చుంచుపల్లి మండలం రుద్రంపూర్ ఆటో స్టాండ్ వారు ఏర్పాటుచేసిన అమ్మవారి నవరాత్రుల సందర్భంగా ఏర్పాటుచేసిన అమ్మవారి విగ్రహాన్ని దర్శించి, కొబ్బరికాయ కొట్టి పూజలు చేసి, అమ్మవారి దీవెనలు తీసుకున్న బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వనమా రాఘవేందర్
వనమా రాఘవ వెంట మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, మాజీ ఉర్దూ కమిటీ చైర్మన్ అన్వర్ పాషా, చుంచుపల్లి మండల యూత్ ప్రెసిడెంట్ కన్ని, మాజీ సర్పంచ్ గుమ్మడి సాగర్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు రాసేపల్లి ప్రసాద్, బాచిరెడ్డి, బొమ్మిడి రమాకాంత్, నరేందర్, డాన్ శీను, బన్నీ, సాంబ, పవన్ రెడ్డి, అజయ్, రాజేష్, రాజు, వెంకటేష్, బాబు తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ ఆర్ డి డి ఎం పద్మావతి జమ్మికుంట: నేటి ధాత్రి ఉత్తర తెలంగాణలోనే రెండవ అతిపెద్ద మార్కెట్గా ప్రసిద్ధి చెందినకరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్ లో కొనుగోలు సక్రమంగా జరిగేలా చూడాలని వరంగల్ ఆర్ డి డి ఏం పద్మావతి అన్నారు. పదోన్నతి పొందిన తర్వాత మొదటిసారిగా జమ్మికుంటకు వచ్చిన పద్మావతికి మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి మల్లేశం తోపాటు సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వరంగల్ ఆర్ డి డి ఎం కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాలైన చర్యలను తీసుకోవాలని, నాణ్యమైన పత్తికి మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రైవేటు వ్యాపారులతో పాటు సిసిఐ సైతం కొనుగోలు చేసేందుకు ఇప్పటికే అధికారులతో సంప్రదింపులు జరపడం జరిగిందని రానున్న రోజుల్లో జరిగే సిసిఐ విక్రయాలను సక్రమంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు తెలిపారు. ప్రతినిత్యం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కు వస్తున్న పత్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
జమ్మికుంట: నేటి ధాత్రి ఇల్లందకుంట గ్రామంలో శ్రీ దేవి శరన్నవరాత్రులు ఉత్సవాల్లో భాగంగా మహా చండీ యాగమును ఘనంగా నిర్వహించారు. దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సోమవారం అమ్మవారిని మహా చండికాదేవి అలంకరణ చేసి అమ్మవారి దగ్గర గుమ్మడి కాయ పూజలను నిర్వహించారు. భవాని మాలధారులు మహా చండీయాగం లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు . గ్రామంలోని ప్రజలందరూ మహా చండీయాగానికి హాజరై అమ్మవారికి మొక్కలు చెల్లించుకున్నారు . అదేవిధంగా మండలంలోని శ్రీరాములపల్లి గ్రామంలో గత తొమ్మిది సంవత్సరాలగా దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. గ్రామంలోని ప్రజలు రైతులు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని మొక్కుకుంటూ పలువురు మాలధారణ చేశారు. జమ్మికుంట పట్టణంలోని మోత్కులగూడెం మహంకాళి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మహా అన్నప్రసాద వితరణ నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి ముక్కులు చెల్లించుకోవడంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
విద్యుత్ వైర్లు పంట పొలంలో ఉండడంతో వ్యవసాయం చేసుకోలేకపోతున్నామని వీణవంక మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన రైతులు వాపోతున్నారు. ఈసందర్భంగా రైతులు పొలంలో కరంట్ నారుమడిలో ఉండడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పని చేయాల్సి వస్తుంది అని అన్నారు. పలుమార్లు సంబంధిత అధికారులకు సమస్యపై తెలిపిన పట్టించుకోలేదని తెలిపారు. కరెంటు వైర్లు కిందికి వేలాడడంతో రైతన్నలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రైతుల పొలంలోకి హార్వెస్టర్లు ట్రాక్టర్లు వెళ్లాలన్న ఇబ్బంది పడుతూ ప్రమాదమని తెలిసినా వెళ్లక తప్పడం లేదని రైతుల ఆవేదం వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు ఈ విషయంపై ప్రజాప్రతినిధులకు ట్రాన్స్కో అధికారులకు తెలిపినప్పటికీ పట్టించుకోవడంలేదని రైతులు తెలిపారు. రాత్రి సమయాల్లో పొలాలకు వెళ్లాలంటే భయపడుతున్నామని ఇప్పటికైనా అధికారులు స్పందించి పంట పొలాలలో ఉన్న లూస్ వైర్లను మరమ్మత్తు చేయాలని కోరారు.
ప్రతి గ్రామానికి కాంగ్రెస్ సంక్షేమ పథకాలు …హుజరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్ బాబు
జమ్మికుంట: నేటి ధాత్రి హుజరాబాద్ నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధి నా లక్ష్యమని, ప్రతి గ్రామానికి కాంగ్రెస్ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటానని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఒడిదల ప్రణవ్ బాబు అన్నారు. జమ్మికుంట మండలంలోని నాగారం గ్రామంలో గల ఆంజనేయ స్వామి కి మకర తోరణం సమర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా పేద పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రణవ్ బాబు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో సెంటిమెంట్ గా ఇక్కడి ఆంజనేయస్వామి దర్శనము చేసుకొని ప్రచారం ప్రారంభించడం జరిగిందని, నాగారం గ్రామంలో గల ఆంజనేయస్వామి చాలా పవర్ ఫుల్ దేవుడని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా పడటంతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా పంటలు బాగా పండాలని కోరుకుంటున్నాను అని, అదేవిధంగా వావిలాల, నగురం, నాగారం, పాపక్కపల్లి గ్రామాలతో పాటు అన్ని గ్రామాలలో ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి నిరుపేదకు చేరాలా చేస్తానని హామీ ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాలమహానాడు విస్తరణలో భాగంగా మాలమహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి ఆదేశానుసారం. పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రగుంట గ్రామంలో మాలమహానాడు సమావేశాన్ని గ్రామస్తులు నిర్వహించారు. ఈ సమావేశానికి మాలమహానాడు రాష్ట్ర సెక్రటరీ జనరల్ S. మధుసూదన్ రావు (చిన్ని )ముఖ్య అతిధిగా హాజరైనారు. ఎర్రగుంట గ్రామ మాలమహానాడు కమిటీ ని మధుసూదన్ రావు (చిన్ని )ప్రకటించారు. ఈ సందర్బంగా మధుసూదన్ రావు (చిన్ని )ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాలమహానాడు ను బలోపేతం చేయాలనే దృక్పధంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అన్ని పట్టణ, గ్రామ కమిటీలను వేయడం జరుగుతుందన్నారు.ఇటీవల సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పును వ్యతిరేకిస్తూ ఆందోళనలు, నిరసనలు తెలియజేస్తున్నామని, ఎస్సీ వర్గీకరణను విరామించుకునేవరకు పోరాటం ఆగదని, ఈ పోరాటంలో మీరుకూడ భాగస్వాములు కావాలని కోరారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలోమాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి నాయకత్వంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా త్వరలో పాదయాత్ర నిర్వహించడం జరుతుందని, మాలమహానాడు కార్యకర్తలు, విద్యార్డులు, యువకులు,మహిళలు అందరూ భాగస్వాములు కావాలని కోరారు. మాలల్లో ఐక్యత లేదని చెప్పే వాళ్ళ నోటికి ఈ పాదయాత్ర ద్వారా బుద్ది చెప్పాలని సూచించారు.ఎస్సీ. లను విడదీసి పబ్బం గడుపుకుంటున్న రాజకీయ పార్టీలు నాయకులకు తగిన గుణపాఠం చెప్పాలని ఉద్బోదించారు. కొత్తగూడెం పట్టణ మాలమహానాడు అధ్యక్షుడు శనగ ప్రభాకర్, జిల్లా ఉపాధ్యక్షుడు శనగ పుల్లయ్య గుడివాడ నారాయణ, నక్కా నరసింహారావు తదితరులు ప్రసంగించారు. ఎర్రగుంట గ్రామం మాలమహానాడు కమిటీ పాల్వంచ మున్సిపాలి ———————————— సలహాదారులు : ———————- గుడివాడ నారాయణ అధ్యక్షులు : ————— సలవాది రత్నం ఉపాధ్యక్షులు : ——————– 1.ద్రాక్ష మాణిక్యరావు 2 నక్కా నరసింహారావు 3.శెట్టి నరసింహారావు ప్రధాన కార్యదర్శి : ———————— ద్రాక్ష సురేష్ సంయుక్త కార్యదర్సులు : ——————————— 1.నిట్ట నరసింహారావు 2.బొజ్జ రాము 3.శెట్టి కమలాకర్ 4.కురివిందల సీతారాములు ముఖ్య ప్రచారకార్యదర్శి : ——————————— సూరం ఆదినారాయణ ప్రచార కార్యదర్సులు : —————————— 1.సలవాది శంకర్ 2.నక్కా వెంకటేశ్వర్లు 3.కోలుకుల రమేష్
ఇల్లు నిర్మాణం చేపట్టడం వల్ల మూడు సంవత్సరాల నుండి విద్యుత్ అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదు. గత నెల పదో తారీకు రోజున నాకు కరెంట్ షాక్ కొట్టి చనిపోయే ప్రమాదం నుండి బయటపడ డం జరిగింది ఇది గట్లకానిపర్తి- సింగారం లైన్, మాంధారిపేట ఇండ్లలోకి 11 కేవీ వైర్లు ప్రమాదకరంగా ఉన్నాయి. ఈ విద్యుత్ బారిన పడిన ప్రజలు కొమ్ముల భాస్కర్ కుమారుడు, జయపాల్, తక్కల్ల సాంబయ్య నివాసముంటున్న వారు విద్యుత్ షాక్ గురయ్యారు తక్షణమే విద్యుత్ అధికారులు స్పందించి విద్యుత్ స్తంభాలను మార్పు చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు.
శాయంపేట మండలం మాందారిపేట గ్రామంలో విద్యుత్ స్తంభాలు ఇంటి ఆవరణంలో ఉండడం దానికి తోడు 11 కేవి విద్యుత్ తీగలు పెద్ద పెద్ద భవనాలను అనుకొని ప్రమాదకరంగా ఉండడంతో స్థానికులు భయపడు తున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని పిల్లలు ,మహిళలు, పెద్దలు అధిక మొత్తంలో జీవనం సాగిస్తున్నారు ఎటు నుంచి ఏ ప్రమాదం పొంచి ఉందో అని నిత్యం భయాందోళనకు గురవుతున్నారు. 11 కేవి విద్యుత్ తీగల మధ్య నివాసం ఉంటున్న ఇంటికి అడ్డంగా కరెంటు స్తంభాలు ఉండటం వల్ల ప్రజలు తీవ్ర అవస్థల పడుతున్నారు విద్యుత్ శాఖ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెంట్ షాక్ గురైన సంఘటన ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని జీవనం సాగిస్తున్నాము .ఏడాదిలో 11కె.వి విద్యుత్ తీగల వల్ల అనేకమంది ప్రజలు కరెంట్ షాక్ కు గురయ్యారు ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి విద్యుత్ స్తంభాలను సురక్షిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసి తమ ప్రాణాలను కాపాడాలని వేడుకుంటున్నారు. వారి తప్పిదాలు మాత్రం ప్రజలు గుర్తుచేస్తున్నప్పటికీ విద్యుత్ అధికారులు మాత్రం కనికరం చూపెట్టడంలేదని ప్రజలు వ్యక్తం చేశారు.
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం (టఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం లెంకాలపల్లి గ్రామానికి చెందిన మలిదశ ఉద్యమకారుడు ఆకుల సాంబరావును ఎంపిక చేసినట్టు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ పేర్కొన్నారు .తెలంగాణ ఉద్యమ సమయంలో గల్లీ నుండి ఢిల్లీ స్థాయి వరకు ఆకుల సాంబరావు పోరాటాన్ని ఉదృతం చేయుటలో కీలక భూమిక పోషించాడని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం గత ఆరు సంవత్సరాల నుండి ఉద్యమకారుల సంక్షేమం కొరకు కొట్లాడుతుందని ఆయన అన్నారు. సాంబరావు మాట్లాడుతు ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర నాయకత్వం తనని ఉపాధ్యక్షుడిగా ప్రకటించినందుకు రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు తనపై ఎంతో నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యతలు అప్పగించినందుకు తెలంగాణ ఉద్యమకారుల కోసం నా వంతుగా కృషి చేస్తానని అలాగే ఉద్యమకారుల ఫోరం తీసుకునే నిర్ణయంపై శిరసా వహించి ఉద్యమకారుల కోసం కష్టపడి పనిచేస్తానని అన్నారు.
బెల్లంపల్లి నియోజకవర్గం శ్రీరామ వెల్ఫేర్ సొసైటీ బెల్లంపల్లి వారి ఆధ్వర్యంలో ఈరోజు సింగరేణి కాల రీస్ కంపెనీ ఏరియా హాస్పిటల్ లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో. హెచ్డిఎఫ్సి బ్యాంక్ సహకారంతో నిర్వహిస్తున్నాం.శ్రీరామ వెల్ఫేర్ సొసైటీ స్థాపించిన కొద్దికాలంలోనే ఈ సమాజంలో రక్తం లేదని కారణంతో ఏ ఒక్కరు మరణించకూడదని సంకల్పంతో రక్తం లేక తల సేమియా వ్యాధిగ్రస్తులు నిరంతరం జీవన్మరణ సమస్యలతో జీవిస్తున్నారు.అలాంటివారు మన జిల్లాలో అత్యధికంగా జీవిస్తు నారు వారిని కాపాడాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా నేటి యువత పెడదారిన పట్టకుండా ఆరోగ్యవంతమైన సమాజం కోసం,రక్తదానం. నేత్రదానం. అవయవ దానం పైన అవగాహన పెంచుకుని. సమాజంలో స్ఫూర్తిదాయకంగా జీవించాలన్నారు. శ్రీరామ వెల్ఫేర్ సొసైటీ భవిష్యత్తులో అనేక సామాజిక సేవా కార్యక్రమాలలో భాగస్వామ్యం అవుతామని సమాజాభివృద్ధిలో మేము సైతం ముందుంటామని పేర్కొన్నారు. ఈరోజు ఈ రక్తదాన శిబిరంలో 70 యూనిట్లకు పైగా రక్తదానం చేశారు. రక్త దాతలు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. వారికి సర్టిఫికెట్స్ అందజేశారు. రక్తదాన శిబిరానికి సింగరేణి హాస్పిటల్ ను మాకు అవకాశం కల్పించినందుకు బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్, సూపర్డెంట్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో శ్రీరామ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు తుమ్మల సురేష్, ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి రాహుల్ కోశాధికారి బింగి రాజశేఖర్. అట్ట సత్యనారాయణ రెడ్డి, మహమ్మద్ అక్బర్ బింగి సతీష్ , చెలిమల్ల మల్లేష్ గుజ్జ కిరణ్, తుమ్మల సాగర్ రెడ్డి, రెడ్ క్రాస్ బాధ్యులు గజల్లి మోహన్, ఈ కార్యక్రమంలో.నునేటి సత్యనారాయణ.గజల్లి చంద్రశేఖర్. రెడ్ క్రాస్ సిబ్బంది హాస్పిటల్స్ సిబ్బంది పాల్గొన్నారు.
దసరా ఉత్సవాలను పురస్కరించుకొని ఉప్పల్ లోని పోచమ్మ ఆలయంలో కార్పొరేటర్ మందముళ్ళ రజితపరమేశ్వర్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి సోమవారం పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి దంపతులు, అమ్మవారికి పూజలు ఘనంగా చేశారు. ఈ కార్యక్రమం లో ఈగ ఆంజనేయులు ,లింగంపల్లి రామకృష్ణ ,గడ్డం యాదగిరి ,ఆగం రెడ్డి ,సోమ్ జంగయ్య ,భాస్కర్ ,ఏర నర్సింహా ,రాఘవేందర్ ,హనుమంత్ ,అలుగుల అనిల్ ,ఆల్వాల్ భాస్కర్ ,జనగాం రామకృష్ణ ,మంద సుమన్ రెడ్డి ,మణి తదితరులు పాల్గొన్నారు.
భక్తులకు భారీగా అన్నదాన కార్యక్రమంను ఏర్పాటు చేసిన జై దుర్గా భవాని యూత్ అసోసియేషన్ ఆర్గనైజషర్, సభ్యులు
దుర్గామాత ఆశీస్సులు ప్రజలందరి పై ఉండాలని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. చర్లపల్లి డివిజన్ కుషాయిగూడ పరిధిలోని ఎంఆర్ఆర్ కాలనీ లో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా జై దుర్గా భవాని యూత్ అసోసియేషన్ ఆర్గనైజర్ విజయ్ కుమార్, సభ్యులు ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటుచేసిన దుర్గామాత అమ్మవారి పూజా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ దన్ పాల్ రెడ్డి, పలు కాలనీల పెద్దలు, సభ్యులు, మహిళలు పాల్గొని అమ్మ వారిని దర్శించుకున్నారు. అనంతరం భారీగా అన్నదాన కార్యక్రమంను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు నేమూరు మహేష్ గౌడ్, నాయకులు, జై దుర్గ భవాని యూత్ అసోసియేషన్ సభ్యులు, స్థానిక కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.
దేవుడు వరమిచ్చిన పూజారి వరం ఈయనట్టు. తయారయింది రైతుల గోడు. వరుణ దేవుడు కరుణించి పుష్కలంగా వానలు పడి చెరువులు బావులు నిండిన కరెంటు సరఫరా లేకపోవడంతో పంట పొలాలు ఎండిపోతున్నాయి సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు పాలకవర్గం నిర్లక్ష్యం చేయడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు వివరాల్లోకి వెళ్తే వేములవాడ రూరల్ మండలంలోని చెక్కపల్లి గ్రామంలో చేతికి వచ్చే వరి పొలాలు గత ఆరు నెలలుగా ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం వల్ల కరెంటు సప్లై సరిగా లేక బావుల మోటర్లు కాలిపోయి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. తమ పంట పొలాలు బతకాలంటే వెంటనే ట్రాన్స్ఫార్మర్ లను రిపేర్ చేసి. లేదా కొత్తవి అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు వీటి విషయం పై సెస్ అధికారులతో పాటు పాలకవర్గాన్ని పలుమార్లు విన్నవించినప్పటికీ పెడచెవిన పెడుతున్నారని పలువురు రైతులు విమర్శలు చేస్తున్నారు. బావిలో నీళ్లు ఉన్నప్పటికీ వాటిని సకాలంలో పంటలు అందించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించకుంటే రోడ్డుపైకి వచ్చి నిరసన వ్యక్తం చేయాల్సి ఉంటుందని రైతులు హెచ్చరిస్తున్నారు.
‘ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే అసలైన నాయకుడు’ అనేది ఒక సినిమా డైలాగు. ప్రస్తుతం పరిణిత నాయకుడిగా తయారవుతున్న పవన్ కళ్యాణ్ కు ప్రస్తుతం కావలసింది ఇదే. ఎందుకంటే తొందరపడి చేసే వ్యాఖ్యలు లేదా విమర్శల వల్ల ప్రత్యర్థులనుంచి బలమైన ప్రతి విమర్శలకు దారితీసి అసలు లక్ష్యం దెబ్బతినే ప్రమాదం వుంది. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మతవిద్వేషాలను రెచ్చగొడుతున్నారంటూ తమిళనాడులోని మదురైలో వాంజినాథన్ అనే ఒక న్యాయవాది ఫిర్యాదు చేయడం తాజా పరిణామం. ఇటీవల తిరుపతిలో పవన్ కళ్యాణ్ సనాతనధర్మ పరిరక్షణకోస మంటూ ఒక డిక్లరేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ డిక్లరేషన్ సందర్భంగా ఆయన రాహుల్‌గాంధీ, అక్బరుద్దీన్ ఒవైసీ, తమిళనాడు ఉపముఖ్యమంత్రి దయానిధి స్టాలిన్‌లపై విమర్శనాస్త్రాలు సంధించారు. ముఖ్యంగా దయానిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని వైరస్‌తో పోల్చారంటూ పేర్కొనడం మదురైలో ఫిర్యాదుకు కారణం. ఇటీవల తమిళన నటుడు కార్తిపైపవన్ ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని కూడా తమిళులు జీర్ణించుకోలేక పోయారన్నది గుర్తుంచుకో వాలి. తమిళుల్లో వుండే అపరిమిత ప్రాంతీయాభిమానం అందరికీ తెలిసిందే. దయానిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు సనాతన ధర్మ మద్దతుదార్లకు తప్పనిపించినా తమిళుల్లో చాలామందికి అవి ఆమోదయోగ్యమే. నిజానికి ఇక్కడ దయానిధి అంశం అప్రస్తుతం! డిఎంకె దీన్ని ఖండిరచి తాముఏ మతానికి వ్యతిరేకంగా ఎప్పుడూ వ్యాఖ్యానిం చలేదని వివరణ ఇచ్చినా, తమిళుల సంగతి మనకు తెలిసిందేగా!
ప్రజల్లోకి వెళ్లిన సనాతనధర్మ వాదం
ప్రస్తుతం పవన్ ఎత్తుకున్న సనాతనధర్మ పరిరక్షణ వాదం ఆంధ్రప్రజల్లోకి బాగా వెళ్లిందనేది సుస్పష్టం. హిందూ ధర్మ పరిరక్షణ అనే పదం ఆయన వాడకుండా జాగ్రత్త పడుతున్నారు. మహారాష్ట్రలో శివసేన ప్రధాన లక్ష్యం హిందూధర్మ పరిరక్షణ. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆది త్యనాథ్ కార్యాచరణ శైలి ఇదే దిశలో కొనసాగుతోంది. దేశంలోని అన్ని ఆలయాలు ఒకే బోర్డ్ కింద ఉండాలి, అలాంటి ధర్మ పరిరక్షణ బోర్డు అవసరమనేది పవన్ చేస్తున్న ప్రధాన డిమాండ్.సనాతనధర్మ పరిరక్షణకు ఆవిధంగా హిందూ ఆలయాలన్నింటిని ఒకే తాటికిందికి తీసుకురావాలని ఆయన కోరడం సహేతుకం. నిజానికి ఇది ఆయన ఒక్కడు చెబుతున్న మాట కాదు, ఇది దేశంలోని మెజారిటీ హిందువుల అభిప్రాయం. దీనివల్ల సనాతనంగా కొనసాగుతున్న దేవాలయ వ్యవస్థకు రక్షణ ఏర్పడుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఆదాయం వున్న దేవాలయాలన్నీ ప్రభుత్వాల పరిధిలోకి వెళ్లడంతో, సనాతనధర్మాచరణకు విఘాతం కలుగుతోంది.
తెరవెనుక నిజాలు
ఇక్కడ తెరవెనుక వాస్తవాన్ని గుర్తించాలి. తెలుగుదేశం`జనసేన కాంబినేషనల్‌లో ప్రభుత్వం కొనసాగుతున్నంతకాలం చంద్రబాబు లేదా లోకేష్ మాత్రమే ముఖ్యమంత్రిగా వుంటారు. పవన్ కళ్యాణ్‌కు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వుండదు. ఈ నేపథ్యంలో అయాచితంగా చేతికందిన సనాతన ధర్మం అస్త్రాన్ని ఉపయోగించి ఆయన లేవనెత్తిన సరికొత్త వాదం, భాజపా పెద్దలకు తప్పక ఆనందం కలిగించేదే! అదీకాకుండా ఆంధ్రప్రదేశ్‌లో నాయకత్వ లేమితో ఇబ్బంది పడుతున్న బీజేపీకి పవన్ ఆ లోటును భర్తీచేయగలడన్న విశ్వాసం ఏర్పడుతుంది. ప్రస్తుతం అందుకున్నసనాతన వాదం భవిష్యత్తులో పవన్ కళ్యాణ్‌ను ఒక శక్తివంతమైన నాయకుడిగా తయారుచేస్తుందన్న నమ్మకం కలిగే దిశగా పరిణామాలు మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో భాజపా పవన్‌కు పూర్తి మద్దతు కొనసాగించి రాష్ట్రంలో బలపడేందుకు పావులు తప్పక కదుపుతుంది.
చంద్రబాబు పుణ్యమే
నిజానికి విజయవాడ వరదల విషయంలో ప్రభుత్వం వైఫల్యం చెందింద న్న అభిప్రాయం ప్రజల్లో పెరిగితే ప్రమాదమన్న ఉద్దేశంతో, ‘డైవర్షన్ పాలిటిక్స్’లో భాగంగా చంద్రబాబు లేవనెత్తిన తిరుపతి లడ్డూ వివాదం బూమరాంగ్ అయినట్టు ఇప్పుడిప్పుడే స్పష్టమవుతోంది. సిట్ ఏర్పాటు చేసి జగన్‌పై పాపం మొత్తం నెట్టేసి గట్టెక్కుదామనుకుంటే, సుప్రీంకోర్టు స్వయంగా సిట్ వేయడం చంద్రబాబుకు ఎంతమాత్రం కొరుకుడు పడని అంశం. విచిత్రమేమంటే ఆయన జగన్‌ను దెబ్బ కొట్టాలన్న ఉద్దేశంతో లేవనెత్తిన వివాదం అటుతిరిగి ఇటుతిరిగి పవన్ చేతికి ‘సనాతన ధర్మం’ అస్త్రం ఇచ్చింది. హిందూత్వ, హిందూధర్మం కాకుండా ‘సనాతనధర్మం’ అనే ఈ కొత్త కాన్సెప్టు ను పవన్ కళ్యాణ్ సుస్థిరమైన ఆయుధంగా తనకు అనుకూలంగా మలచుకొని ముందుకెళితే భవిష్యత్తులో అది తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సీపీలు రెండిరటికి ఇబ్బందికరమే. ఆంధ్రప్రదేశ్‌లో మూడో నాయకత్వం పటిష్టంగా రూపొందుతుంది. ‘సనాతనధర్మం’, ‘హిందూత్వం’ మరియు ‘జాతీ యవాదం’ అనేవి ప్రధాన ఆయుధాలు కనుక, భాజపా పెద్దలనుంచి పవన్‌కు ఆశీస్సులు పుష్క లంగా అందుతాయి. కాకపోతే పవన్ కళ్యాణ్ నిలకడగా తన రాజకీయాలు కొనసాగించాల్సి వుంటుంది. అవసరానికి తగ్గట్టు ఎప్పటికప్పుడు తాత్కాలిక అజెండాలు ఎంచుకుంటే రాజకీయంగా నష్టపోవడం ఖాయం. జగన్‌ను వచ్చే ఎన్నికల్లో పదవిలోకి రాకుండా చేసే ఉద్దేశంతో చం ద్రబాబు కదిపిన తొలి ‘పావు’ లడ్డూ వివాదం. ఈ వివాదం మొదట జగన్ పార్టీని హతాశుల్ని చేసినా, వారు తేరుకొని ఎదురు తిరగడంతో తెలుగుదేశం ప్రస్తుతం డిఫెన్స్‌లో పడిరది. అయితేచంద్రబాబు ప్రయోగించిన ‘లడ్డూ’ అస్త్రం ఇప్పుడు ‘సనాతనధర్మం’ పేరుతో పవన్ చేతిలో తిరు గులేని ఆయుధంగా మారడం ఆంధ్రప్రదేశ్‌లో భాజపాకు అనుకోని వరం!
ఇక పవన్ విషయానికి వస్తే ప్రస్తుతానికి సనాతన ధర్మానికి బ్రాండ్ అం బాసిడర్‌గా ప్రజల్లో పేరు తెచ్చుకోవడంలో విజయం సాధించారనేది తిరుగు లేని వాస్తవం. రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లో వామపక్ష భావజాలాన్ని భుజానెత్తుకున్నా అది పెద్దగా వర్కవుట్ కాకపోవడంతో కాడి కిందపడేశారు. నటుడుగా ఆయన చేగువేరా ఆదర్శమన్నారు. కులమతాలకతీతంగా పోరాడతామని చెప్పిన ఆయన ఇప్పుడు ‘సనాతనధర్మం’ భుజానకెత్తుకున్నారు. రాజకీయ అధికార పరమపద సోపానాన్ని అధిరోహించడానికి ఈ తాజా అస్త్రం పవన్‌కు ఎంతమేర ఉపకరిస్తుందనేని కాలమే నిర్ణయిస్తుంది.
స్థిరంగా నిలబడాలి
అయితే ‘సనాతనధర్మం’పైనే ఆయన స్థిరంగా నిలబడితే, కొన్ని ప్రయోజనాలు సిద్ధించే అవ కాశాలు లేకపోలేదు. ఆంధ్రప్రదేశ్‌లో రెడ్లు, కమ్మల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో మరోకులానికి చోటు లేకుండా పోయింది. కుల రాజకీయాలు బలీయంగా వున్న నేపథ్యంలో పవన్‌కు ‘కాపు’ కుల కార్డు ఎలాగూ తప్పదు. ఇప్పుడు సనాతనధర్మం పుణ్యమాని, మైనారిటీల పేరుతో రాజకీయ పార్టీలు తమను అణచివేస్తున్నాయన్న భావన ఉన్న అన్ని కులాల్లోని ప్రజలు ఇప్పుడు పవన్‌కు తప్పక మద్దతిస్తారు. ఎందుకంటే ఇప్పటివరకు తమ వాణి వినిపించే అవకాశం లేక, సమర్థవంతుడైన నాయకుడు లేక మౌనంగా ఉన్న గళాలన్నీ ఇప్పుడు పవన్ వెంట నడవడానికి నిస్సంకోచంగా ముందుకువస్తాయి. ఇది భాజపాకు, పవన్‌కు…ఇద్దరికీ లాభమే. ఈ ‘వాదం’ ఆం ధ్రలో వేళ్లూనుకుపోయిన కుల రాజకీయాల్లో తప్పక మార్పు తెచ్చే అవకాశాలే ఎక్కువ. పవన్‌కు ‘అస్థిర’ రాజకీయాలు నడుపుతారన్న అపవాదుతో పాటు ‘నిజాయతీ’గల నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో గుర్తింపూ వున్నది. ఇప్పుడు తానొక నిలకడ రాజకీయవేత్తగా నిరూపించు కోవడం పవన్ ప్రధాన కర్తవ్యం. అనుభవం పెరిగే కొద్దీ రాజకీయ పరిణితి కూడా విస్తరిస్తుంది. అందువల్ల పవన్‌ను గతంలో మాదిరిగా అంచనా వేయడం కూడా తప్పే అవుతుంది. అధికారం కోసం లేదా ప్రజామద్దతుకోసం ఎన్నో అంశాలను నెత్తికెత్తుకోవాల్సి వుంటుంది. కానీ వాటిల్లో ఏదో ఒకఅంశమే ఒక నాయకుడి జీవితాన్ని మలుపు తిప్పే బ్రహ్మాస్త్రమవుతుందనేది చరిత్ర చెబుతున్న స త్యం. ‘తెలుగువారి ఆత్మ గౌరవం’ అంశం ఎన్టీఆర్‌ను, ‘తెలంగాణా అస్తిత్వం’ అన్న అంశం కె.సి.ఆర్.ను, ‘గరీబీ హటావో’ ఇందిరాగాంధీని, ‘జై జవాన్ జైకిసాన్’ నినాదం లాల్ బహదూర్ శాస్త్రిని గొప్ప నాయకులుగా నిలిపాయి. మరిప్పుడు ‘సనాతన ధర్మం’ అంశం పవన్‌ను ఎంతమేర నిలుపుతుందో చూడాలి.
తానొకటి తలిస్తే…
నిజం చెప్పాలంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఇంకా కష్టాల కడలిని ఈదు తుందనే చెప్పాలి. మామూలు వర్షాలకే అమరావతిలో వరదనీరు పారుతోంది. దీని అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు రుణం ఇస్తుందో లేదో తెలియదు. వైఎస్ జగన్ మూడు రాజధానులంటూ ప్రచారం చేసినా, తెలుగుదేశం ఎప్పటికప్పుడు అమరావతికి అనుకూలంగా ఎదురుదాడులు చేస్తూ జగన్‌ను అడుగు ముందుకేయనీయలేదు. జగన్ పుణ్యమాని రాష్ట్రానికి ఒక రాజధాని అంటూ లేకుండాపోయిందని ప్రచారం చేసిన తెలుగుదేశానికి ఇప్పుడు అమరావతిని అభివృద్ధి చేయడం మోయలేని భారంగా మారింది. దీనికి తోడు విజయవాడలో వరద విలయం గోరుచుట్టుపై రోకలిపోటుచందమైంది. ఇచ్చిన హమీలు అమలుచేయలేని దుస్థితి మరోవైపు ప్రకృతి ప్రకోపం నేపథ్యంలో ప్రచారహోరు ఎంతోకాలం ‘ప్రతికూల ప్రభావం’ నుంచి గట్టెక్కించలేదు. సకల పాపా లు జగన్‌మీద నెట్టేయాలన్న తలంపుతో ‘లడ్డూ’ను ముందుకు తీసుకొచ్చి తలబప్పికట్టిన చంద్రబాబు, ఇదే ‘లడ్డూ’ పవన్ చేతిలో సనాతన ధర్మం అనే బలమైన అయుధంగా మారుతుందని ఊహించి వుండకపోవచ్చు. ప్రస్తుతం దేశంలో హిందువుల్లో వేగంగా పెరుగుతున్న చైతన్యాన్ని తమను తాము ‘సెక్యులర్’గా చెప్పుకునే రాజకీయ పార్టీలు గుర్తించని విధంగానే, చంద్రబాబు కూడా అంచనా వేయకపోవడం వల్ల అనుకున్న రాజకీయ లక్ష్యం నెరవేరడం మాట అట్లావుంచి, పవన్ బలమైన నాయకుడిగా రూపొందడానికి చేజేతులారా సహకరించినట్లయింది. తానొకటి తలిస్తే…దేవుడొటి తలుస్తాడనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం.
గతంలో రైతులు సొంత ఖర్చులతో సిమెంట్ ఫోల్స్ ఏర్పాటు డబ్బులు లేక మధ్యలో నిలిపివేత
కల్వర్ట్ నిర్మించి పరిస్కారం చూపించండి-యువ రైతు నాగరాజు
పరకాల నేటిధాత్రి హన్మకొండ జిల్లా పరకాల మండలంలోని మల్లక్కపేట గ్రామంలో రైతులు వ్యవసాయ బావుల వద్దకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.గతంలో ఒక కిలోమీటర్ వరకు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రోడ్డు అధిక వర్షాల కారణంగా మట్టి కొట్టుకుపోయి గుంతలు ఏర్పడి వర్షాకాలం వచ్చిన వర్షంపడిన రోడ్డు గుంతల మయంగా మారడంతో గుంతల్లో నీరు చేరి కాలినడకన భూముల వద్దకు వెళ్లే రైతులకు పెద్ద సమస్యగా మారింది.మందు పిచికారీ చేసుకోవాలన్నా,ఎరువులు పంట పొలాలదగ్గరకు తీసుకుపోవాలన్నా రైతులకు పెద్ద చిక్కెదురవుతుంది.
ఒర్రె(పెద్ద కాలువ)దాటలంటే ఇబ్బంది పడాల్సిందే
గ్రామంలోని మహిళా రైతు కూలీలు వ్యవసాయ బావులదగ్గరకు వెళ్లాలంటే మార్గం మధ్యలో ఒర్రె (పెద్దకాలువను) దాటుకొని వెళ్లాల్సివస్తుందని వర్షాకాలంలో ఎక్కువగా ప్రవాహం పెరిగి ఒర్రెను దాతలంటే దాదాపు బుజాలవరకు నీరు వస్తున్నదని గతంలో ఉన్న నాయకులకు చెప్పిన ఎవ్వరు పట్టించుకోలేదని మహిళా కూలీలు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు.
గతంలో రైతులే సొంత ఖర్చుతో సిమెంట్ ఫోల్స్ ఏర్పాటు
వ్యవసాయ భూములు కలిగిన రైతులు భూముల దగ్గరికి వెళ్లే దారిలేక అందరు కలిసి తలకొన్ని డబ్బులు వేసుకొని సిమెంట్ ఫోల్స్ లను ఏర్పాటు చేసుకున్నామని డబ్బులు సరిపోక పని మధ్యలో ఆగిపోయిందని రైతులకు ఇబ్బంది అవ్వకుండా స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు మార్గం చూపించాలని రైతులు కోరుతున్నారు.
గతంలో ఉన్న నాయకులు చెప్పిన పట్టించుకోలేదు
దారిలేక ఇబ్బంది పడుతున్నామని మా ఇబ్బందులు పట్టించుకోమని గతంలో ఉన్న పాలకులకు నాయకులకు చెప్పిన ఎవ్వరు పట్టించుకోలేదని ఎప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే స్పందించి సమస్యకు పరిష్కారం చూపించాలని యువ రైతు అల్లం నాగరాజు కోరారు.
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంట గ్రామంలో గాజుల రాజయ్య ఇంటి పక్కన వర్షం నీరు నిలిచి పెద్ద గుంత ఏర్పడింది. గుంతలో రోజు పశువులు బోర్లడంతో నీరు దుర్వాసన వస్తు దోమలకు, ఈగలకు ఆవాసముగా ఏర్పడింది. దీనికి తోడు చుట్టుపక్కల నివసిస్తున్న వారు తీవ్ర జ్వరాలతో బాధపడుతున్నారు. గ్రామపంచాయతీ అధికారులు ఈ గుంతను పూడ్చి సమస్యను పరిష్కరించి గ్రామంలో ఇలాంటివి ఇంకెక్కడ ఉన్న గుర్తించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరుతున్నారు.
గ్రేటర్ వరంగల్ మహానగర పాలకసంస్థ 16వ డివిజన్ కార్పొరేటర్ సుంకరి మనిషా శివకుమార్ కట్టమల్లన్న దేవాలయం వద్ద బతుకమ్మ ఏర్పాటును పరిశీలించారు. బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సిబ్బందికి తెలియజేశారు. గరీబ్ నగర్,జాన్ పాక,కీర్తి నగర్, లేబర్ కాలనీ,గాంధీనగర్,మహిళలు బతుకమ్మ ఆడే ఆట స్థలంను మున్సిపల్ జెసిబిమరియు డోజర్ మరియు మున్సిపల్ సిబ్బంది చేత శుభ్రం చేయించడం జరిగింది. కార్పొరేటర్ సుంకరి మనీషా శివకుమార్ మాట్లాడుతూ బతుకమ్మ ఉత్సవాలకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడాలని సంబంధిత అధికారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కీర్తినగర్ బిఆర్ ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు గోరుకంటి లక్ష్మణ్ రావు,ప్రధాన కార్యదర్శి మెండు కమలాకర్,నాయకులు ఏం డి ఆరిఫ్, గాడ్దుల రాజు, చల్లా కుమార్ మున్సిపల్ జవాన్ రాజేష్,మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మండలంలోని చెల్లంపేట గ్రామానికి చెందిన జైనేని భీమక్క అనే 35సంవత్సరాల మహిళ ఆదివారం మధ్యాహ్నం తాగిన మైకంలో భర్తతో గొడవపడి ఇంట్లో సీలింగ్ ఫ్యానుకు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుని మరణించింది. మృతురాలి అదే గ్రామానికి చెందిన జైనేని రవి తో 20సంవత్సరాల క్రితం వివాహం కాగా పిల్లలు పుట్టలేదు. ఇద్దరు కూలి పని చేసుకొని బ్రతుకుతారు. ఇద్దరు రోజు అతిగా మద్యం సేవించి గోడవపడుతారని మృతురాలు తాగిన మైకంలో భర్తపై చేయి చేసుకుంటుందని స్థానికులు కుటుంబీకులు చెప్పారు. అదే క్రమంలో ఆదివారం ఉదయం నుండే ఇద్దరు తప్పతాగి గోడవపడటంతో పాటు మృతురాలు తన భర్తను కొట్టి రూమ్ లోకి వెళ్లి గడియ పెట్టుకొని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. మృతుని తమ్ముడు చేదం రాజన్న పిర్యాదు మేరకు ఎస్సై-2 రామయ్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
వనపర్తి నేటిధాత్రి ; వనపర్తి లో గంజి చాటకూలి కార్మికురాలు ఎశమొని.పద్మ 33వ వార్డులో రొట్టెలు తయారు చేయుటకు షెడ్డు నిర్మించుకొని ఉపాధి పొందుతుంది. విద్యుత్తు షాక్ వల్ల షెడ్డు దగ్ధమైంది. నిరు పేదరాలైన బాధితురాలి పరిస్థితిని మాజీ కౌన్సిలర్ ఉంగ్లమ్ తిరుమల్ మాజీ ఎంపి రావుల.చంద్రశేఖర్ రెడ్డి దృష్టికి తీసుకురాగా స్పందించిన రావుల ఆమెకు 5000రూపాయల ఆర్థిక సహాయం పంపినారని మీడియా సెల్ ఇంచార్జి నందిమల్ల అశోక్ ఒక ప్రకటన లో తెలిపారు ఈ కార్యక్రమంలో 33 వ వార్డు ప్రజలు రేణుబాబు,కడెం.శేఖర్,దండు.శ్రీనదండు.యాది,రమేష్ యాదవ్,వజ్రాల.రమేష్ పాల్గొన్నారు.
మొగులపల్లి నేటి ధాత్రి ఆంధ్రోళ్ల ఉచ్చులో తెలంగాణ ప్రజలు పడొద్దని..తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ పౌరులుగా మన అందరిపై ఉందని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు బండి రఘుపతి గౌడ్ అన్నారు. సోమవారం ఆయన మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో ఉన్న కొందరు సంకరజాతి..కచరాగాళ్ల అండతో అటవీ, పర్యావరణ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖమ్మపై ఆంధ్రోళ్లు చేస్తున్న దాడిని తెలంగాణ వాదులుగా ప్రతి ఒక్కరు ఖండించాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ కన్వెన్షన్ అక్రమ కట్టడాన్ని కూల్చివేయడంతో పగ సాధింపు చర్యల్లో భాగంగా ఆంధ్ర వలసవాదులు తెలంగాణ బహుజనుల ఆడబిడ్డయినటువంటి కొండా సురేఖమ్మపై ఆంధ్ర సినీ హీరోలాంత ముకుమ్మడిగా దాడి చేయడం వెనుక తెలంగాణలో చిల్లర బొల్లర గాళ్లు ఉన్నారని మండిపడ్డారు. ఆంధ్రలో మాజీ సీఎం చంద్రబాబు సతీమణిని ఉద్దేశించి అసెంబ్లీ సాక్షిగా నీచంగా తిట్టుకున్నప్పుడు ఈ ఆంధ్ర హీరోలంతా ఎక్కడున్నారని ఆయన ప్రశ్నించారు. సురేఖమ్మ ఎవరి భావాలనైనా నొప్పించినట్లయితే అన్న మాటలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించిన కూడా ఈ దాడి ఆగట్లేదు అంటే.. ఈ చిత్ర విచిత్రమైన పరిశ్రమతోటి తెలంగాణకు నష్టమే కానీ..అనా పైసా కూడా లాభం లేదని..అలాగే ఆ చిత్ర పరిశ్రమలో చెప్పుకో తగ్గట్లు ఎదిగిన హీరో తెలంగాణలో లేడని, ఈ అక్రమ మూకలు తెలంగాణ అస్తిత్వంపై చేస్తున్న దాడిని తీవ్రంగా వ్యతిరేకించి, ఈ ఆంధ్ర నటులకు బుద్ధి వచ్చేలా తెలంగాణ సమాజమంతా ఒకటవ్వాలని, వీళ్ళ చర్యలను తిప్పి కొట్టాలని, బడుగు, బలహీన వర్గాల ఆడపడుచుకు అండగా నిలవాలని, తెలంగాణ వాదాన్ని గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.