మూసి సుందరీకరణ పేరుతో , రాష్ట్ర ప్రభుత్వం పేదల బతుకులు ఆగం చేయదు :సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య

నల్లగొండ జిల్లా, నేటి దాత్రి:
మూసి సుందరీ కరణ పేరుతో, రాష్ట్ర ప్రభుత్వం పేదల బ్రతుకులు ఆగం చేయొద్దని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య అన్నారు.
గురువారం రోజున మునుగోడు మండల కమిటీ సమావేశం స్థానిక సిపిఎం కార్యాలయంలో వేముల లింగస్వామి అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ మూసి సుందరీకరణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు పేద మధ్యతరగతి ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయని మూసి రివర్ బెడ్ ప్రాంతంలో ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్న ప్రజలపై పోలీసులు అధికారులు దౌర్జన్యం ప్రదర్శిస్తున్నారని విమర్శి0చారు.

ఇండ్లకుల్చివేతలకు ఏర్పాటు చేస్తున్న రాష్ట్ర ప్రభు ఎప్పుడు ఋల్ డోజర్లు వచ్చి ఇల్లు కూలగొడతాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారని ప్రభుత్వ0 హడావుడిగా నిర్ణయాలు తీసుకునే ముందు అఖిలపక్ష పార్టీలు ప్రజాప్రతినిధులు ప్రజాసంఘాల మేధావులతో చర్చించాలని చర్చించకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వాన0 ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుందని ఈ సందర్భంగా తెలిపారు

పర్యావరణ పరిరక్షణ ప్రజల భద్రతకు ప్రాధాన్యతను ఇవ్వాలని పర్యాటక కేంద్రంగా మార్చినంత మాత్రాన ప్రభుత్వ ప్రయోజనాలు నెరవేరవని పైగా సాధారణ ప్రజలకు ఆవాసాలకు ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు
మూసి ప్రధాన సమస్య కాలుష్యమని మందులు రసాయన పరిశ్రమలకు సంబంధించిన వ్యర్ధాలు మురుకి నీరు మూసిలో కలవడం వల్ల కాలుష్యం పెరుగుతుందని ఫలితంగా
మూసి పరిసరాల ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని ఉప్పల్ నుండి సూర్యాపేట వరకు కలుషిత మూసి జలాల వలన వ్యవసాయ ఉత్పత్తులు పాలు చేపలు ఉపయోగించిన ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని దీనికి తోడు మూసిలోనూ మూసి గేట్ల మీద నివాసాలు ఏర్పరచుకున్న పేదల ఇండ్లు వరదలు ముంపున గురవుతున్న ఈ ప్రభుత్వానికి ఏమి పట్టి లేదని విమర్శించారు.

ప్రభుత్వ నిర్ణయాల వల్ల వీధిన పడుతున్న మూసి నిర్వాసితులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని మూసి సుందరీకరణ పేరుతో పేదలను నగరం బయటికి పంపి బడా కార్పొరేట్ సంస్థలకు షాపింగ్ మాల్స్ గార్డెన్స్ స్టార్ హోటల్ యజమానులకు ప్రభుత్వ భూములు కట్టబెట్టే ప్రయత్నం మానుకోవాలని పేదలకు వెంటనే పునరావాసం కల్పించాలని, డిమాండ్ చేశారు.

ప్రభుత్వం పేదల ఇళ్లను తోలగిస్తారని తెలియడంతో కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారని మరి కొంతమంది గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారని దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని బాధిత కుటుంబాలను నష్ట పరిహారం ఇవ్వాలని ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు, రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలలో గుడిసెలు వేసుకొని జీవనం కొనసాగిస్తున్న పేదలందరికీ పట్టాలు ఇవ్వాలని వారిపై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో *సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండా శ్రీశైలం మండల కార్యదర్శి మిర్యాల భగత్ మండల కమిటీ సభ్యులు వరికుప్పుల ముత్యాలు యాతరాణి శ్రీను. సాగర్ల మల్లేశం. శివర్ల వీరమల్లు. వడ్లమూడి హన్మయ్య. యాట యాదయ్య. కొంక రాజయ్య. బోల్ల ఎట్టయ్య. ఒంటెపాక అయోధ్య తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version