కిష్టంపేట గ్రామాన్ని సందర్శించిన రాజన్న సిరిసిల్ల జిల్లా అడిషనల్ ఎస్పీ.

కిష్టంపేట గ్రామాన్ని సందర్శించిన రాజన్న సిరిసిల్ల జిల్లా అడిషనల్ ఎస్పీ…

చందుర్తి నేటిధాత్రి:

ఈరోజు చందుర్తి మండలం కిష్టంపేట గ్రామాన్ని అడిషనల్ ఎస్పి చంద్రయ్య సందర్శించారు. ఇటీవల గ్రామంలో తేలుకాటుకు గురై సరియైన వైద్యం అందక మరణించిన చిన్నారి విషయంలో, ఆర్ఎంపీ డాక్టర్ పై నమోదైన కేసులో మృతురాలి ఇంటిని సందర్శించి కుటుంబ సభ్యులను మరియు ఇతర సాక్షులను విచారించడం జరిగింది. ఇందులో భాగంగా ఎస్సీ కాలనీ గ్రామస్తులతో మాట్లాడుతూ మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో వ్యవహరించాల్సిన తీరును మరియు మూఢనమ్మకాలు, ఇతర సామాజిక రుగ్మతలపై కాలనీ వాసులకి తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మరియు ఆపద సమయంలో ప్రజలు ఏ సమస్య వచ్చినా ప్రతి ఒక్కరు కూడా పోలీస్ సహాయం తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో చందుర్తి సిఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రమేష్ మరియు సిబ్బంది ఉన్నారు..

కేసముద్రం మండలంలో అనుమతి పొందిన .!

కేసముద్రం మండలంలో అనుమతి పొందిన ప్రైవేటు పాఠశాలలు

ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించాలి

మండల విద్యాశాఖ అధికారి కాలేరు యాదగిరి

కేసముద్రం/ నేటి ధాత్రి :

 

 

కేసముద్రం మున్సిపల్ మండల లోని ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నియమ నిబంధనలు తప్పకుండా పాటించాలని ప్రభుత్వ నియవ నిబంధనలు ఉల్లంఘిస్తే అలాంటి ప్రైవేట్ పాఠశాలలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేసముద్రం మండల విద్య శాఖ అధికారి కాలేరు యాదగిరి మంగళవారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ,

 

 

 

 

 

1) ఉప్పరపల్లి గ్రామంలో లాల్ బహదూర్ విద్యాలయం ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు,
2) కేసముద్రం స్టేషన్ లో సమత మోడ్రన్ హైస్కూల్ ఒకటి నుంచి పదవ తరగతి వరకు,
3) శ్రీ వివేకానంద విద్యాలయం ఒకటి నుండి పదవ తరగతి వరకు,
4) లేపాక్షి విద్యాలయం ఒకటి నుండి పదవ తరగతి వరకు హనుమతులు ఉన్నాయని,
5) అమీనాపురంలో కృషి విద్యానికేతన్ ఒకటి నుండి పదవ తరగతి వరకు,
6) లిటిల్ సిటిజెన్ పాఠశాల నర్సరీ నుండి ఏడవ తరగతి వరకు అనుమతులు ఉన్నాయని,
7) కేసముద్రం విలేజ్ లో శ్రీ వివేకవర్ధిని విద్యాలయము నర్సరీ నుండి పదవ తరగతి వరకు మరియు
8) ధన్నసరిలో సెయింట్ జాన్స్ హై స్కూల్ నర్సరీ నుండి పదవ తరగతి వరకు అనుమతులు ఉన్నాయని, అలాగే
9) చెరువు ముందు తండాలో సాక్రెడ్ హార్ట్ స్కూల్ నర్సరీ నుండి పది తరగతి వరకు అనుమతి పొంది ఉన్నదని,
10) పెనుగొండ రామకృష్ణ విద్యాలయం నర్సరీ నుండి ఏడవ తరగతి వరకు అనుమతులు పొందినవని.

 

 

 

 

పైన తెలిపిన పది పాఠశాలలు ప్రభుత్వం ద్వారా అనుమతి కలిగి నడుస్తున్నవి పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.

 

 

 

 

ప్రయివేట్ పాఠశాలల యాజమాన్యాలకు సూచనలు:-
ఈ ప్రయివేట్ పాఠశాలల్లో అనుమతి లేని తరగతులను నిర్వహించకూడదని.
ఒక సెక్షన్ కు 40 మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉండకూడదని.
అనుమతి లేని పాఠశాల పేరు పెట్టుకొని నడిపించరాదని.
పాఠశాల ఆవరణలో పాఠ్యపుస్తకాలుగాని నోటు పుస్తకాలు గానీ అమ్మ కూడదని.
పాఠశాల యొక్క పేరుతో వేరే ప్రాంతంలో పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు అమ్మడం చేయరాదని.
తరగతి వారీగా ఫీజుల వివరాలను నోటీస్ బోర్డ్ పై అందరికీ తెలిసేలా బోర్డు ఏర్పాటు చేయాలని.
తరగతి వారీగా విద్యార్థుల సంఖ్యను నోటీస్ బోర్డ్ పై అంటించాలని,
ఏదైనా పాఠశాలలో విద్యార్థులను తరలించడానికి వాహనాన్ని ఉపయోగించినట్లయితే, ఫిట్ నెస్ కలిగిన వాహనాన్ని, అర్హత కలిగిన, సుశిక్షితులైన డ్రైవర్ చేత

 

 

మాత్రమే వాహనాన్ని నడిపించాలని తెలియజేశారు.

 

 

పైన తెలిపిన సూచనలను అన్ని ప్రయివేట్ పాఠశాలల యాజమాన్యం తప్పనిసరిగా పాటించవలెను. లేనిచో తగు చర్యలు తీసుకోబడతాయని మండల విద్యాశాఖాధికారి కాలేరు యాదగిరి తెలిపారు.

సీజనల్ వ్యాధుల పై విద్యార్థులకు అవగాహన.

సీజనల్ వ్యాధుల పై విద్యార్థులకు అవగాహన ‌‌

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

 

 

మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని ఎంజేపి (మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే) పాఠశాలలో మొగుళ్ళపల్లి ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారిణి డాక్టర్ నాగరాణి గారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా 110 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి మందులు ఇవ్వడం జరిగినది. విద్యార్థులకు సీజన్ వ్యాధుల గూర్చి అవగాహన కల్పించడం జరిగినది ,వేడి వేడి ఆహార పదార్థాలు తినాలని, కాచి చల్లార్చిన నీరు తాగాలని తెలియజేసినారు . విద్యార్థులకు ఎవరికైనా జ్వరం కానీ, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే మా వైద్య సిబ్బంది తెలియజేయాలని డాక్టర్ నాగరాణి గారు సూచనలు ఇచ్చారు .ఈ కార్యక్రమంలో డాక్టర్ సంధ్య, ప్రిన్సిపల్ శారద ,సూపర్వైజర్ సునీత, ఏఎన్ఎం శ్రీలత ,స్టాఫ్ నర్స్ అశ్ర ఆశా కార్యకర్తలు ఉపాధ్యాయులు ,విద్యార్థులు పాల్గొన్నారు.

పామాయిల్ సాగు రైతును రాజును చేస్తోంది.

పామాయిల్ సాగు రైతును రాజును చేస్తోంది

భద్రాద్రి కొత్తగూడెం హార్టికల్చర్ అధికారి కిషోర్
డివిజన్ అధికారి రాధాకృష్ణ

చర్ల నేటి ధాత్రి:

చర్ల మండలం దానవాయిపేట గ్రామంలో ఆయిల్ ఫెడ్ అధికారుల ఆధ్వర్యంలో పామ్ ఆయిల్ మొక్కల పంపిణీ చేశారు
మెగా ప్లాంటేషన్ డే సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హార్టీ కల్చర్ అధికారి కిశోర్ మరియు డివిజన్ అధికారి రాధాకృష్ణ పిలుపుమేరకు ఆయిల్ ఫెడ్ అధికారులు చర్ల మండలంలోని రైతులకు పూర్తి సబ్సిడీ పై పామ్ ఆయిల్ మొక్కల పంపిణీ మరియు మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు చర్ల మండలంలో దాదాపు 300 ఎకరాలు సాగు లో ఉండగా విస్తీర్ణం భారీగా పెంచేందుకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ లను వినియోగించుకోవాలని ఆయిల్ ఫెడ్ అధికారులు పిలుపునిచ్చారు మొక్కలకే కాకుండా డ్రిప్ ఇరిగేషన్ పరికరాల పై కూడా సబ్సిడీ వస్తుందనీ తెలియజేశారు అంతే కాకుండా ఎకరానికి రూ 4200 రూపాయలు చొప్పున ప్రోత్సాహకం ఇవ్వటం జరుగుతుంది అంతర్గత పంటలపై అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ అధికారులు వికాస్ సత్యనారాయణపురం ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ ఎమ్ శ్రీనివాసరాజు ఆదర్శ రైతు సాగి శ్రీనివాసరాజు మరియు రైతులు చలపతి వెంకటేశ్వర్లు గ్రామస్తులు తదితరులు   పాల్గొన్నారు

సార్ కొంచెం మా ఏరియాను కూడా పట్టించుకోండి.

సార్ కొంచెం మా ఏరియాను కూడా పట్టించుకోండి

మందమర్రి నేటి ధాత్రి

 

 

 

స్థానిక మందమర్రి అంబేద్కర్ కాలనీ 3వ వార్డు లో రోడ్డు లేవు సరిగ్గా కాలువలు లేవు చెత్త ఎక్కడిది అక్కడే కుడుకపోయి ఉంటుంది లైన్ అంతా చెట్లతో నిండిపోయి కరెంట్ తీగలకు చెట్లు ఆనుకుని ఉన్నాయి పాములతో చాలా భయాందోళనలతో కాలనీవాసులు భయపడుతున్నారు కొంచెం మా ఏరియాను పై దయ చూపండి సారు అని వార్డులోని కాలనీవాసులు వాళ్ళ యొక్క గోడను వెళ్లబుచ్చుకుంటున్నారు సారు ఇది మా ఒక్క వార్డులోని సమస్య మాత్రమే కాదు ప్రతి ఒక్క వర్డ్ లోని కాలనీవాసులు ఎదుర్కొంటున్న ఒక సమస్య..

కొన్ని కొన్ని వార్డులలో ఇంతకంటే ఘోరంగా ఉన్న పరిస్థితి కూడా ఉంది..

వర్షాకాలం కాబట్టి ఇలాంటి సమస్యల పై మన మీడియా మిత్రులు కొంచెం దృష్టి పెట్టి వార్తలు రాయండి అని కాలనీవాసులు కోరడం జరిగింది

నాల్గవ తరగతి ఉద్యోగుల సర్వసభ్య సమావేశం

నాల్గవ తరగతి ఉద్యోగుల సర్వసభ్య సమావేశం

ఎల్లప్పుడూ ఉద్యోగులకు అండగా ఉంటాం జిల్లా అధ్యక్షులు గీట్ల సుమిత్

మంచిర్యాల జులై 01 నేటి దాత్రి :

 

 

జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం సర్వ సభ్య సమావేశం జిల్లా అధ్యక్షుడు గీట్ల. సుమిత్ అధ్యక్షత న నిర్వహించారు. ఈ సమావేశంలో మంచిర్యాల జిల్లా తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగులు ఎదుర్కొంటున్నా సమస్యల పైన మరియు ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన
బకాయి బిల్లుల మంజూరు ,
ఆరోగ్య కార్డులను పూర్తి స్థాయిలో మంజూరు చేయాలని
నాల్గవ తరగతి ఉద్యోగులకు ప్రతి
2 సంవత్సరాలకు ఒకసారి పదోన్నతులు కల్పించాలనే ప్రభుత్వం జీఓ జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వన్నీ కోరుతూ ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గీట్ల. సుమిత్ మాట్లాడుతూ
జిల్లా లోని మండల స్థాయి అధికారులు కొందరు నాల్గవ తరగతి ఉద్యోగుల పై అనుచిత పదాలు ,దురుసుగా ప్రవర్తిస్తున్నారని ,క్రింది స్థాయి ఉద్యోగులపై ఇలా ప్రవర్తించడం సరైనది కాదని, అలాంటి సందర్భాలు ఎదురైతే
జిల్లా సంఘానికి తెలియజేస్తే పై స్థాయి అధికారుల దృష్టికి తీసుకొన్ని వెళ్లి న్యాయం జరిగే వరకు తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం ఎల్లపుడు ముందుగా ఉండి పోరాటం చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమములో గౌరవ అధ్యక్షులు తిరుపతి, అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీలత, కోశాధికారి సుజాత,
సునీత, శేఖర్, ముంతాజ్ అలీ ఖన్,
శ్రీనివాస్, వెంకటేష్, సతీష్, శోభ తదితరులు
పాల్గొన్నారు.

నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణ.

నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణ, ఉపాధి మేళా

 

నడికూడ,నేటిధాత్రి:

 

 

తేదీ. 03/07/2025. గురువారం రోజున ఉదయం 10 గంటలకి నడికూడ మండల ప్రజా పరిషత్ నడికూడ కార్యాలయంలో దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకంలో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణ మరియు ఉపాధి మేళ నడికూడ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో గజ్జెల విమల ఆధ్వర్యంలో మేళా నిర్వహించబడును.ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతాలలోని పేద నిరుద్యోగ యువతీ యువకులకు కంప్యూటర్,స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్స్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ మరియు లాజిస్టిక్స్ కోర్సులలో ఉచితంగా శిక్షణ ఇచ్చి శిక్షణానంతరము ప్రముఖ కార్పొరేట్ కంపెనీల యందు ఉద్యోగ అవకాశం కల్పించబడును శిక్షణ కాలంలో ఉచిత భోజనము మరియు వసతి యూనిఫామ్స్ స్కాలర్షిప్ మరియు కేంద్ర ప్రభుత్వ సర్టిఫికెట్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరియు రాష్ట్ర ప్రభుత్వం చే ఎంప్లాయిమెంట్ జనరేషన్ మార్కెటింగ్ మిషన్ సర్టిఫికెట్ ఇవ్వబడును.ఈ అవకాశాన్ని నడికూడ మండలంలోని అన్ని గ్రామాల నుండి
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ యొక్క విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు మరియు రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ తీసుకొని తేదీ.03/07/2025. రోజున గురువారం ఉదయం 10 గంటలకి నడికూడ మండల ప్రజా పరిషత్ కార్యాలయానికి హాజరు కాగలరని ఎంపీడీవో గజ్జెల విమల తెలిపారు‌. పూర్తి వివరణ కోసం 9849131050,9642141539. సంప్రదించగలరు.

ఘనంగా జనసేన పార్టీ కిట్ల పంపిణి.

ఘనంగా జనసేన పార్టీ కిట్ల పంపిణి
మెట్ పల్లి జూలై 01 నేటి దాత్రి:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కిట్ల పంపిణీ కార్యక్రమం జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి నేమూరి శంకర్ గౌడ్ ఆదేశాల మేరకు మరియు రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంఛార్జి ఆర్ కే సాగర్ సూచనల మేరకు సీనియర్ నాయకులు కోరుట్ల నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి గంగం అజయ్ కుమార్ ఆధ్వర్యంలో క్రియాశీల కిట్ల పంపిణీ కార్యక్రమం నేడు మంగళవారం రోజున మెట్ పల్లి మండలం మారుతి నగర్ లో ఘనంగా జరిగింది . రాబోయే రోజుల్లో జనసేన పార్టీ రాజకీయాల్లో క్రియా శీలకంగా పాల్గొంటుందని వారు అన్నారు .ఇట్టి కార్యక్రమంలో బోగ చక్రదర్, రాజోగి కార్తీక్, ప్రణయ్ కుమార్ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు .

ధర్మ రావు పేట గ్రామంలో విద్యుత్ శాఖ పొలంబాట.

ధర్మ రావు పేట గ్రామంలో విద్యుత్ శాఖ పొలంబాట కార్యక్రమం

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురంమండలంలోని ధర్మారావుపేట్ గ్రామంలో 01.07.2025 న “విద్యుత్ శాఖ – పొలంబాట” కార్యక్రమాన్ని, రైతుల సమక్షంలో నిర్వహించడం జరిగింది. “విద్యుత్ శాఖ – పొలం బాట” ముఖ్య ఉద్దేశాన్ని ఎస్ ఈ వివరిస్తూ 1) వంగిన స్తంభాలను సరి చేయడం 2)విరిగిన లేదా ప్రమాదకరంగా ఉన్న స్తంభాలు మార్చడం 3)కిందకు వేలాడుతూ ప్రమాదకంగా ఉన్న లూజు లైన్ ను సరిచేయడంమొదలగునవిచేస్తామని.విద్యుత్ వినియోగదారులు, రైతు సోదరులకు బట్టలు ఆరెసుకునే దండానికి జి ఐ వైర్ వాడకూడదు, జి ఐ వైర్ వాడడం వలన ఎలక్ట్రిక్ షాక్ కి గురి కావడం జరుగుతోంది.సర్వీస్ వైర్ లోజాయింట్లులేకుండాచూసుకోవాలి.సర్వీస్ వైర్స్ జాయింట్స్ ఉండడం వలన షాక్ కి గురి కావడం జరుగుతుంది.
అలాగే రైతులకు నాణ్యమైన విద్యుత్ ను అందిస్తామని, రైతులుభద్రతసూత్రాలను,విద్యుత్ పొదుపు పాటించాలని కోరారు.
ముఖ్యంగా, రైతులు తమ మోటార్స్ దగ్గర, తగిన కెపాసిటీ కలిగిన కెపాసిటర్స్ ను వాడాలని కోరుతు, ప్రయోగాత్మకంగా వారికి కెపాసిటరును మోటర్ దగ్గర అమర్చి చూపించి తగ్గిన కరెంటు గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతులు కెపాసిటర్లను అమర్చుకోవడానికి ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమం నిర్వహణ పట్ల రైతు సోదరులు హర్షం వ్యక్తం చేసి విద్యుత్ శాఖా పనితీరు పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు.అలాగే రైతులు తమయొక్కసమస్యలను అధికారుల కు తెలిపారు. ఈ కార్యక్రమంలోజిల్లాసూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ మల్చుర్, డిఈ టెక్నికల్ భూపాలపల్లి
వెంకటేశం, స్థానిక ఏ ఈ వెంకట రమణ, సబ్ ఇంజనీర్ రజినీకాంత్ విద్యుత్ శాఖ సిబ్బంది, రైతు సోదరులు పాల్గొన్నారు.

అంతర్జాతీయ వైద్యుల దినోత్సవం పురస్కరించుకొని.

మెట్ పల్లి జూలై 1 నేటి ధాత్రి

 

 

 

 

అంతర్జాతీయ వైద్యుల దినోత్సవం పురస్కరించుకొని మండల్ రూరల్ ఆర్ఎంపి పి.ఎం.పి అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పట్టణ ప్రముఖ ఐఎంఏ జాతీయ వైద్య విధాన రాజ్యాంగ సవరణ కమిటీ మెంబర్ ఐఎంఏ మెట్పల్లి అధ్యక్షులు డాక్టర్ గంగసాగర్ ను ఘనంగా సన్మానం చేశారు.
డాక్టర్ రవి, డాక్టర్ నిర్మల్ రెడ్డి తదితర డాక్టర్లను ఆర్ఎంపి పి.ఎం.పి మెట్టుపల్లి రూరల్ సంఘం వారిచే ఘనంగా సన్మానించడం జరిగింది.
ఇ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు గాజంగి రాజ మల్లయ్య,మండల అధ్యక్షుడు బండి శంకర్, ప్రధాన కార్యదర్శి జోగా నరసయ్య, ఇల్లెందుల సత్యనారాయణ,సదానందం,పరశురాం,సామల గంగాధర్, మొగిలయ్య,మహేష్ గంగుల ఉపేంద్ర పాల్గొన్నారు.

వైద్యులు ప్రత్యక్ష దేవుళ్ళు.

వైద్యులు ప్రత్యక్ష దేవుళ్ళు

కాశీబుగ్గ, నేటిధాత్రి

 

 

 

జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ఈరోజు కాశీబుగ్గ చెందిన జై సీతారాం పరపతి సంఘం ఆధ్వర్యంలో వరంగల్ నగరానికి చెందిన ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ కూరపాటి మధుకు మరియు చర్మ వైద్య నిపుణులు కూరపాటి స్వాతి దంత వైద్య నిపుణులు కూరపాటి మౌక్తిక కి వైద్యుల దినోత్సవం సందర్భంగా ఘనంగా సన్మానించినారు ఈ సందర్భంగా వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వివేకానంద యోగా సేవా సంస్థ అధ్యక్షులు కూరపాటి సుదర్శన్, జై సీతారాం పరపతి సంఘం అధ్యక్షులు వంగరి రవి, భద్రకాళి దేవస్థానం మాజీ ధర్మకర్త సాంబారి మల్లేశం, ఆరే రమేష్, చిలుపూర్ మల్లేశం, లకుoభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

జూనియర్ కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలి.

జూనియర్ కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి:

ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలలల్లో విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పనకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
మంగళవారం జిల్లా కలెక్టర్ చాంబర్ లో ఇంటర్మీడియట్ కళాశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థుల సౌకర్యార్థం కనీస మౌలిక సదుపాయాలు కల్పనపై విద్యా, టిజిడబ్ల్యూఐడిసి ఇంజినీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూనియర్ కళాశాలల్లో కనీస సౌకర్యాలు కల్పనకు జిల్లాలోని 5 జూనియర్ కళాశాలలకు 41.07 లక్షల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసినట్లు తెలిపారు. ఇట్టి నిధులతో
మౌలిక సదుపాయాలు కల్పనకు ప్రతిపాదనలు అందచేయాలని ప్రిన్సిపాల్స్ ను ఆదేశించారు. ఈ నిధులతో సివిల్ మరమ్మతులు, ఎలక్ట్రికల్, మంచినీరు, పారిశుధ్య కార్యక్రమాలు వంటి సదుపాయాలపై ఫోకస్ చేయాలని, ఇట్టి పనులను ప్రాధాన్యతా ప్రాతిపదికన చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకన్న డీఈఓ రాజేందర్ టీజడబ్ల్యూఐడిసి డిఈ రామకృష్ణ ఏఈ మహేందర్, జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్ తదితరులు పాల్గొన్నారు.

కాకతీయ ఆటో యూనియన్ అధ్యక్షునిగా రెంటాల మోష.

కాకతీయ ఆటో యూనియన్ అధ్యక్షునిగా రెంటాల మోష ఎన్నిక

గణపురం నేటి ధాత్రి

 

 

 

గణపురం మండల కేంద్రంలోని కాకతీయ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ లను నూతనంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికలో ప్రెసిడెంట్ గా రెంటాల మోషన్ వైస్ ప్రెసిడెంట్ గా బొనగాని రాజశేఖర్ కాకతీయ ఆటో యూనియన్ డ్రైవర్ల సమక్షంలో ఎన్నుకోవడం జరిగింది. నూతనంగా ఎన్నుకోబడిన ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ వారికి యూనియన్ బాధ్యతలప్పగిస్తూఎన్నుకున్నందుకు ఆటో డ్రైవర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు ఎండి హుస్సేన్ జి శ్రీనివాస్ ఆర్ సంపత్ పి గోపి కే రాహుల్ కే జానయ్య బి ప్రవీణ్ ఎస్ వెంకట్ కె రమేష్ డి అశోక్ డి గణేష్ ఎస్ రాజు టి రమణ పాల్గొన్నారు.

అంగన్వాడిలో 3సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పిల్లలను నమోదు చేయించాలి.

అంగన్వాడిలో 3సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పిల్లలను నమోదు చేయించాలి.

ఐసిడిఎస్ సూపర్వైజర్ జయప్రద.

చిట్యాల నేటి ధాత్రి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నైన్ పాక అంగన్వాడీ కేంద్రంలో జీ జయప్రద సూపర్వైజర్ నిర్వహించిన సెక్టార్ సమావేశమునకు 28 మంది అంగన్వాడీ టీచర్స్ హాజరైనారు మీటింగ్ యొక్క ఉద్దేశం ప్రతి రోజు ఉదయం తొమ్మిది గంటల నుండి నాలుగు గంటల వరకు టీచరు ఆయాసమయ పాలన పాటించాలని మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లల నమోదు హాజరు శాతం పెంచుకోవాలని ప్రతి నెల పిల్లల బరువులు ఎత్తులు తీసి శామ్ మామ్ పిల్లల్ని గుర్తించి ఆరోగ్య పరీక్షలు చేయించాలని 14 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల లోపు కిషోరా బాలికల బరువు ఎత్తు చూసి పల్లి పట్టీలు ఇవ్వాలని వివరించి ఆషాడ మాసము అయినందున టీచర్లతో కలిసి అమ్మవారికి బోనం సమర్పించి టీచర్స్ అందరూ కలిసి భోజనము చేసి సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా అంగన్వాడి కేంద్రాలన్నీ పిల్లలతో కలకలలాడాలని అన్ని గ్రామాల ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకోవడం జరిగింది 28మంది టీచర్స్ హాజరైనారు

బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ చేతుల మీదుగా గంజాయి.

బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ చేతుల మీదుగా గంజాయి అవగాహనపై వాల్ పోస్టర్ విడుదల

బెల్లంపల్లి జులై 01 నేటి దాత్రి

 

 

 

నేషనల్ ఉమెన్ రైట్స్ జస్టిస్ మూమెంట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగుంట ప్రవీణ్ కుమార్ సారాద్యంలో
బెల్లంపల్లి ఏసీపి కార్యాలయంలో
ఏ సి పి రవికుమార్ ని కలిసి వారి చేతులమీదుగా ప్రస్తుతం యువత రోజురోజుకు గంజాయి మత్తులో మునిగిపోతున్నారనే సంకల్పంతో నేషనల్ హ్యూమన్ రైట్స్ &జస్టిస్ మూమెంట్ సభ్యుల ఆధ్వర్యంలో జూలై 5వ తేదీ నుండి జూలై 30 వరకు గంజాయి పై అవగాహన సదస్సులకు సంబంధించి వాల్ పోస్టర్లు విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మందమరి పట్టణ ఎస్సై రాజశేఖర్ నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ మూమెంట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగుంట ప్రవీణ్ కుమార్, జనరల్ సెక్రెటరీ, బత్తిని కృష్ణ, లీగల్ సెల్ అధ్యక్షులు పెసర శ్రీకాంత్, పాల్గొనడం జరిగింది.

వనపర్తి లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన కలెక్టర్.

వనపర్తి లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన కలెక్టర్
వనపర్తి నేటిదాత్రి:

వనపర్తి జిల్లా కేంద్రంలో గాంధీనగర్ లో
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురబి భూమి పూజ చేశారు ఇందిరమ్మ ఇండ్లకు ఎంపికైన లబ్ధిదారులు అంజి వెంకటమ్మ ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించగా కలెక్టర్ కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలని సూచించారు. ఇంటి నిర్మాణంలో ఏమైనా సందేహాలు ఉంటే మోడల్ ఇందిరమ్మ గృహాన్ని సందర్శించి నివృత్తి చేసుకోవాలని లబ్ది దారులకు సూచించారు జి సి డి వో శుభలక్ష్మి, హౌసింగ్ డిఈ విఠోబా, తహసిల్దార్ రమేష్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు అధికారులు తదితరులుపాల్గొన్నారు

సిగాసి ఫ్యాక్టరీ ప్రమాదంపై సమగ్ర న్యాయవిచరణ జరిపించాలి.

సిగాసి ఫ్యాక్టరీ ప్రమాదంపై సమగ్ర న్యాయవిచరణ జరిపించాలి.

ఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

సంగారెడ్డి జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని పాశం మైలారంలోని సిగాసి కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో పదుల సంఖ్యలో కార్మికులు మరణించడం అనేకమంది తీవ్ర క్షతగాత్రులైన సంఘటనపై సమగ్ర న్యాయచారణ జరిపించాలని ఐఎఫ్ టియు తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.

ఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 150 మంది కార్మికులు పనిలో ఉన్నారని వారి రక్షణకై యుద్ధప్రాతిపదికపై మరింతగా అన్నిరకాల సహాయక చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఈ సంఘటనకు యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలని,

ఈ దుర్ఘటనలో లేబర్ అధికారుల,ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ల వైఫల్యం మరోసారి బహిర్గతమైందని పేర్కొన్నారు.

ఈ దుర్ఘటనకు ఫ్యాక్టరీలో తగిన రక్షణ చర్యలు చేపట్టకపోవడం, లేబర్ డిపార్ట్మెంట్ పర్యవేక్షణ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ల ఇన్స్పెక్షన్ లేకపోవడం వలన జరిగిందని ఐఎఫ్టియు అభిప్రాయపడుతుందని తెలిపారు.

 

General Secretary M Srinivas

 

మరణించిన క్షతగాత్రులైన కార్మిక కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకోవాలని కూడా డిమాండ్ చేశారు.

సంబంధిత ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని తక్షణమే ప్రాసిక్యూట్ చేసి,బిఎన్ఎస్ఎస్
సెక్షన్ 106 లేదా సెక్షన్ 107 కింద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని .

మరణించిన కార్మికులకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లిస్తూ కుటుంబానికి ఒక ఉద్యోగాన్ని ఇవ్వాలని, తీవ్రంగా క్షతగాత్రులైన కార్మికులకు ఒకరికి 50 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కార్పొరేట్ స్థాయి లో వైద్యాన్ని ప్రభుత్వ పరివేక్షణలో యాజమాన్యం మరియు ప్రభుత్వం పూర్తిస్థాయిలో వారు( కార్మికులు) సంపూర్ణంగా కోరుకునే వరకు అందించాలని రాష్ట్ర కమిటీ తరుపున కోరారు.

ఈ సంఘటనపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కార్మిక వర్గానికి తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిస్తున్నట్లు ఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్ ప్రకటించారు.

ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి భూమి పూజ.

ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి భూమి పూజ

38వ వార్డు ఇంచార్జ్ బైరి ప్రవీణ్ కుమార్.

నేటి ధాత్రి సిద్దిపేట:

 

 

 

 

స్థానిక సిద్దిపేట 38వ వార్డులో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుగా ఎంపికైన గాదగోని జయ ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా మంజూరు పత్రాలు అందించారు.

ఈ సందర్భంగా మంగళవారం ఇల్లు నిర్మాణం పనులు మొదలు పెడుతూ భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. మరియు నిర్మాణానికి తొలిమెట్టు అయిన ముగ్గు పోయడం జరిగింది.

ఇట్టి కార్యక్రమానికి లబ్ధిధారైన గాధగోని జయ సిద్దిపేట స్థానిక కాంగ్రెస్ నాయకులు బైరి ప్రవీణ్ కుమార్, సిద్దిపేట నియోజకవర్గ ఇన్చార్జ్ పూజల హరికృష్ణ , 17 వార్డు ఇంచార్జీ, వెంకటేశ్వర గుడి డైరెక్టర్ బైరి నాగమణి మరియు మార్క సతీష్ లను ఆహ్వానించగా వారి ఆధ్వర్యంలో లబ్ధిదారుకు శుభాకాంక్షలు తెలిపి కొబ్బరికాయ కొట్టిన స్థానిక 38వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బైరి ప్రవీణ్ కుమార్ భూమి పూజ చేయడం జరిగిందనీ తెలిపారు.

 

Praveen Kumar.

 

 

ఇట్టి కార్యక్రమంలో 38వ వార్డ్ మున్సిపల్ అధికారి, 2వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు 38వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజు మరియు ఇందిరమ్మ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అక్రమంగా భూములను అమ్ముతున్న వారిపై కఠిన.

అక్రమంగా భూములను అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని.

తాసిల్దార్ కు వినతి పత్రం అందజేసిన వి సి కె పార్టీ నాయకులు.

చిట్యాల, నేటి ధాత్రి :

 

 

 

 

 

చిట్యాల మండలం కేంద్రంలో మంగళవారం రోజున వీసీకే పార్టీ నాయకులు తాసిల్దారును మర్యాదపూర్వకంగా కలసి చల్లగరిగ గ్రామానికి 308 గల సర్వే నెంబర్ కు సంబంధించిన ప్రభుత్వ భూములను కాపాడాలని ఎమ్మార్వో దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది, అన్నారు ప్రభుత్వం అణగారిన వర్గాల ప్రజలకు పేదలకు ఇచ్చిన భూములను చల్లగరిగ గ్రామానికి సంబంధించిన కొంతమంది దళారులు ఆ భూములపై ఎలాంటి హక్కు లేకుంన్నా వారు ఇష్టానుసారంగా ప్రభుత్వ ఆస్తులను సాగు చేసుకుంటూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు పి ఓ టి 1977 చట్టం ప్రకారం ప్రభుత్వ భూములను అమ్మకూడదు కొనకూడదు అని తెలిసినా కూడా ప్రభుత్వం మీద గౌరవం లేకుండా ప్రభుత్వ అధికారులకు తెలియకుండా గ్రామంలో ఉన్న కొంతమంది అక్రమ దారుల అండదండలతో ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన భూములను అన్యాయంగా అమ్ముకోవడం చట్ట విరుద్ధం నేటి వరకు ఎన్ని భూములు అమ్ముకున్నారో ఇంకా మిగులు భూమి ఎంత ఉన్నది అనే విషయాలపై తక్షణమే విచారణ జరిపించి అక్రమ దారులపై తగిన చర్యలు తీసుకుని క్రిమినల్ కేసులు పెట్టాలని గౌరవనీయులు అయినా చిట్యాల మండలం ఎమ్మార్వో కి వివరించడం జరిగింది పలు ప్రభుత్వ భూముల విషయం విన్న ఎమ్మార్వో వెంటనే స్పందించారు తక్షణమే విచారణ జరిపించి పేద ప్రజలకు న్యాయం చేస్తానని ప్రభుత్వ భూములు కాపాడుతానని ఎమ్మార్వో హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో విసికే విముక్త చిరుతల పార్టీ రాష్ట్ర యాత్ అధ్యక్షులు అంబాల అనిల్ కుమార్ విసికే పార్టీ జిల్లా అధ్యక్షులు సిరిపెల్లి రమేష్ మరియు ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు కొల్లూరి అశోక్ నోముల శివశంకర్ సిరిపెల్లి తిరుపతి సిరిపెల్లి రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

వనపర్తి డి పి ఆర్ ఓ కార్యాలయం ఉద్యోగి పదవీ విరమణ వీడ్కోలు

వనపర్తి డి పి ఆర్ ఓ కార్యాలయం ఉద్యోగి తిరుపతయ్య గౌడ్ పదవీ విరమణ వీడ్కోలు సమావేశంలో పాల్గొన్న సీనియర్ జర్నలిస్టులు

వనపర్తి నేటిదాత్రి:

వనపర్తి జిల్లా డి పి ఆర్ ఓ కార్యాలయంలో పనిచేసిన తిరుపతయ్య గౌడ్ పదవీ విరమణ సందర్భంగా వీడ్కోలు సమావేశంలో వనపర్తి సీనియర్ జర్నలిస్ట్ లు మోడాల చంద్రశేఖర్ నరసింహారెడ్డి పోతులరామ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వనపర్తి జిల్లా ఏర్పాటైనప్పటినుంచి డి పి ఆర్ ఓ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న తిరుపతయ్య గౌడ్ వనపర్తి జిల్లా ప్రజలకు విలేకరులకు చేసిన సేవలపై కొనియాడారు ఈమేరకు సీనియర్ జెర్నలిస్టులు తిరుపతయ్య గౌడ్ ను అభినందించారు

error: Content is protected !!
Exit mobile version