సవాలును నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా 

మంత్రికి మాజీ ఎమ్మెల్యే సవాల్.

నిరూపించకుంటే మీరు తప్పుకుంటారా.

కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలి.

వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని

కాశిబుగ్గ నేటిధాత్రి

గత కొన్ని రోజుల నుండి కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యల పై నిరసనగా లేబర్ కాలనీ జంక్షన్ లో వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు.బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యల పై ఈ రోజు లేబర్ కాలనీ జంక్షన్ లో తెలంగాణ రాష్ట్ర వరంగల్ తొలి మేయర్, మాజీ శాసనసభ్యులు నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో భారీ ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ విధంగా నరేందర్ మాట్లాడుతూ మంత్రి కొండా సురేఖ కేటీఆర్ పై ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు,నువ్వు చేసిన సవాలును నిరూపిస్తావా లేదా తక్షణమే క్షమాపణ చెప్పుతావా, వరంగల్ జిల్లా అంటే రాణి రుద్రమదేవి పౌరుషం, అలాంటి రాణి రుద్రమదేవి ఏలిన గడ్డ వరంగల్ పరువు ప్రతిష్ట ను దిగజారుస్తున్నారు అని మండిపడ్డారు.మీరు చేసిన సవాలును మీరు నిరూపిస్తే నేను శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా ఉంటాను,సవాలును నిరూపించకపోతే మీరు రాజకీయాలకు దూరం ఉంటారా అని ప్రశ్నించారు.ఒక ఉన్నత కుటుంబానికి చెందిన నాగార్జున కుటుంబాన్ని అవమానపర్చడం సమంజసమా, ఒక ఆడపిల్ల జీవితం గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి ఇలా రోడ్డు మీద వేయడం సిగ్గుచేటు అని అన్నారు.ఈ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలను పట్టించుకోకుండా హైడ్రా అని కొత్త డ్రామా తెర మీదకు తెచ్చి పేద ప్రజల జీవితాలతో ఆడుకుంటుంది.కేటిఆర్ పై చేసిన వ్యాఖ్యలు తక్షణమే వెనుక్కు తీసుకోవాలి,లేని యెడల ఇంకా తీవ్రమైన నిరసనలు ఎదురుకుంటారు అని నరేందర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో కార్పొరేటర్లు దిడ్డి కుమారస్వామి, మారుపల్ల రవి మరియు మాజీ కార్పొరేటర్ కుందారపు రాజేందర్, ముఖ్య నాయకులు, మహిళా నాయకురాలు, యూత్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మాజీ మేయర్ తల్లి కమలమ్మ చిత్రపటానికి నివాళులర్పించి

మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి,
డిప్యూటీ మేయర్.

ఉప్పల్ నేటి దాత్రి 03:

చర్లపల్లి డివిజన్:
ఇటీవల పరమపదించిన బొంతు కమలమ్మ గారి చిత్రపటానికి నివాళులర్పించి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ని,కార్పోరేటర్ శ్రీదేవి యాదవ్ ని, కుటుంబ సభ్యులను పరామర్శించిన మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి
,డిప్యూటీ మేయర్ మోతే శోభన్ లత ,శ్రీను బాబు తదితరులు ఉన్నారు.

రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలకు ఆదర్శవాణి విద్యార్థులు.

దుగ్గొండి,నేటిధాత్రి :

గత నెల 30 న జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి అండర్ 14,17 బాలికల రెజ్లింగ్ పోటీలు నిర్వహించగా ఈ పోటీలలో దుగ్గొండి మండల కేంద్రంలోని శ్రీ ఆదర్శవాణి విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు.ఎంపికైన క్రీడాకారులను శ్రీ ఆదర్శవాణి విద్యాసంస్థల చైర్మన్ నాగనబోయిన రవి అభినందించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ తమ పాఠశాల నుండి రాష్ట్రస్థాయికి ఎంపికైన క్రీడాకారులు సల్గరి అపర్ణ 58 కేజీలు, లేంకాల వర్ష 46 కేజీల విభాగంలో జిల్లాలో మొదటి స్థాయిలో నిలిచారు. క్రీడాకారులకు బహుమతులు ప్రధానం చేసి శాలువులతో సన్మానించినట్లు తెలిపారు. ఆటలలో ఎప్పుడు ముందుండాలని, ఆటలు ఆడడం వలన మానసిక స్థితి మెరుగు పడుతుందని అలాగే ఆలోచన చురుకుదనం పెరుగుతుందని వివరించారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని శారీర దృఢత్వాన్ని కలిగి ఉంటారని అలాగే విద్యార్థులు రాష్ట్రస్థాయిలో మంచి ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపిక కావాలని వరంగల్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులను సూచించారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్ బిక్షపతి, ప్రిన్సిపాల్ మణికంఠ రవి కోచ్ ఇటికాల దేవేందర్ పీటీలు, అంజద్ పాష, విజయ్, సందీప్, చైతన్య, ఉపాధ్యాయులు క్రీడాకారులు పాల్గొన్నారు

మూసి సుందరీకరణ పేరుతో , రాష్ట్ర ప్రభుత్వం పేదల బతుకులు ఆగం చేయదు :సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య

నల్లగొండ జిల్లా, నేటి దాత్రి:
మూసి సుందరీ కరణ పేరుతో, రాష్ట్ర ప్రభుత్వం పేదల బ్రతుకులు ఆగం చేయొద్దని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య అన్నారు.
గురువారం రోజున మునుగోడు మండల కమిటీ సమావేశం స్థానిక సిపిఎం కార్యాలయంలో వేముల లింగస్వామి అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ మూసి సుందరీకరణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు పేద మధ్యతరగతి ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయని మూసి రివర్ బెడ్ ప్రాంతంలో ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్న ప్రజలపై పోలీసులు అధికారులు దౌర్జన్యం ప్రదర్శిస్తున్నారని విమర్శి0చారు.

ఇండ్లకుల్చివేతలకు ఏర్పాటు చేస్తున్న రాష్ట్ర ప్రభు ఎప్పుడు ఋల్ డోజర్లు వచ్చి ఇల్లు కూలగొడతాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారని ప్రభుత్వ0 హడావుడిగా నిర్ణయాలు తీసుకునే ముందు అఖిలపక్ష పార్టీలు ప్రజాప్రతినిధులు ప్రజాసంఘాల మేధావులతో చర్చించాలని చర్చించకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వాన0 ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుందని ఈ సందర్భంగా తెలిపారు

పర్యావరణ పరిరక్షణ ప్రజల భద్రతకు ప్రాధాన్యతను ఇవ్వాలని పర్యాటక కేంద్రంగా మార్చినంత మాత్రాన ప్రభుత్వ ప్రయోజనాలు నెరవేరవని పైగా సాధారణ ప్రజలకు ఆవాసాలకు ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు
మూసి ప్రధాన సమస్య కాలుష్యమని మందులు రసాయన పరిశ్రమలకు సంబంధించిన వ్యర్ధాలు మురుకి నీరు మూసిలో కలవడం వల్ల కాలుష్యం పెరుగుతుందని ఫలితంగా
మూసి పరిసరాల ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని ఉప్పల్ నుండి సూర్యాపేట వరకు కలుషిత మూసి జలాల వలన వ్యవసాయ ఉత్పత్తులు పాలు చేపలు ఉపయోగించిన ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని దీనికి తోడు మూసిలోనూ మూసి గేట్ల మీద నివాసాలు ఏర్పరచుకున్న పేదల ఇండ్లు వరదలు ముంపున గురవుతున్న ఈ ప్రభుత్వానికి ఏమి పట్టి లేదని విమర్శించారు.

ప్రభుత్వ నిర్ణయాల వల్ల వీధిన పడుతున్న మూసి నిర్వాసితులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని మూసి సుందరీకరణ పేరుతో పేదలను నగరం బయటికి పంపి బడా కార్పొరేట్ సంస్థలకు షాపింగ్ మాల్స్ గార్డెన్స్ స్టార్ హోటల్ యజమానులకు ప్రభుత్వ భూములు కట్టబెట్టే ప్రయత్నం మానుకోవాలని పేదలకు వెంటనే పునరావాసం కల్పించాలని, డిమాండ్ చేశారు.

ప్రభుత్వం పేదల ఇళ్లను తోలగిస్తారని తెలియడంతో కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారని మరి కొంతమంది గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారని దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని బాధిత కుటుంబాలను నష్ట పరిహారం ఇవ్వాలని ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు, రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలలో గుడిసెలు వేసుకొని జీవనం కొనసాగిస్తున్న పేదలందరికీ పట్టాలు ఇవ్వాలని వారిపై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో *సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండా శ్రీశైలం మండల కార్యదర్శి మిర్యాల భగత్ మండల కమిటీ సభ్యులు వరికుప్పుల ముత్యాలు యాతరాణి శ్రీను. సాగర్ల మల్లేశం. శివర్ల వీరమల్లు. వడ్లమూడి హన్మయ్య. యాట యాదయ్య. కొంక రాజయ్య. బోల్ల ఎట్టయ్య. ఒంటెపాక అయోధ్య తదితరులు పాల్గొన్నారు.

ఈనెల17న హైదరాబాద్ లో జరిగే యూట్యూబ్ న్యూస్ చానల్స్ యాజమాన్యాల”సింహ గర్జన”బహిరంగ సభను విజయవంతం చేయ్యండి

రాష్ట ప్రచార కార్యదర్శి ఆదేర్ల రాధాగోవిందు…

యూట్యూబ్ న్యూస్ ఛానెల్స్ తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ARG NEWS TV ఆదేర్ల రాధాగోవిందు కారేపల్లి లో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర యూట్యూబ్ న్యూస్ ఛానెల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పురం సంతోష్ కుమార్ ఆదేశాల మేరకు అక్టోబర్ 2 న తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల పదిహేడో తేదీన నిర్వహించే యూట్యూబ్ న్యూస్ చానల్స్ యాజమాన్యాల కమిటీ అసోసియేషన్ రాష్ట్ర “సింహ గర్జన”భారీ బహిరంగ సభకు యాజమాన్యాలు భారీగ తరలి వచ్చి విజయవంతం చేయాలని. తెలంగాణ రాష్ట్రంలో యూట్యూబ్ న్యూస్ చానల్స్ యాజమాన్యాల న్యూస్ దమ్ము ధైర్యాన్ని ఏందో వెలుగేత్తి చూపించాల్సిన సమయం ఆసన్నమైందని మన ఉనికి రాష్ట్రంలో ఎంత ఉంది అనేది చాటి చెప్పే మంచి రోజులు వచ్చాయని ప్రభుత్వం నుంచి శాటిలైట్ న్యూస్ చానల్స్ కి ఏవిధమైన లబ్ధి పొందుతున్నాయో అదే విధమైన లబ్ధి ప్రక్రియను మనకు వచ్చే విధంగా పోరాటం చేయాల్సిన గడియ ఆసన్నమైందని ముప్పై మూడు జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలల్లో కూడా తమ కమిటీలు వెయ్యాలని వివిధ రాష్ట్రాల నుంచి తరలి వస్తున్నారని తెలిపారు.కావున మన సమైక్య తను వెలువెత్తి చాటాలని తెలిపారు.కాంటాక్ట్ సెల్ నెంబర్:- 9491817661,

ఎస్సై ప్రశాంత్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన మండల ఫర్టిలైజర్స్ అసోసియేషన్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

మండల ఫర్టిలైజర్స్ అసోసియేషన్ నూతన కమిటీ స్థానిక ఎస్సై ప్రశాంత్ బాబును కలిసి పూల బొకే అందజేసి శాలువాతో ఘన సత్కారం చేశారు అనంతరం ఎస్సై ప్రశాంత్ నూతనంగా ఎన్నికైన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే నూతన కమిటీ సభ్యులకు స్వీట్ పంపించేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కాసం మదన్ మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎండి హైమత్, కోశాధికారి మామిండ్ల శ్రీనివాస్, మచ్చిక రవీందర్ గౌడ్, గోనె వీరస్వామి తదితరులు ఉన్నారు.

రోడ్లు మరియు డ్రైనేజ్లు పనులకు శంకుస్థాపన చేసిన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు

భద్రాచలo నేటి ధాత్రి

ఈరోజు భద్రాచలం మండలంలో వివిధ కాలనీలో రోడ్లు మరియు డ్రైనేజ్ పనులకు శంకుస్థాపనలకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు

శాంతినగర్ కాలనీ, సుభాష్ నగర్ కాలనీ, అశోక్ నగర్ కొత్త కాలనీ, ఎ ఎస్ ఆర్ కాలనీ, ఆదర్శనగర్ కాలనీ, అభయ ఆంజనేయ స్వామి పార్క్ ఎదురుగా డ్రైనేజీ మరియు కాలనీలో రహదారి లేక ఇబ్బంది పడుతున్నమని కాలనీవాసులు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే ని కలిసి వారి సమస్యలు పై వినతి పత్రం సమర్పించారు.

వెంటనే స్పందించిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు రోడ్లు మరియు డ్రైనేజీలకు సంబంధించిన అధికారులతో మాట్లాడి పై చెప్పిన కాలనీలో రోడ్లు మరియు డ్రైనేజీలు ఎస్టిమేట్ వేసి నిధులు మంజూరు చేయడం జరిగింది.

అట్టి పనులను ఈరోజు భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు.

కాలనీవాసులు ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారికి బ్రహ్మ రథం పట్టారు.

ఎ ఎస్ ఆర్ కాలనీ వాసుల 20 ఏళ్ల నాటి కలను నెరవేర్చిన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు

సుభాష్ నగర్ కాలనీలో అయ్యా మీరు ఎమ్మెల్యే అయ్యాక మొన్న వర్షాలకు గోదావరి వరద నీరు కాలనీలోకి రాకుండా కరకట్ట నిర్మించడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. మీలాంటి ఎమ్మెల్యేని గెలిపించుకోవడం మాకు ఆనందంగా ఉందని తెలిపారు.
అశోక్ నగర్ కాలనీలో కరెంటు స్తంభాలు లేక ఇబ్బంది పడుతున్నారని తెలుపగా అధికారులతో గారితో మాట్లాడి కరెంటు స్తంభాలు వేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్ భోగాల శ్రీనివాస్ రెడ్డి, మండల నాయకులు రత్నం రమాకాంత్, బొంబోతుల రాజీవ్, రత్నం రజనీకాంత్,ఎండి నవాబ్ , అరికెల తిరుపతిరావు,పెద్దినేని శ్రీనివాస్ , నర్రా రాము, చుక్క సుధాకర్, మామిడి పుల్లారావు, భీమవరపు వెంకటరెడ్డి, చెగొండి శ్రీనివాస్, దుద్దుకురి సాయిబాబా, ఒగ్గె రమణ, కాపుల శ్రీను, రసమళ్ళ రాము, యూత్ నాయకులు గాడి విజయ్, ఆకుల వెంకట్, పుల్లగిరి నాగేంద్ర, అవూనురి దుర్గ ప్రసాద్, కొప్పుల రాజా, జామిర్, మహిళలు గంగా భారతి , లక్ష్మి కాంతం, కాసింబీ, సాయి కుమారి తదితరులు పాల్గొన్నారు

సేఫ్టీ మోకులు ప్రతి గీత కార్మికుడు వినియోగించుకోవాలి : చండూరు ఎక్సైజ్ ఎస్ఐ స్వాతి

నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి:
సేఫ్టీ మోకులు ప్రతి గీత కార్మికుడు వినియోగించుకోవాలని చండూరు ఎక్సైజ్ ఎస్సైస్వాతి, తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శిజెర్రిపోతుల ధనంజయ గౌడ్ అన్నారు.చండూరు మండల పరిధిలోనిబంగారిగడ్డ గ్రామంలోసేఫ్టీ మోకులపైగీత కార్మికులకుశిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సేఫ్టీ మోకులు వినియోగించడం వలన ప్రతి గీత కార్మికుడు తాటి చెట్టు ఎక్కేటప్పుడు ప్రమాదం నుండి రక్షణ పొందవచ్చనివారు తెలిపారు.గీత కార్మిక వృత్తిచాలా ప్రమాదకరమైనది. గీత కార్మికుడికి కాటమయ్య రక్షణకవచం చాలా అవసరమని ప్రతి గీత కార్మికుడు వినియోగించుకోవాలనివారు తెలిపారు. సేఫ్టీ మోకులు లేకపోవడం వలన చాలామంది గీత కార్మికులు ప్రమాదాలకు గురవుతున్నారని వారు అన్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వం గీత కార్మికుల కోసం సేఫ్టీ మోకులపై తీసుకున్న నిర్ణయాన్ని గీత కార్మికులు అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ అధికారులు సైదులు, శ్రీను కుమార్, నల్లగొండ టీం ట్రైనర్స్ కాసాని సత్తయ్య,సైదులు, శంకరయ్య,గీత పని వారలసంఘం జిల్లా ఉపాధ్యక్షులు పల్లె శంకరయ్య, ఎక్సైజ్ అధికారి ప్రభాకర్ గీత కార్మికులుతదితరులు పాల్గొన్నారు.

లో లెవెల్ కల్వర్టు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే దొంతి.

పనులలో నాణ్యత లోపించొద్దు: ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి.

నెక్కొండ, నేటి ధాత్రి:

నెక్కొండ మండల నుండి కేసముద్రం కు ప్రధాన రహదారి వెంకటాపురం తొపనపల్లి గ్రామాల మధ్య ఉన్న కల్వర్టు అకాల వర్షానికి పూర్తిస్థాయిలో దెబ్బతినగా వెంటనే స్పందించిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి లో లెవెల్ కల్వర్టు నిర్మాణ పనులను ప్రారంభించిన విషయం తెలిసిందే కల్వర్టు పనులను గురువారం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పరిశీలించారు, అనంతరం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కల్వర్టు మరమతు పనులను నాణ్యత లోపించకుండా ప్రతిష్టాత్మకంగా ఉండే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట పిసిసి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్, నెక్కొండ మార్కెట్ చైర్మన్ రావులహరిష్ రెడ్డి, నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోకల శ్రీనివాస్ రెడ్డి, నెక్కొండ మండల పార్టీ అధ్యక్షుడు బక్కి అశోక్, నర్సంపేట కోర్టు పిజిఏ అడ్వకేట్ బండి శివకుమార్, మండల కాంగ్రెస్ నాయకులు కుసుమ చెన్నకేశవులు, తిరుమల్ నాయక్, మాదాటి శ్రీను, రాహుల మైపాల్ రెడ్డి, సింగం ప్రశాంత్, బోడ శ్రీకాంత్ ,కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

మున్సిపాలిటీ పరిధిలోని వారంతపు సంత (అంగడి )లను బహిరంగ వేలం వేయాలి

ఎమ్మార్పీఎస్ టిఎస్ జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ.

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని భూపాలపల్లి, జంగేడు కాశీంపల్లిలో జరిగే (వారంతపు అంగడి) సంతలను, పట్టణంలోని బహిరంగ వేళo వేయాలని టీఎస్ ఎమ్మార్పిఎస్ జిల్లా అధ్యక్షుడు ఎలుకటి రాజయ్య మాదిగ డిమాండ్ చేశారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కొంతమంది ప్రజా ప్రతినిధులు , అధికారులు, ఒక గుత్తేదారు ఏకమై ఈ మూడు అంగడిలను, గంప గుత్తగా వేలం వేయకుండా తక్కువ ధరకు నడిపించడానికి ప్రయత్నిస్తున్నారని, ఇది దుర్మార్గమైన చర్యని ఆయన దుయ్యబట్టారు. అధికారులు, గుత్తేదారులు ఏకమై తక్కువ ధరకు చేజిక్కుంచుకుంటే, మున్సిపాలిటీ ఆదాయానికి భారీస్థాయిలో గండి పడుతుందన్నారు. తద్వారా మున్సిపాలిటీ ఆర్థికంగా నష్ట పోవాల్సి వస్తుందని, ప్రభుత్వ జీతాలు తీసుకుంటున్న మునిసిపాలిటీ అధికారులు తక్షణమే అంగడీలను బహిరంగ వేలం వేసి, మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని డిమాండ్ చేశారు. ఈ మూడు వారాంతపు సంతలను, గంప చీటీని బహిరంగ వేలం వేసినట్లయితే భూపాలపల్లి మున్సిపాలిటీకి వేట రూ. 8 నుండి రూ. 9 లక్షల వరకు ఆదాయం వస్తుంది… కానీ కొంతమంది ప్రజాప్రతినిదులు మరియు మున్సిపాలిటీ అధికారులు కుమ్మక్కయి గంప చీటీని, వారాంతపు సంతలను వేలం వేయకుండా అడ్డుపడుతున్నాడని మండిపడ్డారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ గారు దీని మీద వెంటనే స్పందించి ఈ మూడు సంతలైనా జంగేడు ,కాశీంపల్లి, భూపాలపల్లి వారంతా సంతలను, గంప చీటీలను వెంటనే బహిరంగ వేలం వేసెలా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా సంతలో ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించవలసిందిగా కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పెండేల దేవ రాజ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రేణుకుంట్ల మహేష్ మాదిగ జిల్లా కార్యదర్శి బచ్చల చిరంజీవి మాదిగ,భూపాలపల్లి నియోజకవర్గ ఇంచార్జి శీలపాక హరీష్ మాదిగ, మండల నాయకులు సాంబయ్య మాదిగ లు పాల్గొన్నారు..

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జీఎస్సార్.

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి మున్సిపాలిటీని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. గురువారం భూపాలపల్లి పట్టణంలోని 15, 18, 20, 21, 22, 19 వార్డులైన కాకతీయ కాలనీ, ఎల్బీనగర్, శాంతి నగర్, హనుమాన్ నగర్, జంగేడు రోడ్డు, బానోత్ వీధి ఫేజ్ – 4 కింద సుమారు రూ.1 కోటి 76 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు జెడ్పి సీఈఓ, జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) విజయలక్ష్మి తో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ… భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధి కొరకు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నట్లు తెలిపారు. భూపాలపల్లి మున్సిపాలిటీ తో పాటు, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు. సదరు గుత్తేదారు పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ శంకుస్థాపన కార్యక్రమాలలో మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్ కౌన్సిలర్ నాగవెల్లి సరళ రాజలింగమూర్తి కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబాల శీను బుర్ర కొమురయ్య తోట రంజిత్ పలువురు అధికారులు, కాంగ్రెస్ నేతలు ఉన్నారు._

వెరిఫికేషన్ సెంటర్ ను పరిశీలించిన జాయింట్ డైరెక్టర్ రాజీవ్.

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి జిల్లాలో డీఎస్సీ 20 24 అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ సెంటర్ ను సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు జాయింట్ డైరెక్టర్ రాష్ట్ర పరిశీలకు రాజీవ్ సందర్శించినారు. రాజీవ్ వెరిఫికేషన్ చేస్తున్న విధానాన్ని పరిశీలించి పలు సలహాలు సూచనలు వెరిఫికేషన్ టీం అధికారులకు తెలియజేసినారు. రాజీవ్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ కోఆర్డినేటర్స్ రాజగోపాల్ లక్ష్మణ్ డిసిఇబీ అసిస్టెంట్ సెక్రటరీ శనిగరపు భద్రయ్య కుసుమ కృష్ణమోహన్ సీనియర్ అసిస్టెంట్స్ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు

పట్టణ ఎస్సై రవికుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసిన బిజెపి నాయకులు

నర్సంపేట,నేటిధాత్రి :

నర్సంపేట పట్టణ నూతన ఎస్సై గా పదవి బాధ్యతలు చేపట్టిన రవికుమార్ ను గురువారం బిజెపి నర్సంపేట పట్టణ అధ్యక్షులు శీలం రాంబాబు గౌడ్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.అనంతరం పట్టణ ఎస్సై రవికుమార్ మాట్లాడుతూ. శాంతి భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. సన్మానించిన వారిలో నర్సంపేట పట్టణ బిజెపి ప్రధాన కార్యదర్శులు కొంపెల్లి రాజేందర్, గూడూరు సందీప్,ఉపాధ్యక్షులు ఠాకూర్ శివ ఇంజన్ సింగ్, వల్లజి నరేందర్, ఠాకూర్ విజయ్ సింగ్, వరంగంటి రాజ్ కుమార్, సోషల్ మీడియా పట్టణ ఇంచార్జ్ సామల ప్రవీణ్ కుమార్,ఓబిసి మోర్చా అధ్యక్షులు తౌటం నిశాంత్ తదితరులు పాల్గొన్నారు.

స్థానికులకే విసి అవకాశం కల్పించాలి

# తెలంగాణ ఉద్యమ కేంద్రంగా కాకతీయ యూనివర్శిటీ.
# బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు,మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్.

నర్సంపేట,నేటిధాత్రి :

తెలంగాణ ప్రాంతంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న కాకతీయ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ పోస్టుకు స్థానికులకే ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ ఉద్యమ నేత బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు,మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లాలో ఉన్న కేయూ వీసీ నియామకం కోసం సెర్చ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.ఈ నేపథ్యంలో కాకతీయ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ నియామకం కోసం సెర్చ్ కమిటీ శుక్రవారం సమావేశం కానున్నది అని సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్పందించి మాట్లాడారు.సెర్చ్ కమిటీలోని ముగ్గురు సభ్యుల్లో కాకతీయ యూనివర్సిటీ నామినీగా జెఎన్టియు రిటైర్డ్ వీసీ ప్రొఫెసర్ ఆవుల దామోదర్, విద్యా శాఖ నుంచి జమ్ము యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ సంజీవ్ జైన్, రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎస్ శాంతి కుమారి నియామకం చేశారని చెప్పారు. వరంగల్ కాకతీయ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ కోసం 158 మంది దరఖాస్తు చేసుకోగా కేయూ నుంచి పోటీలో ఉన్న నలుగురు ప్రొఫెసర్లు ఉన్నారు.గతంలో ఇదే కాకతీయ యూనివర్శిటీలో సేవలందించి వీసీ కోసం దరఖాస్తు చేసుకున్న 8 మంది రిటైర్డ్ ప్రొఫెసర్లు కూడా ఉన్నారని పేర్కొన్నారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమ కేంద్రంగా ఉన్న కాకతీయ యూనివర్సిటీకి వీసీల నియామకాల్లో ప్రాధాన్యం ఇవ్వరా.. అని పెద్ది ప్రశ్నించారు. ఏ ప్రాతిపదికన వీసీల నియామకం చేస్తున్నారో బహిరంగంగా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యమ రణ కేంద్రం కేయూకు వీసీల నియామకాల్లో అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా బిఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కోరారు.

శుభం షాపింగ్ మాల్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే

గడ్డం వినోద్ వెంకటస్వామి.

బెల్లంపల్లి నేటిధాత్రి :

బెల్లంపల్లి మున్సిపాలిటీ బజార్ ఏరియాలో లోని శుభం ఫ్యాషన్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి నూతన షాపింగ్ మాల్ నీ ప్రారంభించిన బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి షాపింగ్ మాల్ యజమాన్ శాలువతో సత్కరించారు. యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత , కౌన్సిలర్స్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

కోరపల్లిలో పిచ్చికుక్క స్వైర విహారం ఐదుగురికి గాయాలు

మూడు సంవత్సరాల చిన్నారి పరిస్థితి విషమం

జమ్మికుంట: నేటిధాత్రి
జమ్మికుంట మండలంలోని కోరపల్లి గ్రామంలో పిచ్చికుక్క స్వైర విహారం చేయడంతో ఐదుగురికి గాయాలు కాగా మూడు సంవత్సరాల చిన్నారికి తీవ్ర గాయాలు కావడంతో వరంగల్ ఆస్పత్రికి తరలించారు. పిచ్చికుక్కల దాడిలో గండీస్వరూప, మొగిలి పాక వెంకటస్వామి తోపాటు మరో ఇద్దరు గాయపడగా ఇంటిముందు ఆడుకుంటున్న మద్దర్ల అక్షర అనే పాపపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. తీవ్రంగా గాయపడిన చిన్నారిని వరంగల్ ఆసుపత్రికి తరలించారు. ప్రజలను గాయపరుస్తూ తిరుగుతున్న పిచ్చికుక్కను పంపి వేయాలంటూ స్థానికులు గ్రామపంచాయతీ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. దీంతో స్థానికులు కుక్కలు వెంటాడి చంపివేశారు. మండలంలో పిచ్చికుక్కల బెడద ఎక్కువగా ఉండడంతో పలువురికి గాయాలు కావడంతో పాటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కొల్చారం మండలంలో టిడిపి పార్టీకి తిరుగురేని నాయకుడు గోకని ధర్మ గౌడ్ …..

– కొల్చారం మండలంలో..మచ్చలేని నాయకుడు…

– కొల్చారం మండలం టిడిపి పార్టీకి చురకమైన పాత్ర పోషించిన రంగంపేట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గోకని ధర్మగౌడ్….

కొల్చారం, ( మెదక్) నేటిధాత్రి:-


రాజకీయ చరిత్రలోనే
కొల్చారం మండల స్థాయిలో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీ రామారావు హయాంలోదాదాపు 40 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీతో రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టి కొల్చారం మండలం రంగంపేట గ్రామానికి చెందిన గోకని ధర్మాగౌడ్ అంటేనే ఒక ధర్మాత్ముడు. అతనికి అవినీతి, అన్యాయం అనే రాజకీయం లేకుండా పెద్దచదువులు చదవకున్నా కూడా తనదైన శైలిలో రంగంపేట గ్రామంలో మొట్టమొదటి ఎస్సీ, బీసీ కాలనీ, శివాజీనగర్ బస్ స్టాండ్ ఏరియా కాలనీ, బుడగ జంగంకాలనీలకు శ్రీకారం చుట్టి ఎలాంటి అవినీతికి పాల్పడకుండా నీతితో నిజాయితీగా తనదైన శైలిలో ఉప సర్పంచ్, సర్పంచ్ గా, ఎంపీటీసీగా, కొల్చారం మండలం వైస్ ఎంపీపీగా నిజాయితీగా పేదల పక్షాన నిలబడి ప్రజా అభ్యున్నతేదేంగా ప్రముఖవ్యాపార కేంద్రమైన రంగంపేటలో మొట్టమొదటిసారిగా సిసి రోడ్ల నిర్మాణం, 40 వేల లీటర్ల సామర్థ్యం గల ఊరికి సరిపడే విధంగా వాటర్ ట్యాంక్ నిర్మించిన ఘనత ఆయనదే,80 సంవత్సరాల వయసు దాటిన ఆయన ఒక మహోన్నతమైన వ్యక్తి రంగంపేట గ్రామానికి అనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేపట్టిన వేళ అదే సమయంలో అమెరికా నుండి వచ్చిన ప్రస్తుతం మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు, తండ్రి మైనంపల్లి హనుమంతరావు రామాయంపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడిన తరుణంలో పక్షాన నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారాన్ని కొనసాగించి గెలిపించిన నాయకుడు గోకని ధర్మ గౌడ్, ప్రస్తుతం నడుస్తున్న రాజకీయాలకు ఆయన పదవుల్లో ఉన్న అంతకాలం ప్రతి కుటుంబాన్ని మేలుకోరుతూ గ్రామాని కవన్నెతెచ్చిన మహానుభావుడు ఇప్పుడున్న రాజకీయాల్లో పట్టి చూస్తే అతను మేధావి, తనకు తానే సాటి, ప్రాణం మించిపనిచేసిన నాయకుడు రంగంపేటలోనే లేడు. అనడానికి మార్గదర్శకుడు. గ్రామానికి ఒక నిదర్శనం ఒక రూపాయి ఆశించకుండా పనిచేసి ధర్మగౌడ్ ఆదర్శంగా నిలిచారు. ధర్మగౌడ్ ఆత్మ శాంతి చేకూరాలని స్వర్గ ప్రాప్తి పొందాలని రంగంపేట ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఫౌండేషన్ కమిటీ సభ్యులు కాముని శ్రీనివాస్,పద్మ బిక్షపతి నేత, వంజరి ఆంజనేయులు, గాండ్ల కృష్ణ, బండి నాగయ్య, ఉసికె బిక్షపతి, పిఎస్పీఎస్ అటెండర్ తదితరులు ఆయనకు ఘనంగా నివాళు లర్పించారు.

– మైనంపల్లి హనుమంతరావుకు..

ప్రస్తుత మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ తండ్రి మైనంపల్లి హనుమంతరావు గతంలో రామాయంపేట అసెంబ్లీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కొల్చారం మండలంలో టిడిపి నుంచి ప్రచారంలో చురకైన పాత్ర పోషించిన నాయకుడు గోకని ధర్మ గౌడ్. అలాగే టిడిపి పార్టీ నుంచి కొల్చారం మండలం అంసన్ పల్లి గ్రామానికి చెందిన దేవర వాసుదేవారావు కూడా టిడిపి పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేశారు. అప్పట్లో కూడా కొల్చారం మండలంలో టిడిపి పార్టీకి పూర్వ వైభవం తెచ్చి ఎన్ని ఆటంకాలు ఎదురైనా మచ్చలేని నాయకునిగా, కొల్చారం మండలంలో మనసున్న మహారాజుగా పేరు తెచ్చుకున్న నాయకుడు ధర్మ గౌడ్ అని చెప్పుకోవచ్చు.
– టిడిపి మాజీ మంత్రి కరణం రామ్ చందర్రావుకు అత్యంత సన్నిహితుడు గోకుని ధర్మగౌడ్ తెలుగుదేశం పార్టీ నుండి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగ పనిచేసిన కరణం రాంచందర్రావుకు గోకని ధర్మగౌడ్ అత్యంత సన్నితుడుగా ఉండేవాడు. అలాగే కర్ణం రామచంద్రా రావు సహాయంతో కొల్చారం మండలానికి వివిధ కార్యక్రమాలు చేపించిన ఘనత గోకనిధర్మ గౌడ్ కు దక్కుతుంది. మండలంలో వివిధ గ్రామాలలో కూడా వాటర్ ట్యాంకులు సిసి రోడ్లకు పంచాయతీల శాఖ మంత్రిగా ఉన్న కరణం రామచంద్ర సహాయంతో కొల్చారం మండలానికి పనులు చేశారు.

– కొల్చారం మండలం రంగంపేట గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ జైపాల్ కు అత్యంత సన్నిహితుడు ధర్మ గౌడ్….

మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ గామని జైపాల్ కు రంగంపేట మాజీ సర్పంచ్ గోకని ధర్మ గౌడ్ సీనియర్ పాతికేయుడు గామన్ జయపాల్ కు అత్యంత సన్నిధిగా ఉండేవాడని జర్నలిస్ట్ జైపాల్ తెలిపారు. అంతేకాకుండా అప్పట్లో కొల్చారం మండలంలో అప్పట్లో కొల్చారం మండలానికి సుమారు నాలుగు ఐదు మంది విలేకరులు ఉండేవారని జైపాల్ తెలిపారు. మండల అభివృద్ధి కోసం పనిచేసిన గోకుని ధర్మ గౌడ్ కు ” జర్నలిస్టు జ్వాలా ” ఎడిటర్ సీనియర్ జర్నలిస్ట్ గామని జైపాల్ గోకని ధర్మ గౌడ్ సంతాపాన్ని తెలిపారు.

26 వ సారి రక్త దానం చేసిన ఆర్.ఎం.పి.డాక్టర్ వనపర్తి సతీష్

చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండలం జోగాపూర్ గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్ గా పని చేస్తున్న వనపర్తి సతీష్, అత్యవసర సమయంలో ఫోన్ కాల్ కు స్పందించి సిరిసిల్ల గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ కి వచ్చి రక్తదానం చేయడం జరిగింది. మరిగడ్డ గ్రామానికి చెందిన నేదురి భవాని అనే మహిళకు డెలివరీ బి పాజిటివ్ రక్తం అవసరం అత్యవసరంగా కావాల్సి ఉండగా, విషయం తెలుసుకున్న సతీష్ వెంటనే వచ్చి బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది, అలాగే సతీష్ చాలా సందర్భాలలో సామాజిక సేవతో పాటు అత్యవసర సమయంలో ఎన్నోసార్లు ఎంతోమందికి బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. ఎంతో మందిని బ్లడ్ డొనేషన్ చేయాలని మోటివేషన్ చేయడం ద్వారా సతీష్ ఎంతమందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.

రుద్రంపూర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉమర్ ని పరామర్శించిన కోనేరు చిన్ని

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి

కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ ఉమర్ తల్లిగారు స్వర్గస్తులైనారు వారి అకాల మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కోనేరు సత్యనారాయణ(చిన్ని) వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ కార్యక్రమంలో మామిడి రాజేశ్వరరావు,రాజు యాదవ్,కాదశి కుమార్,సైమన్,బుచ్చయ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రవి రాంబాబు,22వ వార్డు కౌన్సిలర్ మసూద్,చుంచుపల్లి మండల అధ్యక్షులు అంతోటి పాల్ ,ప్రభాకర్,రవి గౌడ్,కుమార్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా జిల్లా ఆవిర్భావ వేడుకలు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగళ్ళపల్లి రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణంలో జరిగిన జిల్లా ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు జిల్లా రిపోర్టు కోసం ఆనాడు తాము చేసిన ఉద్యమం గుర్తు చేసుకుంటూ జిల్లా ఉద్యమకారులపై ఎన్నో బెదిరింపులు కేసులు పెట్టిన భయపడకుండా జిల్లా సాధించేవరకు పోరాడమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉద్యమంలో తంగళ్ళపల్లి మండలం నుంచి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ బైరవేణి రాము బుస వేణు మాజీ సర్పంచ్ రాజలింగం మండలం నుండి పలు గ్రామాల ప్రజలు మేము పాల్గొను సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ జిల్లా సాధించుకోవడం జరగా ఉందని జిల్లా సాధన లో పాల్గొన్న అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు

error: Content is protected !!
Exit mobile version