మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం రంగాపురం విద్యుత్ ఉపకేంద్రం పరధిలో స్థానిక విద్యుత్ శాఖ ఏఈ అడ్డగట్ల ప్రమోద్ ఆధ్వర్యంలో విద్యుత్ అధికారులు పొలంబాట కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన భూపాలపల్లి టెక్నికల్ డి ఈ వెంకటేశం మాట్లాడుతూ మండలంలోని రైతులు స్థాటర్లు, ఫ్యూజులు స్టార్టర్ బాక్సులను భద్రతగా ఉంచుకోని భద్రత ప్రమాణాలను పాటించడం ప్రధాన లక్ష్యమని లోవోల్టేజ్ సమస్యలను నివారించడానికి కెపాసిటర్లను అమర్చుకోవాలని రైతులకు విద్యుత్ సమస్యలు ఉంటే వెంటనే అధికారులకు తెలియజేయాలని సూచించారు. వ్యవసాయ భూముల్లోని విద్యుత్ స్తంభాలు హై టెన్షన్ వైర్లను పరిశీలించి రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని గ్రామీణ ప్రాంతాలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఫోర్ మెన్ యాదగిరి ,లైన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ నాయక్, లైన్ మెన్ అనిల్, ఏ ఎల్ ఎం మహిపాల్, ఆన్ మ్యాన్డ్ వేముల కిరణ్ రైతులు తదితరులు పాల్గొన్నారు