ఆ ఇద్దరు ఎంత ‘సంతోష’పెట్టారు?..ఈ నలుగురు ఏం పాపం చేశారు!?

https://epaper.netidhatri.com/view/405/netidhathri-e-paper-16th-october-2024%09

`ఆ నాలుగు రోహౌజ్‌లు ఎందుకు కూల్చారు!

`ఈ రెండిరటినీ కూల్చకుండ ఎందుకు ఆపారు?

`ఆ రెండిరటికి సమయమెందుకిచ్చారు!

`ఉన్నఫలంగా ఈ నలుగురిని ఎందుకు రోడ్డు మీద పడేశారు?

`ఆ ఇద్దరికెందుకు ఇంకా సమయమిస్తున్నారు.

`చిత్రపురి కూల్చి వేతల్లో కిరికిరిలెందుకు పెట్టారు.

`కూల్చివేతల్లో వ్యత్యాసం ఎందుకు చూపించారు.

`ఆ ఇద్దరి మీద వున్న మమకారం ఏమిటి?

`ఈ నలుగురి మీద లేని కనికరానికి కారణమేమిటి?

`ఆ మాజీ ఎమ్మెల్సీకి రో హౌజ్‌ ఎలా వచ్చింది.

`చిత్రపురిలో ఈ మతలబు ఏమిటి?

`చిత్రపురి సొసైటీలో బంధువుకు రోహౌజ్‌ కేటాయింపేమిటి?

`కూల్చివేతలో అ ఇద్దరికి మినహాయింపేమిటి?

`పదిహేను రోజుల గడువు దాటి పాతిక రోజులౌతోంది.

`ఆ రెండు కూల్చివేతలలో ఇంత కాలం జాప్యమేమిటి?

`సొసైటీ సెక్రటరీకి ఒక రూలు…ఆ నలుగురికి మరో రూలా?

`చిత్రపురిలో రాజకీయ నాయకుడికి రో హౌజ్‌ కేటాయింపేమిటి?

`బినామీ ఆస్థులు ఎంత కాలం దాస్తారు?

`నిబంధనలకు తూట్లెందుకు పొడుస్తున్నారు!

`ఆ రెండు కూల్చివేతలు ఆగడంలో అదృశ్య శక్తులెవరు?

`మణికొండ మున్సిపాలిటీని శాసిస్తున్నదెవరు?

`హైడ్రా తరహా కూల్చివేతలు జిల్లాల్లోనూ సాగుతున్నాయి!

`మణికొండ బుల్డోజర్లు ఆ రెండు రోహజ్‌ల వైపు ఎందుకు వెళ్లనంటున్నాయి?

హైదరాబాద్‌,నేటిధాత్రి:

తవ్వినా కొద్ది చిత్రపురి హౌజింగ్‌ సొసైటీలో చిత్ర విచిత్ర దోపిడీ విన్యాసాలు బైటపడుతూనే వున్నాయి. కళ్లు బైర్లు కమ్మే నిజాలు వెలుగు చూస్తూనేవున్నాయి. చిత్ర పురి అంశం కొత్తదికాదు. దానిలో వున్న అగాదాలకు అంతం లేదు. అంతు లేదు. ఇంతకాలం వెలుగులోకి రాని అనేక అంశాలు నేటిధాత్రి వెలుగులోకి తెస్తూనే వుంది. నేటిధాత్రి రాసిన వరుస కథనాలతో చిత్రపురిలో జరిగిన అనేక అవకతవకలు బైటపడుతూనే వున్నాయి. తాజాగా రోహౌజ్‌ల విషయంలో కూడా సరికొత్త అంశాలు కనిపిస్తున్నాయి. చిత్రపురిలో 225 రోహౌజ్‌లకు అనుమతులున్నాయి. కాని అవి కార్మికుల కన్నీటీ మీద నిర్మాణం చేసుకున్నవి. చట్టపరమైన అనుమతులున్నాయని చెప్పుకున్నా, కార్మికుల కష్టం దోచుకున్న పాపుల పాపాలకు సాక్ష్యాలు. అయితే 225 రోహౌజ్‌లతోపాటు ఓ ఆరు రోహౌజ్‌లు అదనంగా నిర్మాణం చేశారు. 225 రో హౌజ్‌లకు పర్మిషన్లు వున్నాయంటున్నారు. కాని మరో ఆరు రో హౌజ్‌లకు ఎలాంటి అనుమతులు అసలే లేవు. అక్కడ ఆ కట్టడాలకు ఎలాంటి అవకాశం లేదు. కాని నిర్మాణాలు చేశారు. రోహౌజ్‌లను నిర్మాణం చేసుకున్నారు. ఈ విషయాన్ని నేటిదాత్రి వెలుగులోకి ఎప్పుడో తెచ్చింది. దాంతో మణికొండ మున్సిపాలిటీ రంగంలోకి దిగింది. ఆరు రోహౌజ్‌ల కూల్చివేతకు రంగం సిద్దం చేసింది. కాని నాలుగు రో హౌస్‌లు మాత్రమే కూల్చి వేసింది. మరో రెండు రో హౌస్‌లను కూల్చివేయలేదు. ఆ రెండు ఎవరివని నేటిధాత్రి ఆరా తీస్తే అసలు విషయాలు వెలుగు చూశాయి. ఈ విషయాన్ని గతంలోనే మున్సిపాలిటీ టౌన్‌ ప్లానింగ్‌ అదికారిని నేటిదాత్రి ప్రశ్నించడం జరిగింది. ఆ నలుగురు చేసిన పాపం ఏమిటి? కూల్చని ఇద్దరు చేసిన పుణ్యం ఏమిటని నిలదీయడం జరిగింది. కొంత సమయం కావాలని ఆ రెండు రో హౌజ్‌లకు చెందిన యజమానులు కోరడంతో కనికరించామని చెప్పారు. అయితే ఎంతకాలం తర్వాత కూల్చివేతలు జరగొచ్చన్నదానిపై కూడా స్పష్టత కోరడం జరిగింది. ఓ పది హేను రోజుల సమయం ఇచ్చేందుకు అంగీకరించినట్లు అదికారులు చెప్పారు. కాని ఆ పదిహేను రోజుల సమయం ఎప్పుడో పూర్తయింది. అదనంగా మరో పాతిక రోజులు కూడా పూర్తవుతోంది. కాని రెండు రోహౌజ్‌ల జోలికి ఇంకా వెళ్లడంలేదు. కారణమేమిటని ఆరాతీస్తే ఒక రోహౌజ్‌ గత ప్రభుత్వంలో కీలకమైన నాయకుడుగా తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమం పేరుతో నాయకుడైన ఆ నాయకుడు బిఆర్‌ఎస్‌ పార్టీకి అధికార ప్రతినిధిగా కొనసాగుతూ వుండేవారు. ఉద్యమ సమయంలో ఒంటికాలిపై లేస్తూ కాంగ్రెస్‌, బిజేపి, తెలుగుదేశం పార్టీలను ఉతికి ఆరేస్తుండేవారు. ఎప్పుడూ టివి చర్చల్లో ఎక్కువగా కనిపిస్తూ వుండేవారు. తెలంగాణపై కార్యాచరణలో కొంత దూకుడుగా కనిపించేవారు. అలా టివిలలో కనిపించిన నాయకుడు వక్త మాత్రమే. ఆయనకు సినీ రంగంలో ఎలాంటి సంబంధం లేదు. కనీసం టెలివిజన్‌ రంగంతో కూడా అనుబంధం లేదు. నటుడు అసలే కాదు. కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే. తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన నోరేసుకొని సినిమా వాళ్లను బెదిరించిన సందర్భాలు అనేకం వున్నాయి. తర్వాత కాలంలో ఆయన ఎమ్మెల్సీ కూడా అయ్యారు. ఐదేళ్లలో సంపన్నుడయ్యారు. అలాగే చిత్రపురిలో కూడా వేలు పెట్టాడు. ఏం చేస్తారో నాకు తెలియదు..నాకు ఒక రోహౌజ్‌ కావాలన్నాడు. అంతే చిత్ర పురి హౌజింగ్‌ సొసైటీలో అనధికారికంగా రోహౌజ్‌ నిర్మాణం చేసి ఆ నాయకుడికి ఇచ్చేశారు. కాని ఇంత కాలం వరకు ఆ రోహౌజ్‌ ఆ నాయకుడికి అన్న సంగతి లోకానికి తెలియకుండా మేనేజ్‌ చేశాడు. బినామీ పేరు మీద ఇల్లు రాయించుకున్నాడు. ఆ బినామీ కూడా ఎవరని నేటిదాత్రి ఆరా త తీసింది. బిఆర్‌ఎస్‌ నాయకుడికి బావమర్ధిపేరు మీద వుందన్న సంగతి తెలిసింది. తన పేరు బైటకు రాకుండా రోహౌజ్‌ను తన బావమర్ధి పేరన లాభం పొందారు. అక్రమంగా నిర్మాణం చేసిన రోహౌజ్‌లను మున్సిపాలిటీ కూల్చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆరు రోహౌజ్‌లలో నాలుగు కూల్చేశారు. కాని మిగిలిన రెండు రోహౌజ్‌లను ముట్టుకోవడానికి అదికారులు వెనకుడుగు వేస్తున్నారా? లేక భయపడుతున్నారా? అదీ కాకుండా ఆ రెండు రోహౌజ్‌ల పెద్దలు టైన్‌ ప్లానింగ్‌ను సంతోషపెట్టారా? అన్న చర్చ మొదలైంది. ఒక రో హౌజ్‌ బిఆర్‌ఎస్‌ నాయకుడి కాగా మరో కూల్చని రోహౌజ్‌ ఒక దొరదంటున్నారు. ఆయన చిత్రపురి సొసైటీకి సెక్రెటరీగా కొనసాగుతున్నారని తెలుస్తోంది. సెక్రెటరీ కావడంతోనే దొర రోహౌజ్‌ కూల్చివేత ఆగింది. ఇక్కడ కూడా రోహౌజ్‌ నిర్మాణంలో బంధుత్వమే కీలక భూమిక పోషించిందని తెలుస్తోంది. చిత్రపురి సొసైటీకి చెందని అతి కీలకమైన వ్యక్తికి దొర సమీప బంధువే కావడం గమనార్హం. అంటే సినీపెద్దల బంధుగణమే కాదు, సొసైటీ పెద్దల బంధువులు కూడా ఆవాసాలు అక్రమంగా నిర్మాణాలు సాగించుకున్నారు. దొంగలు దొంగలు కలిసి ఊర్లు దోచుకున్నట్లు చిత్రపురి భూమిని బకాసులై పంచుకున్నారు. ఈ రెండు రోహౌజ్‌ల కూల్చివేత ఆగిపోవడానికి ఎంతకు మేనేజ్‌ చేసుకున్నాడన్నదే తెలియాల్సివుంది. కూల్చివేతల్లో ఎక్కడైన అదికారులు లాలూచీ పడితే సహించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరిక కూడా చేశారు. అది ఆ హెచ్చరిక కేవలం హైడ్రాకే వర్తిస్తుందని అదికారులు అనుకున్నారో ఏమో కాని ఆ రెండు రో హౌజ్‌లను కూల్చివేయకుండా ఆపేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలు హైడ్రా పరిధి కట్టడాలకు మాత్రమే అని నిర్ధారించుకున్నారో ఏమోగాని మణికొండ మున్సిపల్‌ అదికారులు ఆ రెండు రో హౌజ్‌ల మీదకు బుల్లోజర్లు తీసుకెళ్లడానికి ముందూ వెనకు ఆలోచిస్తున్నారు. ఒక వేళ ఆ రెంటిపైకి వెళ్తే తమ బండారం ఎక్కడ బైట పడుతుందో అని టౌన్‌ ప్లానింగ్‌ అదికారి వెనుకడుగు వేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాలుగు రోహౌజ్‌లను కూల్చివేసినా వాటి యజమానులు బైటకు రాలేదు. తమకు అన్యాయం జరిగిందని చెప్పుకోలేకపోయారు. కాని ఈ రెండు రోహౌజ్‌లు కూల్చే శక్తి సంబంధిత అదికారికి లేకుండా పోవడానికి కారణం ఆ ఇద్దరూ పవర్‌ పుల్‌ కావడంతో ఆగిపోయిందన్న మాటలు వినిపిస్తున్నాయి. ఈ విమర్శలపై టౌన్‌ ప్లానింగ్‌ అదికారి సమాదానం చెబుతారా? లేక మౌనం వహిస్తారా? కూల్చివేతలకు సిద్దమౌతారా? అన్నది తేలాల్సివుంది. కారణం ఏదైనా ఆ రెండు రోహౌజ్‌లు అక్రమమే. వాటి కూల్చివేత సక్రమమే. అయినా వెనుకుడుగు అన్నది ఎందుకు పడుతుందన్నదానిపై స్పష్టత రావాల్సివుంది. వాటిని కూల్చివేయాల్సిన అవసరం వుంది. చిత్రపురిలో అసలు రోహౌజ్‌ల నిర్మాణమే ఒక అన్యాయం. అక్రమం. ఒక రకంగాచెప్పాలంటే దుర్మార్గం. కార్మికుల కోసం ప్రభుత్వం ఎంతో ఉదారంగా భూమిని కేటాయిస్తే అందులో రాబందులు దూరిపోయాయి. కనీసం కార్మికుల కోసం నిర్మాణం జరిగిన అప్పార్టుమెంట్లలో న్యాయం జరగలేదు. అనుయాకులు, అనుచరల పేరు మీద ప్లాట్లు దక్కించుకున్నవారు దక్కించుకున్నారు. పదిహేనేళ్ల క్రితం వున్న సభ్యులకే సరిగ్గా అక్కడ దిక్కులేదు. ఇంకా రెండు ట్విన్‌ టవర్స్‌ నిర్మాణం చేస్తామంటున్నారు. అవి మొదలయ్యేదో…ఎప్పుడు పూర్తయ్యేదో…కార్మికులకు న్యాయం జరిగేదెంతో తెలియని అయోమయ పరిస్దితి. అదలా వుంటే సినీ పెద్దలు గద్దలై వాలి ఓ పద్నాలుగు ఎకరాలు ఆక్రమించుకున్నారు. వాటిలో అక్రమంగానే ఇల్లు నిర్మాణం చేసుకున్నారు. ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందన్న కారణంతో నిర్మాణాలు జరిగినా అవి సక్రమమేం కాదు. కార్మికులు భూమిని లాక్కొని రోహౌజ్‌లు నిర్మాణం చేసుకోవడం ఎవరికీ సమ్మతం కాదు. కాని నోరులేని కార్మికులు అన్యాయాన్ని భరించారు. అక్రమాలను చూస్తూ ఊరుకున్నారు. ఇక్కడ గోల చేస్తే సినిమాల్లో అవకాశాలు రావని భయపడ్డారు. కూలీ దొరక్కపోతే కడుపు మాడుతుదంని నోరు మూసుకున్నారు. కార్మికుల బలహీనత సినీ పెద్దలకు వరమైపోయింది. కార్మికులకు శాపంగా పరిణమించింది. ఓ వైపు కార్మికుల ఉసురు పోసుకుంటూనే మరో వైపు చిత్రపురిని రాబంధుల రాజ్యం చేసుకొని దోచుకున్నారు. రోహౌజ్‌ల పేరుతో కోట్ల స్ధిరాస్ధులను ఆక్రమించుకున్నారు. రాబంధులకన్నా మేమేం తక్కువ అని నిరూపించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *