పలు పార్టీల నుండి కాంగ్రెస్ లోకి చేరికలు

ఎంపీగా కడియం కావ్య కు భారీ మెజార్టీ ఖాయం

నడికూడ,నేటి ధాత్రి:
వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా కడియం కావ్య గెలవడం ఖాయమని వరంగల్ పార్లమెంట్ ఇంచార్జ్,పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. శుక్రవారం పరకాల నియోజకవర్గం నడికూడ మండల కేంద్రంతో పాటు గొల్లపల్లెకు చెందిన బిఆర్ఎస్, బిజెపి 30 మంది నాయకులు నడికూడ మండల అధ్యక్షుడు బుర్ర దేవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.వారికి ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వరంగల్ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఎప్పుడో ఖాయం అయిందని, భారీ మెజార్టీ లక్ష్యంగా ముందుకు వెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీలో చేరినవారు నడికూడ మండల ముదిరాజ్ సొసైటీ చైర్మన్ తాళ్ల శ్యామ్ రాజ్ తో సహా 30 మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.ఈ కార్యక్రమం లో నడికూడ మండల ప్రధాన కార్యదర్శి కుడ్ల మలహాల్ రావు,గ్రామ కమిటీ అధ్యక్షుడు తాళ్ల నవీన్, మండల మహిళా అధ్యక్షురాలు భోగం కమల, మండల యూత్ అధ్యక్షులు అప్పం కుమారస్వామి, పరకాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఈర్ల చిన్ని,మండల ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి దుప్పటి సదానందం, ఓ బి సి హనుమకొండ జిల్లా కన్వీనర్ బొమ్మ చంద్రమౌళి, సీనియర్ నాయకులు నారగాని కుమార స్వామి, వాంకె రాజయ్య,రావుల సురేష్,గ్రామ సమన్వయ కమిటీ సభ్యురాలు నీరటి రజిత,గ్రామ ప్రధాన కార్యదర్శి జీల శ్రీనివాస్,మండల సమన్వయ కమిటీ సభ్యులు పెద్ద బోయిన రవీందర్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ఉపాధి పని వారికి స్పందించిన అధికారులు

గణపురం నేటి ధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో ఉపాధి కూలీలకు కనీస అవసరాలు టెంటు ,మంచినీటి సౌకర్యం ,మెడికల్ కిట్లు, ఏర్పాటు చేయాలని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కోగిల జితేందర్ చేసిన డిమాండ్లకు స్పందించిన అధికారులు

కంఠమేశ్వర స్వామి ఉత్సవాలకు హాజరైన మోకుదెబ్బ రమేష్ గౌడ్

# వైభవంగా మొదలైన కంఠమేశ్వర స్వామి వేడుకలు..

నర్సంపేట,నేటిధాత్రి :

వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం లోని వెంకటాపురం గ్రామంలో శుక్రవారం జరిగిన శ్రీ కంఠమేశ్వేర స్వామి పండుగ ఉత్సవాలకు గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నాలుగు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో భాగంగా ఈ నెల 18 న ఆలయంలో దోర్నపాక అలంకరణ జరుగగా శుక్రవారం రోజు గ్రామంలోని గౌడ కులానికి చెందిన పురుషులు నూతన తెల్ల వస్త్రాలు ధరించి కొత్త బిందెలో పరిశుభ్రమైన నీరు పోసి బిందెలు ఎత్తుకొని గౌడ పూజారులు రమేష్,లక్ష్మణ్ ల ఆధ్వర్యంలో డప్పు చప్పుళ్లతో ఊరేగింపుగా ఆలయంలోని విగ్రహలకు జలాభిషేకం చేశారు.ఈ సందర్బంగా మంగళహారతులతో మహిళలు,బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ గౌడ సంఘం అధ్యక్షులు పొగాకు కృష్ణమూర్తి గౌడ్, ఉపాధ్యక్షులు కక్కేర్ల సాంబయ్య గౌడ్, కోశాధికారి బొమ్మగాని సదానందం గౌడ్, పొగాకు సదయ్య గౌడ్, గుండెబోయిన సుధాకర్ గౌడ్, గుండె బోయిన సాంబయ్య గౌడ్, ముత్యాల వెంకన్న గౌడ్, గడ్డమీది శివశంకర్ గౌడ్, బొమ్మగాని రాజేష్ గౌడ్, పొగాకు సమ్మాలు గౌడ్, మోకుదెబ్బ జిల్లా అధ్యక్షులు గోపగాని వెంకట్ గౌడ్, రాష్ట్ర నాయకులు మద్దెల సాంబయ్య గౌడ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పంజాల వెంకట్ గౌడ్, జిల్లా ప్రచార కార్యదర్శులు జునూరి నరేష్ గౌడ్, గోపగాని శోభన్ గౌడ్, దుగ్గొండి మండలం అధ్యక్షులు తడుక కొమురయ్య గౌడ్, పొగాకు రమేష్ గౌడ్, డివిజన్ యువజన సంఘం అధ్యక్షులు ఎరుకొండ కర్ణాకర్ గౌడ్, కక్కేర్ల రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఎల్లమ్మ బండలో కొత్తగా ఏర్పాటుచేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని శేరిలింగం పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ ప్రారంభించారు.

కూకట్పల్లి ఏప్రిల్ 19 నేటి ధాత్రి ఇన్చార్జి

124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధి లోని ఎల్లమ్మబండలో నూతనంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారం భోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్, స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి సోదరుడు నరేందర్ రె డ్డి,సంజీవ్ రెడ్డి పాల్గొని రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంబించడం జరిగిం ది.ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లా డుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు,మ హిళా నాయకురాళ్లు అందరుకలిసి సమి ష్టిగా పనిచేసి చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డిని ఆల్విన్ కాలనీ డివి జన్ తరపున అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించుకోవాలని అన్నా రు.కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూన సత్యంగౌడ్,సంజీవరెడ్డి మన్నేపల్లిసాంబశివరావు,కార్యకర్తలు,
మహిళా నాయకురాళ్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఘనంగా విగ్రహ ప్రతిష్ట మహోత్సవ ప్రారంభం

మలహార్ రావు, నేటిధాత్రి ;
మండల కేంద్రమైన తాడిచర్ల గ్రామంలో ఆంజనేయ శివ పంచాయతన ఆలయంలో గణపతి, పార్వతి, శివుడు, సూర్యభగవనుడు, విష్ణుమూర్తి ల విగ్రహల ప్రతిష్ట మహోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శుక్ర, శని, ఆదివారం మూడు రోజుల పాటు ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించనున్నారు. 19న శుక్రవారం గణపతి పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, దీక్షా స్వీకారం, ఋత్విక్వర్ణనం, నవగ్రహ, యోగిని, వాస్తు క్షేత్రపాలక బ్రహ్మది మండల పూజలు, అగ్నిప్రతిష్ట దేవతా హోమాలు విగ్రహాజలాధి వాసాలు నిర్వహించారు. ప్రతిష్టాపన సందర్భంగా నిర్వహించిన హోమం కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శనివారం రోజున గణపతిపూజ, పుణ్యాహవాచనం, విగ్రహ పాలాభిషేకము, స్థాపిత దేవతా పూజలు, హోమాలు, విగ్రహ ధ్యానఫల, పుష్ప శయ్యాధివాసాలు నిర్వహించనున్నారు. ఆదివారం రోజున బ్రహ్మముహూర్తంలో లక్ష్మీనారాయణ హోమం గర్తన్యాసం, యంత్రప్రతిష్ట, విగ్రహప్రతిష్ట, దృక్బలి, దిక్బలి. పూర్ణహూతి అనంతరము భక్తులకు దర్శనం కల్పించనున్నారు. మూడు రోజుల పాటు సాగే ఈ ప్రతిష్టాపన కార్యక్రమంలో భక్తుల అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు తెలిపారు. తాడిచెర్ల ఆలయ అభివృద్ది కమిటి ఆధ్వర్యంలో ప్రతి రోజు అన్నదాన కార్యక్రమము నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

బావిలో దూకి వృద్ధురాలు ఆత్మహత్య..

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

ఓదెల గ్రామానికి చెందిన చింతం లక్ష్మి వయసు 74 భర్త పేరు చంద్రయ్య వయసు 80 తన ఆరోగ్యపరంగా బాగా లేకపోవడంతో నిత్యం ఇంట్లో ఏదో రకమైన ఇబ్బందులను భరించలేక శుక్రవారం ఐదు గంటలకు లేచి నాగులకుంట వెనకాల ఉన్న బావిలో పడి ఆత్మహత్య చేసుకుంది. వెనకాలనే ఆమెను గమనించుకుంటూ వచ్చిన గ్రామస్తులు ఆమె అందులో పడగానే ఆమెను కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుంట పోయిందని గ్రామస్తులు తెలిపారు.వెంటనే పొత్కపల్లి ఎస్ఐకి సమాచారం అందడంతో సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టి మృతదేహాన్ని పోస్టుమార్టంకి పంపించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏ ఎస్ ఐ లక్ష్మీ రాజం గౌడ్ తెలిపారు.

జైపూర్ మండల్ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా కాసిపేట సతీష్ కుమార్ నియామకం

జైపూర్, నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని నరసింగాపూర్ గ్రామానికి చెందిన కాసిపేట సతీష్ కుమార్ ను జైపూర్ మండలం సోషల్ మీడియా ఇన్చార్జిగా చెన్నూరు శాసనసభ్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు వంశీకృష్ణ చేతుల మీదుగా శుక్రవారం నాడు నియామక పత్రాన్ని అందుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని కాంగ్రెస్ నాయకులతో కలిసి సోషల్ మీడియాను ఒక బలమైన శక్తిగా తయారు చేస్తానని అన్నారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వంశీకృష్ణ గెలుపు కోసం ఒక సైనికుల పనిచేస్తానని అన్నాడు.ఈ అవకాశం ఇచ్చిన శాసనసభ్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పదవి రావడానికి సహకరించిన పెద్దపల్లి పార్లమెంట్ ఓఆర్డినేటర్ అరుణ్ వాల్మీకి జిల్లా కోఆర్డినేటర్ శశిధర్, చెన్నూర్ నియోజకవర్గం కోఆర్డినేటర్ సృజన్ కి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు.

మానుకోట కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు భారీగా తరలి వెళ్ళిన భద్రగిరి కాంగ్రెస్ శ్రేణులు

భద్రాచలం నేటిదాత్రి

మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి *పోరిక బలరాం నాయక్ విజయాన్ని కోరుతూ భద్రాచలం నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే *తెల్లం వెంకట్రావు వెంట మానుకోట కి తరలి వెళ్లారు.

టిపిసిసి ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ అన్ని విభాగాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఈరోజు ఉదయం నుంచే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం చేరుకొని అక్కడి నుంచి సుమారు 150 కార్లలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి పాల్గొనే మానుకోట బహిరంగ సభకు
పోరిక బలరాం నాయక్ విజయమే ధ్యేయంగా సభకు తరలి వెళ్లారు.

*పోరిక బలరాం నాయక్ విజయం కోసం భద్రాచలం నుంచి తరలి వెళ్లిన కాంగ్రెస్ నాయకులు.

టిపిసిసి సభ్యులు బుడగం శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బలుసు నాగ సతీష్,భద్రాచల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సరెళ్ళ నరేష్, పట్టణ కార్యదర్శి దొడ్డిపట్ల కోటేష్,రత్నం రమాకాంత్, కొండశెట్టి కృష్ణమూర్తి, ఇందుల రమేష్, ఎన్ ఎస్ యు ఐ నియోజకవర్గ అధ్యక్షులు సరెళ్ళ వెంకటేష్, మైనార్టీ సెల్ పార్లమెంట్ ఎలక్షన్ ఇంచార్జ్ మహమ్మద్ జిందా,బంబోతుల రాజీవ్, చింతాడి చిట్టిబాబు, నర్రా రాము, ధనకొండ ప్రసన్న, చింతాడి రామకృష్ణ,రాజశేఖర్, హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు రెడ్డి బత్తుల కృష్ణారెడ్డి, ఎండి నవాబ్,నాగేంద్ర, గాడి విజయ్, భాను, బండారు నాగేశ్వరరావు, కొప్పుల శీను, కేతినేని లలిత,తదితర కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో సభకు తరలి వెళ్లారు.

ముదిగుంట,నర్వ గ్రామాలలో పర్యటించిన ఎంపీడీవో

జైపూర్, నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ముదిగుంట గ్రామంలో శుక్రవారం రోజున ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్ పర్యటించారు. ముదిగుంట గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పర్యవేక్షించి, వేసవికాలం కాబట్టి ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఉదయం పూటనే పనులు పూర్తి చేసుకుని వెళ్లాలని, నిర్దేశించిన కొలతల్లోనే పని సక్రమంగా చేయాలని కూలీలకు తగు సూచనలు చేయడం జరిగింది. అలాగే కూలీలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎండ తాపం నుండి రక్షణగా టెంటు మరియు ప్రథమ చికిత్స కిట్టు, మంచినీటి సౌకర్యం అన్ని అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఫీల్డ్ అసిస్టెంట్ కి తెలియజేయడం జరిగింది. తదనంతరం నర్వ గ్రామంలో పర్యటించి మిషన్ భగీరథ వాటర్ ట్యాంకును, పైప్ లైన్లు లీకేజ్ జరుగు స్థలాలను పరిశీలించి వెంటనే సమస్యలను పరిష్కరించమని గ్రామపంచాయతీ సిబ్బందికి తెలియజేయడం జరిగింది. గ్రామంలో మంచినీటి సమస్య లేకుండా చూసుకోవాలని, పారిశుద్ధ్య కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించాలని గ్రామ పంచాయతీ సిబ్బందికి మరియు పారిశుద్ధ్య కార్మికులకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్, గ్రామపంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, పారిశుద్ధ్య కార్మికులు, ఉపాధి హామీ కూలీలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఎన్నికల తర్వాత ఎమ్మెల్యే చెరువుల కబ్జాలను బట్ట బయలు చేస్తాం:సీనియర్ కాంగ్రెస్ నాయకులు సత్యం శ్రీరంగం

కూకట్పల్లి ఏప్రిల్ 19 నేటి ధాత్రి ఇన్చార్జి

మల్కాజ్ గిరి పార్లమెంట్ స్థానంలో తన గెలుపు తద్యమని మల్కాజ్ గిరి పార్ల మెంటు కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేంద ర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.శుక్రవారం కూకట్పల్లి నియో జకవర్గంలోని కె.పి.హె చ్.బి.కాలనీలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.ముందుగా వరసిద్ధి వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎమ్ఐ జిఫ్లాట్స్ లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గమాజీ అ ధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాల యాన్ని సునీత మహేందర్ రెడ్డి ప్రారం భించారు.అనంతరం హౌసింగ్ బోర్డ్ ఫంక్షన్ హాల్లో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ …కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పని చసిన కార్యకర్తలకు గుర్తింపు ఉంటుంది అన్నారు.భవిష్యత్తులో ఇంది రమ్మ కమిటీల ద్వారా కాంగ్రెస్ పార్టీ కార్య కర్తలకు న్యాయం జరుగుతుందన్నా రు.తనను నాన్ లోకల్ అంటున్నారని అసలు సిసలైన లోకల్ అ భ్యర్థిని తానే నని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

విద్యుత్ ఘాతంతో ట్రాక్టర్లో తరలిస్తున్న గడ్డి దగ్ధం.

చిట్యాల, నేటి ధాత్రి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చింతకుంట రామయ్య పల్లి లో శుక్రవారం రోజున విద్యుత్ ఘాతంతో ట్రాక్టర్లో తరలిస్తున్న గడ్డి దగ్ధం అయ్యింది వెంటనే గ్రామంలోని గ్రామస్తులు సకాలంలో స్పందించిన గ్రామపంచాయతీ ట్రాక్టర్ తో నీళ్లు తెప్పించి మంటలు ఆర్పడం జరిగింది దీంతో గ్రామస్తులు పెను ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు. విద్యుత్ ఘాతం కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

రామారావు పేట, ఇందారం గ్రామాలలో ఆకస్మిక తనిఖీ

మంచిర్యాల జిల్లా పంచాయతీ అధికారి డి.వెంకటేశ్వరరావు

జైపూర్, నేటి ధాత్రి :

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం లోని రామారావు పేట మరియు ఇందారం గ్రామాలలో శుక్రవారం రోజున మంచిర్యాల జిల్లా పంచాయతీ అధికారి డి.వెంకటేశ్వరరావు ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో పారిశుధ్య కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించాలని,రోడ్లపై ప్లాస్టిక్ వ్యర్ధాలు లేకుండా శుభ్రం చేయించాలని, గ్రామంలో ఎక్కడా ప్లాస్టిక్ చెత్త కనబడకుండా చూసుకోవాలని, ప్రతీ రోజు రహాదారులు మరియు మురుగు కాలువలను శుభ్రం చేయాలని, గ్రామ పంచాయితీ ట్రాక్టర్ల ద్వారా ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ వంటి పారిశుద్ధ్య కార్యక్రమాలు విధిగా నిర్వహించాలని పంచాయితీ కార్యదర్శులకు మరియు పారిశుధ్య కార్మికులకు తెలియజేశారు. గ్రామాలలో ఉన్నటువంటి నర్సరిలో ప్రతీ బ్యాగు తడిచే విదంగా ప్రతీ రోజు ఉదయం సాయంత్రం నీళ్ళు పోయించాలని సూచించడం జరిగింది. సెగ్రిగేషన్ షెడ్ లను సందర్శించి కంపోస్ట్ పిట్ లో కంపోస్ట్ ఎరువు తయారీ విధానమును పరిశీలించి, కంపోస్ట్ ఎరువు తయారీ ప్రక్రియను నిరంతరం కొనసాగించాలని, తయారు చేసిన కంపోస్ట్ ఎరువును నర్సరీ మరియు పల్లె ప్రకృతి వనంలో పెంచుతున్నటువంటి మొక్కలకు వినియోగించాలని పంచాయితీ కార్యదర్శులకు తగు సూచనలు చేయడం జరిగింది. స్మశాన వాటికల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, స్మశాన వాటికల పరిసరాలలో ఉన్న మొక్కలను సంరక్షించాలని తెలిపారు. గ్రామాలలో త్రాగు నీటి సరఫరా చేసే ఓహెచ్ఎస్ఆర్,మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులను మరియు బోర్ వెల్ మోటార్ల ను పరిశీలించి, ఎండాకాలంలో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉన్నందున గ్రామాలలో ఎక్కడ కూడా మంచినీటి సమస్య లేకుండా చూసుకోవాలని, ఎక్కడైనా సమస్య ఏర్పడినట్లయితే తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగింది. త్రాగునీటి సమస్యలు ఏర్పడకుండా ముందస్తుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని పంచాయితి సిబ్బందికి సూచించారు. అనంతరం ఇందారం మరియు రామారావు పేట గ్రామ పంచాయితీ రికార్డులను తనిఖీ చేయడం జరిగింది.ఈ రెండు గ్రామాల పర్యటనలో మంచిర్యాల జిల్లా పంచాయతీ అధికారి డి.వెంకటేశ్వర్ రావు, జైపూర్ మండల పంచాయతీ అధికారి జి.అనిల్ కుమార్, రామారావు పేట గ్రామపంచాయతీ కార్యదర్శి పి.సురేష్, ఇందారం గ్రామపంచాయతీ కార్యదర్శి ఏ.సుమన్ మరియు గ్రామ పంచాయితీ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పాల్గొన్నారు.

రైతులకు శిక్షణ కార్యక్రమం

శాయంపేట నేటి ధాత్రి:

శాయంపేట మండలంలోని ప్రగతి సింగారం గ్రామంలో ప్రజ్వల్ ఎఫ్.పి.సి.ఎల్ ఆధ్వర్యంలో ప్రజ్వల్ ప్రతినిధి ఎస్కే గౌస్ బి సి ఐ రైతులకు భూసార అభివృద్ధి గురించి నేల పునరుత్పాదక వ్యవసాయ పద్ధతుల గురించి అవగాహన కల్పించడం జరిగింది. రైతులందరూ వ్యవసాయ భూముల్లో నిరంతరం పోషకాలను అందించాలన్నారు సేంద్రియ కర్బనo తక్కువగా ఉండడం మూలాన దిగుబడులు సరిగారాక ఎరువుల ఖర్చులు మరియు పెట్టుబడి ఖర్చులు పెరిగి రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని వివరించారు విశ రసాయన ఎరువులు పురుగుమందులను అత్యధికంగ వాడటం మూలన సారవంతమైన నేల క్షీణించి చౌడునేలలుగా మారు తున్నాయని వ్యవసాయ భూముల్లో తిరిగి పునర్జీవం వచ్చి తిరిగి సారవంతమైన భూములుగా మారుటకు గాను రైతులు పచ్చి రొట్టె ఎరువులు కంపోస్టు సేంద్రియ ఎరువులు పప్పు జాతి పంటలు అంతర పంటలు చెరువు మట్టి పశువుల పెంట పశువుల మందులు కోడి ఎరువు పంట పొలాల్లో వేసుకొని నెలలో సేంద్రియ కర్భణాన్ని పెంచుకోవాలని నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వివరించడం జరిగింది ప్రజ్వల్ సంస్థ వారు అందిస్తున్న సిటీ కంపోస్టును రైతులు వినియోగించుకోవాలని చెప్పడం జరిగింది ప్రతి రైతు భూసార పరీక్షలు చేయించుకోవాలని వాటి ఆధారంగా ఎరువులను వేసుకోవాలని తద్వారా వృధా ఖర్చులను తగ్గించుకోవచ్చని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు బోనెపల్లి రాజిరెడ్డి, వైద్యుల సమ్మిరెడ్డి ,సంజీవరెడ్డి, పింగిలి రాజిరెడ్డి ఎలమంచి ఆదిరెడ్డి లోకల్ బోయిన కుమారస్వామి చిలువేరు మల్లేశం ప్రజ్వల్ సంస్థ క్షేత్ర సిబ్బంది తరాల తిరుపతి పోతు సునీల్, పల్నాటి రాంబాబు, పోరండ్ల భానుమతి, బైకని ప్రశాంత్ మోటే మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

వైద్య కళాశాల ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తులకు ఆహ్వానం.

# జిల్లా కలెక్టర్ ప్రావీణ్యం ప్రకటన..

నర్సంపేట,నేటిధాత్రి :
వరంగల్ జిల్లా
నర్సంపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.ఈ మేరకు వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఒక ప్రకటన విడుదల చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఔట్సోర్సింగ్ పద్దతిలో
డిసెక్షన్ హాల్ అటెండర్ల – 4 పోస్టులు
పోస్ట్ కోసం అర్హత 10వ తరగతి లేదా సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలని అలాగే,అనాటమీ డిసెషన్ లేదా ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగంలో కనీసం 1 సంవత్సర అనుభవం ఉండాలని పేర్కొన్నారు.ల్యాబ్ ఆటెండర్లు 4 పోస్టులను గాను
పోస్ట్ కోసం అర్హత కోసం గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బీఎస్సీ ఎంఎల్టి లేదా డిఎంఎల్టిలో డిగ్రీ లేదా డిప్లొమా కలిగి ఉండి తప్పనిసరిగా తెలంగాణ పారామెడికల్ బోర్డుతో గుర్తింపు పొందాలని వివరించారు. తియేటర్ అనస్థీషియా అసిస్టెంట్ -4 పోస్టులకు గాను పోస్ట్ కోసం అర్హత అనస్థీషియా అసిస్టెంట్ కోర్సులో బీఎస్సీఎంఎల్టి లేదా డిఎంఎల్టిలో ఉత్తీర్ణులై ఉండాలని తెలంగాణ మెడికల్ బోర్డుతో గుర్తింపు పొంది ఉండాలని పేర్కొన్నారు.
అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్ లను పూరించి మీ మీ దరఖాస్తు ఫారాలను
నర్సంపేటలోని ఏరియా ఆసుపత్రిలో సమర్పించంలని కలెక్టర్ తెలిపారు.ఈ దరఖాస్తులకు చివరి తేదీ ఈ నెల 24 సాయంత్రం 5 గంటల
లోపు ఒక సెట్ జిరాక్స్ సర్టిఫికేట్లను సమర్పించిన దరఖాస్తులను పరిగణ లోకి తీసుకోబడునని వివరించారు.
మెరిట్ మరియు రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ వర్తించినప్పుడల్లా అనుసరించబడతాయని అన్నారు.
ఏదైనా క్వారీల కోసం 08718-230226 నంబర్ సంప్రదించాలని కలెక్టర్ ప్రావీణ్య ప్రకటన ద్వారా తెలియజేశారు.

దర్బార్ బిర్యాని సెంటర్ ని ప్రారంభించిన ఆది శ్రీనివాస్

చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండల కేంద్రంలో నిరుద్యోగి లింగంపల్లి అశోక్ ఏర్పాటు చేసుకున్న దర్బార్ బిర్యాని సెంటర్ ని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ శుక్రవారం ప్రారంభించారు. బిర్యాని సెంటర్ ఏర్పాటు చేసుకొని ప్రారంభించుకోవడం సంతోషకరమని, స్వయం ఉపాధి పొందుకోవాలని ఆది శ్రీనివాస్ సూచించారు. ప్రభుత్వం స్వయం ఉపాధి కి అండగా నిలుస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో చందుర్తి జెడ్పిటిసి సభ్యులు నాగం కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు చింతపంటి రామస్వామి, పార్టీ నాయకులు గొట్టె ప్రభాకర్, పులి సత్యం, బొజ్జ మల్లేశం, భీమరాజు కనకరాజు, చంద్రం, తదితరులు పాల్గొన్నారు.

ఆడిపిల్లలను సంతానంగా కలిగిన మా కుటుంబాలను కాపాడండి.

తండ్రి వేదింపులు భరించలేక వలస వెళ్లిన కుమారులు.

మాపై ఆర్డిఓ ఆఫీసులో ఎస్పీ ఆఫీసులో ఫిర్యాదులు.

చిట్యాల, నేటి ధాత్రి ;

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని రామచంద్రాపురం గ్రామంలో క్యాతం భూమయ్య కు మేము ముగ్గురం కుమారులం రమేష్ వెంకటేశ్వర్లు సతీష్ జన్మించడం జరిగినది. మా తండ్రి కి తరతరాలుగా వారసత్వంగా వ్యవసాయ భూమి రావడం జరిగింది. ఆ భూమిని వ్యవసాయం చేసుకుంటూ ఉమ్మడి కుటుంబంతో సంతోషంగా జీవిస్తున్న తరుణంలో మా పెద్ద అన్న అయిన క్యాతం రమేష్-విజయ దంపతులకు 3గురు ఆడపిల్లలు సంతానంగా జన్మించారు. వారసులు జన్మించలేదని గొడవచేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంటే 2006సం॥ లో ముగ్గురు కూతుర్లను తీసుకొని జీవనోపాధి కోసం చిట్యాలకు వలస వెల్లడం జరిగినది.
మా ముగ్గురు అన్నదమ్ములకు తేది. 07:09, 2007న వేరు పోసి ఆస్తిపంపకాలు చేయడం జరిగినది. ఇందులో మా తండ్రి గారు చేసిన రూ॥12,37,950/- అప్పును ముగ్గురు అన్నదమ్ములకు సమాన వాటాలుగా 4,12,650/- చొప్పున వేసి మనిషికి 4 ఎకరాల భూమిని పంచి ఇవ్వడం జరిగినది.
మా తండ్రి జీవనోపాధి కోసం ఎ4.17గుం.ల భూమిని తీయడం జరిగినది. అప్పటికి మా పెద్ద అన్న రమేష్కి మా చిన్నన్న వెంకటేశ్వర్లుకి వివాహం జరిగినది. అప్పుడు నేను డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాను. నాకు వివాహం జరుగలేదు. నాకు కూడా ఇద్దరు ఆడపిల్లలు పుట్టడం జరిగింది ,అప్పు ఎలా కట్టాలో తెలియని పరిస్థితిలో నాకు ఇచ్చిన 4 ఎకరాల భూమి నుండి 2ఎకరాల భూమిని అమ్మి నాపై వేసిన అప్పును పెద్దమనుషులు కట్టడం జరిగింది. తండ్రి నుండి నాకు వచ్చిన ఆస్తి 2 ఎకరాల భూమి మాత్రమే.. క్యాతం భూమయ్య పేరుపై మరియు క్యాతం రమేష్ పేరుపై వచ్చిన ఇందిరమ్మ ఇండ్ల ద్వారా రామచంద్రాపురంలో మా తండ్రి కి 2013సం॥ లో విలాసవంతమైన బంగ్లాను కట్టియ్యడం జరిగినది.
మళ్లీ తేది. 04.10.2009సం॥లో ఇంకా నాకు అప్పులు ఉన్నాయని మా తండ్రి గొడవ చేయడంతో ముగ్గురు అన్నదమ్ములం మనిషికి రూ॥51,597/-లు కట్టడం జరిగింది.
2018 సం॥లో నాకు ఇంకా అప్పులు ఉన్నాయని మా తండ్రి పై పట్టా ఉన్న మా ముగ్గురు అన్నదమ్ములకు చెందిన భూమిలోని 25సం॥ల నుండి పెంచిన ఎ1.10గుం. లలో ఉన్న టేకుతోటను అప్పటికప్పుడు మాకు తెలియకుండా తోటను నరికివేసి చెట్టలను అమ్ముకోవడం జరిగింది, తదుపరి అట్టి భూమిని 2019సం॥లో మా అక్క అయిన ఎలగొండ స్వప్న, వయస్సు. 50, భర్త. ఎలగొండ రాజేంద్రప్రసాద్ పై రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది.
2020 సం॥లో నాకు ఇంకా అప్పులు ఉన్నాయంటూ పెద్దమనుషుల దగ్గరికి ముగ్గురు అన్నదమ్ములను పిలిపించి అప్పులు కట్టవల్సిందిగా అడుగితే మీకు ఎందుకు అప్పులు అవుతున్నాయని మేము అడిగితే మమ్ములను నానా భూతులు తిడుతూ అక్కడినుండి వెల్లిపోవడం జరిగింది.
మా బావ సహాయంతో తేది.31.12.2021న సీనియర్ యాక్ట్ క్రింద భూపాలపల్లి ఆర్.డి.ఓ ఆఫీసులో, తేది. 08.01.2022న జిల్లా ఎస్.పి. ఆఫీసులో తేది. 26.05.2022 తేదిన తెలంగాణ మానవ హక్కుల కమీషన్ ఆఫీసులో మాపై కేసు వేయడం జరిగినది. అవి ఇంకా ఎంక్వైరీ జరుగుచున్నది.
తేది. 16.12, 2022 రోజున మా చేసులో మా తండ్రి సైపోన్లు అన్ని పగలగొట్టడంతో మేము ఆధారాలతో సహా చిట్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అతనిపై కేసు నమోదు కావడం జరిగినది.
మళ్లీ తేది. 15.04.2024 రోజున మా చేసులో కూలీలు మిరపకాయ ఎరడం కోసం వస్తుంటే వారిని మమ్మల్ని నానా భూతులు తిడుతూ భయభ్రాంతులకు గురిచేసి కూలీలను అక్కడి నుండి వెల్లగొట్టడం జరిగింది. ఇట్టి విషయాన్ని పూర్తి ఆధారాలతో మేము చిట్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా మా తండ్రి క్యాతం భూమయ్యపై మరొక కేసు నమోదు కావడం జరిగింది.
అప్పుడు మా బావ అయిన ఎలగొండ రాజేంద్రప్రసాద్ దగ్గరుండి మా తల్లిదండ్రులతో వారి ఫొటోలను గోడలపై అంటింపజేసి, పురుగుల మందు డబ్బా పట్టిపించి ఈ సన్నివేశాన్ని పోన్లో ఫొటోలు, వీడియో తీసి మా పెద్ద కుమారుడు రమేష్, మా చిన్న కుమారుడు సతీష్ు మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని సోషల్ మీడియాలో మా తల్లిదండ్రులతో చెప్పించి మాపై అసత్యపు ఆరోపణలు చేపించి వైరల్ చేసిమా కుటుంబాలలో గొడవలు సృష్టిస్తూ మమ్మల్ని మా కుటుంబాలను ఆత్మహత్య చేసుకునేలా మా బావ అయిన
ఎలగొండ రాజేంద్రప్రసాద్ (వార్త రిపోర్టర్, పోస్ట్మ్యాన్) ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. అని క్యాతం రమేష్ క్యాతం సతీష్ లు తన బాధను చెప్పుకుంటూ మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.

 

క్యాతం రమేష్, సెల్ 9966391033
క్యాతం సతీష్ కుమార్, సెల్, 9676185018

భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ని గెలిపించుకుందాం

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్

చేర్యాల నేటిధాత్రి

చేర్యాల పట్టణంలో జరిగిన విలేకరుల సమావేశం లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ మా నాన్నగారు మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం గౌడ్ గారి ఆధ్వర్యంలోని అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని మరియు ఎందరో బిసి ఎస్సి మైనార్టీ నాయకులను చేరదీసి పదవులు ఇచ్చి సహకరించాడని మరియు కాంగ్రెస్ ప్రభుత్వంలో జనగామ చేర్యాల అభివృద్ధి చెందాయని అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జనగామ చేర్యాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతానని భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి నే అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు భువనగిరి పార్లమెంటుపై కాంగ్రెస్ జెండా ఎగురవేద్దామని పిలుపునిచ్చారు

మడలేశ్వర స్వామి సీతాల దేవి విగ్రహ ప్రతిష్ట కు విరాళం

నిజాంపేట, నేటి ధాత్రి, ఏప్రిల్ 19

మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని చల్మెడ గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మడలేశ్వర స్వామి శీతల దేవి నూతన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమము మరియు కళ్యాణ మహోత్సవం గురించి రజక సంఘానికి ఎంపీటీసీ నంద్యాల బాల్ రెడ్డి 31116=00 ముప్పై ఒక వేయి ఒక వంద పదహారు రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు సంగోళ్ల చంద్రం సంగోళ్ల బైరయ్య సంగోల ముత్తయ్య నర్సింలు వెంకయ్య పెద్దయాదగిరి సురేష్ స్వామి రాజు చిన్న యాదగిరి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు

డ్రైవింగ్ స్కూల్లో యోగా శిక్షణ శిబిరం

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగళ్ళపల్లి మండలం బదనపల్లి టెక్స్టైల్ పార్కు నందు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్లో ఆది యోగి ఉప్పల శ్రీనివాస్ ఆధ్వర్యంలో యోగ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని అందులో మనం ఉండాలని అనే నినాదంతో చేస్తున్న యోగా సాధన ప్రయత్నంలో మీరందరూ పాలుపంచుకుంటున్నందుకు ధన్యవాదములు తెలుపుతూ అలాగే ప్రజలందరూ యోగా శిక్షణ కేంద్రంలో ప్రతి ఒక్కరు పాలుపంచుకుంటూ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో మండపల్లి డ్రైవింగ్ స్కూల్ సంబంధించిన వారు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

గణపురం నేటి ధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుర్రకాయల గూడెం గ్రామానికి చెందిన కాలియా అశోక్ బక్కమ్మ దంపతుల కూతురు లక్ష్మి-రాజు ల వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు వీరి వెంట తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గాజర్ల అశోక్, మార్క విజయ్ కుమార్, మండల వైస్ ఎంపీపీ విడిదినేని అశోక్, మండల కో ఆప్షన్ ఎండి చోటేమియా, పిఎసిఎస్ చైర్మన్ కన్నబోయిన కుమార్ యాదవ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేపాక రాజేందర్, వాణిజ్య సెల్ అధ్యక్షులు కటుకూరి శ్రీనివాస్,ఎంపీటీసీ కాలియా సాగర్, సోషల్ మీడియా ఇన్చార్జి జోడు ప్రదీప్ ముదిరాజ్ ,నాయకులు దూదయ్య, దూడపాక దుర్గయ్య, పెండ్యాల వెంకటేష్ ముదిరాజ్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Exit mobile version