ప్లేయింగ్ ఎలెవన్‌తో షాక్ ఇచ్చిన ఇంగ్లండ్ ఇలా చేశారేంటి.

ప్లేయింగ్ ఎలెవన్‌తో షాక్ ఇచ్చిన ఇంగ్లండ్ ఇలా చేశారేంటి…

 

రెండో టెస్ట్ కోసం ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది ఇంగ్లండ్. అయితే అనూహ్య రీతిలో ఒక ప్లేయర్‌ను పక్కనపెట్టేసింది. తుది జట్టు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

లీడ్స్ టెస్ట్‌లో విజయంతో ఫుల్ ఖుషీగా ఉంది ఇంగ్లండ్. టీమిండియాను 5 వికెట్ల తేడాతో ఓడించడంతో స్టోక్స్ సేన కాన్ఫిడెన్స్ మరింత పెరిగింది. ఇదే జోరులో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగే రెండో టెస్ట్‌లో కూడా గెలుపుబావుటా ఎగురవేయాలని చూస్తోంది ఆతిథ్య జట్టు.
ఈ క్రమంలోనే ప్లేయింగ్ ఎలెవన్‌ను కూడా ప్రకటించింది. అయితే అనూహ్యంగా ఓ స్టార్ పేసర్‌ను పక్కనబెట్టేసింది.
అతడ్ని తీసుకుంటారంటూ బాగా ప్రచారం జరిగినా తుది జట్టులో మాత్రం అవకాశం కల్పించలేదు.
అతడు ఎవరనేది ఇప్పుడు చూద్

 

ఎందుకు తీసుకోలేదు?

తొలి టెస్టులో ఆడిన జట్టునే ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌కూ యథావిధిగా కొనసాగించింది ఇంగ్లండ్. ఓపెనర్లుగా జాక్ క్రాలే, బెన్ డకెట్ బరిలోకి దిగుతారు. ఆ తర్వాత ఓలీ పోప్, జో రూట్ ఆడతారు.

హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జేమీ స్మిత్ మిడిలార్డర్ బాధ్యతలు పంచుకుంటారు. క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జోష్ టంగ్ పేస్ బాధ్యతలు తీసుకుంటారు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా షోయబ్ బషీర్‌ బరిలోకి దిగుతాడు.

అయితే అంతా బాగానే ఉన్నా పేస్ సెన్సేషన్ జోఫ్రా ఆర్చర్‌ను తుది జట్టులోకి తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. కౌంటీల్లో అదరగొట్టిన ఆర్చర్.. ఫామ్, ఫిట్‌నెస్ రెండూ నిరూపించుకున్నాడు.

దీంతో అతడ్ని స్క్వాడ్‌లోకి తీసుకున్నారు. కానీ ఈ మ్యాచ్ ప్లేయింగ్ ఎలెవన్‌లో మాత్రం అవకాశం కల్పించలేదు.

ఆర్చర్ విషయంలో మరికొంత కాలం వేచి ఉండాలని పూర్తి ఫిట్‌నెస్ సాధించాకే ఆడించాలనే ఆలోచనల్లో ఇంగ్లండ్ టీమ్ మేనేజ్‌మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది.

సిద్ధాంతమే శ్వాసగా..బిజేపి ఊపిరిగా!

-బిజేపి రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్ర రావు ఎదిగేదాక.

-సనాతన ధర్మం సాక్షిగా..ఆర్‌ఎస్‌ఎస్‌ వాదిగా

-దేశం కోసం, ధర్మం కోసం, కట్టర్‌ హిందూ అనే ముద్ర దాకా…

-కమ్యూనిజానికి వ్యతిరేకంగా.. బిజేపికి అనుకూలంగా.

-మానవత్వానికి బాసటగా..పార్టీకి న్యాయ సహాయకుడిగా

-పదవులకు కోసం కాకుండా.. పార్టీ కోసం పనిచేసిన నాయకుడుగా

-విద్యార్థి ఉద్యమాలు, ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాలు, రాజకీయ ప్రస్థానం దాకా

-పార్టీకి అలుపెరగని సేవలందిస్తున్న నాయకుడు ఎన్‌. రామంచంద్రరావు.

-‘‘నేటిధాత్రి’’ గత ఎడాది కాలంగా అనేక సార్లు చెప్పింది.

-రామచంద్రరావుకే బిజేపి అధ్యక్ష పదవి అని రాసింది.

-ఇప్పుడు అదే నిజమైంది. రామచంద్ర రావు కు గౌరవం దక్కింది.

జీవితాంతం నమ్మినసిద్దాంతం కోసం రాజకీయాలు చేసే వారు అతికొద్ది నాయకుల్లో ఎన్‌. రామచంద్రరావు ఒకరు. ఆయన చేసిన ఉద్యమాలు, త్యాగాలు చాలా గొప్పవి. తెలంగాణలో బిజేపి ఉనికి కోసం, ప్రస్తానం కోసం ఆయన పడిన శ్రమ ఈ తరానికి తెలియకపోవచ్చు. కాని బిజేపి జెండా రెపరెపలాడాలని కలలు గని కష్టించిన అతి కొద్ది మంది నాయకుల్లో రామచంద్రరావు ముందువరసలోవుంటారు. సహజంగా పార్టీ బలపడిన తర్వాత పాతతరం నేతలు కాస్త కనుమరుగు కావడం సహజం. కానీ రామచంద్రరావు సుమారు నలభై ఏళ్లుగా బిజేపికి సేవ చేస్తూనేవున్నారు. విద్యార్ధిరాజకీయాలలో అఖిలబారత విద్యార్ధి పరిషత్‌ను బలంగా విద్యార్ధి సమాజంలోకి తీసుకుపోవడంలో రామచంద్రరావు పాత్ర ఎంతో గొప్పది. నిజానికి ఆయన ఎప్పుడో పెద్ద నాయకుడు కావాలి. ఎందుకంటే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్ధి నాయకులుగా పేరున్న వాళ్లెంతో మంది నాయకులయ్యారు. కాని రామచంద్రరావు పార్టీ కోసం పనిచేస్తూ వచ్చారు. పార్టీని జాతీయ స్ధాయిలో నిలబెట్టేందుకు కృషిచేశారు. ఒకప్పుడు తెలంగాణలో బిజేపి జెండా పట్టుకునేవారు లేరు. కొద్ది మంది మాత్రమే ఆర్‌ఎస్‌ఎస్‌ బావాలకు ఆకర్షితులై, దేశం కోసం, ధర్మం కోసం పనిచేసేవారు. అయితే ప్రజల్లో స్పందన కనిపించకపోయినా, ఎప్పటికైనా సమాజంలో మార్పు వస్తుందని రామచంద్రరావు నమ్మారు. అది రెండు దశాబ్ధాలుగా నిజమౌతోంది. అయినా ఏనాడు పార్టీలో తనకు ఈ పదవి కావాలని, ఆ పదవి కావాలని కోరుకున్నది లేదు. ఒకప్పుడు హైదరాబాద్‌ నగర అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టాలంటే కూడా నాయకులు ముందుకు వచ్చే పరిస్ధితి లేని సమయంలో అండగా వున్న నాయకుడు రామచంద్రరావు. నగరం నుంచి పార్టీని జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాల దాకా పెరిగేందుకు కృషి చేసిన నాయకుడు రామచంద్రరావు. పార్టీ పిలిచి పదువులు ఇవ్వడం తప్ప, తనకు పదవులు కావాలని ఏనాడు కోరలేదు. ఇక బిజేపికి లీగల్‌ సెల్‌ బాద్యుడిగా ఆయన చేసిన సేవలు సామాన్యమైనవి కాదు. పార్టీ కోసం, ఆయన అనేక త్యాగాలు చేశారు. తెలంగాణలోనే కాదు, ఉమ్మడి రాష్ట్రంలో బిజేపి నాయకులకు ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా వారికి న్యాయపరమైన సేవలు అందించిన ఏకైక నాయకుడు రామచంద్రరావు. ఎంతటి క్లిష్టమైన కేసులైనా అవలీలగా గెలిచి, పార్టీ నాయకులను శిక్షలను తప్పించి, పార్టీకి సేవ చేశారు. బిజేపి నాయకులు, ఆర్‌ఎస్‌ఎస్‌ వాదులకు ఉచిత న్యాయ సేవలందించారు. అందుకే ఆయన వెనుకబడి పోయారని కూడా ఆయన సన్నిహితులు అంటుంటారు. అయితే ఈసారి ఎలాగైనా రామచంద్రరావు తెలంగాణ అద్యక్షుడు అవుతారని నేటి ధాత్రి ఏడాది కాలంగా చెబుతోంది. గత ఆరు నెలల కాలంగా ఎంత విసృతమైన బిజేపి అద్యక్ష పదవిపై రకరకాల చర్చలు జరుతున్నా బిజేపి అద్యక్ష ఎంపిక సమయం కూడా ఖచ్చితంగాచెప్పిన ఏకైక పత్రిక నేటిధాత్రి. అదిగో బిజేపి అద్యక్షుడు వస్తున్నాడు. ఇదిగో వస్తున్నాడని వార్త పత్రికలు, మీడియా సంస్ధలు విపరీతమైన ప్రచారం చేస్తున్న సమయంలో బిజేపి ఆలోచనలు, అడుగులు పక్కాగా చెప్పిన ఏకైక పత్రిక నేటిధాత్రి. అంతే కాదు రకరకాల నాయకులు పేరు తెరమీదకు తెచ్చి గందరగోళం సృష్టించిన మీడియాకుకూడా రామచంద్రరావుకే ఈసారి అవకాశం అని చెప్పిన ఏకైక మీడియా నేటిదాత్రి. ఇప్పుడు అదే నిజమైంది.ఎందుకంటే పార్టీ కేంద్ర విభాగం ఆలోచనలు ఎప్పటికిప్పుడు నేటిధాత్రి పసిగడుతూ చెబుతూనే వుంది. ఈసారి ఆర్‌ఎస్‌ఎస్‌ వాదికే బిజేపి అద్యక్ష పదవి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే బిజేపి బలపడక ముందు ఇతర పార్టీల నుంచి రావాలంటే నాయకులు ఒకటికి రెండు సార్లు ఆలోచించేవారు. గతంలో బిజేపి కేంద్రంలో అదికారంలో వున్నప్పటికీ బిజేపిలో చేరడానికి ముందుకొచ్చేవారు కాదు. కాని ఎప్పుడైతే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారో అప్పటి నుంచి బిజేపి దేశ వ్యాప్తమైంది. అప్పటి నుంచి ఇతర పార్టీలలో స్ధానం లేదనుకున్నవాళ్లు బిజేపిలో చేరుతూ వచ్చారు. కొన్ని కటువుగా అనిపించినా సరే నిజాలు చెప్పుకోవాలి. ఈ మధ్య కాలంలో బిజేపిలో చేరిన వారు ఎవరూ బిజేపి సిద్దాంతాలకు ఆకర్షితులై చేరిన వారు కాదు. తమ రాజకీయ ప్రాబల్యం కోసం, పరపతి కోసం , రాజకీయ పదువుల కోసం, ఎన్నికల్లో సీట్ల కోసం చేరిన వారే ఎక్కువ. రాజకీయంగా ఇతర పార్టీలలో ఆశ్రయం దొరకని వారు కూడా చాల మంది బిజేపి గొడుకు కిందికు చేరారు. ఆ తర్వాత తమదే పెత్తనం అని కలలుగన్నవారున్నారు. బిజేపిపార్టీ వల్ల తమ రాజకీయ భవిష్యత్తుకు దారి దొరికిందన్న ఆలోచన లేకుండా తమ వల్లే బిజేపి ఎదిగిందని అనుకుంటున్న వారు కూడా తెలంగానలో చాలా మంది వున్నారు. అలాంటి నాయకులు ఈసారి పగటి కలలు కంటూ వచ్చారు. పార్టీని ఏలుదామనుకున్నారు. కాని అన్ని రాజకీయ పార్టీలు వేరు. బిజేపి వేరు. ఎందుకంటే దివంగత వాజ్‌పాయ్‌ ప్రధానిగా వున్నప్పుడు , తమిళనాడుకుచెందిన అప్పటి ముఖ్యమంత్రి జయలలిత కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నది. ఆ సమయంలో ఒక్క ఓటుతో బిజేపి కేంద్ర ప్రభుత్వం పడిపోయింది. నిజానికి ఆనాడు వాజ్‌పాయ్‌ తన పదవిని నిలుపుకోవాలంటే ఏ ఒక్క ఎంపిని మద్దతు కావాలని కోరినా సరిపోయేది. కాని ధర్మంగా పాలన చేయాలనుకున్నప్పుడు ప్రజల తీర్పుతో మళ్లీ వస్తా అని చెప్పారు. మళ్లీ బిజేపిని గెలిపించి వాజ్‌పాయ్‌ ప్రధాని అయ్యారు. అంతటి అంకితభావం ఒక్క బిజేపిలోనే చూస్తారు. అలాంటి పార్టీలో అవకాశవాదులకు, వలసవాదులకు పార్టీపరమైన పదవులు అప్పగించొద్దని ఈసారి బిజేపి కేంద్ర పెద్దలు ఆలోచించారు. జీవితాంతం పార్టీ కోసం త్యాగం చేసిన, కృషి చేసిన ఎన్‌. రామచంద్రరావును సేవలను గుర్తించారు. బిజేపి ఉనికి కోసం ఆరాపడుతున్న సమయం నుంచి, బిజేపి బలపడి దేశాన్ని ఏలుతున్న రోజుల దాకా పార్టీ కోసం పనిచేసిన రామచంద్రరావుకు గుర్తింపు దక్కడమంటే ఆయనకు పార్టీ ఇచ్చిన గౌరవం అని చెప్పాలి. నిన్నగాక మొన్న చేరిన వారు , పార్టీ చలవతో పదవులు పొందిన వారు పోటీలు పడడం విడ్డూరం. అంతే కాదు బిజేపి అద్యక్షపదవికి పోటీ పడుతున్నట్లు నిత్యం ప్రచారం చేసుకున్నవారెవరూ అసలైన బిజేపి నాయకులు కాదు. సనాతన ధర్మం గొప్పదనం తెలిసిన వారు కాదు. ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్దాంతాలను మోసిన వారు కాదు. కేవలం రాజకీయ భవితవ్యం కోసం వచ్చినవారే. అందువల్ల తెలంగాణలోని నిబద్దులైన బిజేపి నాయకులు ఈసారి ఎలాగైనా బిజేపి సిద్దాంతాలను నరనరాన జీర్ణించుకున్న వారికే ఇవ్వాలని కోరుకున్నది. కేంద్ర పార్టీ అదే చేసింది. అయితే రామచంద్రరావు ఎంపికపై రకరకాల వార్తలు ప్రచారం చేస్తున్నారు. వారికి పదవి దక్కలేదన్న అక్కసును వెళ్లగక్కుతున్నారు.

నోరుందని రంకెలేస్తే కొంకులు కంకులైతయ్‌!?

`తెలంగాణ రాజకీయాల మీద తప్పుడు కూతలు కూస్తే పంగలు పగులతయ్‌!

`తెలంగాణ బ్రాండ్‌ దెబ్బ తీయాలని చూస్తే మంగన్లు వస్తై!

`మీడియా ముసుగులో తెలంగాణ అస్తిత్వం మీద కొన్ని ఛానళ్ల దాడి. 

`ఇది తెలంగాణ బిడ్డా… ఉద్యమాల జీవ గడ్డ.

`పోరాటాల పురిటిగడ్డ..పౌరుషానికి అడ్డ.

`తెలంగాణ రాజకీయాల మీద ఏపీ మీడియా బరితెగించి ఫోకస్‌.

`తెలంగాణ అభివృద్ధి చూడలేని ఓర్వలేని తనం.

`ఫోన్‌ ట్యాపింగ్‌ విచారణ జరుగుతున్న సమయంలో మీడియా వికృత రూపం.

`సిట్‌ విచారణ పూర్తి కాలేదు.

`సిట్‌ తన నివేదిక ప్రభుత్వానికి సమర్పించలేదు.

`ఏపీ మీడియా అత్యుత్సాహం హద్దులు మీరుతోంది.

`మహాన్యూస్‌ కేటీఆర్‌ పై బురద జల్లుతోంది.

`అదే సమయంలో ఏబిఎన్‌ సీఎం. రేవంత్‌ రెడ్డి మీద విషపు రాతలు రాస్తోంది.

`తెలంగాణ సమాజం ఇది గమనించాల్సి వుంది. 

`పదేళ్ల పాటు లేవని కాంగ్రెస్‌కు జవసత్వాలు తెచ్చింది రేవంత్‌ రెడ్డి.

`కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తెచ్చింది రేవంత్‌ రెడ్డి.

`అందుకే అధిష్టానం రేవంత్‌ రెడ్డిని సిఎం చేసింది.

`ఆ మాత్రం స్పష్టత, పూర్తి అవగాహన అధిష్టానానికి వుంది.

`కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు కాలేదు.

`రేవంత్‌ రెడ్డిని తొలగించాలని చూస్తున్నట్లు ఏబిఎన్‌కు ఎవరు చెప్పారు.

`ముందు తెలంగాణలో బీఆర్‌ఎస్‌ను దెబ్బ కొట్టాలని ఏపీ. మీడియా చూసింది.

`కాంగ్రెస్‌ను పావుగా వాడుకున్నది.

`ఇప్పుడు కాంగ్రెస్‌ను దెబ్బ తీయాలని కుట్ర చేస్తోంది.

`తెలంగాణ లో పార్టీలు ఈ విషయం అర్థం చేసుకుంటే మంచిది.

`ఏం కొంపలు మునిగిపోయాయని రేవంత్‌ రెడ్డిని దించాలనుకుంటున్నారు.

`ప్రశాంతమైన తెలంగాణలో ఎక్కడా శాంతి భద్రతల సమస్యల లేదు.

`ప్రజల్లో ఎలాంటి అసంతృప్తి ఇప్పటి వరకు లేదు. 

`అయినా రేవంత్‌ను ఎందుకు అధిష్టానం పక్కకు పెట్టాలనుకుంటుంది.

`తప్పుడు వార్తలతో కాంగ్రెస్‌ పార్టీలో అలజడి సృష్టించాలని ఏపీ. మీడియా ప్రయత్నం చేస్తోంది.

`ఇక కేటీఆర్‌ మీద లేనిపోని అవాస్తవాలు వండి వార్చేస్తోంది. 

`కేటీఆర్‌ సినిమా వాళ్ల దగ్గర నుంచి యాంకర్ల వరకు వదల్లేదని బురద జల్లుతోంది.

`అంటే పరోక్షంగా సినిమా హీరోయిన్లు అంత బలహీనమైన వాళ్లా!

`ఎవరు బెదిరిస్తే వారికి లొంగిపోతారా?

`యాంకర్లంటే ఏపీ. మీడియాకు అంత చులకనా? 

`యాంకర్ల మీద ఇంత దుర్మార్గపు విషం చిమ్ముతారా?

`వారికి వ్యక్తిత్వం, ఆత్మాభిమానం లేదన్నట్లు అర్థం రాదా?

`ఆ చానళ్లలో కూడా యాంకర్లు పని చేస్తున్నారు.

`కేటీఆర్‌ బెదిరిస్తే యాంకర్లు లొంగిపోయారని అనడం నేరం కాదా!

`మహా టివి మీద దాడి ప్రజాస్వామ్యంపై దాడి అంటారా?

`ప్రజా రాజ్యం జెండా పీకేద్దామా? అని వార్త వచ్చినప్పుడు ఏం చేశారో పవన్‌కు గుర్తు లేదా?

`దక్కన్‌ క్రానికల్‌ పేపర్‌ కార్యాలయం మీద పవన్‌ దాడి చేయలేదా!

`ఇటీవల సాక్షి కార్యాలయాల మీద ఏపీలో దాడి జరగలేదా!

`ఏపీలో రాజకీయాలు చేస్తారు. 

`ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజా ప్రతినిధులౌతారు.

`సాయంత్రం హైదరాబాద్‌ చేరుకుంటే గాని నిద్రపోలేరు.

`ఏపీ ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసుకుంటూ నిత్యం అమరావతి, హైదరాబాద్‌కు చక్కర్లు కొడతారు.

`ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వంచించి, పాలన గాలికొదిలేస్తారు.

`ఇది ఏపీ మీడియాకు కనిపించడం లేదా!

`ఏపీలో ఏం జరిగినా వార్త కాదు.

`తెలంగాణలో జరిగే విచారణలను వార్తలు చేసి విషం చిమ్ముతారా?

`కాళేశ్వరం మీద విషం కక్కుతారా?

`పోలవరం స్పిల్‌ వే కొట్టుకుపోయింది వార్త కాదా?

`కాళేశ్వరం మొదలైనప్పుడు ప్రారంభమైన పోలవరం ఎందుకు పూర్తి కాలేదని ఏపి. మీడియాకు అవసరం లేదా?

`విశాఖలో మంచి నీటి ఎద్దడి కనిపించడం లేదా.

  హైదరాబాద్‌,నేటిధాత్రి: 

మీడియాకు కొన్ని హద్దులుంటాయి. ప్రమాణాలుంటాయి. మీడియా అయినంత మాత్రాన రాజ్యాంగంలో ప్రత్యేకమైన ఆర్టికల్స్‌ ఏమీ వుండవు. వ్యక్తి స్వేచ్చ, భావ ప్రకటనా స్వేచ్చ 19(1)ప్రకారమే హక్కులంటాయి. తప్ప మీడియా అనే దానికి ఎలాంటి ప్రత్యేక వెలుసులుబాటు లేదు. ఈ విషయం తెలియని అల్పులు కొందరు మీడియా స్వేచ్ఛ అనేది వుందని భ్రమ పడుతుంటారు. అందులోనూ ఎలక్రానిక్‌ మీడియా అనే దానికి ఎలాంటి గుర్తింపులేదు. సమచార శాఖ ఎలక్రానిక్‌ మీడియాను గుర్తించింది లేదు. న్యూస్‌ చానల్స్‌ అయినా అవి వినోదాత్మక ఛానల్స్‌లో భాగం మాత్రమే. ఆ సంగతి తెలిసి కూడా లేని పోని వార్తలువండి వార్చడమే కాకుండా, రాజకీయ నాయకుల వ్యక్తిగత జీవితాలలో తొంగి చూస్తామంటే సమాజం ఊరుకోరు. ఆ రాజకీయ పార్టీలు, నాయకులు వదిలిపెట్టరు. ముఖ్యంగా తెలంగాణలో జరుగుతున్న మీడియా విశృంకల పోకడలో రెండురకాల విషయాలు ఆధారపడి వున్నాయి. తెలంగాణను అస్ధిరపర్చాలన్న కుట్ర కోణం దాగి వుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది కొన్ని రాజకీయ పార్టీలకు, నాయకులకు, మీడియా సంస్ధలకు సుతారం ఇష్టం లేదు. ఎప్పటికైనా సరే తెలంగాణ విఫల రాష్ట్రం చేయాలన్న కుట్రను ఆనాటి నుంచి చేస్తూనే వున్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా అనేక రకాలుగా అడ్డుకునే ప్రయత్నం చేసింది. తెలంగాణ సమాజం మొత్తం ఏకం కావడంతో తప్పని పరిస్ధితుల్లో మద్దతు తెలుపకపోయినా, సైలెంటుగా వున్నారు. తెలంగాణలో బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం వున్నంత కాలం ఏపి మూలాలున్న మీడియా సంస్దలు రంకెలు వేయలేదు. 2018 ఎన్నికల ముందు వేయాలని ఒకసారి చూశాయి. తెలంగాణలో బిఆర్‌ఎస్‌ ఓడిపోతుందని ప్రచారం చేశాయి. కాని ఆ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ ఊహించనంత మెజార్టీ సొంతం చేసుకోవడంతో ఎన్నికల సమయంలో కూడా బిఆర్‌ఎస్‌పై వార్తలు రాయడానికి భయపడ్డాయి. కాకపోతే కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాలని ప్రయత్నం చేశాయి. అందులో కూడా కాంగ్రెస్‌ మీద ప్రేమతోనో, లేక సిఎం. రేవంత్‌ రెడ్డికి మద్దతివ్వాలని కాదు. తెలంగాణలో రాజకీయ అస్ధిరత అనేది ఏ దశలోనైనా చూపించడానికి కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మేలనుకున్నారు. ఎందుకంటే కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యమెక్కువ. దాంతో సీమాంద్ర మీడియా ఆడిరది, ఆట పాడిరది పాట అవుతుందని అంచనా వేసుకున్నాయి. ఇప్పుడు అదే పనిని మొదలు పెట్టాయి. కాంగ్రెస్‌కు అనుకూలంగా వార్తలు రాయపోయినా, సరే బిఆర్‌ఎస్‌పై లేనిపోని వార్తలు రాస్తూ వస్తున్నారు. అంటే సహజంగా ఏ వ్యక్తికైనా తనను మెచ్చుకోకపోయినా, అవతలి వ్యక్తిని తిడితే సంతోషించడం అనేది మానవసహజం. ఇదే సీమాంద్ర మీడియా పట్టుకున్నది. బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంటు కేటిఆర్‌ మీద లేనిపోని వార్తలు సృష్టిస్తోంది. విపరీతమైన ధంబ్‌ నెయిల్స్‌తో రకరకాల స్టోరీలు ప్రసారం చేస్తున్నాయి. చర్చలు సాగిస్తున్నాయి. అది మరీ హద్దులు దాటింది. ఓ వైపు టెలిఫోన్‌ ట్యాపింగ్‌పై సిట్‌ విచారణ జరుగుతోంది. అందులో ఏం జరుగుతుందో పూస గుచ్చినట్లు, ప్రజలు నమ్మేలా వార్తలు ప్రసారం చేస్తున్నారు. నిజానికి ఓ ఇన్వెస్టిగేషన్‌ జరుగుతున్నప్పుడు దానిపై వార్తలు రాయడం తప్పు కాదు. కాని విచారణలో ఏంజరుగుతుందో ప్రసారం చేయడం చట్టపరంగా తప్పు. నిజంగానే విచారణ పూర్తయి, కేటిఆర్‌ తప్పు చేశాడని తేలితే, ఆ వివరాలు వెలుగులోకి వస్తే వార్తలు వేయడంలో తప్పుండదు. కాని ఆలు లేదు చూలు లేదు కొడుకుపేరు సోమలింగం అన్నట్లు వార్తలు రాయడానికి ఎవరూ స్వాగతించరు. అందుకే నోరుంది కదా? స్టూడియోలో కూర్చొని రంకెలెస్తే కొంకులు పగిలిపోతాయని బిఆర్‌ఎస్‌ తేల్చి చెప్పింది. తెలంగాణ రాజకీయాల మీద లేనిపోని తప్పుడు కథనాలు ప్రసారం చేస్తే పంగలు పగులుతాయని రుచి చూపించారు. తెలంగాణ బ్రాండ్‌ను దెబ్బతీయాలని చూస్తే తెలంగాణ సమాజమే ఊరుకోదు. మరోసారి తెలంగాణ ఉద్యమ రుచి చూపిస్తారు. అప్పుడు ఈ మాత్రం స్ధానం కూడా లేకుండా చేస్తారు. మీడియా ముసుగులో కొన్ని ఛానళ్లు చేస్తున్న దాడిని తెలంగాణ సమాజం కూడా చూస్తూ ఊరుకోదు. ఎందుకంటే బిఆర్‌ఎస్‌ అనేది రాజకీయ పార్టీయే కాదు, తెలంగాణ ఉద్యమ పార్టీ. తెలంగాణ సాధించిన పార్టీ. తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ. ఆ పార్టీ నాయకుడు తెలంగాణ సాధనలో ముందున్నాడు. తెలంగాణ సాధించాడు. పదేళ్లపాటు ముఖ్యమంత్రిగా తెలంగాణను తీర్చిదిద్దాడు. ఈ రోజు స్టూడియోలో రెప్పపాటు కరంటు పోకుండా నడుస్తున్నాయంటే కారణం కేసిఆర్‌. ఇండ్లలో కూడా కరంటు నిరంతరాయం సరఫరా అవుతుందంటే కారణం కేసిఆర్‌. హైదరాబాద్‌ ఇంతలా విస్తరించిందంటే కారణం కేసిఆర్‌. ఈ సంగతి మర్చిపోయి , తెలంగాణ మీద విషం చిమ్మడానికి నాయకుల మీద లేనిపోని బుదర జల్లితే తెలంగాణ సమాజమే సహించదు. తెలంగాణ అభివృద్దిని చూడలేక ఓర్వలేని తనం బాగా పెరిగిపోయింది. ఫోన్‌ ట్యాపింగ్‌ విచారణ సమయంలో ఏపి మీడియా వికృత రూపాన్ని చూపిస్తే, తెలంగాణ సమాజం, బిఆర్‌ఎస్‌ పార్టీ తన అసలైన నిజ స్వరూపం చూపిస్తుంది. ఇప్పటి వరకు సిట్‌ విచారణ పూర్తి కాలేదు. ఇప్పుడే మొదలైంది. ఎంత కాలం సాగుతుందో తెలియని పరిస్దితి. సిట్‌ విచారణ పూర్తి కావాలి. అది ప్రభుత్వానికి సమర్పించాలి. ప్రభుత్వం వారిపై చర్యలకు ఉపక్రమించాలి. అందుకు ఇంకా చాలా కాలం వుంది. అయినా ఆ సిట్‌ ఎలాంటి నివేదిక ఇస్తుందన్నది కూడా ఎవరికీ తెలియదు. కాని ఏపి మీడియాకు మాత్రం తెలుస్తుందా? ఏపి మీడియా అత్యుత్సాహం హద్దులు దాటింది. అయితే ఇక్కడ తెలంగాణ సమాజం గమనించాల్సింది ఏపి మీడియా ఒక్క కేటిఆర్‌నే టార్గెట్‌ చేయలేదు. అటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇటు ప్రతిపక్ష పార్టీ బిఆర్‌ఎస్‌ అధినేత, కేసిఆర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంటు కేటిఆర్‌ను టార్గెట్‌ చేశారు. ఇది చాల మంది గమనించడం లేదు. ఏక కాలంలో ఏపి మీడియా సంస్ధలు తెలంగాణ రాజకీయాల మీద విషం చిమ్ముతున్నాయి. ఏకంగా సిఎం. రేవంత్‌రెడ్డి మీద ఏబిఎన్‌ విషపు రాతలు రాస్తోంది. పదేళ్లపాటు జవసత్వాలు లేని, కాంగ్రెస్‌ పార్టీని బతికించి, నిలబెట్టి అదికారంలోకి తెచ్చిన నాయకుడు రేవంత్‌రెడ్డి. ఆయన పది కాలాల పాటు పదవిలో వుండాలని కోరుకోవాలి. కాని ఆయనపై డిల్లీలో ఏదో జరుగుతుందోన్న అసత్య ప్రచారం విసృతంగా చేస్తున్నారు. రేవంత్‌రెడ్డి చేసిన కష్టాన్ని చూసిన తర్వాతే ఆయనను కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం సిఎంను చేసింది. అ ంతే కాని ఎవరో చెబితేనో, మీడియాలో వచ్చే వార్తల వల్లనోచేయలేదు. ఆ మాత్రం స్పష్టత అధిష్టానానికి వుంది. కాంగ్రెస్‌ పార్టీ అదికారంలోకి వచ్చి రెండేళ్లు కూడా కాలేదు. అప్పుడే లుకలుకలు అంటూ వార్తలు రాస్తున్నారు. ఏబిఎన్‌ కూడా రేవంత్‌రెడ్డిని తప్పించాలని కోరుకుంటున్నట్లుంది. ముందు బిఆర్‌ఎస్‌ మీద దెబ్బకొట్టాలని ఏపి మీడియా చూసింది. ఇప్పుడు కాంగ్రెస్‌ మీద కూడా పగపట్టింది. ఆనాడు కాంగ్రెస్‌ను పావుగా వాడుకున్నది. ఇప్పుడు కాంగ్రెస్‌ను దెబ్బతీయాలని చూస్తోంది. ఏం కొంపలు మునిగిపోతున్నాయని సిఎం. రేవంత్‌రెడ్డిని తప్పిస్తారు? తెలంగాణలో ప్రశాంతమైన వాతావరణం వుంది. ఎక్కడా శాంతి బద్రతల సమస్యలేదు. ప్రజల్లో అసంతృప్తిలేదు. ఎక్కడా ప్రజా పోరాటాలు సాగడం లేదు. ఆఖరుకు రైతులు కూడా సంతోషంగా వున్నారు. తప్పుడు వార్తలతో కాంగ్రెస్‌ పార్టీలో అలజడి సృష్టించాలని ఏపి మీడియా చూస్తోంది. అలాగే కేటిఆర్‌ మీద కూడా అవాస్తవాలు వండి వార్చుతోంది. కేటిఆర్‌ మీద తప్పుడు కథనాలు విపరీతంగా ప్రసారం చేస్తున్నాయి. కేటిఆర్‌ సినిమా వాళ్ల దగ్గర నుంచి మీడియా ఛానళ్ల యాంకర్ల వరకు వదిలిపెట్టలేదన్నట్లు అర్దమొచ్చేలా కథనాలు ప్రసారం చేశారు. అంటే సినిమా హీరోయిన్లంటే మహా న్యూస్‌కు అంత చులకనగా కనిపిస్తున్నారా? పరోక్షంగా వారి క్యారెక్టర్‌ను దెబ్బతీస్తున్నారా? సినిమా హీరోయిన్లు అంత బలహీన మైన వారా? వారికి సమాజంలో వున్న గౌరవం, పేరు , ప్రఖ్యాతులను దెబ్బతీస్తారా? ఇదేనా జర్నలిజం అంటే? సినిమా హీరోయిన్లు అంటే ఎవరు బెదిరిస్తే వారికి లొంగిపోతారా? మీడియాలో పనిచేసే యాంకర్లంటే మహా న్యూస్‌కు అంత చిన్న చూపా? వారంటే అంత చులకనా? అంటే పరోక్షంగా మహా న్యూస్‌లో పనిచేసే యాంకర్లను కూడా వేలెత్తి చూపిస్తున్నట్లు కాదా? వాళ్లు ఎంత కష్టపడితే వార్తలు ప్రసారమౌతున్నాయో చూసుకుంటూ కూడా ఇలాంటి ధంబ్‌ నెయిల్స్‌ ఎలా పెడుతున్నారు? వాటిని మళ్లీ మహిళా యాంకర్లతో ఎలా చదవిస్తున్నారు? ఎవరూ అడగరని అహంకారమా? యాంకర్లకు వ్యక్తిత్వం, ఆత్మాభిమానం వుండదని మహా టీవి చెబుతున్నట్లు కాదా? కేటిఆర్‌ బెదిరిస్తే సినిమా హీరోయిన్లు, యాంకర్లు లొంగిపోతారని చెప్పడం మహా న్యూస్‌ చేస్తున్న నేరం కాదా? ఇక మహా న్యూస్‌ మీద బిఆర్‌ఎస్‌ కార్యకర్తలు దాడి చేస్తే అది ప్రజాస్వామ్యం మీద దాడిగా మారిపోయిందా? మరి ఇటీవల ఏపిలో సాక్షి కార్యాలయాల మీద తెలుగుదేశం శ్రేణులు చేసిన దాడి ప్రజాస్వామ్య విరుద్దం కాదా? ఇలాంటి దాడులు తెలుగుదేశం పార్టీ చేస్తే సంసారమౌతుందా? బిఆర్‌ఎస్‌ చేస్తే మరొకటి అవుతుందా? ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలు సమర్ధనీయమా? గతంలో ప్రజారాజ్యం పార్టీపై జెండా పీకేద్దామా? అని వార్త వచ్చినప్పుడు ఏం చేశారు. పవన్‌ కళ్యాణ్‌కు గుర్తులేదా? దక్కన్‌ క్రానికల్‌ కార్యాలయం ద్వంసం పవన్‌కు మర్చిపోయాడా? అయినా తెలంగాణ రాజకీయాల మీద మీడియా మాట్లాడిరదంటే ఒక అర్దం వుంది. కాని చంద్రబాబు నాయకుడు, పవన్‌ కళ్యాణ్‌కు ఏం పని. ఈ మధ్య ఏపిలో సాక్షి కార్యాలయాలపై దాడి జరిగితే తెలంగాణ నుంచి ఏ ఒక్కరైనా స్పందించారా? బిఆర్‌ఎస్‌ ఏ ఒక్క నాయకుడైనా మాట్లాడారా? తెలంగాణ నాయకులు ఎంతో విజ్ఞులు. అందుకే ఆ రాష్ట్ర రాజకీయాలు పట్టించుకోలేదు. ఏపిలోవున్న రెండు పార్టీల ఆలోచనలు వేరు. అందుకే తెలంగాణ రాజకీయాల్లో వేలు పెడుతున్నారు. ఒకనాడు పవన్‌ కళ్యాన్‌ 2014 ఎన్నికల సమయంలో మహబూబాబాద్‌లో కేసిఆర్‌ మీద చేసిన వ్యాఖ్యలు ఆయన గుర్తుంచుకుంటే పరిస్దితి ఎలా వుండేదో ఆలోచించుకోవాలి. వాటిన్నింటినీ మర్చిపోయి పవన్‌ కళ్యాణ్‌తో సుహృద్భావంగా వున్నారు. గౌరవి ంచారు. ఏకంగా ప్రజా భవన్‌కు పలిపించి కేసిఆర్‌ మర్యాదలు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులు అయ్యోడివా? నువ్వు అవ్వోడివా? అని పాడిన పాటలే కరక్టు. బిఆర్‌ఎస్‌ కూడా ఇప్పటికైనా తెలుసుకుంటేనే మేలు. ఎందుకంటే పాముకు నిత్యం పాలు పోసి పెంచినా అది సాదు జంతువు కాదు. విషాన్ని చిమ్మక మానదు. కాటేయక మానదు. అదే కొందరి నైజం.

error: Content is protected !!
Exit mobile version