పనులలో నాణ్యత లోపించొద్దు: ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి.
నెక్కొండ, నేటి ధాత్రి:
నెక్కొండ మండల నుండి కేసముద్రం కు ప్రధాన రహదారి వెంకటాపురం తొపనపల్లి గ్రామాల మధ్య ఉన్న కల్వర్టు అకాల వర్షానికి పూర్తిస్థాయిలో దెబ్బతినగా వెంటనే స్పందించిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి లో లెవెల్ కల్వర్టు నిర్మాణ పనులను ప్రారంభించిన విషయం తెలిసిందే కల్వర్టు పనులను గురువారం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పరిశీలించారు, అనంతరం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కల్వర్టు మరమతు పనులను నాణ్యత లోపించకుండా ప్రతిష్టాత్మకంగా ఉండే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట పిసిసి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్, నెక్కొండ మార్కెట్ చైర్మన్ రావులహరిష్ రెడ్డి, నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోకల శ్రీనివాస్ రెడ్డి, నెక్కొండ మండల పార్టీ అధ్యక్షుడు బక్కి అశోక్, నర్సంపేట కోర్టు పిజిఏ అడ్వకేట్ బండి శివకుమార్, మండల కాంగ్రెస్ నాయకులు కుసుమ చెన్నకేశవులు, తిరుమల్ నాయక్, మాదాటి శ్రీను, రాహుల మైపాల్ రెడ్డి, సింగం ప్రశాంత్, బోడ శ్రీకాంత్ ,కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.