నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

 కొల్చారం మండల బి ఆర్ ఎస్ పార్టీ యువత విభాగం అధ్యక్షుడు తుంకులపల్లి సంతోష్ రావు….

కొల్చారం, (మెదక్) నేటిధాత్రి :-

మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ శాసన సభ్యురాలు సునీత లక్ష్మారెడ్డి ఇంటిపై ఆదివారం రాత్రి కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కొల్చారం మండలం బిఆర్ఎస్ పార్టీ యువత విభాగం అధ్యక్షుడు తుంకలపల్లి సంతోష్ రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అని చెప్పుకుంటూ, మహిళ ఎమ్మెల్యే అని చూడకుండా గుండాయిజం చేస్తే ప్రజాపాలన.. లేక రౌడీయిజం పాలననా అది కాంగ్రెస్ కార్యకర్తలకే గుర్తుండాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా పోలీస్ అధికారులు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఇంటిపై దాడి చేసిన వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని ఆయన అన్నారు.

నారాయణ స్కూల్ పై చర్యలు తీసుకొని సీజ్ చేసి గుర్తింపు రద్దు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలి

మంచిర్యాల నేటిధాత్రి

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న నారాయణ స్కూల్ పై చర్యలు తీసుకొని సీజ్ చేసి గుర్తింపు రద్దు చేయాలని కోరుతూ జిల్లా విద్యాశాఖ అధికారి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అనంతరం ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ…మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సర్వేనెంబర్ 61 లో శ్రీ చైతన్య జూనియర్ కళాశాల భవనంలో నారాయణ స్కూల్ నడిపిస్తున్నారు ఆ యొక్క స్కూల్ 2020 తర్వాత అనుమతులు లేకుండా ఏర్పాటు చేశారు ఆ యొక్క స్కూల్ ISMS లో 2004 లో అనుమతి పొందినట్లుగా ఉంది ఒకవేళ గౌతమ్ బుద్ధ పాత ఫైల్ అయితే కొన్ని సంవత్సరాలు అనుమతి లేకుండా నారాయణ స్కూల్ అని విద్యార్థులను వారి తల్లిదండ్రులను మోసం చేసి నడిపించారు ఆ సంవత్సరాలలో విద్యార్థులను వారి తల్లిదండ్రులను మోసం చేసి ఫీజులు వసూలు చేసిన ఆ యొక్క ఫీజులను వెనక్కి ఇప్పించి వారి పై క్రిమినల్ కేసులు నమోదు చేపించాలి అంతేకాకుండా నారాయణ స్కూల్ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జీవో ఎంఎస్ నెంబర్ వన్ ప్రకారం కనీస సౌకర్యాలు అనుమతులు ఫైర్, గ్రౌండ్, గ్రిల్స్ లేకుండా నిర్వహిస్తున్నారు అంతేకాకుండా అదే పాఠశాలలో టై, బెల్టు, షూస్, సాక్సులు, పుస్తకాలు అమ్ముతూ సూపర్ మార్కెట్ లాగా తయారు చేసి విద్యను వ్యాపారం చేస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు నారాయణ స్కూల్ యాప్ అని పెట్టి 50% డబ్బులు కడితేనే డ్రెస్సులు ఇస్తామని ఈ యొక్క యాప్ ద్వారా డబ్బులు కట్టించుకుంటున్నారు ఇప్పటికీ అకాడమిక్ ఇయర్ సగం పూర్తయినప్పటికీ చాలామంది విద్యార్థులకు డబ్బులు కట్టించుకుని డ్రెస్సులు ఇవ్వలేదు డబ్బులు వసూలు చేస్తున్నారు తప్ప చాలావరకు మెటీరియల్ విద్యార్థులకు అందజేయలేదు అంతేకాకుండా ఐఐటీ, నీట్ అని చెప్పి విద్యార్థులకు వేరు వేరు తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులను విభజించి పాలించు అన్న విధంగా వ్యవహరిస్తున్నారు విద్యాబుద్ధులు నేర్చుకునే వయసులోనే విద్యార్థులను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తు విద్యార్థులను వారి తల్లిదండ్రులను అయోమయానికి గురి చేస్తున్నారు విద్యార్థులకు ఎగ్జామ్స్ పెట్టకుండా క్లాస్ లొ నిలబెట్టి నానా రకాల ఇబ్బందులూ పెడుతూ వారి మానసిక ధైర్యాన్ని దెబ్బతీస్తున్నారు నారాయణ స్కూల్ యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తూ ధనార్జనే ధ్యేయంగా దోచుకుంటున్నారు ఇంతే కాకుండా టీచర్ల ను మానసికంగా వేధించడమే కాకుండా వారి దగ్గర నుండి సెల్ ఫోన్లు బలవంతంగా లాక్కొని వారి పర్సనల్ జీవితంలో కూడా ఇన్వాల్వ్ అవుతున్నారని వారు ఆరోపించారు తక్షణమే విద్యార్థుల యొక్క బంగారు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కిన నారాయణ స్కూల్ పై విచారణ జరిపి చర్యలు తీసుకొని సీజ్ చేసి గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో
బచ్చలి ప్రవీణ్ కుమార్
విద్యార్థి జన సమితి జిల్లా అధ్యక్షులు
జాగిరి రాజేష్
తెలంగాణ బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్
షేక్ సల్మాన్ పాష
బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు

శాతవాహన యూనివర్సిటీకి వీసీనీ వెంటనే నియమించడంతో పాటు పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి-మచ్చ రమేష్

కరీంనగర్, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లాలో ఉన్న శాతవాహన యూనివర్సిటీకి వీసీనీ వెంటనే నియమించాలని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న వీసీల నియామకం చేయడంలో ప్రభుత్వ ఆలస్యం ఎందుకని, వీసీలు లేకపోవడం వల్ల యూనివర్సిటీలో రోజురోజుకు విద్యాప్రమాణాలు దెబ్బతింటున్నయాని, పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్. డిమాండ్ చేశారు. ఈసందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లాకార్యదర్శి మచ్చ రమేష్ మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలోని శాతవాహన యూనివర్సిటీ సమస్యలు నిలయంగా మారిందని గత పది ఏళ్ల బిఆర్ఎస్ పాలనలో విద్యారంగం పూర్తిగా నిర్లక్ష్యానికి, నిర్విర్యానికి గురైందని తెలంగాణలో మే 21న యూనివర్సిటీ వీసీల పదవి కాలం పూర్తయితే పదిహేను రోజుల్లో సెర్చ్ కమిటీ సమావేశాల ద్వారా వీసీల నియామకం చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి నాలుగు నెలలు కావస్తున్న ఇంకా వీసీల నియామకం చేపట్టకపోవడం అంటే ఉన్నత విద్యారంగా అభివృద్ధి వెనక్కి తీసుకెళ్లడమేనని సీఎం రేవంత్ రెడ్డి వద్దే విద్యాశాఖ ఉన్న ఎందుకు విద్యాశాఖలో ఇంత నిర్లక్ష్యం జరుగుతుందని ఒక్కో యూనివర్సిటీ వీసీ కోసం దరఖాస్తు చేసుకున్నారని అందులో ఒక్కరిని వీసీగా సెర్చ్ కమిటీ సమావేశం ద్వారా నియామకం చేయడానికి ఎందుకింత నిర్లక్ష్యమని,
శాతవాహన యూనివర్సిటీ గత ప్రభుత్వంలో చాలా వెనుకబడిందని, బడ్జెట్ విషయంలో, కొత్త రెగ్యులర్ కోర్సుల విషయంలో,ఖాళీగా ఉన్న పోస్టుల మంజూరు విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిందని సీఎం రేవంత్ రెడ్డి వెంటనే విద్యాశాఖ పై సమీక్ష చేసి విద్యారంగంలోని అన్ని విభాగాల్లో అన్ని విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని, పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిల విడుదల చేయాలని పెండింగ్ బకాయిల వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేద విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుందని పలు బడ్జెట్ కళాశాల యాజమాన్యాలు సైతం సిబ్బందికి జీతాలు ఇవ్వలేక భవన కిరాయిలు కట్టలేని పరిస్థితిలో ఉన్నాయని వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని, రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు వీసీల నియామకాలను త్వరగా నియమించాలని మచ్చ రమేష్ డిమాండ్ చేశారు.

జీవో 25 ఉత్తర్వులను సవరించాలి

మరిపెడ మండల ఉపాధ్యాయ జేఏసి.

మరిపెడ నేటి ధాత్రి.

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 25 ఉత్తర్వులను వెంటనే సవరించాలని మరిపెడ ఉపాధ్యాయ జేఏసీ నాయకులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయ పోస్టులను నిర్ణయించడం సబబు కాదని అన్నారు. ప్రతి ప్రాథమిక పాఠశాలలో తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రాథమిక పాఠశాలలో గుణాత్మక విద్యను పెంపొందించడానికి మరియు ఒకటి నుండి ఐదు తరగతులకు 18 సబ్జెక్టులు బోధించడం కోసం ఉపాధ్యాయుల సంఖ్యను పెంచాలి తప్ప కుదించడం సరికాదని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు కీసర రమేష్ రెడ్డి,హేమ్లా, లింగాల మహేష్ గౌడ్,జనార్ధనచారి,మంగు హఫీజ్, కరుణాకర్,వెంకన్న,మంగిలాల్ ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

వేములవాడ రాజన్న ఆలయ ప్రసాదం భద్రమేనా?

ప్రసాదంలో వాడే నెయ్యి నాణ్యత పై అధికారులు దృష్టి పెట్టాలి – భక్తులు

వేములవాడ నేటిధాత్రి

తిరుమల లడ్డులో కల్తి నెయ్యి వ్యవహారం రాష్ట్రమంతటా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో యాదాద్రి ఆలయ అధికారులు సైతం నెయ్యి వ్యవహారంలో అప్రమత్తమయ్యారు. లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో లడ్డు తయారీకి వినియోగించే నెయ్యిని హైదరాబాద్లోని ఓ ల్యాబ్ కు పంపారు. అలాగే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో లడ్డుల తయారీలో వినియోగించే నెయ్యిని కూడా ల్యాబ్ కు పంపించి పరిశోధించాలని పలువురు భక్తులు కోరుతున్నారు. కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రమంతటా చర్చనీయాంశంగా మారడంతో ఆలయాల్లో అమ్మే ప్రసాదాల నాణ్యత పై అధికారులు దృష్టి పెట్టాలని భక్తులు కోరుతున్నారు..

దక్షిణ మధ్య రైల్వే మేనేజర్ ని కలిసి వినతి పత్రం అందజేసిన నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ జస్టిస్ ముమెంట్ సభ్యులు

మంచిర్యాల నేటి ధాత్రి

ఈరోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ జస్టిస్ మూమెంట్ ఆధ్వర్యంలో
ఇటీవల ప్రారంభమైన సికింద్రాబాద్ నుండి నాగపూర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ మంచిర్యాలలో హాల్టింగ్ ఇవ్వాలని సికింద్రాబాద్ లోని దక్షిణ మధ్య రైల్వే మేనేజర్ అరుణ్ కుమార్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్టేట్ వైస్ ప్రెసిడెంట్ రేగుంట ప్రవీణ్ కుమార్ వెంకటేష్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు

యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో వారియర్ గా పోరాడాలి

# ములుగు పోలీస్ వారి ఆధ్వర్యంలో జిల్లా యువతకు వాలీబాల్ పోటీలు

# జిల్లా ఎస్పీ డా శబరీష్ ఐపిఎస్

ములుగు జిల్లా నేటిధాత్రి

ములుగు జిల్లా జాకారం నందు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల అనుసారం.. డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో భాగంగా..ములుగు జిల్లా పోలీస్ వారి ఆధ్వర్యంలో యువతకు జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలను నిర్వహించడం జరిగినది. ఈ పోటీలకు ప్రతి మండలం నుండి గెలుపొందిన టీంలను తీసుకోవడం జరిగినది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరు అయిన జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో గల యువత యొక్క నైపుణ్యం ప్రపంచానికి తెలియాల్సి ఉందని ఆటలను ఉల్లాసానికే కాకుండా భవిష్యత్తుగా కూడా తీసుకోవాలని జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో మంచి ప్రతిభ కనబరిచిన వారికి రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్నత స్థాయి ఉద్యోగాల లో అవకాశాలు కూడా కల్పించడం జరిగినదని తెలియచేసారు ములుగు జిల్లా యువతని పోలీస్ శాఖ తరఫున కోరేది ఒకే విషయమని మీ మీ గ్రామాలలో గంజాయిని అమ్మేవారు లేదా సేవించేవారు, ప్రభుత్వ స్థలాల్లో లేదా బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించేవారు ఉంటే వారి సమాచారాన్ని స్థానిక ఎస్సై సీఐ అధికారులకు అందజేయాలని
పోటీలో ఒక జట్టు గెలవాలంటే ఆ జెట్టులోని సభ్యులందరూ కలిసికట్టుగా ఏలా పోరాడుతారో ఈ డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టాలంటే యువత ప్రజలు మరియు పోలీస్ ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పోరాడుతేనె విజయం సాధించగలు గుతామని డ్రగ్స్ మహమ్మారి ఎందరో జీవితాలను నాశనం చేస్తుందని దేశానికే వెన్నెముక అయిన యువతను కబలిస్తున్న ఈ డ్రగ్స్ ను నిర్మూలించడంలో ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని ఎస్పీ గారు కోరారు డ్రగ్స్ అమ్మే వారి పైన అత్యంత కఠినంగా వ్యవహరించబడుతుందని” తెలియక డ్రగ్స్ సేవించేవారు ఉంటే వారిని పునరావాస కేంద్రాలకు తరలించి వారికి కౌన్సిలింగ్ ఇప్పించడం జరుగుతుందని మీ పరిసరాలలో డ్రగ్స్ అమ్మేవారు సేవించేవారి వివరాలు తెలిస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100 కు ఫోన్ చేసి తెలుపగలరని మీ వివరాలు అత్యంత గోప్యంగా ఉంచబడతాయని ప్రభుత్వం తరఫున నగదు రివార్డును అందజేస్తామని ఎస్పీ తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఓ ఎస్ డి ములుగు మహేష్ బిగితే ఐపీఎస్ అదనపు ఎస్పీ ఏ ఆర్ సదానందం ములుగు డిఎస్పి రవీందర్ డి.సి.ఆర్.బి డి.ఎస్.పి రాములు సీఐ ములుగు సి ఐ పస్రా సిఐ వెంకటాపురం జిల్లాలోని పలువురు ఎస్ఐలు పాల్గొన్నారు

జయహో.. నిత్య జనగణమన

జనగణమన పరిశీలనకు వచ్చిన కర్ణాటక వాసులు
జమ్మికుంట: నేటిధాత్రి

జమ్మికుంట పట్టణంలో 2017 ఆగస్టు 15వ తేదీన అప్పటి సీఐ ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిత్య జనగణమన కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా అమలులోకి తీసుకొని వచ్చారు. భారతదేశంలో హర్యానాలోని ఈస్సార్ తర్వాత తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంటలో ప్రారంభమైంది. జమ్మికుంట పట్టణంలోని ప్రధాన కూడల వద్ద మైకులను ఏర్పాటు చేయడంతో పాటు ఉదయం ఎనిమిది గంటలకు ప్రతినిత్యం జనగణమన ప్రారంభమవుతుంది. జయహో నిత్య జనగణమన అంటూ పట్టణ ప్రజలతో పాటు వివిధ పనుల మీద వచ్చే ప్రజలు సైతం జనగణమన వచ్చే సమయానికి నిలబడి రెండు నిమిషాల పాటు జెండా వందనం చేయడం జరుగుతుంది. జమ్మికుంట పట్టణంలో జరుగుతున్న నిత్య జనగణమనను పరిశీలించేందుకు కర్ణాటకలోని బీదర్ కు చెందిన జైహింద్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ సభ్యులు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత దేశంలో హర్యానా తర్వాత జమ్మికుంట పట్టణంలోనే నిత్య జనగణమన పాడడం జరుగుతుందని ఇక్కడి ప్రజలందరూ జనగణమన వస్తున్న సమయంలో ఉన్నచోటనే నిలబడి సెల్యూట్ చేయడం జరుగుతుందని, ఇక్కడి ప్రజల దేశభక్తికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. తమ రాష్ట్రంలో సైతం ఇదే తరహాలో నిత్య జనగణమన కొనసాగించేందుకు పరిశీలనకు వచ్చినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బిఎస్ఉప్పిన్, రామకృష్ణ మునిగల్ ,అరవింద్ కులకర్ణి, నిజ లింగప్ప తాగరే, గంగప్ప సావలే, రతన్ కమల్ తో పాటు జమ్మికుంట సీఐ రవి పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

హసన్‌ పర్తి 66 వ డివిజన్ సమస్యల పై వర్దన్న పేట ఎమ్మెల్యే తక్షణమే స్పందించాలి

కార్పోరేటర్ గురు మూర్తి శివకుమార్

హసన్ పర్తి / నేటి ధాత్రి

హసన్‌ పర్తి 66 వ డివిజన్‌ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ గురు మూర్తి శివకుమార్ వర్ధన్నపేట శాసనసభ్యులు కే.ఆర్ నాగరాజు కు వినతి పత్రం అందించి హసన్పర్తి నగరంలో గల సమస్యల్ని వేగవంతంగా పరిష్కరించాలని కోరారు.

హసన్పర్తి పోలీస్ స్టేషన్ నుండి ఎల్లాపూర్ వరకు రోడ్డు వెడల్పు (డివైడర్) సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు.

గత సంవత్సరం పట్టణ ప్రగతిలో మంజూరైనటువంటి వైకుంఠధామం ఇప్పటివరకు కాంట్రాక్ట్ పనులు మొదలుపెట్టలేదు

గతంలో టెండర్ అయిన సి.సి రోడ్లు,సైడ్ డ్రైనేజీలు ఇప్పటివరకు పనులు పూర్తికాలేదు వాటి ఏర్పాటు గురించి

హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ నుండి ఎల్లాపూర్ వరకు రోడ్డు వెడల్పు లేక సెంట్రల్ లైటింగ్ లేక రోడ్డు ప్రమాదాల లో అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు.

కావున శాసనసభ్యులు కె.ఆర్ నాగరాజు హసన్‌పర్తి 66 వ డివిజన్‌ సమస్యలని దృష్టి లో ఉంచుకొని మా డివిజన్‌ ప్రజల సౌకర్యాలకై న్యాయం చేయాలని కోరారు.

తప్పుడు ఆరోపణలు చేసే సంఘ సభ్యులపై చర్యలు తీసుకోండి..

పద్మశాలి సంఘం సభ్యుడు రాపల్లి శ్రీధర్…

-కుల బహిష్కరణ పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న పద్మశాలి సంఘం అధ్యక్షుడు..

వేములవాడ నేటిధాత్రి

కుల సంఘ బహిష్కరణ పేరుతో బెదిరిస్తూ తన సభ్యత్వాన్ని తొలగిస్తామంటూ మానసికంగా కృంగిపోయేలా చేస్తున్న పద్మశాలి సంఘ అధ్యక్షులు అవధూత రజినీకాంత్ ప్రధాన కార్యదర్శి అంబాటి గంటాద్రి కోశాధికారి కోడం గణేష్ మరియు అతనికి సహకరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పద్మశాలి సంఘం సభ్యుడు రాపల్లి శ్రీధర్ అన్నారు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కుల సంఘం నుండి బహిష్కరిస్తామంటూ బెదిరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా రాపల్లి శ్రీధర్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి పద్మశాలి సంఘ సభ్యుడిగా ఉంటూ సంఘంలో అనేక పదవులు పొంది సంఘ అభివృద్ధికి కృషి చేస్తుంటే తన పై తప్పుడు ఆరోపణలు చేస్తూ నకిలీ లెటర్ ప్యాడ్లపై కుల బహిష్కరణ పేరుతో తనను సభ్యత్వం నుండి తొలగిస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతూ తనను మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని అన్నారు ప్రస్తుతం సంఘం అధ్యక్షుడిగా ఉన్న అవధూత రజనీకాంత్ పదవి కాలం 05/09/ 2024 తో ముగిసినప్పటికీ నాపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తూ నన్ను మరియు నా కుటుంబ సభ్యులను మానసికంగా వేదనలకు గురి చేయిస్తున్నారని అన్నారు గతంలో నేను అతనిపై సంఘం అధ్యక్షుడిగా పోటీ చేసిన సమయంలో నన్ను బెదిరింపులకు గురి చేసి పోటీ నుండి తప్పించారని మళ్లీ సంఘం ఎన్నికలు వస్తున్న తరుణంలో నాపై ఇలా తప్పుడు ఆరోపణలతో సంఘం సభ్యత్వాన్ని తొలగిస్తూ కుల బహిష్కరణ చేస్తున్నారని అన్నారు నాపై తప్పుడు ఆరోపణలు చేసి కుల బహిష్కరణ చేసే పలువురు పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు

అన్ని వేళలలో నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటా

సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
జమ్మికుంట: నేటిధాత్రి
హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఆపదలో అండగా ఉంటూ చేయూతనందిస్తానని
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిఅన్నారు.జమ్మికుంట పట్టణం లోని 30 వార్డులలో జమ్మికుంట మండలంలో జగ్గయ్యపల్లి, పెద్దంపల్లి, మాచనపల్లి, జమ్మికుంట పట్టణం, మడిపల్లి, శాయంపేట, నాగంపేట, తనుగుల, పాపక్కపల్లి, వావిలాల, నగురం, విలాసాగర్, బిజ్జిగిరి షరీఫ్, కోరపల్లి గ్రామాల్లో చెక్కులు పంపిణీ చేశారు.హుజురాబాద్ నియోజకవర్గంలోని ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా, బీఆర్ఎస్ పార్టీతో కలిసి పోరాటానికి తాను ఎప్పుడూ సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చెప్పారు. జమ్మికుంట అర్బన్, జమ్మికుంట మండలంలోని పలు గ్రామాల్లో చికిత్స పొందిన బాధిత కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు.జమ్మికుంట టౌన్ లో 43 చెక్కులు మొత్తం 12,26,500/- రూపాయల చెక్కులను, జమ్మికుంట రూరల్లో 45 చెక్కులు
మొత్తం 10,75,000/- రూపాయల చెక్కులను పంపిణీ చేశారు.చెక్కుల పంపిణీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాధితులకు ఆర్థిక భరోసా ఇవ్వడమే కాకుండా, ఆరోగ్యశ్రీ పథకం కింద అనారోగ్యంతో బాధపడుతున్న వారందరికీ మెరుగైన సేవలు అందించేలా నేను పని చేస్తా అని పేర్కొన్నారు.పాడి కౌశిక్ రెడ్డి వర్షంలోనూ చెక్కులు పంపిణీ చేస్తూ ప్రజల నుండి విశేష అభినందనలుఅందుకున్నారు.
ఈ కార్యక్రమంలో జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు, కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మరియు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

గ్రామాలల్లో స్వచ్ఛమైన మంచినీటిని అందించాలి

ఎంపీడిఓ పెద్ది ఆంజనేయులు

పరకాల నేటిధాత్రి
తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ పతకం ద్వారా పరకాల నడికుడ మండలాల 24 గ్రామాలలో మంచినీటి సహాయకులకు ఏర్పాటు చేసిన నాలుగు రోజుల శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.అనంతరం మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే ముఖ్యంగా స్వచ్ఛమైన మంచినీటిని సేవించాలని అందుకోసం గ్రామంలో మంచినీటి సహాయకులను గుర్తించి వారికి నాలుగు రోజుల శిక్షణ ఏర్పాటు చేయడం జరిగిందని.అందరూ ఇట్టి శిక్షణ కార్యక్రమానికి తప్పని సరిగా హాజరయి గ్రామంలో ప్రజలకు స్వచ్చమైన మంచినీరు సరఫరా చేయాలని అన్నారు.మొదటి రోజు శిక్షణలో బాగంగా హైదరాబాద్ రాజేంద్రనగర్ లో శిక్షణ పొందిన కె.చంద్రశేఖర్ పైపులైన్ లీకేజీ,రిపేర్ మరియు రిపబ్లిక్ మెంట్ లపై శిక్షణ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఆర్ డబ్ల్యు.యస్.డిప్యూటీ.ఈ ఈ.మధుకుమార్,ఏ.ఈ.ఈ రమణయ్య,మండల పంచాయతీ అధికారి ఇమ్మడి భాస్కర్,గ్రిడ్ ఏఈ నాగరాజు,నడికుడ పరకాల మండలాలకు సంబందించిన మంచినీటి సహాయకులు తదితరులు పాల్గొన్నారు.

శాంతి భద్రతల పరిరక్షణలో ఎస్సైలే కీలకం జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే

భూపాలపల్లి నేటిధాత్రి

మంగళవారం భూపాలపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్సైలకు శిక్షణలో భాగంగా 11 పోలీస్‌ స్టేషన్‌లలో పని చేసేందుకు ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా శిక్షణ లో ఉన్న ఎస్సైలు విధి నిర్వహణలో ప్రత్యేకత చాటుతూ శాంతి భద్రతల పరిరక్షణలో కీలకపాత్ర పోషించాలని ఎస్పీ కిరణ్ ఖరే దిశా నిర్దేశం చేశారు. ఎస్సైలుగా బాధ్యతలు నిర్వహించడం కత్తిమీద సాములాంటిదని అన్నారు. శిక్షణలో చివరి ఘట్టంలో మండల స్థాయి ప్రజల మదిలో తమదైన ముద్ర వేయాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ, మహిళా భద్రత, నేరాలు, దొంగతనాలు అరికట్టడం, సైబర్ నేరాల నియంత్రణ పోలీసుల లక్ష్యమని, జిల్లాలో డ్రగ్స్ నిర్మూలన పైన దృష్టి పెట్టాలని ఎస్పీ సూచించారు. ప్రజలు బాధితులు ఇచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఎస్సై లకు ఎస్పీ సూచించారు. ఉద్యోగంలో ఎన్నో కఠిన పరిస్థితులు, సవాళ్లు ఉంటాయని వాటన్నింటిని సమర్థంగా ఎదుర్కోవాలని, నిజాయతీగా, అంకితభావంతో సేవలు అందించాలని ఎస్పీ కిరణ్ ఖరే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ ఎస్సైలు పాల్గొన్నారు

పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి

నర్సంపేట,నేటిధాత్రి :

సర్పంచులకు,ఎంపిటిసిలకు పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని నర్సంపేట పట్టణంలోని పద్మశాలి ఫంక్షన్ హాల్ లో 6 మండలాలకు సంబంధించిన మాజీ ప్రజాప్రతినిధులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచుల ఫోరం గౌరవ ఆధ్యక్షులు నామాల సత్యనారాయణ మాజీ మార్కెట్ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కోసం అప్పు సప్పు చేసి పనులు చేస్తే ఇప్పటివరకు బిల్లులు రాకపోవడంతో కుటుంబాలు ఆర్థికంగా చితికెలబడి రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఈ నెల 26న ఎంపీడీవో కార్యాలయాల ముందు శాంతియుతంగా ధర్నా నిర్వహించి 27న జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు మాదాసి రవి,తిరుపతి రెడ్డి,అనుముల కుమారస్వామి,నానబోయిన రాజారాం,మొగ్గం మహేందర్, పలువురు మాజీ సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.

స్థానిక సమస్యలపై ప్రజా ఉద్యమాలు నిర్మించాలి

మాజీ ఎంపీ డాక్టర్ మిడియం బాబురావు

భద్రాచలం నేటి ధాత్రి

భద్రాచలం కు ఆనుకొని ఉన్న ఐదు పంచాయతీలను తెలంగాణలో కలపాలి
ఎమ్మెల్యే కాలనీ శాఖ 8వ మహాసభలో తీర్మాణo

స్థానికంగా ప్రజా సమస్యలు గుర్తించి ప్రజా పోరాటాలు నిర్మించాలని సిపిఎం రాష్ట్ర నాయకులు, మాజీ ఎంపీ డాక్టర్ మీడియం బాబురావు అన్నారు. ఎమ్మెల్యే కాలనీ సిపిఎం శాఖ 8వ మహాసభ కుంజ మంగమ్మ అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న నూతన ఆర్థిక విధానాలు ఫలితంగా ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతున్నాయని, రోజురోజుకీ పేదరికంలోకి నెట్టబడుతున్నారని అన్నారు. పేద ప్రజలకు కనీసం కనీస సౌకర్యాలు కూడా అందని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి ప్రజలను సమీకరించి ప్రజా పోరాటాలు, ఉద్యమాలు నిర్మించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మహాసభలో భద్రాచలం కు అనుకుని ఉన్న ఐదు పంచాయతీలను తెలంగాణలో కలపాలని, ఎమ్మెల్యే కాలనీలో అంగనవాడి సెంటర్ కు పక్కాభవనం మంజూరు చేసి నిర్మించాలని, ట్రైన్లు సిసి రోడ్లు వేయాలని, కరెంటు పోసి కొత్తవి ఏర్పాటు చేయాలని తీర్మానించడం జరిగింది. మహాసభకు ముందు అమరవీరుల చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, కార్యదర్శి వర్గ సభ్యులు వై. వెంకట రామారావు, నాదెళ్ల లీలావతి, పి సంతోష్ కుమార్, పట్టణ కమిటీ సభ్యులు ఎం వి ప్రసాద్ రావు, డి సీతాలక్ష్మి, పార్టీ సీనియర్ నాయకులు ఎంవిఎస్ నారాయణ, ముండ్రు ఝాన్సీ, కనక శ్రీ, హైమావతి, సత్యవతి, రుక్మిణి, దేవి, మంగమ్మ, రామిరెడ్డి, గొడ్ల రమణయ్య తదితరులు పాల్గొన్నారు.

వైద్యం వికటించి యువకుడి మృతి

లక్షెట్టిపేట్ (మంచిర్యాల) నేటిధత్రి:
కొత్త కొమ్ముగూడెం గ్రామానికి చెందిన బత్తుల మధుకర్ అనే యువకునికి ఆర్ఎంపి శ్రీనివాస్ చేసిన వైద్యం వికటించి మృతి చెందాడని ఆరోపిస్తూ బంధువులు రాస్తారోకో నిర్వహించారు. వివరాల్లోకి వెళితే మృతునికి జ్వరం రావడంతో మంచిర్యాల ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించగా డెంగ్యూ జ్వరమని నిర్ధారణ కావడంతో ఆర్ఎంపీ వద్ద ఇంజక్షన్ తీసుకోవడంతో అప్పటికప్పుడే కుప్పకూలిపోయాడు. వెంటనే బంధువులు మంచిర్యాలలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లగా బ్రెయిన్ లో సమస్య ఉందని వైద్యులు తెలిపారు. అటు నుంచి సికింద్రాబాద్లోని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే కోమాలోకి వెళ్ళిపోయాడడు. వైద్యులు ఐసీయూ లో ఉంచి చికిత్స నిర్వహించారు. మృతునిది సాధారణ రైతు కుటుంబం కావడంతో ఖర్చులు భరించలేక మంచిర్యాల్ లోని ఆసుపత్రిలో చికిత్స చేయించారు. వారం రోజులపాటు ప్రాణాలతో పోరాడి మంగళవారం నాడు మృతి చెందినాడు. దీనికి అంతటికి ఆర్.ఎం.పి శ్రీనివాస్ కారణమని బంధువులు ఆరోపిస్తూ రాస్తారోకో నిర్వహించారు.

పందిపంపుల 12 శిరుసుల నాగులమ్మ జాతర విజయవంతం చేయండి.

పూజార్లు దామెర శ్రీవిద్య రమేష్

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి రూరల్ మండలంలోని పందిపంపుల గ్రామంలో వెలిసిన 12 షిరుసుల నాగులమ్మ జాతర నవంబర్ 3,4,5 తేదీలలో జరుగుతుంది
జతర నిర్వహణ కమిటీ తేదిలు ప్రకటించింది.
ఈ సంధర్బంగా నాగులమ్మ పూజారులు దామెర శ్రీ విద్యా రమేష్ మాట్లాడుతూ నాగులమ్మ పందిపంపులో కొలువైనపటి నుండి ఇది 2వ జాతర అన్నారు.
జాతర వచ్చేస్తున్నా భక్తులకు అని ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. అదేవిధంగా భక్తుల అందరికీ మహ అన్న దానం కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా .మొదటి రోజు పాల పొరుక . దామేర వారి ఇండ్లల్లో ఇలా వెల్పుగా ఉన్న అమ్మ వారి రెండో వరోజు నా నాగులమ్మ వారు గద్దెకి వచ్చి మొక్కులు అందుకుంటారు .3రోజు గ్రామ దేవతలకు ఎర్రెమ్మ, పోతూరాజు కి మేకల కొల్లతో మొక్కలు అప్పజెబ్బటం జరుగుతుందిఅన్నారు.
ఈ కార్యక్రమంలో నిర్వహణ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఎలుకటిసదానందం.వావిలాల రాజేందర్,సభ్యులు, దామెర నరేష్, దామెర సురేష్, దామెర శ్రీనివాస్, ఇటుకుల సమ్మక్క ,ఓదెల కేషోవులు తదితరులు పాల్గొన్నారు.

‘ఇందిర మహిళ శక్తి’ స్నేహ క్యాంటీన్ ను ప్రారంభించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే & జిల్లా కలెక్టర్

హసన్ పర్తి / నేటి ధాత్రి

హాసన్ పర్తి మండల కేంద్రం లోని ఇందిరా మహిళ శక్తి ద్వారా లబ్ధి పొంది జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సహాయ సహకారంతో కావేరి గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్నేహ క్యాంటీన్ ను హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీన్య తో కలిసి ప్రారంభించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కే ఆర్ నాగరాజు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మన ప్రజా ప్రభుత్వం లో సీఎం రేవంత్ రెడ్డి మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేస్తూ తెలంగాణ ప్రభుత్వం 2024-25 వార్షిక బడ్జెట్‌లో మహిళా సాధికారికతకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. వారి కోసం బడ్జెట్‌లో వినూత్న పథకాలను ప్రతిపాదించింది. మహిళలను వ్యాపార, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ‘ఇందిరా మహిళా శక్తి’ పథకానికి రూపకల్పన చేసింది. ఈ పథకం ద్వారా 63 లక్షల మంది మహిళలకు లబ్ది చేకూరాలనేది ప్రభుత్వం లక్ష్యం. ఇందుకోసం స్త్రీ నిధి ఏర్పాటు, బ్యాంకులతో అనుసంధానం సహా వివిధ మార్గాల ద్వారా ఆర్థిక సహాయాన్ని అందజేయనున్నారు. ఈ పథకం ద్వారా మహిళలకు ఆసక్తి ఉన్న రంగాల్లో వృత్తి, నైపుణ్య శిక్షణ ఇప్పించడంతో పాటు బ్రాండింగ్‌, మార్కెటింగ్‌‌ లలో మెలకువలు నేర్పించేందుకు సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు.
ఈ మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల కోసం ఉమ్మడి ప్రాసెసింగ్‌ కేంద్రాలతో పాటు, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక చిన్నతరహా పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయనున్నారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఏటా 5,000 గ్రామీణ సంఘాలకు ప్రాంతీయ స్థాయి సమాఖ్యలకు లబ్టి చేకూరే విధంగా కార్యాచరణ చేపడుతుంది. వచ్చే ఐదేళ్లలో వీటిని 25,000 సంస్థలకు విస్తరింప చేయడానికి కృషి చేస్తుందన్నారు.
అనంతరం మహిళ మణులు ఈ క్యాంటీన్ బాగా నడుపుకొని మరియు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎమ్మెల్యే వారికి తెలియజేయడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే కలెక్టర్ వన మహోత్సవంలో భాగంగా చెట్లను నాటడం జరిగింది.
ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి, ఎపిడి, ఎంపీడీవో, ఎమ్మార్వో, అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్య కర్తలు తదితరులు పాల్గొన్నారు.

టేకుమట్ల చిట్యాల మండలాల్లో అక్రమ మొరం దంద

సహజ వనరులను లూటీ చేస్తున్న పట్టించుకోని అధికారులను సస్పెండ్ చేయాలని

సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్.

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల టేకుమట్ల మండలాల్లో ఎర్ర మట్టి మొరం దంద చేస్తున్నారని సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ ఆరోపించారు అనంతరం మాట్లాడుతూ ఉన్నటువంటి టేకులబోడు కంపబోడు జొన్నల రాశి బోర్డు నవోపేట శివారులోని జొన్నలరాశి బోర్డు సర్వేనెంబర్ 257 ప్రభుత్వ భూమి 18 ఎకరాలు కలిగి ఉన్నది. 236 బై ఏ లో ఎనిమిది ఎకరాలు 276మూడు ఎకరాలు 237 బై A 12 ఎకరాలు 276 బై వన్ లో మూడు ఎకరాలు 278లో 23 ఎకరాల భూమిని మొత్తం 68 ఎకరాలు భూమిని ఎవరెస్ట్ మైనింగ్ పేరిట అక్రమంగా ఆక్రమించుకొని గత ప్రభుత్వంలో ధరణి వ్యవస్థలో నమోదు చేసుకుని కోట్లాది రూపాయల మోరాన్ని మట్టిని ఎలాంటి శ్రమ లేకుండా పెట్టుబడి లేకుండా అక్రమంగా.. దోసకపోతున్నారు తక్షణమే సర్వే నిర్వహించి ఈ గుట్టను కాపాడాలని జిల్లా కలెక్టర్ ని డిమాండ్ చేస్తా ఉన్నాం … ఇందు నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ పేరట.. పేరు నమోదు చేసుకొని 284 బై ఏ లో 10 ఎకరాలు 285 బై బి లో నాలుగు ఎకరాలు 286 బై బి లో నాలుగు ఎకరాలు 286 బై బిలో ఎకరాలు.. 286 బై బి లో ఎనిమిది ఎకరాలు 286 బై ఏలో 10 ఎకరాలు 287 బై ఎలో 21 ఎకరాలు మొత్తం 57 ఎకరాలు ఆక్రమించుకొని కోట్లాది రూపాయలు విలువ చేసే ఎర్ర మట్టిని తరలిస్తున్నారు వీళ్లకు సహకరిస్తున్న మైనింగ్ అధికారులను రెవిన్యూ అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం సహజ వనరులను కాపాడకుండా అప్పనంగా సొమ్ము చేసుకుంటా ఉంటే కొంతమంది వ్యక్తులు…చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నారు గత ప్రభుత్వంలో ఇలాగే జరిగింది ఈ ప్రభుత్వంలోనే మార్పు జరుగుతుంది అనిప్రజలు కోరుకుంటున్నారు కానీ జరగడం లేదు రెండు మండలాల్లో చలి వాగు పరివాహ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు ఇలా రోజు రోజుకు సహజ వనరులు తరిగిపోతున్నాయి ఈ అక్రమ దందను ఆపాలని సమగ్ర సర్వే నిర్వహించి ఈ మూడు గుట్టలను కాపాడాలని పశువులకు మేత కూడా దొరకని పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాం తక్షణమే చర్యలు చేపట్టాలని కళ్ళముందే నడుస్తున్న దందా అరికట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం పార్టీ ఆధ్వర్యంలో జెండాలు పాతు తాము ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకుల కోసం పరిశ్రమలు నెలకొల్పాలని అనితెలియజేస్తున్నాను ప్రజలు పోరాటానికి సిద్ధం కావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం

పోలేపల్లి గ్రామ పంచాయతీ రికార్డుల విచారణ సజావుగా సాగేనా ?

ఈ నెల 30న విచారణ అధికారి పదవి విరమణ

పదవి విరమణ లోపుగా విచారణ పూర్తయ్యేనా ?,

అక్రమాల పుట్ట బట్టబయలయ్యేనా ?.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల, మండల పరిధిలోని పోలేపల్లి గ్రామపంచాయతీ రికార్డుల ట్యాంపరింగ్ కు సంబంధించిన విచారణ నిర్ణీత కాలంలో ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రికార్డుల ట్యాంపరింగ్ కు సంబంధించి విచారణ అధికారిగా నియమితులైన జిల్లా పంచాయతీ అధికారి పండరినాథ్ ఈనెల 30వ తేదీన పదవి విరమణ చేయబోతున్నారు.ఆలోపుగా విచారణ పూర్తవుతుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పోలేపల్లి గ్రామపంచాయతీలో సుమారు 6 కోట్ల రూపాయల నిధుల వినియోగం వ్యవహారంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లుగా ఆరోపణలు వచ్చాయి. విచారణలో ఆ ఆరోపణలు కొంతవరకు వెలుగులోకి వచ్చినట్లుగా విశ్వసనీయ సమాచారం. అయితే విచారణ ఎంతవరకు నిష్పక్షపాతంగా జరుగుతుందనే అనుమానాలు గ్రామస్తుల్లో నెలకొన్నాయి. ఈ విషయం పై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సీరియస్ గా ఉండడం వల్ల విచారణ సాఫీగా సాగుతుందని భావించినా నిర్ణీత సమయంలో విచారణ పూర్తి కాకుంటే విచారణ మరో అధికారికి బదిలీ అయ్యే అవకాశంతో పాటు ఆ అధికారి సంబంధిత అంశంపై పట్టు సాధించి విచారణ పూర్తి చేసేందుకు తీవ్ర జాప్యం నెలకొనే అవకాశం ఉందని, అందువల్ల విచారణ పక్కదారి పట్టే అవకాశాలు కూడా లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అందువల్ల పండరీనాథ్
డి ఎల్ పి ఓ గా పదవీ విరమణ చేసే లోపల విచారణ పూర్తి చేయాలని, అక్రమాలకు పాల్పడిన వారికి తగిన శాస్తి జరగాలని ఆ గ్రామ ప్రజలు కోరుతున్నారు.

error: Content is protected !!
Exit mobile version