శుక్రవారం రోజు కూకట్పల్లి నియోజ కవర్గంలోని జేఎన్టీయూ నుండి హై టెక్ సిటీ రోడ్డు 3వ పేస్ (కెఎస్బేకర్ ) ఎదు రుగా భవిరెడ్డి భూశంకర్ దంపతులు నూతనముగా ఏర్పాటు చేసిన టీ -టైం పాయింట్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅ తిథిగా కూకట్పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ కంటె స్టెడ్ ఎమ్మెల్యే ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ విచ్చేసి టీ టైం-షాపును ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్రేమ కుమార్ మాట్లాడుతూ.. యువత ప్రభు త్వ ఉద్యోగాలపై ఆధారపడకుండా వ్యా పార రంగాలలో రాణించి ఉన్నత శిఖరా లను అధిరోహించాలని అలాగే మరికొం దరికి ఉపాధి కల్పించాలని,యువత యొ క్క స్వయం ఉపాధి ద్వారా దేశాభివృద్ధి తోడ్పడుతుందని,రాష్ట్ర కేంద్ర ప్రభుత్వా లు యువత స్వయం ఉపాధికై రుణాల రూపేనా సహాయం చేయాలని అన్నా రు.ఈ కార్యక్రమంలో కూకట్పల్లి జనసేన పార్టీ కోఆర్డినేటర్ కొల్లాశంకర్,కలిగినిడి ప్రసాద్,అంజి,పులగంసుబ్బు,షణ్ముఖ, సామనరాజు,వెంకటేశ్వరరావు,బాల కోటేశ్వరరావు,శేఖర్,అనిల్,చిన్నం దేవ సహాయం,సు బ్బారావు (సుబ్బు), తోట మురళి భూ శంకర్ బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని జంగేడు పకీరుగడ్డ ఆకు దారి వాడలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ ప్రచార కార్యక్రమానికి బిజెపి పార్టీ భూపాలపల్లి అర్బన్ అధ్యక్షులు సామల మధుసూదన్ రెడ్డి హాజరై ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది అనంతరం మాట్లాడుతూ అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ దేశం అభివృద్ధి చెందుతుంది కావున వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి అరూరి రమేష్ ని కూడా అన్ని వర్గాల ప్రజలు మీ చల్లని మనసుతో ఆశీర్వదించి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు భాస్కర్ సారయ్య సుదర్శన్ వెంకటరామిరెడ్డి దిలీప్ నితిన్ గౌతమ్ సత్యరాజ్ తదితరులు పాల్గొన్నారు
జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండల కేంద్రంలోని జేకే ఫ్యాలస్ ఫంక్షన్ హాల్ లో దొండ్లపల్లి గ్రామానికి చెందిన నెల్లి రామస్వామి కూతురు శిరీష వివాహ వేడుకలో ఆర్ ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి.పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించరు. ఈ కార్యక్రమంలో రాజాపూర్ మండల కేంద్రంలోని పలు రాజకీయ నాయకులు దొండ్లపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ యువకులు తదితరులు పాల్గొన్నారు.
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సుభాష్ కాలనీలో 26 28 38 పోలింగ్ బూత్ లో ఇంటింటికి ప్రచారాన్ని బూత్ అధ్యక్షులు ఆధ్వర్యంలో తొట్ల స్వామి చోట గోపాల అర్జున్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు దొంగల రాజేందర్ హాజరై మాట్లాడుతూ నరేంద్ర మోడీ ని మూడవసారి దేశ ప్రధానిగా ప్రజలు చూడబోతున్నారని అన్నారు వరంగల్ పార్లమెంట్ బిజెపి పార్టీ అభ్యర్థి ఆరూరి రమేష్ కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలి కేంద్రంలో గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక అవినీతి అక్రమాలు పాల్పడింది ఆ యొక్క అవినీతి అక్రమాలను పక్కకు పెట్టి ఇండియా కూటమి పేరుతో ప్రజలను మోసం చేయాలని చూస్తుంది రాష్ట్రంలో అమలు కానీ హామీలను ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిందని అన్నారు ఇలాంటి పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు ప్రపంచ దేశాలు నరేంద్ర మోడీ ని కొనియాడుతున్నారని కానీ మన దేశంలోని కొన్ని దేశద్రోహ వ్యక్తులు బిజెపిని విమర్శలు చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో నాంపల్లి కుమార్ ఓబీసీ మోర్చా అర్బన్ అధ్యక్షులు మరియు గట్ల శ్రీనివాస్ తోట్ల స్వామి చట్టగొప్పుల అర్జున్ హరీష్ సంతోష్ సారంగపాణి వేణు తదితరులు పాల్గొన్నారు
హన్మకొండ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గం శాయంపేట మండల పరిధిలోని పెద్దకోడేపాక గ్రామంలో ఇటీవల అనారోగ్యం కారణంగా చనిపోయిన కోగిల పోచయ్య కుటుంబానికి 50కిలోల బియ్యన్ని కాంగ్రెస్ యువజన నాయకుడు కొగిల అర్జున్ భాధిత కుటుంబానికి అందజేశారు.ఈ కార్యక్రమంలో సాయి,టోనీ,బబ్లు,చంటి, సుమన్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కోటపల్లి మండలంలోని సర్వాయిపేట గ్రామంలో గురువారం అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణ గురించి స్థానికులకు అవగాహన కల్పించడం జరిగింది.ఈ సందర్బంగా మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ జి.సురేష్ కుమార్ మాట్లాడుతూ అటవీ, ప్లాంటేషన్ ప్రాంతాల మీదుగా ఎవరైనా వెళ్ళేటప్పుడు బీడీలు, సిగరెట్ లు తాగి పడేయవద్దని చెప్పారు. అటవీ ప్రాంతం లో ఎటువంటి కారణం చేతనైనా సరే ఒకవేళ అగ్ని ప్రమాదం సంభవిస్తే వెంటనే మాకు సమాచారం ఇచ్చి, ఆ మంటలు అర్పివేయడానికి సహకరించాలని విజ్ఞప్తి చేసారు.ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయని, ఈ సమయం లో అడవులు, ప్లాంటేషన్ లలో నిప్పు అంటుకుంటే చాలా నష్టం జరుగుతుందని, దీంతో పర్యావరణం పై తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పారు.అందువల్ల అటవీ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాల నివారణకు సామాజిక భాద్యత గా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమం లో అటవీ అభివృద్ధి సంస్థ(టి.ఎస్.ఎఫ్.డి. సి )మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ జి. సురేష్ కుమార్ తో పాటు ఫీల్డ్ సూపర్ వైజర్ శ్రీనివాస్, వాచర్ ఓదెలు లు పాల్గొన్నారు.
`పార్లమెంటు ఎన్నికలలో పల్లె, పట్నం బిఆర్‌ఎస్ వైపే!
`నాలుగు నెలల్లోనే తెలంగాణ ప్రజల్లో మార్పిదే!
`కేసిఆర్ పాలనలో పదేళ్ళు కోతలు లేని కరంటు చూశాం!
`ఇప్పుడు కోతలు మళ్ళీ చూస్తున్నాం!
`తెలంగాణ గొంతెండుతోంది.
`జనం గొంతు తడారిపోతోంది.
`కరువు లేని తెలంగాణ చూశాం.
`పదేళ్ళ తర్వాత కరువు గురించి మాట్లాడుకుంటున్నాం.
`ఎండాకాలంలో నీళ్లు చూశాం.
`కళ్ల నిండా పంటలు చూశాం.
`పండిన పంటలతో రోజూ పండగలా బతికాం.
`నాలుగు నెలలకే పదేళ్ళ కింద తెలంగాణ మళ్లా …చూస్తున్నాం.
`తొందరపడినందుకు ఆలోచనలో పడ్డాం.
`నీళ్లు, కరంటు లేక గోసలుపడుతున్నాం!
`మళ్లా కేసిఆర్ రావాలి.
`మా బాధలు తీరాలి.
`కాంగ్రెస్ మీద తొలగిన మబ్బులు!
`నేటిధాత్రి, ఢీ ప్యాక్ సర్వేలో తేలిన నిజాలు.
`మెజారిటీ సీట్లు బిఆర్‌ఎస్ సొంతం.
`టాప్ గేర్‌లో కారు దూసుకుపోవడం ఖాయం!
`పార్లమెంటు ఎన్నికలలో 8కి పైగా సీట్లలో బిఆర్‌ఎస్ విజయం!
`తెలంగాణకు కారే దిక్కనుకుంటున్న జనం.
హైదరాబాద్,నేటిధాత్రి:
పార్లమెంటు ఎన్నికలలో తెలంగాణ ప్రజలు ఎటు వైపు అనేది జోరుగా జరుగుతున్న చర్చ. అదే క్రమంలో ఢీ ప్యాక్, నేటిధాత్రి నిర్వహిస్తున్న సర్వేలలో విస్తుపోయే నిజాలు వెల్లడౌతున్నాయి. పల్లెల్లో ఎక్కడికి వెళ్లినా ప్రజల నాడీ స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజలు బిఆర్‌ఎస్ గురించి ఎక్కువగా మాట్లాడటం కనిపిస్తోంది. సరిగ్గా నాలుగు నెలల క్రితం పల్లెల్లో కాంగ్రెస్ గురించి చర్చ వినిపించేది. ఇప్పుడు తెలంగాణ పల్లెల్లో బిఆర్‌ఎస్‌ను ఓడిరచి, పొరపాటు చేశామన్న భావన ప్రజలు బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సందర్భం తెలంగాణ ఉద్యమ కాలంలో ఎక్కువగా వినిపించేది. మళ్ళీ ఇంత కాలానికి ప్రజల్లో మళ్ళీ స్పష్టమైన చర్చ జరుగుతోంది. తాము గత శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్‌ను నమ్మడం మొదటికే మోసానికి వచ్చిందనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. పల్లెల్లో నీళ్లు కరువౌతున్నాయి. మళ్ళీ బిందెలు కనిపిస్తున్నాయి. అంతెందుకు ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు నింపుకొని తెచ్చుకుంటున్నారు. అంటే ప్రజల గొంతు ఎంత ఎండిపోతుందో అర్థం చేసుకోవచ్చు. పట్టణాలలో సైతం ట్యాంకర్లు దర్శనమిస్తున్నాయి. బోర్లు ఎండిపోవడం, మోటార్లు కాలిపోవడం కనిపిస్తోంది. ఇక రైతులు చదువుతున్న పంచాంగం వింటే కాంగ్రెస్ పెద్దలు చెవులు మూసుకోవాల్సిందే. ఇది ఏప్రిల్ నెల మాత్రమే. ఇంకా మేలో ఎండలు ముందు ముందు తమ ప్రతాపం చూపనున్నాయి. ఈ పరిస్థితులు కచ్చితంగా కాంగ్రెస్‌పై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. బిజేపి పరిస్థితి కాంగ్రెస్ కన్నా గొప్పగా ఏమీ లేదు. కానీ కాంగ్రెస్ కంటే మెరుగైన స్థితిలోనే వుంది. కేంద్రం విషయంలో కొంత సానుకూలత కనిపించినట్లు, అనిపించినా అది పార్టీలోనే ఎక్కువగా వుంది. ప్రజల్లో బిజేపికి అంత ఆదరణ లేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా, బిఆర్‌ఎస్‌కే మెజారిటీ స్థానాలు వచ్చే అవకాశం వుంది. ఇంకా ఎన్నికలకు దాదాపు నెల రోజుల సమయం వుంది. బిఆర్‌ఎస్ గ్రాఫ్ మరింత పెరిగే అవకాశం వుంది. సీట్లు కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణ గోసంతా నీళ్లతోనే…అది కాంగ్రెస్ విస్మరించింది. ఇప్పుడు అదే కాంగ్రెస్‌కు శాపం కానుంది. సీట్ల కోతకు కారణం కానుంది. తెలంగాణలో ప్రజా క్షేత్రంలో వినిపిస్తున్న ప్రజాభిప్రాయానికి, వెలుగులోకి వస్తున్న విషయాలకు ఇటీవల కొంత పొంతన లేకుండా పోతోంది. సర్వేలు కొన్ని వెలువరుస్తున్న విషయాలు వాస్తవాలు వ్యక్తీకరించడం లేదు. పార్టీల వారిగా జరుగుతున్న సర్వేలలో నిజాలు ఒక రకంగా వుంటే, సమాచారాలు మరో రకంగా వుంటున్నాయి. కానీ అసలు విషయాలు పార్టీలకు తెలిసిపోతున్నాయి. ప్రజాభిప్రాయాలను తెలుసుకుంటున్నాయి. వాటిలో పార్లమెంటు ఎన్నికలలో తెలంగాణ విషయానికి వస్తే ఏక పక్ష తీర్పు వుండబోతోందని స్పష్టంగా కనిపించనుందని తెలుస్తోంది. తెలంగాణలో మళ్ళీ కారు రేసులోకి వచ్చిందనే విషయం అన్ని పార్టీలకు అర్థమౌతోంది. సరిగ్గా పదిహేను రోజుల ముందు నాయకులు వేసుకున్న అంచనాలు వేరు. ఇప్పుడు జనం మది నుంచి వినిపిస్తున్న మాటలు వేరు. వాటిని తెలుసుకొని నాయకులు కంగారెత్తుతున్నారని కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. తొందరపడిన వారు కొందరైతే, తప్పక జారుకున్న వారిలో కూడా పశ్చాత్తాపం కనిపిస్తోంది. ప్రజల వ్యతిరేకత ప్రస్పుటంగా తెలిసిపోతోంది. ప్రజలు ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరు, ఎన్ని చెప్పినా వినరు. సరిగ్గా శాసనసభ ఎన్నికలలో ఇదే జరిగింది. ఎప్పుడైతే ఆరు గ్యారెంటీలు ప్రజల్లోకి వెళ్లాయో! అప్పడే ప్రజలు మార్పు కోరుకున్నారు. నిజానికి శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మ్యానిఫెస్టో మొత్తం బిఆర్‌ఎస్ జిరాక్సే. ఎందుకంటే బిఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు బలంగా ప్రజల్లోకి వెళ్లాయి. నిక్కచ్చిగా అమలౌతున్నాయి. వాటికి మరింత కొత్త రూపునిస్తే ప్రజలు మన వైపు చూస్తారని కాంగ్రెస్ అంచనా వేసింది. బిఆర్‌ఎస్ అమలు చేసిన పథకాలకే కొత్త పేర్లు పెట్టి, నిధులు పెంచింది. ఏక కాలంలో, ఏక మొత్తంలో అన్న కాంగ్రెస్ ప్రచారానికి బలం చేకూరింది. అయితే బిఆర్‌ఎస్ మ్యానిఫెస్టో కూడా ముందుగా ప్రకటించిన కాంగ్రెస్‌ను పోలి వుందని ప్రజలు భావించారు. ఎందుకంటే అప్పుడు అధికారంలో వున్న బిఆర్‌ఎస్ ముందుగానే కొన్ని అమలు చేస్తే బాగుండేది. కానీ మరోసారి గెలిపిస్తే అన్న బిఆర్‌ఎస్ ట్యాగ్ లైన్ ప్రజలకు నచ్చలేదు. దానికి తోడు కాంగ్రెస్ చెప్పిన విషయాలను ప్రజలు బలంగా నమ్మారు. అప్పుటికే బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఆగడాలు మరీ మితిమీరి పోయాయి. మరో సారి అదే బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు ఓట్లేస్తే మరింత నరకం చూస్తామని అనుకున్నారు. కొంతమంది బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే మూలంగా ఎంతో గొప్ప పథకాలు కూడా పక్కకు పోయాయి. కాంగ్రెస్ వాగ్థానాలు ముందుకొచ్చాయి. రైతుబంధును రైతు భరోసా పేరుతో రూ.15 వేలు కాంగ్రెస్ ఇస్తామని చెప్పింది. అయినా ఇప్పటికీ ప్రజల మదిలో రైతు బంధు అనేదే నాటుకుపోయింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు కూడా రైతు బంధు అనే సంబోదిస్తున్నారు. ప్రస్తావిస్తున్నారు. సకాలంలో రైతు బంధు పడలేదన్నదానిపై ప్రతిపక్షాల నుంచి విమర్శలున్నాయి. ఆ ఆరోపణలపై నిదానంగా సమాధానం చెబితే బాగుండేది. కానీ బాధ్యత కలిగిన నేతలు చెప్పుతో కొట్టాలని అనడం వివాదాలకు దారి తీసింది. అలా మొదలైన వివాదాలు నాలుగు నెలలుగా ముసురుతూనే వున్నాయి. ప్రభుత్వ పథకాల మీద ప్రభావం చూపుతూనే వున్నాయి. ఇంతలో పార్లమెంటు ఎన్నికలు రానే వచ్చాయి. ప్రజల ఆలోచనా తీరులో మళ్ళీ మార్పులు వస్తూనే వున్నాయి. ప్రభుత్వ పథకాలు ఎలా వున్నా తెలంగాణలో నీళ్లు, కరంటు అన్నది కీలక పాత్ర పోషిస్తోంది. కేసిఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో తెలంగాణను దోచుకుతిన్నదని గత శాసనసభ ఎన్నికలలో నమ్మిన ప్రజలు పార్లమెంటు ఎన్నికలలో నమ్మడానికి సిద్ధంగా లేరు. ఇంత కాలం కేసిఆర్ ఇచ్చినవి కాళేశ్వరం నీళ్లు కాకుంటే, కాంగ్రెస్ నీళ్లు ఎందుకు ఇవ్వలేకపోతోందని ప్రజల్లో ప్రశ్న మొదలైంది. అది మళ్ళీ తెలంగాణలో చర్చకు దారి తీసింది. అతి తక్కువ కాలంలోనే ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై అసహనం మొదలైంది. దానంతటికీ కారణం నీళ్లు. కరంటు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుర్తించలేకపోయింది. పదేళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మొదటి రోజు నుంచి ఎంతో జాగ్రత్తగా అడుగులేల్సి వుంది. అది విస్మరించారు. ప్రజా సమస్యలు గాలికి వదిలేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పులపై తవ్వకాలు మొదలుపెట్టారు. మొదట శ్వేత పత్రాలన్నారు. తర్వాత విచారణలన్నారు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అంటూ గత ప్రభుత్వ హయాంలో జరిగిన సంఘటనలు వెలుగులోకి తెస్తూ వచ్చారు. గత ప్రభుత్వాన్ని నిత్యం విమర్శించడానికే పూర్తి కాలం వినియోగించారు. ఇచ్చిన హామీలు ఎలా అమలు చేయాలో అర్థం కాక, గత కేసిఆర్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయడమొక్కటే అలవాటు చేసుకున్నారు. ప్రతిపక్ష బిఆర్‌ఎస్ పై విరుచుకుపడడంతోనే కాలయాపన చేస్తున్నారు. ఆరు గ్యారెంటీలపై ప్రజలు అడగకుండా, రోజుకో కొత్త విషయం తెచ్చి సమాజం మీద రుద్దుతున్నారు. రైతులకిచ్చిన హామీలు మర్చిపోయారు. కనీసం నిరంతర కరంటు, సాగుకు ఇబ్బంది లేకుండా నీళ్లు ఇస్తే కాంగ్రెస్ కు ఇంత సమస్య వచ్చి వుండేది కాదు. దాంతో ఎండాల్సినంత వరి ఎండిపోయింది. పండిన పంట అమ్మకానికి దిక్కులేకుండా పోయింది. రైతు కోసం శాపంగా మారే తరుణం వచ్చేసింది. కారుకు జోరును పెంచింది. కేసిఆర్ అధికారంలో వుంటే సమస్యలు వుండేవి కాదన్న చర్చ మొదలైంది. పల్లెల్లో, పట్నాలలో మళ్ళీ కారుకు అనుకూల వాతావరణం ఏర్పడుతోంది. ఎన్నికల నాటికి ఇది మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ సారు, సారు అని కేసిఆర్‌ను కలవరిస్తోంది.
అధ్యక్షులుగా బండారి కుమార్ ప్రధాన కార్యదర్శిగా బండారి అశోక్ మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం మొగుళ్లపల్లి అంబేద్కర్ యువజన సంఘం గ్రామ అధ్యక్షులుగా బండారి కుమారు ప్రధాన కార్యదర్శిగా బండారి అశోక్ లను ఏకగ్రీవంగాఎన్నుకున్నట్లు మండల అధ్యక్షులు మంగళపల్లి శ్రీనివాస్ తెలిపారు అనంతరం నూతన గ్రామ అధ్యక్షులు బండారి కుమార్ మాట్లాడుతూ సంఘానికి లోబడి ఉండి సంఘం యొక్క విధివిధాలను అనుసరిస్తూ సంఘం యొక్క అభివృద్ధి కోసం నా సాయి శక్తుల పని చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు.నాపై నమ్మకం ఉంచి నన్ను గ్రామ కమిటీ అధ్యక్షులుగా నా ఎన్నికలకు సహకరించిన మండల అధ్యక్షులకు సీనియర్ నాయకులకు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు
చందుర్తి, నేటిధాత్రి: చందుర్తి మండలం మల్యాల గ్రామంలో క్రీడాకారులకు టిఆర్ఎస్ సీనియర్ నాయకులు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు ఈర్లపల్లి రాజు గురువారం క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఈర్లపల్లి రాజు మాట్లాడుతూ గ్రామీణ యువత, క్రీడాకారులు వేసవికాలంలో చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ క్రీడల పై దృష్టి సారించాలన్నారు. గత టిఆర్ఎస్ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి పెద్దపీట వేసిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు క్రీడాకారులు పాల్గొన్నారు.
కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగులూరి మల్లేశం గౌడ్…..
కొల్చారం,(మెదక్ )నేటి ధాత్రి:-
మెదక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి.. ముదిరాజ్ ముద్దుబిడ్డ నీలం మదును భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కొల్చారం మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగులురి మల్లేశం గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోకసభ ఎన్నికల్లో నీలం మధు విజయాన్ని ఎవరు ఆపలేరని, భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని , ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులంతా, కష్టపడి నీలం మధు గెలుపు కోసం కృషి చేయాలని మల్లేశం గౌడ్ అన్నారు.
మెదక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి.. ముదిరాజ్ ముద్దుబిడ్డ నీలం మదును భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు భాగ్యరాజ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోకసభ ఎన్నికల్లో నీలం మధు విజయాన్ని ఎవరు ఆపలేరని, భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని , ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులంతా, కష్టపడి నీలం మధు గెలుపు కోసం కృషి చేయాలని భాగ్యరాజ్ అన్నారు.
వనపర్తి నేటిదాత్రి ; వనపర్తి జిల్లా కేంద్రంలో రాజవారి హాస్టల్ భవనం పాలిటెక్నిక్ భవనం శిథిలావస్థలో ఉన్నదని అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ పాలిటెక్నిక్ విద్యార్థుల తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐక్యవేదిక పోరాటంతో గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం 22 కోట్లకు నిధులు కేటాయించిందని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అట్టి జీవోలు మార్చి ఆ నిధులతో వెంటనే పనులు ప్రారంభించాలని ఎమ్మెల్యే మెగా రెడ్డిని ఒక ప్రకటనలో విద్యార్థుల తరఫున కోరారు
జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని దొండ్లపల్లి గ్రామ పంచాయతికి చెందిన నేల్లి రామస్వామి కూతురు శిరీష వివాహానికి 10,000/- రూపాయలు అభిమన్యు యువసేన సభ్యుల ద్వారా ఆర్థిక సహాయన్ని బీఆర్ఎస్ పార్టీ యువనేత శ్రీ చించోడ్ అభిమన్యు రెడ్డి.అందించరు
ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీదేవి రంజిత్ గౌడ్, శశిధర్, వార్డు మెంబెర్స్ లింగమయ్య, పండ్ల చెన్నయ్య, యువసేన నాయకులు రాములు, మహేష్, సత్యనారాయణ, నాగరాజు, మల్లేష్, రామస్వామి, కృష్ణయ్య, రామస్వామి, నర్సింలు, కృష్ణయ్య, రామస్వామి గ్రామస్తులు బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
# మండుతున్న ఎండలు ప్రజల దాహర్థి తీర్చే దిశగా పోలీసులు ముందడుగు
ములుగు జిల్లా నేటిధాత్రి
ములుగు పట్టణంలోని స్థానిక బస్టాండ్ సెంటర్ లో ములుగు ఎస్ పి గారి చొరవతో స్థానిక ఎస్సై వేసవి దృష్ట్యా చలివేంద్రం ఏర్పాటు చేశారు దీనిని గురువారం నాడు జిల్లా ఎస్పి ప్రారంభించారు కార్యక్రమంలో ఎస్పి మాట్లాడుతూ ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలు ప్రయాణికుల దాహార్తి తీర్చేందుకు స్థానిక ఎస్ ఐ సి ఐ చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమని ప్రజలు పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృశ్య జాగ్రత్తలు పాటించాలని ముఖ్యంగా పిల్లలు ముసలివారు అత్యవసరం అనుకుంటే తప్ప ఎండలో బయటికి రాకూడదని తప్పని పరిస్థితులలో గొడుగు, మంచి నీరు వెంట ఉంచుకోవాలని తెలియచేసారుఈ కార్యక్రమంలో డి ఎస్ పి ములుగు రవీందర్ సి ఐ ములుగు రంజిత్ కుమార్ ఎస్ ఐ వెంకటేశ్వర్లు ఎస్ ఐ లక్ష్మా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హిందువుల ఆరా ధ్యదైవమైన శ్రీరా ముడు అవతరించిన రోజు,సీతారా ముల కల్యాణ మహోత్సవం జరిగిన రోజే శ్రీరామనవమి అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజ్య పాలన చేసిన శ్రీరాముడు ఆదర్శ పరిపాలకుడని ప్రేమ కుమార్ అన్నా రు. అన్యోన్య దాంపత్యానికి సీతారా ములు ఆదర్శనీయులని ప్రేమ కు మార్ తెలిపారు.శ్రీరామ నవమి సంధర్భంగా….. ఈరోజు శ్రీ జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహా సంస్థా నము, శ్రీ విశ్వనాథ స్వామి ఆలయ సముదాయము.శ్రీహనుమధ్ల క్ష్మణ సీతా సమేత శ్రీ రామచంద్ర స్వామి వార్ల ఆలయ త్రాయోవింశతి వార్షిక బ్రహ్మోత్సవల్లో బాగంగా,వసంతన గర్లో సీతా రాముని కళ్యాణంలో ప్రేమ కుమార్ పాల్గొన్నారు.ఈ సంధర్భంగా ఆలయ అధికారులు ప్రేమ కుమార్ ని శాలువాతో సన్మా నించారు.అనంతరం శ్రీరామనవమి సందర్భంగా నేడు కూకట్పల్లి నియో జకవర్గం జనసేన పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ముమ్మారెడ్డి ప్రేమ కుమా రు నియోజకవర్గంలో వసంతనగర్, 5వ ఫేస్ వినాయక గ్రౌండ్,ఎం ఐ జి గ్రౌండ్స్, హెచ్ఐజి కెపిహెచ్బి 1వ పేస్ లో హెచ్ఐజి గ్రౌండ్ కెపిహెచ్బి ఒకటి ప్లేస్ లో తెలంగాణ స్టేట్ స్ట్రీట్ వెండ ర్ అసోసియేషన్ వారు నిర్వ హిం చిన,వి.రామారావు నగర్,మోతీన గర్ లలో సీతారాములవారి కళ్యా ణము లో పూజ కార్యక్రమము లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కొల్లా శంకర్,షణ్ముఖ,రఘు,పులగం సుబ్బు,మధుసూదన్రెడ్డి,అంజి,సా లాది శంకర్ ,సత్యసాయి,వీరమహి ళలు సత్యా ఎర్ర,అడబాల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
– కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు తరఫున మొదటి సెట్ నామినేషన్ దాఖలు…
కొల్చారం, ( మెదక్ )నేటి ధాత్రి :-
మొదట మెదక్ పట్టణంలోని దత్తాత్రేయుని దేవాలయంలో పూజల అనంతరం మెదక్ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేసిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, నర్సాపూర్ ఇంచార్జ్ రాజిరెడ్డి,మెదక్ డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్,మెదక్ మునిసిపల్ చైర్మన్ చంద్రపాల్. మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ గారి పక్షాన మొదటి సెట్ నామినేషన్ పత్రాలను ఆయన తరుపున మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ అధ్వర్యంలో ఎన్నికల అధికారి రాహూల్ రాజ్ కు అందచేసారు. ఈ మేరకు మైనంపల్లి రోహిత్ నర్సాపూర్ కాంగ్రెస్ ఇంచార్జి ఆవుల రాజి రెడ్డి, మెదక్ డిసిసి అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ ,మెదక్ మున్సిపల్ ఛైర్మెన్ చంద్ర పాల్ తో కలిసి మెదక్ కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి రాహూల్ రాజ్ కు పత్రాలు అందజేసి నామినేషన్ దాఖలు ప్రక్రియను పూర్తి చేశారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
భద్రాచలం పట్టణంలోని అల్లూరి సీతారామరాజు కాలనీలో కొలువై ఉన్న శ్రీ సమ్మక్క సారలమ్మ ఆలయంలో గత 14 సంవత్సరాలుగా వనదేవతల ఆశీస్సులు, కృపాకటాక్షాలతో భక్తులచే సాంప్రదాయంగా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతున్న శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతర మహోత్సవము ఆహ్వానమును భద్రాచలం ఎంఎల్ఏ తెల్లం వెంకట్రావుకు ఆలయ ధర్మకర్తలు మరియు జాతర నిర్వాహకులు కుంజా ధర్మారావు, కుంజా సంతోష్ కుమార్, కుర్సం విశ్వశాంతి అందచేశారు.
ఈ గిరిజనుల ఇలవేల్పుల జాతర ది. 22-04-2024 నుండి ది.24-04-2024 మూడు రోజుల వరకు ఘనంగా నిర్వహించబడుతుందని, కావునా శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల దైవ సేవలో భక్తులందరూ మనస్ఫూర్తిగా భాగస్వాములు కాగలరని ఆశిస్తున్నామని జాతర నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రత్నం రమాకాంత్, చిట్టిబాబు, పుల్లగిరి నాగేంద్ర, ఎండి నవాబ్, బంబోతుల రాజీవ్ తదితరులు పాల్గొన్నారు.
-చిట్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి సుదర్శన్ గౌడ్ మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ కాంగ్రెస్ పార్టీ ఏడాది పాటు ఉంటదో ఉండదేమోనని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టు లాంటిదని చిట్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి సుదర్శన్ గౌడ్ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పీకల్లోతు కుంభకోణాల్లో ఇరుక్కున్న కేసీఆర్ అసహనంతో రేవంత్ రెడ్డిపై పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతున్నాడన్నారు. బిజెపి, బీఆర్ఎస్ నాయకులు పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు పూర్తి మెజార్టీని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చిన విషయం గుర్తేరుగాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు పదవులకు, డబ్బులకు, ప్రలోభాలకు ఆశపడే రకం కాదన్నారు. కరుడుగట్టిన నిబద్ధత కలిగిన నాయకులే మా శాసనసభ్యులుగా ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. గత పది సంవత్సరములు అధికారంలో ఉన్న కేసీఆర్ ఏ ఒక్కరోజు కూడా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయని వ్యక్తి అని, ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వల్ల అంబేద్కర్ కు అవమానం జరిగిందని మాట్లాడడం కేసీఆర్ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ఎన్నికల నిబంధనలు అమలులో ఉన్న దృష్ట్యా ప్రభుత్వం ఆధ్వర్యంలో మహానాయకుల జయంతి ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహించలేకపోయిందన్నారు. ఈ నెలలో సర్దార్ సర్వాయి పాపన్న, దొడ్డి కొమురయ్య, కొమరం భీం, అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఉండగా వాటిని కూడా ప్రభుత్వం ఎన్నికల కోడ్ ఉన్నందున నిర్వహించలేకపోయిందన్నారు. అంతేకాకుండా భద్రాచలంలో శ్రీ రాముల వారి కళ్యాణ మహోత్సవానికి కూడా ఎన్నికల కోడ్ రావడం వలన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వెళ్లలేకపోయారని, వాస్తవ పరిస్థితి ఈ విధంగా ఉంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వాస్తవాన్ని వక్రీకరించి..తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడడం ఆయన ద్వంద నీతికి నిదర్శనం కాదా అని ప్రశ్నించారు.
జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండల కేంద్రంలో చారుకొండ రాములమ్మ(65) అనారోగ్యంతో మరణించారు. మృతికి సంతాపం తెలిపిన బి ఆర్ ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి. అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయన్ని యువసేన సభ్యుల ద్వారా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎ ఎం సి డైరెక్టర్ వనపర్తి దేవేందర్, బాలయ్య, లింగం, గోపాల్, నర్సింహులు, శేఖర్, నర్సింహులు గ్రామస్తులు, యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
– మెదక్ జిల్లా కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి….
– సమావేశానికి హాజరైన కొల్చారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులూరి మల్లేశం గౌడ్, దేవన్న గారి శేఖర్…
కొల్చారం, (మెదక్ )నేటిధాత్రి :-
గురువారం నాడు నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతు మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ గారు ఈనెల 20వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. వారితో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ గారు, అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రివర్యులు, మెదక్ పార్లమెంట్ ఇన్చార్జి కొండా సురేఖ విచ్చేస్తూనారు అని తెలిపారు. మెదక్ రాందాస్ చౌరస్తాకు ఉదయం 10:00గంటలకు భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది.కావున ఎంపీ అభ్యర్థి నీలం మధు నామినేషన్ దాఖలు కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని పార్టీ నేతలు నాయకులకు పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త బూత్ స్థాయి నాయకుల నుంచి మండల స్థాయి నాయకుల వరకు పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎలా కాపాడుకున్నరో అదేవిధంగా దేశని కూడా కాపాడుకోవడనికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సైనికుల పనిచేయాలని అన్నారు. ఒకరు మతం వాదంతో మరొకరు ప్రాంతీయవాదంతో ముందుకు వెళుతున్నరు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు దేశాని కాపాడుకోవలి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొట్టమొదటిసారిగా మెదక్ జిల్లాకు విచ్చేసిన తరుణంలో ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త పాల్గొని దిగ్విజయం చేయాలని కోరారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్రోహి అని అన్నాను. కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులు అనుభవించి పార్టీకి నమ్మకద్రోహం చేశారన్నారు. గత ప్రభుత్వంలో వడ్ల కల్లాల వద్ద రైతులు మరణించిన పట్టించుకోలేదు అన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం కొనసాగుతుందని ఆగస్టు 15 లోపు రైతులకు రెండు లక్షల రుణమాఫీ జరుగుతుందని అన్నారు. ప్రజా పాలనలో ఇప్పటికే ఐదు గ్యారంటీలను అమలు పరచామన్నారు. మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు గారిని గెలిపించి సోనియా గాంధీ గారికి గిఫ్టు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్, మాజీ జడ్పీటీసి శ్రీనివాస్ గుప్తా, కొల్చారం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులూరి మల్లేశం గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దేవన్న గారి శేఖర్, అన్ని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ,బ్లాక్ అధ్యక్షులు , మహిళ అధ్యక్షులు, యుత్ కాంగ్రెస్ నాయకులు ఎన్ ఎస్ యు ఐ నాయకులు అనుబంధ సంస్థ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.