చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండలం జోగాపూర్ గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్ గా పని చేస్తున్న వనపర్తి సతీష్, అత్యవసర సమయంలో ఫోన్ కాల్ కు స్పందించి సిరిసిల్ల గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ కి వచ్చి రక్తదానం చేయడం జరిగింది. మరిగడ్డ గ్రామానికి చెందిన నేదురి భవాని అనే మహిళకు డెలివరీ బి పాజిటివ్ రక్తం అవసరం అత్యవసరంగా కావాల్సి ఉండగా, విషయం తెలుసుకున్న సతీష్ వెంటనే వచ్చి బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది, అలాగే సతీష్ చాలా సందర్భాలలో సామాజిక సేవతో పాటు అత్యవసర సమయంలో ఎన్నోసార్లు ఎంతోమందికి బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. ఎంతో మందిని బ్లడ్ డొనేషన్ చేయాలని మోటివేషన్ చేయడం ద్వారా సతీష్ ఎంతమందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.
