రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు బంటు రవి కల్పన వారి ఇల్లు కూలిపోవడం జరిగింది. వారిది నిరుపేద కుటుంబం అవడంతో అది తెలుసుకున్న మల్యాల గ్రామ అభివృద్ధి కమిటీ – దుబాయ్ గ్రూపు సభ్యులు వారి కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో గ్రూప్ తరఫున వారు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయంగా 20 వేల రూపాయలను వేములవాడ ఏఎస్పి శేషాద్రిని రెడ్డి మరియు చందుర్తి సిఐ వెంకటేశ్వర్లు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మాట్లాడుతూ దుబాయ్ వారు ఇంతకుముందు చేసిన కార్యక్రమాలను వివరిస్తూ…… వారు ఇంతకుముందు మల్యాల గ్రామానికి బాడీ ఫ్రీజర్ను అందించారు అని, బంటు నందు అనే అతను అనారోగ్యంతో చనిపోతే వారి కుటుంబానికి 20వేల రూపాయలు అందజేశారు, గతంలో కీర్తి (మేర) వెంకటేష్ అనే అతని ఇంటి రేకులు గాలికి వానకు ఎగిరిపోతే వారి కుటుంబానికి 15000 సాయం అందజేశారు అలాగే మల్యాల గ్రామానికి సైన్ బోర్డులు 30000 రూపాయలతోని ప్రమాద హెచ్చరికల బోర్డులు పెట్టించారు అలాగే ఎల్ల రమేష్ అని యువకుడికి గతంలో యాక్సిడెంట్ అయితే అతనికి 10000 రూపాయలు అందజేశారు, మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టాయిలెట్స్ బాగా లేకపోతే వాటికి సుమారు 65 వేల రూపాయలతో రేనోవేషన్ పని చేపిస్తున్నారు అని అన్నారు. ఈ దుబాయ్ గ్రూపు వారు ఇలాంటి మంచి పనులు ఎన్నో చేయాలని, సామాజిక సేవలు కొనసాగించాలని ఆకాంక్షించారు, ఇటి కార్యక్రమంలో మల్యాల దుబాయ్ అభివృద్ధి కమిటీ గ్రూప్ సభ్యులు మరియు గ్రామ ప్రజలు మహిళలు యువకులు పాల్గొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెంజిల్లా కలెక్టర్, ఎస్పీ ని కలిసి ఫిర్యాదు చేయనున్న భద్రాచలం మాజీ జడ్పీటీసీ గుండు శరత్ భద్రాచలం, సెప్టెంబర్ 25:ఏజెన్సీ లో చట్ట విరద్దుo గా గిరిజన ఇసుక క్వార్రీల పేరు తో డబ్బులు వసూలు చేస్తున్న వారి పై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి అని మాజి జడ్పీటీసీ గుండు శరత్ డిమాండ్ చేశారు. బుధవారం నాడు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. గత రెండు రోజులుగాఒక పత్రిక లో వరుస ఇసుక క్వారీ ల పేరా 7కోట్లు పెట్టుబడులు కథానాలు పై భద్రాచలం మాజి జడ్పీటీసీ గుండు శరత్ స్పందించి మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లోఈ విషసoస్కృతి మూలంగా గిరిజన ఇసుక సొసైటీలు నష్టపోతున్నాయని ఆయన ఆవేదన వ్యకత్తo చేశారు. పెట్టుబడుల్లో పోలీస్ శాఖావారి ప్రమేయం ఉన్నాయని ఆరోపణలు తో విచారణ కు ఎస్పీ బాధ్యత తీసుకోవాలి అని డిమాoడ్ చేశారు. ఏజెన్సీగిరిజన ఇసుక సొసైటీ ల్లో బినామీల పాత్ర పై త్వరలో గిరిజన సంఘాలతో ఉద్యయo చేపడతామని భద్రాచల మాజీ జడ్పిటిసి గుండు శరత్ హెచ్చరిoచారు.
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి చిన్ననాటినుండి ఆటలే తన ఊపిరిగా పాఠశాల తరగతి గదికంటే పాఠశాలలోని. క్రీడా మైదానంలోనే ఎక్కువ సమయం గడుపేందుకు ఇష్టపడే దండు తిరుపతి. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ ను ఆదర్శంగా తీసుకొని తన ఆటతిరుతో క్రీడాభిమానుల మన్ననలు చురగొన్న ఆటగాడు దండు తిరుపతి, గ్రామస్థాయి నుండే క్రికెట్ పై మక్కువ పెంచుకొని క్రికెట్ లో మెలుకువలు నేర్చుకొని తన ప్రతిభను చాటుకున్న దండు తిరుపతి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడ క్రికెట్ పోటీలు నిర్వహించిన తనతోటి క్రాడాకారులతో వెల్లి తన ప్రతిభతో విజయాన్ని అందిందించేవాడు. బ్యాటింగ్ బౌలింగ్ ఆల్ రౌండర్ గా తన సత్తా చాటవాడు. అలాంటి క్రీడాకారుడుగా మంచి గుర్తింపు పొందుతున్న సమయంలో అనారోగ్యం సరిగా లేకపోవడం కారణంగా ఇంటికే పరిమితం కావాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇండియా క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది అంటే చాలు తన ఇంటినే స్టేడియంలా మార్చి మిత్రులతో క్రికెట్ మ్యాచ్ ను టెలివిజన్ ద్వారా విక్షించెవారమని తనతో సరదాగా గడిపిన క్షణాలు తిరిగిరావంటూ మిత్రులు అంత్యక్రియల్లో పాల్గొని కన్నీటి పర్యంతమయ్యారు. తన ఆత్మకు శాంతిః చేకూరాలని మిత్రునికి కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు. అంత్యక్రియల్లో చెక్క శ్రీధర్, మహేష్ విక్రమ్ దిలీప్ శ్రీనివాస్ నాగరాజు కిషోర్ రాజు సీనియర్ ప్లేయర్ దేవుడు కుమార్ కోటి గుర్రపు కొడారి రాజ నరేష రాజన్న ఇంకేందిరాపాల్గొన్నారు
జమ్మికుంట: నేటి ధాత్రి ప్రజా సమస్యల పరిష్కారం కావాలంటే ప్రతి ఒక్కరు ఎర్ర జెండా బాట లో నడవాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు శీలం అశోక్ పిలుపునిచ్చారు. బుధవారం రోజున స్థానిక ఇల్లందకుంట మహాసభ మల్లయ్యఅధ్యక్షతన జరిగింది. ఈ మహసభల ప్రారంభానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు శీలం అశోక్ మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో ప్రజలు అనేకసమస్యలతోఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కనీసం పాలక వర్గ పార్టీలు సమస్యల వైపు కనీసం కన్నెత్తి చూడటంలేదనిచెప్పారు.ఎర్రజెండా పార్టీ మాత్రమే ప్రజలు ఎదుర్కొంటున్న ప్రజల పట్ల నిలబడుతుందని తెలిపారు. సిపిఎం పార్టీ ప్రజలకు ఎక్కడ ఏ సమస్య వచ్చిన ముందు ప్రజల పక్షాన నిలబడుతుందని వివరించారు.ఈ దేశంలో విద్యార్థులు యువకులు మహిళలు రైతులు కార్మికులు కష్టజీవుల పక్షాన న్యాయం కోసం నిలబడుతుందని అన్నారు. సమస్యల పరిష్కారం కోసం సిపిఎం నిర్వహించే పోరాటాల్లో ప్రజలు పాల్గొని, విజయవంతం చేయాలన్నారు.సిపిఎం పార్టీ మహాసభలు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయని, ఈ మహాసభలు గ్రామం ,వార్డు, స్థాయి నుంచి, మండలం, జిల్లా,రాష్ట్రం,జాతీయ,స్థాయిలో జరుగుతాయని గత మూడు సంవత్సరాలుగా పార్టీ చేసిన కార్యక్రమాలు, నిర్మాణం సమీక్షించుకొని భవిష్యత్తులో మరింత ముందుకు పోవడం కోసం అనేక చర్చలు ఈ మహాసభలో జరుగుతాయని భవిష్యత్తులో పార్టీ బలోపేతం కోసం చర్చలు జరుగుతాయని ఆయన తెలిపారు.మహాసభల లో నూతన శాఖ తిప్పర బోయిన శ్రీకాంత్ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమం లో సిపిఎం పార్టీ నాయకులు చేల్పూరి రాము, కొత్తూరి మల్లయ్య, గురుకుంట్ల కట్ట స్వామి, రాజేందర్, జంబుకం వెంకన్న, రవి,ఎల్లయ్య, పాల్గొన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం లోని మరణించిన వారి కుటుంబ సభ్యులను బుధవారం రోజున పరామర్శించి,తన ప్రగాఢ సానుభూతి తెలియచేసిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి పరామర్శించిన వారి వివరాలు.చిట్యాల మండల వాస్తవ్యులు సీఐ తూటిచర్ల స్వామి తండ్రి కీ.శే నర్సయ్య గారు,రోడ్డు ప్రమాదంలో మరణించిన కొత్తపేట గ్రామ వాస్తవ్యులు కీ.శే మధురకవి దినేష్ కుటుంబ సభ్యులను, వొడితల గ్రామ వాస్తవ్యులు కీ.శే యాంసాని భద్రయ్య కుటుంబ సభ్యులను మరియు ఇదే గ్రామానికి చెందిన కీ.శే.కోడూరి రాజ సమ్మయ్య, అందుకు తండ గ్రామ వాస్తవ్యులు,సీనియర్ నాయకులు భూక్యా పూల్ సింగ్ నాయక్ గార్ల కుటుంబ సభ్యులను పరామర్శించారు.వారి వెంట మండల మాజీ జడ్పీటీసీ గొర్రె సాగర్, పిఎసిఎస్ చైర్మన్ క్రాంతి కుమార్ రెడ్డి,మాజీ వైస్ ఎంపిపి రాంబాబు,యూత్ అధ్యక్షుడు నవీన్,ప్రధాన కార్యదర్శి మడికొండ రవీందర్,మాజీ సర్పంచ్ బైరం భద్రయ్య,పులి వెంకటేష్, పి ఎస్ ఎస్ డైరెక్టర్ రాజు నాయక్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ దామెర రాజు,చిట్యాల మండల నాయకులు పంద్రాల వీరస్వామి, అల్లం రవీందర్, రవీందర్, శ్రీను నాయక్, డా.నాగేందర్,వైకుంఠం, సోషల్ మీడియా కన్వీనర్ రాసురి మొగిలి,లక్కాకుల నారాయణ, రాజేందర్, మాజీ ఉప సర్పంచ్ శంకర్,నరేష్,అజ్మీరా రాజునాయక్, దన్నే రాజు నాయక్, తిరుపతి నాయక్, శ్రీను నాయక్,సమ్మయ్య మరియు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పొందుపరచిన విధంగా హామీలు నెరవేర్చాలని కోరుతూ తెలంగాణ ఉద్యమకారుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నర్సంపేట ఉద్యమకారుల ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకురాలు దార్ల రమాదేవి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టిన తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల సంఘం డివిజన్ నాయకులు నరసయ్య గౌడ్,మాజీ గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ పుట్టపాక కుమారస్వామి, బైరి తిరుపతిరెడ్డి,బోళ్ల స్వామి,పులిగిల్ల యాదగిరి,పలనాడు సాంబయ్య,దుగ్గి రాజు,వేల్పుల సురేష్, గాన్లోజ్ భాస్కర్,బోనాల రవి, పెండ్యాల కృష్ణ, దార్ల చంద్రమ్మ, రచ్చ రఘు,పొన్నం రజిత,మిడిద రవి,వాసం సాంబయ్య,వడ్లపెల్లి శ్రీనివాస్,దొంగల సురేష్, బోనాల రవి పాల్గొన్నారు.
# రైతు సమస్యలను పరిష్కరం కోసం మండల కేంద్రాల్లో ఆందోళనలు
# ఏఐకెఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశ నిర్ణయం నర్సంపేట,నేటిధాత్రి :
రైతుల పెట్టుబడి సహాయం కోసం తక్షణమే 10 ఎకరాల లోపు సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా అమలు చేసి ఎకౌంట్లో డబ్బులు జమ చేయాలని, రైతులు పండించే అన్ని రకాల వరి ధాన్యాలకు క్వింటాకు 500 రూపాయల బోనస్ వర్తింపచేయాలని, రైతుల రెండు లక్షల రుణాలను బేషరతుగా మాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వాలని అఖిల భారత రైతు సమాఖ్య (ఏఐకెఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ డిమాండ్ చేశారు. (ఏఐకేఎఫ్) రాష్ట్ర కమిటీ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు వసుకుల మట్టయ్య అధ్యక్షతన నర్సంపేటలోని ఓంకార్ భవన్ కార్యాలయంలో జరుగగా రాష్ట్రంలో ప్రస్తుత రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వ విధానాలపై చర్చించారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో కోటి 30 లక్షల ఎకరాల సాగు అవుతున్న అధిక వర్షాలు ప్రభుత్వ విధానాలతో రైతుల పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందన్నారు. ఒకవైపు ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోయి మరోవైపు అధిక వర్షాలతో పంటలు కోల్పోయి ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారని ప్రధాన పంటలైన పత్తి మొక్కజొన్న తీవ్రంగా దెబ్బతిన్నాయని కేవలం వారి పంట మాత్రమే కొంత ఆశాజనకంగా ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం రైతులకు అనేక ఆశాజనకమైన హామీలు ఇచ్చి ఆచరణలో మొండి చేయి చూయిస్తున్నదని వర్షాలతో పంటలు కోల్పోయిన రైతులను ఆదుకునేందుకు ఎకరాకు పదివేలు ఇస్తామని చెప్పి నేటికీ క్షేత్రస్థాయిలో పంటల సర్వే చేపట్టకుండా ఎలా ఆదుకుంటారని ప్రశ్నించారు.రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నామని అంటూనే ఆచరణలో కుంటి సాకులతో అమలు చేయడం లేదని 72 లక్షల మంది రైతులలో బ్యాంకర్స్ ఇప్పటివరకు కేవలం 12 లక్షల మందికి మాత్రమే పంట రుణాలు ఇచ్చారని అలాగే రైతులు అనేక దశాబ్దాలుగా భూములు సాగు చేసుకుంటూ వారసత్వంగా వస్తున్న భూములను సైతం రికార్డులోంచి తొలగించి అనేక ఇబ్బందులకు గత ప్రభుత్వం గురిచేసిందని సరిచేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేటికీ సరి చేయకపోవడం విడ్డురంగా ఉందన్నారు. అలాగే రైతులు పండించిన వరి ధాన్యానికి ఎకరాకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి ప్రస్తుతం సన్న రకం వరి ధాన్యానికే ఇస్తామని అనడం సరైంది కాదన్నారు.ఇలాంటి పరిస్థితుల్లో రైతాంగాన్ని ఆదుకోవాలని ఎన్నికల హామీలను సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతాంగ పోరాటాలను ఉదృతం చేయాలని నిర్ణయించినట్లు ఈ క్రమంలో అక్టోబర్ 15న రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టనున్నట్లు రైతులంతా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వల్లెపు ఉపేందర్ రెడ్డి,రాష్ట్ర నాయకులు గుండెబోయిన చంద్రయ్య,మహమ్మద్ ఇస్మాయిల్, వక్కల కిషన్, సింగతి మల్లికార్జున్, నాగేల్లి కొమరయ్య, కర్ర రవీందర్ గౌడ్, ప్రభాకర్ రెడ్డి, మారయ్య,అంజయ్య, పెంటయ్య, ఓడ్డే నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
ఏ వై ఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య.
జయశంకర్ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు సరిగొమ్ముల రాజేందర్ అద్యక్షతన అంబేద్కర్ సంఘం 48వ వార్షికోత్సవ సభ కరపత్రాలు* విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏ వై ఎస్ రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ పుల్ల మల్లయ్య మాట్లాడుతూ గతంలో ఉన్న జిల్లా, మండల, గ్రామ స్థాయి అంబేద్కర్ యువజన సంఘాల పునః నిర్మాణం ల గురించి సంఘాలను బలోపేతం చేసేందుకు అనేక విషయాల గురించి చర్చించడం జరుగుతుందని తెలిపారు. అలాగే మండల, గ్రామ స్థాయి అంబేద్కర్ యువజన సంఘాలకు అనుబంధ పత్రాలు అందజేయడం జరుగుతుందని అన్నారు.మరియు అంబేద్కర్ యువజన సంఘం లో మహానీయుల ఆశయాలను సిద్ధాంతాలను లక్ష్యాలను ముందుకు తీసుకెళ్తు దళిత బహుజనులను చైతన్య వంతులను చేస్తు అమరులైన వారికి నివాళులు అర్పించడం జరుగుతుందని చెప్పారు.ఈనెల 29న జరిగే 48వ వార్షికోత్సవ సభకు ఉమ్మడి వరంగల్ జిల్లాలైన వరంగల్, జనగాం ,మహాబూబా బాద్ ,హన్మకొండ,జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల అద్యక్ష, కార్యదర్శులతో పాటు ఆయా మండలాల గ్రామాల అద్యక్షులు కార్యదర్శులతో పాటు సంఘం నాయకులు అధిక సంఖ్యలో హాజరై 48వ వార్షికోత్సవ సభ ను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రచార కార్యదర్శి గుర్రపు రాజేందర్ జిల్లా, మండల నాయకులు పుల్ల ప్రతాప్ గురుకుంట్ల కిరణ్,కనకం తిరుపతి దాసారపు నరేష్,పాముకుంట్ల చందర్ నేరేళ్ళ సమ్మయ్య, కలికోట సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
యువత ప్రభుత్వ ఉద్యోగాల కొరకు ఎదురుచూడకుండా.. ఏదో ఒక పనిచేసుకుని చేసి కుటుంబానికి ఆసరాగా నిలబడాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మంజూరునగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జిల్లా ఎస్సీ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో మొబైల్ టిఫిన్ సెంటర్ ను లబ్ధిదారుడు దుర్గం లింగమూర్తి(బెడ్డేలపల్లి గ్రామం) జడ్పి సిఈవో, అదనపు కలెక్టర్ విజయలక్ష్మీ, జిల్లా ఎస్సీ డెవలప్మెంట్ ఈడీ వెంకటేశర్లు తో కలిసి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు వెహికల్ ని అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యువత ప్రభుత్వ ఉద్యోగాల కొరకు ఎదురుచూడకుండా.. ఏదో ఒక పనిచేసుకుని చేసి కుటుంబానికి ఆసరాగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి మెంబర్ చల్లూరి మధు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు బుర్ర కొమురయ్య బౌత్ విజయ్ ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ ఏకు రవీందర్, నాయకులు బెడ్డేల తిరుపతి, కుమ్మరి తిరుపతి లబ్ధిదారులు తదితరులు ఉన్నారు.
కండువా మెడలో వేసి పార్టీలోకి ఆహ్వానించిన మారేపల్లి మల్లేష్
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ బాగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రగిరి శంకర్ సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీలో చేరిక పార్టీ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి మారేపల్లి, మల్లెష్ ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ విద్యార్థి విభాగం జిల్లా కార్యదర్శి శీలపాక నరేష్ కండువా కచ్పే పార్టీలోకి ఆహ్వానించడం. జరిగింది ఈ విధంగా చంద్రగిరి. శంకర్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తు ప్రజా సమస్యల పై నిరంతరం ప్రజలతరఫున పారాటం చేస్తానని ఆయన మాట్లాడారు.ఈ కార్యక్రమం లో జిల్లా నాయకులు తాటికొండ రాకేష్,చిలుక శివ తదితరులు పాల్గొన్నారు
మండలంలోని నుండి వర్షకొండ కు వెళ్లే దారిలో వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు మూడు నెలల క్రితం రిపేర్ చేసిన రోడ్డు మళ్ళీ నాసిరకం చేయడంతో మళ్ళీ రోడ్డు చేడిపోయింది చెడి పోవడమే కాకుండా మట్టి దిబ్బలు మరియు చిన్న చిన్న బండలు నడి రోడ్డు మీద వెలిచయి కుటుంబ సభ్యులు బైక్ మీద వెళ్లాలంటే చాలా భయంగా ఉంది ఇప్పటికే రెండు మూడు యాక్సిడెంట్లు కూడా జరిగాయి ఈ మట్టి దిబ్బలు ఎక్కితే చాలా పెద్ద నష్టం జరిగే ప్రమాదం జరుగుతుంది దయచేసి ఆర్ అండ్ బి వాళ్ళు మరియు ప్రజ ప్రతినిధులు దీన్ని చొరవ తీసుకొని శాశ్వత కొత్త రోడ్డు వేయాలని ధర్మసమాజ్ పర్టీ కోరుట్ల నియోజకవర్గ నాయకులు,బొబ్బిలి కిషోర్ కోరారు.
పరకాల నేటిధాత్రి బుధవారం రోజున పరకాల పట్టణంలోని 2వ వార్డులో ములుగు జిల్లా పంచాయితీ అధికారి ఒంటేరు దేవరాజు తండ్రి ఒంటేరు సారయ్య అనారోగ్యంతో మరణించడం జరిగింది.భాదిత కుటుంబాన్ని బిఎస్పీ పట్టణ అధ్యక్షురాలు మడికొండ రవళి సారయ్య పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు ఆర్పించారు.అనంతరం మడికొండ రవళి మాట్లాడుతు సారయ్య కాయకష్టం చేసి తన కుమారుడిని ఉన్నత చదువులు చదివించి నేడు జిల్లా అధికారిగా చేసారని అందువలన సారయ్య ఎన్నో కుటుంబాలకు ఆదర్శంగా నిలిచారని అన్నారు.ప్రతి తల్లి తండ్రులు సారయ్యను ఆదర్శంగా తీసుకొని తమ పిల్లలను కూడా ఉన్నత స్థాయిలో ఉంచాలని కోరారు.
రాజన్న సన్నిధిలో బుధవారం తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ బండారి రాజ్ కుమార్ ఎమ్మెల్సీ అభ్యర్థి సతీ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు వారి వెంట ఆలయ అధికారులు మరియు డాక్టర్ సాయి క్రిష్ణ ప్రియ డాక్టర్ సందీప్ ఎంఆర్పిఎస్ రాష్ట్ర కన్వీనర్ సుంకపాక దామోదర్ దొడ్ల దేవేందర్ హరీష్ అరుణ్ సతీష్ రాజు తదితరులు పాల్గొన్నారు
నల్లగొండ జిల్లా,నేటి ధాత్రి: సిపిఎం చండూరు మండల కార్యదర్శిగా జెర్రిపోతుల ధనంజయ గౌడ్ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చండూరు మండల కేంద్రంలో జరిగిన మండల మహాసభలో ఆయన మాట్లాడుతూ, చండూరు మున్సిపాలిటీ కేంద్రంలో ప్రధాన రహదారిపై రోడ్డు అద్వానంగా తయారైందని, వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని ఆయన అన్నారు. అర్హులైన నిరుపేదలందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ఇంతవరకు అమలు చేయలేదనిఆయన అన్నారు. వృద్ధులకు,వితంతువులకు,గీత కార్మికులకు,చేనేత కార్మికులకు,ఒంటరి మహిళలకు వెంటనే కొత్త పింఛన్లు మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. డిండి ఎత్తిపోతల పథకం డీ పీ ఆర్ లు ఆమోదించాలని,పర్యావరణ, అటవీశాఖ అనుమతులు ఇచ్చి, చర్లగూడెం రిజర్వాయర్ ప్రాజెక్టును త్వరగా పూర్తిచేసి, నిధులు కేటాయించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ మహాసభలో ఇలా పలు సమస్యల పరిష్కారాన్ని కోరుతూ తీర్మానం చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నకార్మిక,రైతు, ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలు నిర్వహించాలన్నారు.కేంద్ర ప్రభుత్వం,రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకపోతే సిపిఎం ఆధ్వర్యంలోఆందోళన, పోరాటాలు చేపడతామని అందుకు ప్రజలంతా సహకరించాలని ఆయన అన్నారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాల తొర్రూరు నందు ఈ రోజు జాతీయ సేవా పథకం యూనిట్ 1 మరియు యూనిట్ 2 ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపల్ Dr.B. రాములు అధ్యక్షతన కళాశాల ఆవరణంలో NSS Day ను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు సేవా గుణాన్ని అలవర్చుకోవాలని, సమాజంలో ఉన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం పనిచేయాలని, పచ్చదనం పరిశుభ్రత పెంపొందించడంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ముందుండాలని, సోదర భావంతో పనిచేసే తత్వం అలవర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు ఈ కార్యక్రమంలో NSS Program officers వాల్య నాయక్, సుజాత, సీనియర్ అధ్యాపకులు వెంకటేశ్వర్లు, రవీంద్రారెడ్డి శాంతి కుమార్ మరియు NSS వాలంటర్లు పాల్గొన్నారు
ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడం కోసం ఎస్జీ టీ యు సంఘం ఏర్పాటు కావడం జరిందని జిల్లా నాయకులు అశోక్ అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల పరిధిలోని నందగోకుల్ లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సెకండరీ టీచర్స్ కోసం అహర్నిశలు శ్రమించడం జరుగుతుందన్నారు. తరగతి ఒక ఉపాధ్యాయున్ని ప్రభుత్వం నియమించలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గణేష్, దశరతం, సత్యం తదితరులు పాల్గొన్నారు
మునుగోడు నియోజకవర్గం లోని ప్రతి గ్రామానికి పల్లె వెలుగులు బస్సులు నడిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . మంగళవారం మండలంలోని గూడపూర్ , కొరటికల్ గ్రామాలలో నిర్వహించిన గ్రామ శాఖ మహాసభలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గం లో గ్రామానికి మధ్య ఉన్న రోడ్లు గుంతల మయంగా మారడంతో రోడ్ల వెంట ప్రయాణం చేయడానికి అంతరాయం గా ఆ రోడ్ల నిర్మాణం కు నిధులు కేటాయించి రోడ్లను మరమదులు చేయించాలని సూచించారు . నియోజవర్గంలోని అన్ని గ్రామాలకు మురికి కాల్వ నిర్మాణం , సీసీ రోడ్ల నిర్మాణం అర్హులైన లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం కు 5 లక్షలు , అర్హులైన వికలాంగులకు వితంతువులకు వృద్ధులకు అనాధ కుటుంబాలకు పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. విజయదశమి దృష్టిలో అధికారులు గ్రామాలలో వీధిలైట్లను ఏర్పాటు చేయాలని కోరారు. సీజనల్ వ్యాధుల బారిన పడిన ప్రజలకు వైద్యం అందుబాటులో ఉంచి నాణ్యమైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. రైతు పండించిన పంటకు మద్ద ధర అనేందుకు సిసిఐ , ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. పత్తి క్వింటలకు 12,500 వరి ధాన్యముకు 2850 మద్దతు ధర ప్రతి పంటకు 1000 రూపాయల బోనస్ ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి మిర్యాల భరత్ , మండల కమిటీ సభ్యులు వేముల లింగస్వామి ,గూడపూర్ గ్రామ కార్యదర్శి పగడాల కాంతయ్య , కొరటికల్ గ్రామ కార్యదర్శి బోడిసె శివ , కట్ట కల్వకుంట్ల గ్రామ కార్యదర్శి పగిళ్ల మధు , పలివెల గ్రామ కార్యదర్శి పూల శ్రీను , కల్వలపల్లి గ్రామ కార్యదర్శి ఒంటెపాక అయోధ్య , కిష్టాపురం గ్రామ కార్యదర్శి పర్సనబోయిన లింగస్వామి , చల్మడ గ్రామ కార్యదర్శి కొంక రాజయ్య , కొంపెల్లి గ్రామ కార్యదర్శి పగిళ్ల సైదులు తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి: జమిలి ఎన్నికల విధానాన్ని కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం సరైనది కాదు అని, ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. మంగళవారం చండూరు మండల కేంద్రంలో సిపిఎం మండల మహాసభకు సిపిఎం సీనియర్ నాయకులు చిట్టి మల్ల లింగయ్య అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ,2029 నుంచి ఒకే దేశం- ఓకే ఎన్నిక విధానాన్ని ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర క్యాబినెట్ లో ప్రవేశ పెట్టడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమనిఆయన అన్నారు. దేశంలో ప్రతిపక్ష పార్టీలని జమిలి ఎన్నికల పద్ధతి అనుకూలం కాదని చెప్తూ వస్తున్నప్పటికీ బిజెపి ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని ఆయన విమర్శించారు. గత ఏడాది పది రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు జరిగాయని, వీటికి2028 మళ్లీ ఎన్నికలు జరగవలసి వస్తుందనిఆయన అన్నారు. అప్పుడే ఏర్పడిన ప్రభుత్వాలు ఒక సంవత్సరం లేదా అంతకంటే తక్కువ సమయం మాత్రమే అధికారంలో ఉంటాయన్నారు.హిమాచల్ ప్రదేశ్,మేఘాలయ, నాగాలాండ్,త్రిపుర,కర్ణాటక,తెలంగాణ,మిజోరం, మధ్యప్రదేశ్, చత్తీస్ గ డ్, రాజస్థాన్ రాష్ట్రాలలో పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే తన నిర్ణయాన్ని మార్చుకొని మెజార్టీ ప్రజల, రాజకీయ పార్టీల నిర్ణయాన్ని గౌరవించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వంఅధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్న నేటికీ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానం పూర్తిస్థాయిలో అమలు కాలేదు అన్నారు.రాష్ట్రంలో 40 లక్షల కుటుంబాలురేషన్ కార్డు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ పథకం కిందఇల్లు నిర్మిస్తామని,ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇస్తామన్న వాగ్దానాన్ని వెంటనే అమలు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారని ప్రభుత్వం వెంటనే కొత్త పింఛన్లు మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ మహాసభలో గత మూడు సంవత్సరాల కాలంలో ప్రజా సమస్యల కోసం పనిచేసిన పోరాటాలను సమీక్షించుకొని ప్రజా సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్ కర్తవ్యాలను నిర్వహించుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసి ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. డిండి ఎత్తిపోతల పథకం డి పి ఆర్ ను ఆమోదించి వెంటనే పనులు పూర్తి చేయాలని, పర్యావరణ అనుమతులు, అటవీ శాఖ అనుమతులు ఇవ్వాలనిఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు జెర్రిపోతుల ధనుంజయ గౌడ్, చిట్టి మల్ల లింగయ్య, వెంకటేశం, కొత్తపల్లి నరసింహ, గౌసియా బేగం, బల్లెం స్వామి ఈరటి వెంకన్న, లింగస్వామి, సైదులు, స్వామి, లక్ష్మమ్మ, లింగమ్మ,తదితరులు పాల్గొన్నారు.
`బిసిల భుజం మీద బరువు పెట్టి, సీటేసుకొని కూర్చుంటారని తెలుసు.
`బిసిలను అడుగుడుగునా వంచించడం పార్టీలకు అలుసు.
`బిసిలకు రాజ్యాధికారం మీద అధ్యయనాలు ఎందుకు చేయరు!
`పొరుగు రాష్ట్రాలకు వెళ్లి ఏం రాజకీయాలు అధ్యయనం చేస్తారు?
`తెలంగాణలో బిసిల అభ్యున్నతి అంటే బిస్కట్లు వేయడమా?
`అధికారంలో వున్నప్పుడు దామాషా లేదు.
`ఈసారి బిసి సిఎం అనకపోతే మీ తమాషాలు చెల్లవు.
`మూడు పార్టీలు ఏక వాఖ్య తీర్మానం చేయాలి.
`లేకుంటే బిసి నేతలంతా కలిసి రాజకీయ వేధిక ఏర్పాటు చేయాలి.
`యాచించడం కాదు, శాసించడం కావాలి.
`బిసి ముఖ్యమంత్రి నినాదం తెలంగాణలో మారుమ్రోగించండి.
`ప్రతి బిసి మన బిసినే గెలిపిస్తా అని శపథం చేయండి.
`అంతరాత్మ ప్రభోదంతో ఓటు వేయండి.
`బిసి రాజ్యం కోసం ఒక్కసారి మన ఓట్లు మన కోసం అని కంకణం కట్టుకోండి.
`బిసిల రాజ్యాధికారం ఎందుకు సాధ్యం కాదో చూడండి!
హైదరాబాద్,నేటిధాత్రి:
తెలంగాణ రాజకీయాలలో బిసి మబ్బులు కమ్ముకున్నాయి. బిసిల ఓట్ల కోసం రాజకీయ పార్టీలు కాచుకొని కూర్చున్నాయి. రాష్ట్రంలో ఒక్కసారిగా బిసి నినాదం ఊపందుకున్నది. అన్ని పార్టీలు ఇప్పుడు బిసి జపం చేయని తప్పని పరిస్థితులు నెలకొంటున్నాయి. నిజానికి జాతీయ స్థాయిలో బిసి గణన అనేది రాజకీయ అంశంగా మారి చాలా కాలమైంది. పార్లమెంటు ఎన్నికలలో బిజేపికి అదే ఆశనిపాతమైంది. అయినా ఆ వేడి తెలంగాణ దాక అప్పటి వరకు రాలేదు. దేశ వ్యాప్తంగా కుల గణన డిమాండ్ ఈపందుకున్న నేపథ్యంలో తెలంగాణలో బిసిల ఐక్యతా రాగం జోరందుకున్నది. అటు కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికలలో ఈ వ్యూహాన్ని అమలు చేయాలని ప్రయత్నం చేస్తోంది. అదే సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బిసి లెక్కలు తేలాల్సిందే అంటూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గళం విప్పారు. ఇది ఆయన స్వయంగా ఎంచుకున్న అంశమా? లేక పార్టీ వెనకుండి నడిపిస్తున్న విషయమా! అన్నదానిపై స్పష్టత రావాల్సివుంది. ఏది ఏమైనా అన్ని పార్టీలు తీన్మార్ మల్లన్న ఉచ్చులో పడిపోయాయన్నది వాస్తవం. ఇప్పుడు ముందుకు తప్ప వెనక్కి వెళ్లే పరిస్థితి లేకుండా చేయడంలో మల్లన్న మొదటి విజయం అందుకున్నారు. అదే సందర్భంలో అన్ని రాజకీయ పార్టీల కదిలేలా చేశారు. బిసిల అంశంలో అన్ని పార్టీల బిసి నేతలను ఒకే వేధిక మీదకు తెస్తున్నారు. సరిగ్గా తెలంగాణ ఉద్యమ సమయంలో అన్ని పార్టీలు జేఏసి గూటికి చేరాయి. కాలం గడుస్తున్న కొద్దీ జారిపోయాయి. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఎదురౌతుందా! లేక బిసిల దామాషా ప్రకారం అందాల్సిన సీట్లు అన్ని పార్టీలు ప్రకటించే దాక పోరు జరుగుతుందా! వేచి చూడాలి. అయితే అన్ని పార్టీలు బిసి నినాదం ఎజెండాగా వచ్చే ఎన్నికలలో బరిలోకి దిగాలని ప్రయత్నం చేస్తాయా? లేదా అన్నది కూడా తేలిపోతుంది. బిజేపి గత ఎన్నికల ముందే బిసి. ముఖ్యమంత్రి స్లోగన్ వాడుకునే ప్రయత్నం చేసింది. కానీ ప్రజలు పూర్తిగా విశ్వసించలేదు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ముందుగా ప్రకటిస్తే బిజేపి సీట్ల గెలుపు మరో రకంగా వుండేది. జాతీయ పార్టీలు ముందుగా సిఎం. అభ్యర్థిని ప్రకటించే ఆనవాయితీ లేదని తప్పించుకున్నారు. గెలవాల్సిన చోట ఓటమి మూటగట్టుకున్నారు. చే జేతులా ఎన్నికల ముందు చేతులు ఎత్తేసి చెయ్యి పార్టీకి మార్గం సుగమం చేశారు. తర్వాత తప్పు చేశామని అన్నారు. గత ఎన్నికలలో కాంగ్రెస్, బిఆర్‌ఎస్ లు బిసిల అంశాన్ని ముట్టుకోలేదు. అసలు బిసిలకు రావాల్సిన సీట్లు కూడా కేటాయించ లేదు. ఇప్పుడు తెలంగాణలో బిసి విదానం అమలు చేసే పార్టీకే నూకలుంటాయని బిసిలు బలంగా హెచ్చరికలు జారీ చేయాల్సిన అవసరం వుంది. తాజాగా బిఆర్‌ఎస్ బిసి అంశం ఎక్కడ కాంగ్రెస్, బిజేపిలు ఎత్తుకొని మళ్ళీ తెలంగాణ రాజకీయాలలో ఏకాకిని చేస్తాయో అని ఉలిక్కిపడిరది. బిసి నేతలంతా కలిసి రాజకీయం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఆ పార్టీ నాయకులు సమావేశమై ఎజెండా రూపకల్పన చేశారు. కానీ వాళ్ల ఎజెండా ఎన్నికల నాటికి కేసిఆర్ అమలు చేస్తాడా? అన్నది మాత్రం అనుమానమే. అధికారంలో వున్న పదేళ్ళలో బిఆర్‌ఎస్ బిసిలకు ఇచ్చిన ప్రాధాన్యత ఏమి లేదు. మంత్రి వర్గంలో తగిన స్థానం కల్పించింది లేదు. సమాజం నుంచి ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా కేసిఆర్ పట్టించుకున్నది లేదు. పదేళ్ల కాలంలో ఎంతో మంది ఓసి నాయకుల మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా స్పందించలేదు. కానీ బిసి అయిన ఈటెల రాజేందర్ ను పార్టీ నుంచి తరిమేశాడు. ఉప ముఖ్యమంత్రి రాజయ్యను పదవి నుంచి దించేశాడు. బిసి.బిడ్డ కొండా సురేఖకు టికెట్ ఇవ్వలేదు. ఇలా బిసిలకు అనేక రకాలుగా కేసిఆర్ అన్యాయం చేశాడు. తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రతి వేధిక మీద దళితుడే ముఖ్యమంత్రి అని వందల సార్లు చెప్పాడు. అధికారంలోకి రాగానే మాట మార్చాడు. మంత్రి వర్గంలో తగిన ప్రాధాన్యత కూడా కల్పించలేదు. అలాంటి కేసిఆర్ ఇప్పుడు బిసి నినాదం ఎత్తుకుంటే ప్రజలు నమ్మకపోవచ్చు. స్వయంగా కేసిఆరే బహిరంగంగా ప్రకటించే అవకాశం లేదు. ఒకవేళ ప్రకటించినా ప్రజలు నమ్ముతారనే నమ్మకం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకతతో తాము ఎలాగైనా అధికారంలో వస్తామనే కలలు కేసిఆర్ కంటున్నారు. అందుకే తెలంగాణ ఏం జరుగుతున్నా ఆయన నోరు మెదపడం లేదు. కేసిఆర్ ను ఓడిరచి తప్పు చేశామన్న భావనలో ప్రజలు పశ్చాత్తపపడాలని కోరుకుంటున్నాడు. మళ్ళీ కేసిఆరే రావాలని ప్రజలు నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నాడు. కాకపోతే ప్రజల్లో నాయకులు వుండాలన్న ఆలోచనతో బిసి నాయకుల సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని కొన్ని గేమ్ మొదలుపెట్టారు. సహజంగా ఏ రాజకీయ పార్టీ అధినేత అయినా తానే ముఖ్యమంత్రిగా వుండాలనుకుంటారు. ప్రాంతీయ పార్టీలలో ఇతరులను ముఖ్యమంత్రులను చేయడం జరగదు. బిఆర్‌ఎస్ లో అది ఎప్పటికీ సాధ్యం కాదు. అయినా బిసి విధానం ప్రకటించాలనుకుంటే ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ను సిఎం అభ్యర్థిగా ప్రకటించాలి. బిసిల వాదం వినిపించాలనుకున్నప్పుడు కచ్చితంగా వచ్చే ఎన్నికలకు ముందే బిసి ముఖ్యమంత్రి అభ్యర్థులను ప్రకటించాలి. కాంగ్రెస్ పార్టీలో ఉద్యమకారుడైన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌ను మించిన బిసి నాయకుడు లేడు. కాంగ్రెస్ కు చిత్త శుద్ధి వుంటే మంత్రి పేరు ప్రకటించాలి. అలాగే బిజేపి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మా ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటిస్తే చాలు. ఎందుకంటే తెలంగాణలో బిజేపి బలపడడానికి ప్రధాన కారణం ఎవరు? అని ఏ ఒక్కరినీ ప్రశ్నించినా బండి సంజయ్ అని టక్కున సమాధానం చెబుతారు. ఇలా ముగ్గురు నాయకులు మూడు పార్టీలలో వున్నారు. ఈ ముగ్గురిని సిఎం అభ్యర్థులుగా ఆయా పార్టీలు చేయగలవా? ఈసారి బిసి సిఎం అనగలరా! తీర్మానాలు చేస్తారా!! అందుకు అవసరమైన విధివిధానాలు ప్రకటిస్తామని చెప్పగలరా? నిక్కచ్చిగా ఇదే మా నిర్ణయం అని పార్టీలు ప్రకటిస్తాయా! రాజకీయ అవసరాల కోసం బిసి నాయకులను ముందు పెట్టి బిసి వాదం అనగానే సరిపోదు! మన పార్టీ ఎక్కడ వెనుకబడి పోతుందో అన్న ఆందోళనతో నాయకులను ముందుకు తోయొద్దు. ఒకవేళ పార్టీల ఆదేశాలు లేకుండా రాజకీయ పార్టీలలో వుంటే బిసి నాయకులు తమ విధానం ఇదీ అని ప్రకటించగలరా? ఒక అడుగు ముందుకేసి బిసిలకు ఎక్కువ సీట్లు ఇస్తామని ఇప్పుడు మాట్లాడే బిసి నేతలకు ఎన్నికల నాడు ఆ పార్టీలు టిక్కెట్లు ఇస్తాయా? తెలంగాణలో బిసి విధానంతో పార్టీలు నినాదం ఎత్తుకొమ్మని తోలిస్తే లాభం లేదు. మా పార్టీ గెలిస్తే వీళ్లే సిఎంలని చెప్పండి! రాజకీయంగా ప్రజల్లో వెనకబడిపోతున్నామని గ్రహించి బిసిలను ముందుపెట్టకండి. ఈ విషయాన్ని ఆ పార్టీలలో వున్న నాయకులు బాగా ఆలోచించి ముందుకు రావాలి. తర్వాత బిసిలను కూరలో కరివేపాకులు చేయాలనే అన్ని పార్టీలు చూస్తాయి. దేశంలో మూడు సార్లు, నాలుగు సార్లు, వరుసగా ముఖ్యమంత్రులు అయిన వాళ్లు ఎంతో మంది నాయకులున్నారు. కానీ కేసిఆర్ ను రెండో సారికే ఎందుకు దించేశారో ఇప్పటికీ మధనం జరుపుకోవడం లేదు. ప్రజలేం అమాయకులు కాదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల కోసం అర్రులు చాచలేదు. కేసిఆర్ ను దించేయాలనుకున్నారు. ఆ స్పష్టత కనిపిస్తున్నా కేసిఆర్ అతి విశ్వాసానికి పోయారు. దెబ్బ తిన్నారు. పార్లమెంటు ఎన్నికలలో అందుకే మరింత ఘోర పరాభవం మూటగట్టుకున్నారు. ప్రజల్లో లేని నాయకుడు ఎప్పుడూ ప్రజా సేవకు పనికి రాడు. సరిగ్గా ఏపిలో కూడా అదే తీర్పు ఇచ్చారు. అయినా కేసిఆర్ ప్రజల కోసం బైటకు రాలేదు. ఒకవేళ ప్రజలు మళ్ళీ అధికారం ఇచ్చినా ఆయన జనం ముఖం చూడరు. పైగా అన్ని వర్గాలకు మేలు చేశానన్న భ్రమలో వున్నాడు. ఇతర వర్గాలను రాజకీయంగా ఎదగకుండా చేశాడు. వాళ్లు ముందుకొస్తే తన సీటుకు ఎసరొస్తుందనుకున్నాడు. అందుకే ప్రజలు కేసిఆర్ ను పక్కన పెట్టారు. ఇంకా ప్రజలు కేసిఆర్ ను నమ్ముతారనుకోవడం వృధా ప్రయాస. తనకు ఉద్యమ సమయంలో ఎంతో అండగా వున్న ఎంతో మంది బిసి నేతలను తర్వాత వారి ఉనికి ప్రశ్నార్థకం చేశాడు. ఓట్ల కోసం బిసి రాజకీయాలు ఓసిలకు అలవాటుగా మారింది. ఈసారి ఈసారి అలాంటి చిర్లర రాజకీయాలకు చెల్లు చీటే! పాడాల్సిన సమయం వచ్చింది. ఏ పార్టీ అయితే బిసి ముఖ్యమంత్రిని ప్రకటిస్తుందో ఆ పార్టీకే మనుగడ కనిపిస్తోంది. అందుకే బిసి ముఖ్యమంత్రి మా విధానం అని ప్రకటించండి. పార్టీల వేధికగా అన్ని పార్టీల అధినేతలు తీర్మానం చేయండి. మాట తప్పమని తేల్చి చెప్పండి. అప్పుడే బిసి నేతలను సమాజంలోకి పంపండి. బిసిల భుజం మీద బరువు పెట్టి, సీటేసుకొని కూర్చుంటారని తెలంగాణ సమాజానికి తెలియంది కాదు. బిసిలను అడుగుడుగునా వంచించడం పార్టీలు వంచించడం చూడంది కాదు. బిసిలకు రాజ్యాధికారం మీద అధ్యయనాలు ఎందుకు చేయరు! ఆ దిశగా అడుగులు వేయరెందుకు? పొరుగు రాష్ట్రాలకు వెళ్లి ఏం రాజకీయాలు అధ్యయనం చేస్తారు? ఈ మాట చెప్పడానికి కనీసం ఇంగితం వుండాలి. బిసిల జనాభాను బట్టి సీట్లు కేటాయిస్తామని చెప్పడానికి అధ్యయనాలు అవసరమా? కాలయాపన, ప్రజల్ని మభ్యపెట్టడం తప్ప మరేమీ జరగదు. బిసిలు అంత అమాకులు కాదు. ఈసారి బిసి సిఎం అనకపోతే మీ తమాషాలు చెల్లవు. ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు పార్టీలు ఏక వాఖ్య తీర్మానం చేయాలి. లేకుంటే బిసి నేతలంతా కలిసి రాజకీయ వేధిక ఏర్పాటు చేయాలి. పార్టీలకు హెచ్చరికలు జారీ చేయాలి. యాచించడం కాదు, శాసించడం బిసిలు అలవర్చుకోవాలి. బిసి ముఖ్యమంత్రి నినాదం తెలంగాణలో మోత మోగించాలి. బిసి సభలు, సదస్సులు, అడుగడుగునా నిరంతరం ఏర్పాటు చేయాలి. తెలంగాణ ఉద్యమ స్పూర్తితో బిసి ఉద్యమాలు రావాలి. ప్రతి బిసి మన బిసినే గెలిపిస్తా అని శపథం చేయాలి. అంతరాత్మ ప్రభోదంతో ఓటు వేయాలి. బిసి రాజ్యం కోసం ఒక్కసారి మన ఓట్లు మన కోసం అని కంకణం కట్టుకోవాలి. బిసిల రాజ్యాధికారం ఎందుకు సాధ్యం కాదో తేల్చుకోవాలి. సై అంటే సై అంటే తప్ప బిసిలు అధికారంలోకి రారు. బిసిలకు రాజ్యాధికారం దక్కదు.
“స్వచ్ఛత హే సేవ” కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధం ప్రబలకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య అన్నారు.. ఈ మేరకు మంగళవారం నిజాంపేట మండలం లో ఆయన పర్యటించి మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్శనలో భాగంగా మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజనం పై సంబంధిత మండల విద్యాధికారికి చరవాణి ద్వారా సంబోధించారు. అనంతరం మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో ప్రైమరీ స్కూల్లో పాల్గొన్నారు . ప్రైమరీ స్కూల్ పిల్లలు తడి చెత్త పొడి చెత్త గురించి విన్యాసాలు చేశారు అలాగే ప్రకృతి గురించి విన్యాసాలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి రాజిరెడ్డి, ఎంపీ ఓ ప్రవీణ్ కుమార్, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ హేమలత, పంచాయతీ కార్యదర్శి మమత, ఉపాధ్యాయులు మన్మధ, రజిని, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.