మృతుల కుటుంబాలకు బిఅర్ఎస్ నాయకుల పరామర్శ.

చిట్యాల,నేటిధాత్రి :

చిట్యాల మండల కేంద్రానికి చెందిన కోడేల అశోక్ ,శ్రీను గార్ల తండ్రి కోడెల నర్సయ్య గారు అనారోగ్యముతో బాధపడుతూ ఇటివలే
మృతి చెందారు వారి కుటుంబ సభ్యులను మాజీ జెడ్పిటిసి గొర్రె సాగర్ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అల్లం రవీందర్ బిఅర్ఎస్ నాయకులతో కలిసి మంగళవారం రోజున కుటుంబాన్ని పరామర్శించి వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అనంతరం ముచినిపర్తి గ్రామానికి చెందిన కందికొండ పోచయ్య సదయ్య గార్ల తండ్రి జంగలయ్య మరణించగా వారి ప్రార్థివ దేహానికీ నివాళులు అర్పించి వారి కుటుంబాన్ని ఆర్థిక సాయం అందజేసి వారి అంతిమయాత్రలో పాల్గొన్నారు,వారి వెంట బిఆర్ఎస్ మండల నాయకులు పిట్ట సురేష్ బాబు .ఏరుకొండా రాజేందర్ గౌడ్దామెర రాజు, ఇంగిలి నరసింగరావు, దామెర సాంబయ్య,నోముల నాగరాజు. చిన్నల వెంకన్న ,అన్నారపు రమణ,సముద్రాల కొమురయ్య,కంకల రాజకొమురు తదితరులు నివాళులు అర్పించారు

కుల సమగ్ర సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలి.

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

చిట్యాల, నేటిధాత్రి :
మంగళవారం చిట్యాల మండలం, నైనిపాక బీసీ కాలనీలో జరుగుతున్న సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ మరియు కుల సమగ్ర సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వే ఫారంను పరిశీలించారు. ఎలాంటి పొరపాటుకు తావులేకుండా తావు లేకుండా కుటుంబాల సమగ్ర సమాచారం నమోదులు చేయాలని సూచించారు. ఈ గ్రామ పరిధిలో 790 గృహాలున్నాయని, వీటిని 5 ఎన్యూమరేషన్ బ్లాకులుగా విభజించి సర్వే చేసేందుకు ఐదుగురు సిబ్బందిని నియమించినట్లు పేర్కొన్నారు. ప్రతి రోజు కనీసం 20 ఇండ్లకు తగ్గకుండా సర్వే చేయాలని సూచించడమేకాక, సర్వేలో వేగాన్ని పెంచాలని సూచించారు. సర్వే మెటీరియల్‌ను అత్యంత జాగ్రత్తగా భద్రపరచాలని ఆదేశించారు. సర్వే డేటా ఎంట్రీ కోసం ఆపరేటర్లను నియమించాల్సిందిగా ఆయన సూచించారు. సర్వే ప్రక్రియ పరిశీలించిన కలెక్టర్ కార్యదర్శి విష్ణు వర్ధన్ ను అభినందించారు. ఇదే ఉత్సాహంతో కేటాయించిన అన్ని ఇండ్లను పకడ్బందీగా సర్వే చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, తహసిల్దార్ హేమ, ఎంపీడీవో జయశ్రీ, ఎంపీఓ రామకృష్ణ, కార్యదర్శి విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

గత 25 సంవత్సరాలుగా ఎస్టీ బోగస్ కుల దృవీకరణ పత్రంతో లబ్ధి పొందిన గీదా కోదండ రామయ్య పై ప్రభుత్వం చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందే.

భద్రాచలం నేటి ధాత్రి

(Jac) చైర్మన్ పాయం

మంగళవారం నాడు చర్ల మండల కేంద్రం భద్రాద్రి డిగ్రీ కళాశాలలో ఆదివాసి సంఘాల సమన్వయ కమిటీ జేఏసీ సభ్యుల సమావేశం జరిగినది
ఈ యొక్క సమావేశంలో జాక్ చైర్మన్ పాయం సత్యనారాయణ మాట్లాడుతూ చర్ల మండల కేంద్రానికి చెందిన గీద కోదండ రామయ్య 1988 సంవత్సరంలో స్కూల్ రికార్డును టాపరింగ్ చేసి ఎస్ టి గా నమోదు చేయించి మూడుసార్లు సర్పంచ్ గా పోటీ చేసి గెలిచి మరియు రెండుసార్లు ఎంపీపీగా ఎన్నికై ప్రభుత్వాలను మోసం చేస్తూ పదవిని అడ్డుపెట్టుకొని అనేక రాజకీయ పదవులు ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధి పొందుతూ రాజా లాగా రాజభోగాలు అనుభవించిన సదరు వ్యక్తిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు
షెడ్యూల్ ప్రాంతాలలో విచ్చలవిడిగా రెవెన్యూ అధికారులు కొంతమంది గిరిజ నేతరులకు ఎస్టీ బోగస్ సర్టిఫికెట్లు మంజూరు చేస్తున్నారని అన్నారు హెల్త్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కూడా బోగస్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు అనుభవిస్తున్న వారు పై కూడా చర్యలు తీసుకోవాలని ఈ యొక్క కార్యక్రమంలో నాయక పోడు సేవా సమితి సంఘం రాష్ట్ర కార్యదర్శి పున్నం రామకృష్ణ సీనియర్ ఆదివాసి నాయకులు మాజీ ఎంపీపీ గొంది ముయ్యన్న. సీనియర్ ఆదివాసి కుల పెద్ద సున్నం సుబ్బయ్య తుడుందెబ్బ డివిజన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ తాటి లక్ష్మణరావు. ఆదివాసి గిరిజన విద్యార్థి జేఏసీ రాష్ట్ర నాయకులు ఈర్ప ప్రకాష్ నీలం రమణయ్య పూజారి ఆదినారాయణ కుల పెద్ద పూజారి కొండబాబు జిఎస్ పి వర్కింగ్ ప్రెసిడెంట్ పూనెం వరప్రసాద్ గొంది లీలా ప్రసాద్ యాక న బ్రోరసింహారావు పాయం సన్యాసి తోలం రామకృష్ణ. ఇ ఇర్ప శరత్,కోరం. బిట్టు, కణితి. భానుప్రకష్, తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు

జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఇతర అధికారులపై దాడినీ ఖండిస్తున్నాం

భూపాలపల్లి నేటిధాత్రి

వికారాబాద్ జిల్లా, లగచర్లలో
ఔషధ పరిశ్రమ ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఇతర అధికారులపై దాడి చేయడం పనికిమాలిన చర్య అని కలెక్టరేట్ పరిపాలన అధికారి ఖాజా మోహినుద్దీన్ అన్నారు.
సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్, అధికారులపై జరిగిన దాడికి నిరసనగా
మంగళవారం ఐడిఓసి కార్యాలయం ముందు రెవెన్యూ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలెక్టర్లు కానీ అధికారులు కాని ప్రభుత్వం అమలు చేయనున్న పథకాల విధి విధానాలు, మార్గదర్శకాల మేరకు పని చేసే ఉద్యోగులు మాత్రమేమని, జనం లేరని ఎక్కడో ఉన్నారని చెప్తే వెళ్లిన కలెక్టర్ సిబ్బంది పై దాడి చేయడం చాలా చాలా దారుణమన్నారు. వివిధ అభివృద్ది కార్యక్రమాలకు, ప్రాజెక్టులు, పరిశ్రమల నిర్మాణానికి ప్రభుత్వం భూ సేకరణ చట్టం ద్వారా ప్రజల నుండి భూములను సేకరణ చేస్తుందని తెలిపారు. ఔషధ పరిశ్రమ ఏర్పాటుకు వెళ్లిన జిల్లా కలెక్టర్, ఇతర అధికారులపై దాడికి పాల్పడిన వారిపై పోలీస్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
భవిష్యత్ లో మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరుగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, అధికారులకు రక్షణ కల్పించాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో రెవిన్యూ ఉద్యోగుల సంగం అధ్యక్షుడు రామ్ మోహన్, షఫీ, రజాక్, తహసీల్దార్. మురళి, ఈడిఎం శ్రీకాంత్, నాల్గవ తరగతి ఉద్యోగుల సంగం అధ్యక్షులు బండారి శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.

రోటరీ క్లబ్ ఆఫ్ కోకాపేట్ ఏకం మరియు రోటరీ క్లబ్ ఆఫ్ భద్రాచలం ఆధ్వర్యంలో స్కూల్ బెంచీలు పంపిణీ

భద్రాచలం నేటి ధాత్రి

ఈరోజు స్థానిక నన్నపనేని మోహన్ హైస్కూల్ నందు రోటరీ క్లబ్ ఆఫ్ కోకాపేట్ ఏకం మరియు రోటరీ క్లబ్ భద్రాచలం సంయుక్తంగా నూజివీడు సీడ్స్ వారి ఆర్థిక సౌజన్యంతో స్కూలు విద్యార్థులకు సుమారు 2,50,000/- విలువచేసే స్కూల్ బెంచీలను అందించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు ముఖ్యఅతిథిగా హాజరవడం జరిగింది వితిష్ట అతిథిగా ఎంఈఓ రమాదేవి స్కూల్ హెడ్మాస్టర్ పులిపాటి రామకృష్ణ అదేవిధంగా నూజివీడు సీడ్స్ సేల్స్ హెడ్ కృష్ణ కిలారు హాజరయ్యారు.

రోటరీ క్లబ్ ఆఫ్ భద్రాచలం అధ్యక్షుడు దార బాలాజీ మాట్లాడుతూ భద్రాచలం రోటరీ క్లబ్ మరియు రోటరీ క్లబ్ ఆఫ్ కోకపేట్ ఏకం వారు సంయుక్తంగా ఈ కార్యక్రమం చేయటం జరిగింది అని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి విద్యాసాగర్, కోశాధికారి శ్రీనివాస్, పూర్వ అధ్యక్షులు ప్రభాకర్ గుప్త ,రఫీ, మధుసూదన్ రావు, నాగేశ్వర రావు ,వీరయ్య, చైతన్య రెడ్డి ,వైస్ ప్రెసిడెంట్ అజీమ్, సబ్యులు చలపతి, శ్రీధర్ రెడ్డి,, బందు నరసింహ రావు, ఎల్. వెంకటేశ్వర్లు, రామకృష్ణ ,
ఇన్నర్ విల్ సభ్యులు దారా నలిని నూకల రజని అదేవిధంగా స్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

రైతులకు ఆయిల్ ఫామ్ సాగుపై శిక్షణా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర

భూపాలపల్లి నేటిధాత్రి

పరకాల పట్టణ కేంద్రంలోని జి ఎమ్ ఆర్ గార్డెన్స్ నందు ఉద్యాన వన & పట్టు పరిశ్రమల శాఖ సువెన్ ఆగ్రో ఇండస్ట్రీస్ కంపెనీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతులకు ఆయిల్ ఫామ్ పంటపై శిక్షణా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి ఫామ్ ఎలైట్ కంపెనీ ప్రతినిధులు నికోలస్, శ్రీవిజయన్ ఆయిల్ ఫామ్ సాగులో అపార అనుభవం కలిగిన సీనియర్ కన్సల్టెంట్ రంగనాయకులు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ త్రివేణి, లీడ్ బ్యాంక్ మేనేజర్ తిరుపతి,హార్టికల్చర్ అధికారి సునీల్ మరియు సువెన్ ఆగ్రో ఇండస్ట్రీస్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గండ్ర గౌతమ్ రెడ్డి మరియు భూపాలపల్లి జిల్లా రైతులు, ఎక్స్టెన్షన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు…

ఈ కార్యక్రమంలో గండ్ర గౌతమ్ రెడ్డి గారు మాట్లాడుతూ…

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వరి, మిర్చి,పత్తి పంటలకు ప్రత్యామ్నాయ పంటగా ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహిస్తున్న తరుణంలో భూపాలపల్లి జిల్లాలో రైతులకు ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన కల్పించడం కొరకు అశ్వారావుపేట లోని ఆయిల్ ఫామ్ తోటలు,ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని దాదాపు 300 మంది రైతులతో కలిసి వీక్షించడం, పరీక్షించడం జరిగింది.

గత వ్యవసాయ శాఖ మంత్రి మరియు మా నాన్న గారి ప్రోత్సాహంతో మన జిల్లాల్లో మన రైతులకు మనమే ఆయిల్ ఫామ్ మొక్కలు ఇచ్చి, పంట సాగుకు కావాల్సిన మేలుకువలు రైతులకు ఇస్తూ వారికి మంచి దిగుబడి,స్థిర ఆదాయం వచ్చేలా చేద్దాం ఈ రంగంలోకి రావడం జరిగింది.

మనల్ని నమ్ముకున్న రైతులకు నష్టం కలగకుండా ప్రతి మండలానికి ఒక్క ఎక్స్టెన్షన్ అధికారిని నియమించి, రైతులకు ఆయిల్ ఫామ్ సాగు పై సలహాలు సూచనలు అదించడం జరుగుతుంది.
అదే విధముగా ఈ ఎక్సటెన్షన్ అధికారులు సరిగా పని చేస్తున్నారా లేదా తెలుసుకోవడం కొరకు 4 టెలికాలర్లను నియమించి వారి ద్వారా రైతులకు మరింత అందుబాటులో సువెన్ ఆగ్రో ఇండస్ట్రీస్ సేవలు అందిస్తుంది.
రైతులకు కొన్ని సందేహాలు ఉన్నాయి ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నాం,మరి ఈ పంటను ఎక్కడ అమ్మాలి,ఎవరు కొంటారు అనే సందేహం ఉంది
అనుమానం ఏమి వద్దు ఈ మొదటి సంవత్సరం 350 ఎకరాల్లో పంట దిగుబడి వచ్చింది, వచ్చే సంవత్సరం 2500 ఎకరాల్లో పంట దిగుబడి వస్తుంది.
చిట్యాల, నైన్ పాక గ్రామంలో సువెన్ ఆగ్రో ఇండస్ట్రీ కంపెనీ 2025 అక్టోబర్ వరకు పూర్తి చేసుకోబోతున్నాం,అప్పటి వరకు ప్రతి మండలంలో ఆయిల్ ఫామ్ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు కంపెనీనే ప్రతి ఆయిల్ ఫామ్ గింజను కొనుగోలు చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ
కేంద్ర ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగు పై జి.ఓ పాస్ చేసినప్పుడు వెంటనే స్పందించిన ప్రభుత్వం నాటి కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తో వెంటనే ఈ ఆయిల్ ఫామ్ సాగు మన రాష్ట్రంలో ఇంట్రడక్షన్ చేయాలి, ఈ పంట ద్వారా అధిక లాభాలు ఉన్నాయని తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగు చేపట్టడం జరిగింది..
ఈ సంవత్సరం 350 ఎకరాల పంట దిగుబడి వచ్చింది.
మరి మొన్న జరిగిన ఎన్నికల్లో నేను ఓడిపోవడం దానితో పాటు ప్రభుత్వం కూడా మారడంతో రైతుల్లో కొన్ని అనుమానాలు మొదలయ్యాయి.
పంట ఎక్కడ అమ్మాలి,ఎవరికి అమ్మాలి అనే అనుమానం ఉంది.
ఎవరికీ అనుమానం వద్దు మీ ఆయిల్ ఫామ్ పంట సువెన్ ఆగ్రో కంపనీనే ప్రతి మండలం లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఆయిల్ ఫామ్ పంటను కొంటుంది అని రైతులకు భరోసా ఇచ్చారు.
అదే విధంగా ఆయిల్ ఫామ్ పంటలో అంతర పంటగా కోకో సార్ గంధం,అగార్ ఉడ్,అవకాడో మంచి ధర కలిగిన మంచి లాభాలు ఇచ్చే పంటలను సాగు చేయవచ్చని నేను కూడా పరకాలలో సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ పద్దతిలో సేద్యం చేస్తున్న అని తెలిపారు
సుభాష్ పాలేకర్ వ్యవసాయ పద్దతిలో తక్కువ భూమిలో ఎక్కువ అంతర్గత పంటలు వేసి అధిక లాభాలు రైతులు పొందవచ్చని సలహా ఇచ్చారు.
ఆయిల్ ఫామ్ పంట స్థిర ఆదాయం ఇచ్చే పంట అని అన్నారు.
బ్యాంకర్స్ తో మాట్లాడి రైతులకు కావాల్సిన ఋణాలు ఇప్పించడమే కాకుండా మీ ఋణాలు కూడా మేమే బ్యాంక్ వారికి సకాలంలో కడతామని తెలిపారు.

నిజాయితీ చాటుకున్న సింగరేణి సివిల్ కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులు

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

మందమర్రి ఏరియా లోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల ఆర్ కే సి ఓ ఏ క్లబ్ ఎదురుగా ఉన్న స్పెషల్ ఏ -17 క్వార్టర్ లో నివాసముంటున్న సింగరేణి అధికారి జయంత్ కుమార్ ఎస్ ఆర్ పి లో ఉన్న ఓపెన్ కాస్ట్ గనిలో అడిషనల్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నారు, మంగళవారం ఉదయం బి – జోన్ సివిక్ మెయింటెనెన్స్ లో భాగంగా తన ఇంటికి చెత్త తీసుకో వెళ్లడానికి వచ్చిన ట్రై సైకిల్ లో చెత్తను వేయడం జరిగింది, పారవేసిన చెత్తలో సుమారు 40000 రూపాయలు విలువ గల 5 గ్రాముల బంగారు ఉంగరం పోయింది ఇట్టి విషయం గ్రహించిన సదరు అధికారి సివిల్ సూపర్వైజర్ సదానందం కి ఫోన్ చేసి జరిగిన విషయం తెలియజేశారు, ఆయన వెంటనే స్పందించి చెత్త బండి కార్మికుడైన ఫతకాల శాంత్ కుమార్, ఇతర మహిళా కార్మికులు చెత్తను పారవేసిన డంపు యార్డ్ కాడ గంటసేపు చేత్త లో వెతకగా దొరికిన ఆ ఉంగరాన్ని అధికారి కుటుంబానికి అప్పగించి తమ ఉదార స్వభావాన్ని చాటుకున్నారు, తమ పోగొట్టుకున్న ఉంగరాన్ని వెతికి అప్పగించిన బి జోన్ పారిశుద్ధ కార్మికుల్ని వారి సూపర్వైజర్ నీ ఆ అధికారి కృతజ్ఞతలు తెలియజేశారు

పోలీసు లకు కిట్ ఆర్టికల్ పంపిణి చేసిన జిల్లా ఎస్పీ

వనపర్తి నేటిధాత్రి
మంగళవారం వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రావుల గిరిధర్ జిల్లాపోలీసులకు కిట్ ఆర్టికల్ పంపిణిచేశారు.
ఈసందర్బంగాఎస్పీరావుల గిరిధర్ మాట్లాడుతూ పోలీసులు చలికి వర్షం ఎండా కాలాల్లో విధులు నిర్వహించేపరిస్థితులుఉంటాయన్నారు పోలీసులకుఇబ్బందులు కలగకుండాచూసుకోవాల్సిన బాధ్యతకూడాతమపై ఉంటుందనిఅందుకొరకు శీతాకాలంను దృష్టిలో ఉంచుకొని ‘వులెన్ బ్లాంకెట్స్ ముస్కీటోనెట్, టి షర్ట్స్,లు సిబ్బందికి పంపిణీ చేశామనిఎస్పీ తెలిపారు.క్షేత్ర స్థాయిలోపనిచేసే పోలీసు సిబ్బంది సంక్షేమానికి తాము అత్యంత ప్రాధాన్యత నిస్తామని, ప్రతి ఉద్యోగి వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు కుటుంబ సభ్యుల ఆరోగ్యంపట్లకూడాప్రత్యేకశ్రద్ధ వహించాలనిఎస్పీ సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ,రాందాస్ తేజావత్, వనపర్తి డిఎస్పీ, వెంకటేశ్వరావు, సైబర్ క్రైమ్ డిఎస్పి, రత్నం, సాయుధల రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, శ్రీనివాస్, అప్పలనాయుడు, వనపర్తి సీఐ, కృష్ణ,కొత్తకోట సిఐ రాంబాబు, ఆత్మకూర్ సిఐ, శివకుమార్ , స్టోర్ ఇంచార్జ్,సుదర సిబ్బంది పాల్గొన్నారు.

మహిళల భద్రతే షీ టీం లక్ష్యం జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే

భూపాలపల్లి నేటిధాత్రి

మహిళలు, యువతులు ఎలాంటి సమస్యలు ఉన్నా నిర్భయంగా పోలీసులను సంప్రదించవచ్చునని, మహిళల భద్రత కోసమే షీ టీంలు పనిచేస్తున్నాయని, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ శ్రీ కిరణ్ ఖరే అన్నారు. మంగళవారం
జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం షి టీం, పోస్టర్లను ఎస్పి గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పి కిరణ్ ఖరే గారు మాట్లాడుతూ మహిళలు, చిన్న పిల్లల రక్షణ విషయంలో జిల్లా పోలీస్‌ శాఖ పటిష్ట చర్యలు తీసు కుంటున్నట్లు తెలిపారు. మహిళలు సామాజిక మాధ్యమాల విషయంలో జాగ్రత్త గా ఉండాలన్నారు. ఆకతాయిలు మహిళలను, విధ్యార్ధినిలను వేధింపులకు గురిచేస్తే చట్ట పరంగా కఠిన చర్యలు తప్పవని, ఈవ్‌టీజింగ్‌కు గురైతే షీటీం వెంటనే స్పందిస్తుందని, మహిళలు, విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తే షీటీం నంబరు 87126 58162 కు కాల్‌ చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ రమేష్, షీటీం ఎస్ఐ ఫజల్ ఖాన్, ఉమెన్ హెడ్ కానిస్టేబుల్ దేవేంద్ర, శిరీష కానిస్టేబుల్, ఇర్ఫాన్ పాల్గొన్నారు.

ఏడో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

నర్సంపేట,నేటిధాత్రి :

నర్సంపేట పట్టణంలోని హరిజనవాడ ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 1991-92 సంవత్సరంలో ఏడో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు మంగళవారం పట్టణంలోని రాజరాజేశ్వర ఫంక్షన్ హాల్ లో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా పూర్వ విద్యార్థులు చిన్ననాటి జ్ఞాపకాలను ఉపాధ్యాయులతో తోటి మిత్రులతో గుర్తుచేసుకొని ఆనందాన్ని వ్యక్తం చేశారు. నాడు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించుకున్నారు. ఉపాధ్యాయులు సురేందర్, సాంబయ్య, కమల, సరోజినీ దేవి, రెహమాన్, కర్ణకుమారి, రజాక్, పూర్వ విద్యార్థులు ఆగారపు స్వామి, శ్యామ్, కృష్ణ, యాకయ్య, ప్రవీణ్, నగేష్, అశోక్, శ్రీధర్, రవి, రవీందర్, రాజేందర్, శంకర్, కందుల అరుణ, యశోద, కవిత, ఉమా, సరిత, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

రైతులు ధాన్యం విక్రయాల్లో నాణ్యత పాటించాలి

అదనపు కలెక్టర్ అశోక్ కుమార్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి. మండల పరిధిలోని గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలతో పాటు ఇసిపేట
పీఏసీఎస్‌ గోడౌన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ధాన్యం కొనుగోలు ప్రక్రియ, రైతులకు అందిస్తున్న సదుపాయాలు, గోడౌన్‌లో గన్ని సంచులు పరిశీలించారు. ధాన్యం విక్రయ కేంద్రాల్లో రైతుల సమస్యలు తెలుసుకొని, వాటికి తగిన పరిష్కారాలు చూపేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులు దాన్యం విక్రయాల్లో నాణ్యత పాటించాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి రైతులకు సకాలంలో చెల్లింపులు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన దాన్యం తేమశాతాన్ని పరిశీలించారు.
రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన రైతులకు సూచించారు. దళారులను ఆశ్రయించి తక్కువ ధరకు విక్రయాలు చేయొద్దని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో మంచినీరు, నీడ కొరకు షామియానాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనాధ్,
డీఎం రాములు, డీసీఓ వాలియా నాయక్, తహశీల్దార్‌ సునీత తదితరులు పాల్గొన్నారు.

వచ్చే నెలలో నిర్వహించే నియోజకవర్గ పాదయాత్రను విజయవంతం చేయండి

జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ళపెల్లి శ్రీనివాస్ గౌడ్

కరీంనగర్, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రామడుగు మండల శాఖ అధ్యక్షులు ఒంటెల కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ళపెళ్లి శ్రీనివాస్ గౌడ్ హాజరై మాట్లాడుతూ ప్రతి బూత్ లో రెండు వందలకు పైగా సభ్యత్వాలు నమోదు చేయాలని, పూర్తి కానీ బూత్ లలో రెండు రోజుల్లో పూర్తి చేయాలని, క్రియశీలా సభ్యత్వానికి అర్హులైన ప్రతి ఒక్కరు క్రియశీలా సభ్యత్వానికి నమోదు చేసుకొని మండల, జిల్లా పార్టీకి రసీదు పంపించాలని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్న ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, దానిపై ప్రజా సేకరణ అభిప్రాయంలో భాగంగా డిసెంబర్ ఒకటో తేదీ నుండి ఐదవ తేదీ వరకు జరిగే నియోజకవర్గ పాదయాత్రని విజయవంతం చేయాలని ప్రతి ఒక్క కార్యకర్త పాల్గొనాలని తెలియజేశారు. ఈకార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఉప్పు రాంకిషన్, మండల ప్రధాన కార్యదర్శి పోచంపెల్లి నరేష్, మండల ఉపాధ్యక్షులు అంబటి నర్సింగరావు, కారుపాకల అంజిబాబు, జిల్లా యువ మోర్చా కార్యవర్గ సభ్యులు ఎడవెల్లి రామ్, మండల కార్యదర్శి గుంట అశోక్, మండల యువ మోర్చా ప్రధాన కార్యదర్శి ఎడవెల్లి లక్ష్మణ్, మండల ఐటి సెల్ కన్వీనర్ మాడిశెట్టి జయంత్, కోకన్వీనర్ మూల వంశీ, సీనియర్ నాయకులు జిట్టవేని అంజిబాబు, కట్ట రవీందర్, జిల్లా కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు ఊకంటి మహేందర్ రెడ్డి, బూత్ కమిటీ అధ్యక్షులు కడారి శ్రీనివాస్, మునిగంటి శ్రీనివాస్ చారి, బుర్ర శ్రీధర్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.

జర్నలిస్టులకు మొండి చేయి చూపిన కాంగ్రెస్ ప్రభుత్వం

మళ్లీ గెలిస్తేనె జర్నలిస్టు లకు ఇండ్ల స్థలాలు అని చెప్పిన సీఎం రేవంత్ సర్కార్

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.

నర్సంపేట,నేటిధాత్రి :

రాష్ట్రంలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ఎన్నో ఏండ్లుగా సేవలు చేస్తున్న జర్నలిస్టులకు కాంగ్రెస్ ప్రభుత్వం మొండి చేయి చూపిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు.జర్నలిస్టుల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇండ్ల స్థలాల కోసం ఎదురుచూసిన జర్నలిస్టులకు నిరాశే మిగిలిందని పేర్కొన్నారు.రెండో విడత ఇండ్ల స్థలాలను రెండవసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఇస్తాం అని చెప్పడం జర్నలిస్టులను మోసం చేయడమే అని రేవంత్ ప్రభుత్వం జర్నలిస్టులతో సహా అన్ని వర్గాలను మోసం చేసిందని ఆయన ఎద్దేవా చేశారు.ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం
జర్నలిస్టులకు ఇచ్చిన ఇండ్ల స్థలాలు
గత కెసిఆర్ ప్రభుత్వం కేటాయించినవే అని పెద్ది సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు.
బిఆర్ఎస్ ప్రభుత్వంలో నర్సంపేట మున్సిపాలిటీతో పాటు నియోజకవర్గంలో అన్ని మండలాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలను కేటాయించామని వాటిని నేటికీ కూడా కేటాయించికపోవడం ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.ఇండ్ల స్థలాలతో పాటు ఇండ్ల నిర్మాణాల కోసం 7 కొట్ల 50 లక్షల నిధులతో టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేయగా అగ్రిమెంట్ దశలో ఉన్న వాటిని ఆపింది ఎవరు అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజలకు ప్రభుత్వాలకు రాజకీయ పార్టీలకు వారధిగా పనిచేసే జర్నలిస్టుల పట్ల రాజకీయ కక్ష చూపడం తగదని పెద్ది పేర్కొన్నారు.నర్సంపేటలో పనిచేస్తున్న జర్నలిస్టులకు కూడా రెండవసారి కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాతనే ఇళ్ల స్థలాలు ఇస్తారా అని స్థానిక ఎమ్మెల్యేను ప్రశ్నించారు.నియోజకవర్గ పరిధిలో జర్నలిస్టల కోసం కేటాయించిన ఇండ్ల స్థలాలు తక్షణమే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
అనంతరం గంతలో తన ఎమ్మెల్యేగా ఉన్న హాయంలో జర్నలిస్టుల కు కేటాయించిన స్థలాలు కలెక్టర్ ప్రోసిడింగ్స్ కాపీ వివరాలు వెల్లడించారు.

వనపర్తి కలెక్టర్ కువినతిపత్రం అందజేసిన ఉద్యోగులు

వనపర్తి నేటిధాత్రి :
వికారాబాద్ లో రెవెన్యూ అధికారులపై జరిగిన దాడికి నిరసనగా బాధ్యుల పై చర్యలు తీసుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభికి.వినతి పత్రం అందజేశారు

తండ్రి విక్రయించిన భూమికి పుట్టుకొస్తున్న కుమారుడు

భయభ్రాంతులకు గురిచేస్తూ, దౌర్జన్యం చేస్తున్నారు

నాకు న్యాయం చేయండి

శాయంపేట నేటిధాత్రి:

హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాక గ్రామంలో చిట్టి రెడ్డి రజనీకర్ రెడ్డి వాసు అయిన తన భూమి సర్వే నెంబరు 532 బి వైశాల్యం 30 గుంటలు కలదని అట్టి భూమి నేను బతకడానికి వేరే ప్రాంతంలో ఉన్న సమయంలో మా ఊరిలోని రాజిరెడ్డి భూమిని 532 A ను తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలో 532 B గా మార్చుకోవడం జరిగింది దాదాపు పది సంవత్సరాలు గడుస్తున్న అడగాడానికి వెళితే నీది ఎక్కడ భూమి నీ భూమి లేదు ఏమీ లేదు వెళ్ళిపో అంటూ దౌర్జన్యం పాల్పడు తున్నారు నన్ను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వ్యక్తం చేశారు భూమియొక్క పాస్ పుస్తకము నా దగ్గర ఉన్నది మరియు ఈసి కాస్త పహాని తదితర అన్ని కాగితాలునా వద్ద ఉన్నాయని తెలపడం జరిగింది. ఆర్టీఐ కింద మా నాన్న యొక్క కాస్తాలోఉన్న కాగితం నా దగ్గర ఉంది

కేసులు వాపసు తీసుకోమని దౌర్జన్యం బెదిరింపులు

హనుమకొండలో నివాసం కోసం ఇల్లు కట్టుకోవడం వీళ్ళ పాలిట శాపంగా మారింది. ఏసిపి సుష్మ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ నుంచి అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పినా కూడా వాటిని పట్టించుకోకుండా దౌర్జన్యంగా ఇల్లును కూలగొట్టడం జరిగింది సుమారుగా ఆరు లక్షల నష్టం వాటిల్లింది జరిగింది. మున్సిపా లిటీ పరిధిలోని అన్ని కాగితాలు నాదగ్గర ఉన్నా కూడా దౌర్జన్యం చేసి ఇండ్లు కులకొట్టడం జరిగింది. దీని మీద పరువు నష్టం దావా వేయడం ఖాయం.

మా కుటుంబాన్ని ఆదుకోండి

తండ్రి విక్రయించిన భూమికి పుట్టుకొస్తున్న కుమారుడు మా తాతల కాలం నుండి భూమిపై శిస్తు అధికారం మాకే ఉంది చిట్టి రెడ్డి వీరారెడ్డి కుమారులు చిట్టి రెడ్డి రజనీకర్ రెడ్డి నాకు 532 B తాతల కాలం నుంచి భూమి శిస్తులో ఉంటున్నాం కానీ దౌర్జన్యానికి పాల్పడుతూ కేసులు వాపసు తీసుకోమని బెదిరింపులు గురిచేస్తూ కట్టించిన ఇళ్లను కులగోడుతూ కేసులు వాపస్ తీసుకోమని బెదిరిస్తున్నారు ఆర్టీఐ కింద కేసు వేసి భూమిపై ఉన్న అన్ని ఆధారాలున్న కాగితాలను జమ చేశాను నేను నా తండ్రి యాగు భూమిపై సర్వ హక్కులు నాకే చెందుతాయి కోర్టు ద్వారా నాకే చెందుతుం దని తీర్పు ఇవ్వడం జరిగింది భూమిపై వెళ్లడం జరిగింది మమ్మల్ని కాపాడాలని ప్రభుత్వాన్ని వేడుకోవడం జరిగింది.

కోర్టు ఆదేశాల ప్రకారం భూమిపై హద్దులు పాతడం

27/ 10/ 2024 రోజున సిమెంట్ దిమ్మలు పాతడం జరిగింది కోర్టు ఆదేశాల ప్రకారం నా భూమి నాకే చెందుతుందని తీర్పు ఇవ్వడం వల్ల నేను పోలీస్ స్టేషన్లో ఎస్సై ను కలిసి భూమిపై వెళ్లి సిమెంట్ దిమ్మలు పాతడం జరిగింది తెల్లారేసరికి వాటిని నాశనం చేయడం జరిగింది ఇప్పటికైనాజిల్లాఅధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని రజనీకాంత్ రెడ్డి అధికారులను కోరారు నాపై దయవుంచి జిల్లా మరియు మండల అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు

విద్యుత్ అధికారుల పొలం బాట

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం రంగాపురం విద్యుత్ ఉపకేంద్రం పరధిలో స్థానిక విద్యుత్ శాఖ ఏఈ అడ్డగట్ల ప్రమోద్ ఆధ్వర్యంలో విద్యుత్ అధికారులు పొలంబాట కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన భూపాలపల్లి టెక్నికల్ డి ఈ వెంకటేశం మాట్లాడుతూ మండలంలోని రైతులు స్థాటర్లు, ఫ్యూజులు స్టార్టర్ బాక్సులను భద్రతగా ఉంచుకోని భద్రత ప్రమాణాలను పాటించడం ప్రధాన లక్ష్యమని లోవోల్టేజ్ సమస్యలను నివారించడానికి కెపాసిటర్లను అమర్చుకోవాలని రైతులకు విద్యుత్ సమస్యలు ఉంటే వెంటనే అధికారులకు తెలియజేయాలని సూచించారు. వ్యవసాయ భూముల్లోని విద్యుత్ స్తంభాలు హై టెన్షన్ వైర్లను పరిశీలించి రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని గ్రామీణ ప్రాంతాలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఫోర్ మెన్ యాదగిరి ,లైన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ నాయక్, లైన్ మెన్ అనిల్, ఏ ఎల్ ఎం మహిపాల్, ఆన్ మ్యాన్డ్ వేముల కిరణ్ రైతులు తదితరులు పాల్గొన్నారు

24వ డివిజన్లో సమగ్ర కుటుంబ సర్వే

నేటిధాత్రి, వరంగల్

వరంగల్ నగరంలోని 24వ డివిజన్ లో సర్వే తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించిన వరంగల్ జిల్లా కలెక్టర్. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర కుటుంబ కులగణన సర్వేపై సందేహాలు, అపోహలు అవసరం లేదని, ప్రజలు సర్వే ప్రక్రియలో భాగస్వాములై తమ వివరాలను నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్ సత్య శారదా సూచించారు. వరంగల్ నగరం జిడబ్ల్యూఎంసీ లోని 24వ డివిజన్ ఫాటక్ మోహల్లా, ఎల్లంబజార్ లలో కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వే తీరును క్షేత్ర స్థాయిలో కలెక్టర్ పరిశీలించారు. ఆర్పిలు, ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి సమాచారం సేకరిస్తున్న తీరును, నిర్ణీత ఫారాలలో ఆయా కోడ్‌ ల వారీగా వివరాలు నమోదు చేస్తున్న విధానాన్ని గమనించారు. ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ ఇంటింటి కుటుంబ సర్వేలో సమగ్ర సమాచారాన్ని సేకరించాలని ఆమె అధికారులను ఆదేశించారు.


ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుండి సేకరించిన సమాచారం గోప్యంగా ఉంచడం జరుగుతుందని అన్నారు.
ఎలాంటి అవాంతరాలు లేకుండా జిల్లాలో సమగ్ర ఇంటింటి సర్వే కొనసాగుతోందని, ప్రజల నుండి సేకరించిన సమాచారాన్ని డేటా ఎంట్రీ ఆపరేటర్ల ద్వారా ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌ లో నమోదు చేసేవిధంగా చర్యలు తీసుకున్నామన్నారు.  కలెక్టర్ వెంట ఉప కమిషనర్ కృష్ణారెడ్డి, స్థానిక కార్పొరేటర్, ఆర్ఓ షాజాదిబేగం, ఆర్ ఐ సోహైల్, మహిళ సంఘం ఆర్పిలు తోట రాణి, పుష్పా తదితరులు ఉన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఆచరణకు నోచుకోని హామీలు ఇచ్చి అధికారం లోకి వచ్చింది

బీజేపీ జిల్లా అధ్యక్షుడు చందుపట్ల సునీల్ రెడ్డి

మంథని :- నేటి ధాత్రి

మంథని కేంద్రం లోని బిజెపి కార్యాలయంలో జరిగిన భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి జిల్లా స్థాయి సంస్థాగత ఎన్నికల కార్యశాల సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమం లో
సంస్థగత ఎన్నికల పెద్దపల్లి జిల్లా రిటర్నింగ్ ఆఫీసర్ అయ్యన్నగారి భూమయ్య, మాట్లాడుతూ ప్రతి పోలింగ్ బూత్ లో ఎన్నికల ద్వారా పోలింగ్ బూత్ కమిటీలను బూత్ అధ్యక్షులు ద్వారా మండల అధ్యక్షులను వారి ద్వారా జిల్లా అధ్యక్షులను ఎన్నుకునే ప్రక్రియ బిజెపి పార్టీలో కొనసాగుతూ వస్తుందని అదే విధంగా ఇప్పుడు కూడా ఎన్నికలు నిర్వహించ నున్నని పార్టీ పటిష్టత కోసం బూత్ స్థాయి లో నిర్మాణం అయినప్పుడే స్థానిక సంస్థల ఎన్నికలు మొదలుకొని పార్లమెంట్ వరకు పార్టీ పరిపుష్టత సాధిస్తుందని అందుకే ప్రతి కార్యకర్త సంస్థగత ప్రక్రియలో భాగస్వామ్యులు కావాలని తెలియ జేశారు.పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు చందుపట్ల సునీల్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆచరణకు నోచుకోని హామీలను ఇచ్చి అధికారంలకు వచ్చిందని వాటిని ఎండగడుతూ డిసెంబర్ మొదటి వారంలో ప్రజా సమస్యలపై అసెంబ్లీ వారీగా యాత్రలు నిర్వహించనున్నమని గత పాలకుల పరిపాలనకు కాంగ్రెస్ పరిపాలనకు తేడా ఏమీలేదని పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టుగా ఈ రాష్ట్ర ప్రజల పరిస్థితి తయారైందని ప్రజా అభీష్టం మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పై తిరుగుబాటు యాత్రలు చేపట్టనున్నమని తెలియజేశారు ఈ కార్యక్రమం లో
పెద్దపల్లి జిల్లా సభ్యత్వ నమోదు ప్రభారీ ఆర్ముళ్ళ పోచం. జిల్లా ఎన్నికల సహాయాదికారి క్యాతం వెంకటరమణ,పోల్సని సంపత్ రావు,రామగుండం అసెబ్లీ ఇన్చార్జి కందుల సంద్యారాణి,
రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి,మెర్గు హనుమంత్ గౌడ్, మచ్చగిరి రాము,స్టేట్ కౌన్సిల్ సభ్యులు కొండపాక సత్యప్రకాష్, ఆదిరెడ్డి,మోహనరావు,నాంపల్లి రమేష్ మండల అధ్యక్షులు ,ఇన్చార్జి లు,నాయకులు పాల్గొన్నారు.

ఏపీ సిఎం చంద్రబాబు ఆదేశాలు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు

వనపర్తి నేటిధాత్రి
ఎ పి సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీసభ్యత్వ నమోదు కార్యక్రమం వనపర్తి తెలుగుదేశం పార్టీని కార్యాలయంలో నిర్వహిం చారు
తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల భద్రత కోసం రూ.5 లక్షల ప్రమాద భీమా విద్య వైద్యము, ఉపాధి సహాయ సదుపాయాలు పొందడానికి నాగర్ కర్నూల్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కన్వీనర్ బి రాములు హడహక్ కమిటీ సభ్యులు మాజి జెడ్పీటి సి గొల్ల వెంకటయ్య యాదవ్ సుధాకర్ నాయుడు రాష్ట్ర తెలుగుదేశం మైనార్టీ నాయకులు ఎండి దస్తగి రి శ్రేయోభిలాషులు ,రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే వారు రాష్ట్ర , జిల్లా, మండల , గ్రామ నాయకులు కార్యకర్తలు అందరూ విధిగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని అధిక సంఖ్యలో నమోదు చేయించుకున్నారని తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవంనకుకృషి చేయాలని నిర్వాహకులు ద్యారపోగు బా లింగం బాలరాజు , కోమరగిరి , కొత్తగొల్ల శంకర్ ఒకప్రకటనలో కోరారు

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని ఘనంగా సన్మానించిన

మండల వైద్యాధికారి అమరేందర్ రావు
వైద్య సిబ్బంది

ముత్తారం :- నేటి ధాత్రి

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి గా డాక్టర్ అన్న ప్రసన్న బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా ముత్తారం కేంద్రం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను సందర్శించారు ఈ సందర్భంగా మండల వైద్యాధికారి డాక్టర్ అమరేందర్ రావు తన యొక్క సిబ్బందితో కలిసి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అన్న ప్రసన్నని పుష్ప గుచ్చం ఇచ్చి శాలువాతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలియచేసారు ఈ సందర్బంగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ అన్న ప్రసన్న మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో విధులు నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ అమరేందర్ రావు ను అభినందించారు మండలంలో ఏలాంటి సమస్యలు రాకుండా మంచిగా విధులు నిర్వర్తించాలని ఇంతకుముందు కూడా మండలంలోని అన్ని గ్రామాలలో ఎలాంటి జ్వరాలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకొని మంచి చర్యలు చేపట్టాలని అలాగే ఫీల్డ్ స్టాఫ్ అందరు యధావిధిగా తమ యొక్క సమయమును పాటించవలెనని సూచించారు ఈ కార్యక్రమం లో వైద్య సిబ్బంది పాల్గొన్నారు

error: Content is protected !!
Exit mobile version