భూపాలపల్లి సిఆర్ నగర్ బాంబుల గడ్డలో ఇంటింటి ప్రచారంలో నిర్వహించిన బిజెపి పార్టీ భూపాలపల్లి అర్బన్ అధ్యక్షుడు శ్యామల మధుసూదన్ రెడ్డి అనంతరం మాట్లాడుతూ బిఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కుటుంబ పార్టీలే కుటుంబ పార్టీలు అంతం కావాలంటే ప్రజలందరూ ఐక్యమత్యం కావాలి బిఆర్ఎస్ పార్టీ మునిగిపోతున్న నావ లాంటిది బిఆర్ఎస్ లో కేసీఆర్ పోతే కేటీఆర్ కాంగ్రెస్ లో సోనియా గాంధీ పోతే రాహుల్ గాంధీ కుటుంబ పార్టీలలో వేరే వ్యక్తులకు పార్టీలో సీఎం అయ్యే అవకాశం ఉండదు సామల మధుసూదన్ రెడ్డి అన్నారు భారతీయ జనతా పార్టీలో గనుక చూసుకున్నట్లయితే అటల్ బిహారీ వాజ్పేయి కి నరేంద్ర మోడీ ఎలాంటి సంబంధం లేదు దేశ ప్రజల అందరికీ సుపరిపాలన అందించేది మోడీని మేము గత పది రోజులుగా భూపాలపల్లి మున్సిపాలిటీలో వివిధ కాలనీలలో ప్రచారం ముమ్మరంగా చేస్తా ఉన్నాం. ఏ ఇంటికి పోయిన దేశంలో మోడీకి తప్ప వేరే వ్యక్తికి చోటు లేదని చిన్న పిల్లవాడి నుండే ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు చెప్తున్నారు దేశంలో మోడీ లేకపోతే మన స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదు. ఎక్కడ ఏం జరుగుతుందో అనే భయంతోటి ఉండాలి తప్ప అని ప్రజలంతా అంటున్నారు కాబట్టి భూపాలపల్లి అన్ని వర్గాల ప్రజలందరూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి ఆరూరి రమేష్ ని భారీ మెజార్టీతో గెలిపించి భూపాలపల్లి అభివృద్ధిలో పాలుపంచుకోవాలని మధుసూదన్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో అర్బన్ ప్రధాన కార్యదర్శి తుమ్మేటి రామ్ రెడ్డి అర్బన్ ఉపాధ్యక్షులు ఉరెటి మునిందర్ బూత్ అధ్యక్షులు పోన్న శ్రీనివాస్ దూలం మొండయ్య శేఖర్ అనిల్ రాజు రవి స్వప్న జోష్మి తదితరులు పాల్గొన్నారు
నేటి ధాత్రి:వీణవంక మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మురహరి రాజమ్మ అనారోగ్యంతో మృతి చెందగా ఇట్టి విషయాన్ని తెలుసుకున్న అతిధి డెవలపర్స్ అధినేత కొమ్మిడి రాకేష్ రెడ్డి తన అనుచరులను పంపించి మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ప్రగడ సానుభూతి తెలియజేసి కుటుంబ సభ్యులకు తన వంతు సహాయంగా 50 కేజీల బియ్యాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రాకేష్ రెడ్డి యువ సైన్యం వ్యవస్థాపకులు పోతరవేన సతీష్, మద్దుల ప్రశాంత్, కాసనగొట్టు కర్ణాకర్,బోయిన విద్యాసాగర్,ఐలయ్య,బిక్షపతి,మొగిలి,సమ్మయ్య, చింటు తదితరులు పాల్గొన్నారు.
గ్రామ దేవతల ఆశీస్సులు ప్రజలపై ఉండాలి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ జిల్లా టేకుమట్ల మండలం మందరోలి పల్లి గ్రామంలో శ్రీ పోచమ్మ భూలక్ష్మి విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవ వేడుకకు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అనంతరం టేకుమట్ల మండల కేంద్రంలోని యూత్ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ కొలుగూరి అనిల్-ఉమా దంపతుల కూతురు పుట్టినరోజు వేడుకలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గాజర్ల అశోక్, మండల జెడ్పిటిసి పులి తిరుపతిరెడ్డి మండల అధ్యక్షులు కోటగిరి సతీష్ , కత్తి సంపత్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు యూత్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చల్లగరిగ గ్రామానికి చెందిన సిరిపెల్లి సుధాకర్ అలియాస్ మురళి అలియాస్ శంకర్ చత్తిస్ ఘడ్ రాష్ట్రం కాంకేడ్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి సుధాకర్ అలియాస్ శంకరన్న కుటుంబాన్నీ బుధవారం రోజున గ్రామీణాభివృద్ధి పంచాయితీ రాజ్ శాఖ మంత్రి సీతక్క పరామర్శించి సుధాకర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుధాకర్ కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు, ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గాజర్ల అశోక్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు గుట్ల తిరుపతి, కాంగ్రెస్ పార్టీ జిల్లా మండల నాయకులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పోలినేని లింగారావు ముళ్ల పెళ్లి నేటి ధాత్రి న్యూస్ దేశంలో ప్రజాస్వామ్యానికి, నియంతృత్వానికి జరుగుతున్న యుద్ధమే జరగబోయే లోక్ సభ ఎన్నికల సమరమని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పోలినేని లింగారావు అన్నారు. బుధవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. బిజెపికి టీం లీడర్ నరేంద్ర మోదీ మాత్రమే ఉన్నాడని, కాంగ్రెస్ కు రాహుల్ గాంధీతో పాటు కూటమి రూపంలో అతిపెద్ద ఇండియా టీమే ఉందన్నారు. మొదటి దశ ఎన్నికల అనంతరం మోదీ వెన్నులో వణుకు పుడుతుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆస్తులన్నీ ముస్లింలకు పంచుతారన్న మోదీ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలన్నారు. పంచ్ న్యాయ్, కులగణన వంటివి బిజెపికి రుచించడం లేదని మండిపడ్డారు. బిజెపి లీడర్లది ఫ్యూడల్ మెంటాలిటీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాముని ఫోటో తప్ప మోదీ ఫోటోలతో బిజెపి ప్రచారం చేయడం లేదన్నారు. మోదీ మతతత్వవాది అని..రాహుల్ గాంధీ మానవతావాది అన్నారు. వరంగల్ కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థి కడియం కావ్యను భారీ మెజార్టీతో గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలన్నారు.
ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ..సహాయ, సహకారాలను అందించుకోండి
మొగుళ్లపల్లి మాజీ సర్పంచ్ మోటే ధర్మన్న మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ వేసవికాలంలో సంభవించే అగ్ని ప్రమాదాల పట్ల రైతులు, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మొగుళ్లపల్లి మాజీ సర్పంచ్ మోటే ధర్మన్న సూచించారు. బుధవారం ఆయన మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. వేసవికాలంలో భానుడి ప్రతాపం విలయతాండవం చేస్తుండడంతో..ఎండలు మండిపోతున్నాయని, కాగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో గాని, సిగరెట్, బీడీలను అంటు పెట్టుకొని అగ్గిపుల్లలను ఆర్పీ వేయకుండా అజాగ్రత్తగా పారవేయడం వలన ప్రమాదాలు సంభవిస్తాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ, అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు సహాయ, సహకారాలు అందించుకోవాలని సూచించారు. మంగళవారం రోజున మండల కేంద్రంలో జరిగిన షార్ట్ సర్క్యూట్ ప్రమాదం వలన తాను అధికారులు మేల్కొనకపోతే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని ధర్మన్న తెలిపారు.
తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామంలో బిజెపి నాయకులు ప్రచారంలో భాగంగా బండి సంజయ్ గెలవాలని అలాగే కేంద్రంలో ఇస్తున్న మోడీ సంక్షేమ పథకాల గురించి వివరించడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధి హామీ వద్ద పనిచేస్తున్న వారికి మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో బిజెపి నాయకులు ఆసాని లింగారెడ్డి గజబిన్కర్ సంతోష్ మండల ప్రధాన కార్యదర్శి సంధ్య వేణి రాజు యాదవ్ మండపల్లి బిజెపి నాయకులు సింగం చింటూ తదితరులు పాల్గొన్నారు
ములుగు మండల రాయినిగూడెం గ్రామంలో గ్రామదేవతలైన పోచమ్మ, బొడ్రాయి , హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు గత మూడు రోజులుగా అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలకు ములుగు జడ్పీ చైర్మన్ పీఆర్ఓ జంగిలి.రవితేజ హాజరై గ్రామ దేవతలను దర్శించుకున్నారు. అనంతరం తన వంతు విరాళాన్ని అక్కడి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమ నిర్వాహకులు ఆగబోయిన వెంకన్న, ఆగబోయిన సాంబయ్య, పాయం నరేష్, ఎండి అక్బర్ పాషా, దామరనేని రవీందర్ రావు, మాజీ సర్పంచ్, ఈసాల చంద్రయ్య, వాసం పాపయ్య తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరి ఆశీర్వాదంతో రెండవసారి యంపిగా పోటీచేస్తున్నా మాజీ ఎంపీ మాలో కవిత రెండోసారి కూడా పార్లమెంటు పంపించి తెలంగాణ నుంచి ప్రశ్నించే గొంతుగా మన మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గం సహాయ సహకార నిధులను కూడా తెచ్చుకొని ఎన్నో పనులు చేయించుకుందాం మాజీ ఎంపీ మాలతి కవితను అధిక మెజార్టీతో గెలిపించుకుందాం. పార్లమెంటుకు పంపిద్దాం మన ఇంటి ఆడబిడ్డగా పార్లమెంటుకు పంపిద్దాం కాంగ్రెస్ పార్టీ ఎన్నో మాయ మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు ఈగ ఊరుకునేది లేదు ప్రశ్నించే గొంతుకగా మేం బయలుదేరు తున్నాం నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసి చూపెట్టు సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగా లు ఇస్తానని చెప్పావు ఏమాయని రెండు లక్షల ఉద్యోగా సీఎం రేవతి రెడ్డి కాంగ్రెస్ పార్టీ వచ్చి వంద రోజులు దాటింది మహిళలకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తానని చెప్పావు కళ్యాణ లక్ష్మి కింద లక్ష రూపాయలు ఇస్తానని 10 గ్రాముల బంగారం ఇస్తానని చెప్పావు ఏ మాయ రేవంత్ రెడ్డి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేరని ప్రజలకు అర్థం అయిపోయింది ఇంక నుడి నెరవేర్చలేని హామీలు చెప్పి ప్రజలకు మాయమాటలు చెప్పి మోసగించకండి దుర్గం రాజ్ కుమార్ ములుగు జిల్లా బీఆర్‌ఎస్‌వీ నాయకులు
జిల్లాలో త్రాగునీరు, విద్యుత్తు సరఫరా, జాతీయ ఉపాధి హామీ పనులు, ప్రతి ఒక్కరికీ పని కల్పించుటలో పక్కగా అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టరు సుమిత్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.యస్. జవహర్ రెడ్డి కి తెలిపారు.
మంగళవారం వెలగపూడి సెక్రటేరియట్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, జాతీయ ఉపాధి హామీ పథకం పనులు చేపట్టుట, కూలీలకు ఉపాధి కల్పించుట, వేసవిలో విద్యుత్తు సరఫరా, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.యస్. జవహర్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత వేసవిలో రాష్ట్రంలో ఎక్కడా త్రాగునీటికి ఎటువంటి సమస్య తలెత్తకుండా చూడాలని, ఏ చిన్న సమస్య వచ్చినా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు. త్రాగునీటి చెరువులను, సమ్మర్ స్టోరేజీ ట్యాంకులు, మంచినీటి చెరువులు నీటి నిల్వలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. రాష్ట్రంలో వేడి గాలులు అత్యధికంగా వీస్తున్న దృష్ట్యా అందుకు అనుగుణంగా ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం పనులలో నీటి సంరక్షణ పనులు, మంచినీటి చెరువుల డీసిల్టింగ్ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని పని అడిగిన ప్రతి ఒక్కరికి పనికల్పించాలన్నారు. విద్యుత్తు సమస్యలు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎటువంటి చిన్న సమస్యలు తలెత్తినా వెనువెంటనే పరిష్కారం చూపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.యస్.జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టరు సుమిత్ కుమార్, డ్వామా పిడి యం.ప్రభాకర రావు, జిల్లా ఆర్డబ్ల్యూయస్ అధికారి బి.వి.వి. నాగేశ్వరరావు, విద్యుత్ శాఖ ఇఇ ఫీర్ అహ్మద్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.
ఐదవ రోజు నామినేషన్ల ప్రక్రియలో భాగంగా మంగళవారం నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గానికి ఏడు మంది అభ్యర్థులు కొత్తగా నామినేషన్ లు దాఖలు చేయగా, ఇంతకు ముందే నామినేషన్ లు దాఖలు చేసిన ఇద్దరు అభ్యర్థులు ఒకరు రెండు సెట్స్, మరియొకరు ఒక సెట్ నామినేషన్ ను దాఖలు చేయడం జరిగింది.
భారతీయ జనతా పార్టీ తరపున భూపతి రాజు శ్రీనివాస్ వర్మ రెండు సెట్లు నామినేషన్లను రాజ్యసభ సభ్యులు అరుణ్ సింగ్, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, తణుకు నియోజకవర్గ అభ్యర్థి ఆరుమిల్లి రాధాకృష్ణన్ లతో కలిపి నామినేషన్ పత్రాలను నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ కు అందజేయడం జరిగింది.
బిజెపి తరఫున కలిదిండి వినోద్ కుమార్ వర్మ , స్వతంత్ర అభ్యర్థులుగా మాడపాటి వెంకట వరాహలరెడ్డి, కేత శ్రీను, రామ దుర్గాప్రసాద్, గేదల లక్ష్మణరావు, అద్దేపల్లి వీర వెంకట సుబ్బారావులు ఒక్కొక్క సెట్ నామినేషన్ లను దాఖలు చేయడం జరిగింది. ఇంతకుముందే నామినేషన్లు దాఖలు చేసిన వైఎస్ఆర్సిపి అభ్యర్థి గూడూరి ఉమా బాలా తరఫున రెండు సెట్లు, గూడూరి జగదీష్ కుమార్ వైఎస్ఆర్సిపి ఒక సెట్ నామినేషన్నులను దాఖలు చేయడం జరిగింది.
నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గానికి పోటీగా ఇప్పటివరకు 14 మంది అభ్యర్థులు 20 సెట్ల నామినేషన్లను దాఖలు చేయడం జరిగింది.
జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంగళవారం పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాలు మినహా మిగతా ఐదు నియోజకవర్గాల్లో 19 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది
ఎన్నికలప్రచార యాత్ర లో ఓటర్లను అభ్యర్థించిన చెరుకువాడ.
ప.గో జిల్లా/పోడూరు నేటి ధాత్రి.
పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం ,పోడూరు గ్రామం లో మంగళవారం ఎన్నికల శంఖారావం ప్రచార పాదయాత్ర లో ఆచంట శాసనసభ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు,రాష్ట్ర మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజుకి సంఘీభావంగా పాలకొల్లు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల గోపి, డిసిసిబి మాజీ చైర్మన్ ఎడ్లతాతాజీపాల్గొన్నారు.అడుగడుగున ప్రజల బ్రహ్మరథం పట్టారు.ఎన్నికల ప్రచారయాత్రలో పాల్గొని గెలిపే లక్ష్యంగా ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు.రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకే వెయ్యమని ప్రజలను అభ్యర్థించారు.ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గంలో రంగరాజు చేస్తున్నటువంటి అభివృద్ధిసంక్షేమకార్యక్రమాలను పేద బడుగు బలహీన వర్గాలనుఆయనచేస్తున్నటువంటి కృషి గ్రామ ప్రజలే కాకుండా నియోజకవర్గంలోని ప్రజలు పెద్ద ఎత్తున పూలదండలతో వేసి హారతులతో ఘన స్వాగతంపలికారు.రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిచేయడానికినియోజకవర్గంలో రంగరాజుని ఎమ్మెల్యేగా గెలిపించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని స్వాగతం పలుకుతూ మహిళలు,రైతులు,అవ్వ తాతలు,అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొని నినాదాలతో హోరెత్తించిప్రచారంనిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చట్టబత్తుల సువర్ణ రాజు, జడ్పిటిసి సభ్యులు గుంటూరి పెద్దిరాజు, ఎంపీపీసబ్బిత సుమంగళి సాగర్, ఆచంట ఏఎంసీ చైర్మన్ చిల్లే లావణ్య, చేకూరి సూరిబాబు, పొడూరి సత్య సాయి బాబా, రుద్రరాజు శివాజీ రాజు, గంట గిరిబాబు, మండల వైసీపీ కన్వీనర్ పిల్లి నాగన్న, నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ పోతుమూడి రామచంద్ర రావు, పైడి ఏసుబాబు, గెద్దాడ ఏకలవ్య కంది కట్ల వెంకట్రావు,గొట్టుముక్ల ఏసురత్నం,స్థానిక పార్టీ నాయకులు,కార్యకర్తలు గ్రామప్రజలుఅభిమానులుపెద్దఎత్తునపాల్గొన్నారు.
నేటిదాత్రి పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు (ఏప్రిల్ 23)
పాలకొల్లు పంచారామక్షేత్రం శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం లో ఈ రోజు అనగా ది.23.04.2024 తేదీ మంగళవారం పౌర్ణమి సందర్భముగా చండి హోమం నిర్వహించడం జరిగినది ఈ చండి హోమం లో 20 మంది దంపతులు పాల్గొన్నారు వీరికి శ్రీస్వామి వారి శేషవస్త్రములు ప్రసాదములు ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమములో భక్త్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు యాళ్ళ సూర్యనారాయణ , కార్యనిర్వహణాధికారి
నేటిదాత్రి పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు (ఏప్రిల్ 23 )
రాష్ట్రంలో అధికారంలోకి రాబోయే టిడిపి జనసేన బిజెపిf కూటమి ప్రభుత్వంలో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరే పథకాలు అందుతాయని నిమ్మల సూర్యకుమారి తెలిపారు. ఆమె మంగళవారం పాలకొల్లు పట్టణ 28వ వార్డులో టిడిపి జనసేన బిజెపి శ్రేణులతో కలిసి కూటమి ఉమ్మడి అభ్యర్థి, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విజయాన్ని కాంక్షిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. లబ్ధి చేకూరే పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంచారు. ఈ ప్రచార కార్యక్రమంలో నాయకులు28వ వార్డు మాజీ కౌన్సిలర్ పొట్నూరి అప్పన్న,వార్డు అధ్యక్షులు కెల్లా లక్ష్మీనారాయణ, కార్యదర్శి ఎర్ర బాబి, కడలి త్రిమూర్తులు, జనసేన వార్డు అధ్యక్షులు విన్నకోట గోపి,రాష్ట్ర టీడీపి కార్యదర్శి పెచ్చేట్టి బాబు, టిడిపి పట్టణ అధ్యక్షులు gv, జనసేన జిల్లా కార్యదర్శి బోనం నరసయ్య,జనసేన పట్టణ అధ్యక్షులు సిడగం సూరి, అల్లు రాధాకృష్ణ, మండాది అవినాష్, పెండ్యాల భవాని అంబల్ల లక్ష్మీ జ్యోతి ద్రాక్షారపు జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
నేటిదాత్రి పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు( ఏప్రిల్ 23)
పాలకొల్లు నియోజకవర్గ అభివృద్ధికి, అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను తీర్చే మన ఎమ్మెల్యే, టిడిపి జనసేన బిజెపి కూటమి అభ్యర్థి డాక్టర్ నిమ్మల రామానాయుడు గెలిపించుకోవాలని రాష్ట్ర ఫెన్షనర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పి. సుబ్బారాయన్, బి పెద్దన్న గౌడ్ లు పిలుపునిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే రామానాయుడు ను ఫెన్షనర్స్ పార్టీ నాయకులు కలిసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సుబ్బారాయన్, పెద్దన్న గౌడ్, పార్టీ రాష్ట్ర కోశాధికారి తూము నాగభూషణం, నాయకులు పి సత్యనారాయణమూర్తి, తోట వెంకట రవీంద్ర,కాగిత వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ ఫెన్షనర్స్ కుటుంబ సభ్యులంతా ఎమ్మెల్యే రామానాయుడుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో జగన్ ఐదేళ్ల ప్రభుత్వంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక ప్రజల వ్యతిరేక విధానాలతో పాలన సాగిందని, అటువంటి ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికల్లో గద్దె దించాలని పిలుపునిచ్చారు.
• They are becoming scapegoats in high command politics
• They are losing their self respect and integrity
• The new trend in democracy creating problems
• Democracy moving towards direction less politics
• Party workers turning towards ‘smart’ politics
Democracy is nothing but the participation of people. Unfortunately when observed the National and State politics the ‘definition’ and meaning of Democracy is totally changing. Workers belong to various parties losing their self respect and integrity in present ‘career’ and ‘power’ oriented politics. There is no place for new water in these politics, only ‘old wine’ is being changed into ‘different bottles’. In this back ground this story on the position of field level workers. The place of traditional ‘Ideology’ based statecraft now being occupied by ‘career’ and ‘power’ based opportunistic politics and new political trends are moving swiftly in this way. If it is healthy or un-healthy can’t say at this juncture, but the political parties running their politics solely depending on whom they consider winning candidates is fact in present scenario. This political drama may be gainful for some reasons and may cause loss on some occasions and the share of these two, changes according to the situation. The party workers remain the real losers for this time to time changing scenario. In this current political situation, BJP, Congress, BRS and other parties changed their trends in their political strategies. This new attitude of these parties has been putting pressure and causing negative impact on the field level workers and second level leaders of these parties, who still have been continuing in those parties since long time. The main cause for this because of the attitude of political parties those changed their trends from ideological politics to welfare oriented politics. In the name of welfare they resort to announce free bees to people for their political gain and retain their power. This trend has been leading the parties to attract powerful leaders into the party fold to gain enough strength to win the elections which may lead them to attain authority. At the same this trend also paved way to run ‘career oriented politics’ by political leaders of various parties. In this changing scenario, indiscriminate ‘free bees’ announced, occupied the place of ‘ideology’. The political parties began to give chances to those leaders belong to the communities who have strong voter base. In order to gain influence in such communities, political parties began to announce ‘free bees’ applicable to them.
In these time to time changing treads, real losers we can say are field level workers. The party cadre at field level and second level leaders have been experiencing hardships in promoting the party policies in their respective constituencies, because of the opportunistic politics played by high commands of various parties for temporary gain of power. As the elections become nearer the selection of candidates become like ‘IPL auction’! Those leaders of no guarantee of getting ticket begins to look towards the thresholds of other parties and those parties looking for strong candidates resort to attract such leaders from other parties become very common in these days. This caused the party workers to remain in confusion state to assess the time of stay of such leaders in their party. Really it became paradox for party workers to campaign in favour of their party candidate because in previous elections, they might have campaigned against such leader who stood in fray as a candidate of other party. Now how can they go to the people asking them to give their vote in favour of such leaders whom they campaigned against in previous elections? Suppose a leader belongs to BRS party who contested the elections in previous elections, due to the cause of not getting ticket, if stand in election fray on another party like Congress or BJP what is the position of party workers who worked against him in previous? Like that in the ‘snake and ladder’ play of parities, creating lot of confusion among the party works and causing embarrassment for them.
BRS says ‘we brought Telangana’, Congress says ‘we gave Telangana’ and BJP says ‘without our support how it is possible to get separate state?’ Seeming these three arguments are correct. Now leader’s transformation has been occurring in between these three parties. The career politics of leaders and power politics of parties are the main cause of this embarrassing situation. This lead confusion among party workers who fell in dilemma on continues their campaign on whose favour? For their surprise party workers in some conditions have compelled to campaign in favour of those leaders whom they opposed in previous elections. In the same manner they have compelled to campaign against those candidates whom they worked in favour of them in previous. Really speaking this is damaging the self respect and integrity of party workers. Skeleton gives strength and posture of the body of human beings, steel gives strength to buildings. Like that field level cadre create strong base for any party. They are the life line of the party. When parties run their politics on ideological basis, there were less number of party changing’s but when the career orient politics began these party changing’s became much frequent and there is no guarantee that how much time a leader may remain in a party! In these circumstances party workers compelled to change their way of running politics. Now everywhere ‘smart’ politics are appearing. In some places where the party cadre remain cling to its party are not accepting the authority of new leaders and his followers who newly joined which leads to conflicts among them. Those newly joined in a party don’t hesitate to exercise their authority with the support of their leader and high command on the old cadre in that party. The high commands of all parties know well about this situation. Unfortunately they remain silent due to the power politics they played. For that they compelled invite strong leader into the party fold. Such leader along with his followers brings victory to the party. Then what is the need of cadre for a party? Only strong leader’s support is enough! In this present scenario nobody is against anybody. All are actors and playing their assigned role. That’s all! Here all the bottles are old and wine is also old but only thing that happens is time to time the wine and bottles gets changed! So the cadre felt that there is no other way for them to play ‘smart’ politics instead. Otherwise they may fell victim for the ‘snake bite’ in the politics. Now the definition for a ‘worker’ gradually being changed. The existence of Democracy and its direction has been changing constantly. Only time will decide if it is good or bad.
`డిప్యుటేషన్లు రద్దుచేస్తూ ఫిబ్రవరి 7న ప్రభుత్వ ఉత్తర్వులు
`ఉత్తర్వుల్లో లసుగుల ఆధారంగా ఎక్కడివారక్కడే కొనసాగుతున్న వైనం
`విల్లింగ్ లెటర్లే వారికి బ్రహ్మాస్త్రం
`డిప్యుటేషన్లు రద్దుచేస్తూ ఇచ్చిన ఉత్తర్వులు నిర్వీర్యం
`‘విల్లింగ్’ల పేరుతో ఇప్పటికే జాగ్రత్తపడిన చాలామంది డాక్టర్లు
`లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయన్న ఆరోపణలు
`రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలల్లోనే వైద్యశాఖలో ఈ వైపరీత్యం
`ఉత్తర్వులో లోపంతో నెరవేరని ప్రభుత్వ లక్ష్యం
చక్రం తిప్పుతున్న మంత్రులతో ప్రభుత్వ ప్రతిష్టకు మచ్చ
హైదరాబాద్,నేటిధాత్రి: వైద్యో నారాయణో హరి అనేది నానుడి. కానీ ప్రస్తుతం అందుకు పూర్తి భిన్న పరిస్థితి కనిపిస్తోంది. అక్రమ సంపాదనకు అలవాటుపడిన కొందరు వైద్యాధికార్లు, ప్రైవేటు వైద్యాన్ని ప్రోత్సహించడం ద్వారా ప్రభుత్వ వైద్యాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. కొందరు ఏకంగా సొంత ఆసుపత్రులనే న డుపుతుండటం వర్తమాన చరిత్ర. దీన్ని అరికట్టడానికి ప్రభుత్వం జి.ఓ.ల రూపంలో చర్యలు తీ సుకున్నా ఎంతమాత్రం ఫలితం ఉండటంలేదన్నది ప్రస్తుతం వైద్య ఆరోగ్యశాఖలో జరుగుతున్న ప్రహసనాన్ని చూస్తే అర్థమవుతుంది. ప్రభుత్వాలు మారుతుంటాయి. అధికారాన్ని చేపట్టే ప్రతి కొత్త ప్రభుత్వం ఏదో చేయాలన్న తపనతో ముందుకెళ్లడం సహజమే. ఇందుకోసం తనద్కెన శ్కెలిలో ప్రభుత్వ కార్యకలాపాలను నిర్వహి స్తుంటుంది. ఇందుకు అవసరమైన జి.ఓ.లను ఎప్పటికప్పుడు జారీచేస్తుంటుంది. వీటి ఉద్దేశం మంచిద్కెనప్పటికీ, అక్రమాలకు పాల్పడేవారు వీటిల్లో రంధ్రాన్వేషణ చేసి, తద్వారా సదరు జి.ఓ. ల ప్రభావం తమపై పడకుండా జాగ్రత్తపడుతుంటారు. ఇది అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ జరిగే అతి సహజమైన పరిణామం. నిజాయతీపరులు జి.ఓ. ఉద్దేశాన్ని తెలుసుకొని ఆ దిశగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తే, అవినీతిపరులు మాత్రం అందులో లసుగులకోసం వెతుకుతూ, ఏ చి న్న లోపం కనిపించినా, తమ ప్రయోజనాలకు అనుగుణంగా వాడుకోవడానికి ప్రయత్నిస్తుంటా రు. ఇప్పుడు సరిగ్గా వైద్య ఆరోగ్యశాఖలో జరుగుతున్న తంతు ఇదే. వివరాల్లోకి వెళితే… ఎంతోకాలంగా డిప్యుటేషన్ పేరుతో వివిధ జిల్లాల్లో తిష్టవేసిన వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులను తిరిగి తమ స్వస్థానాలకు తిరిగి వెళ్లాల్సిందిగా ఈ ఏడాది ఫిబ్రవరి 7న వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ (హెచ్.ఎం ఎఫ్.డబ్ల్యు) ఉత్తర్వులు జారీచేసింది. అంతవరకు బాగానే ఉంది. దీని ప్రకారం డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న ఉద్యోగులు గతంలో పనిచేసిన తమ స్వస్థానాల కు తిరిగి వెళ్లిపోవాలి. ఇందులో విశేషమేముందని ఎవరైనా సాధారణంగా అభిప్రాయ పడతా రు. ఎందుకంటే డిప్యుటేషన్‌పై వచ్చిన ఉద్యోగి ఏడాదికి మించి అక్కడ పనిచేయడానికి ప్రభుత్వ నిబంధనలు ఒప్పుకోవు. కానీ మన ప్రభుత్వాల నిర్వాకంవల్ల ఎంతోమంది ఎన్నో ఏళ్లుగా డిప్యుటేషన్‌పై వచ్చి అక్కడే పాతుకుపోవడం తెలంగాణలో మాత్రమే కాదు, ఆంధ్రలో కూడా సర్వసాధా రణంగా జరుగుతున్న తంతు. దీన్ని పట్టించుకుంటే సీరియస్‌గా పట్టించుకోవచ్చు లేదా పట్టించుకోకపోవచ్చు. ‘భారతీయుడు’ మాదిరిగా నిబంధనలను పట్టుకొని వేలాడేవారి సంఖ్య చాలా తక్కువ కనుక డిప్యుటేషన్లను గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వం పెద్ద సీరియస్‌గా తీసుకోలేదు. కానీ కొత్తగా అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దీనిపై దృష్టిసారించి వైద్య ఆరోగ్యశాఖలో బహుకాలంగా డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నవారి సంఖ్య చాలా అధికంగా ఉందన్న సత్యాన్ని గుర్తించి, తక్ష ణం ఆయా డిప్యుటేషన్లను రద్దుచేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఉత్తర్వుల్కెతే జారీ అయ్యాయి కానీ, వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు ముఖ్యంగా డి.ఎం.హెచ్.ఒ.ల్లోచాలామంది భద్రంగా ఎక్కడివారక్కడే తిష్టవేసి వేసి వుండటంతో, ప్రభుత్వం జారీచేసిన జి.ఓ. లక్ష్యం నెరవేరకుండా పోయింది. మరి ఈ ఉత్తర్వులను ధిక్కరించి వారు ఎట్లా తమస్థానాల్లోనే ఉండిపోగలిగారన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది. ప్రభుత్వ ఉత్తర్వుల్లోనినూణం ష్ట్రaశ్రీశ్రీ ఱంంబవ సవజూబ్a్‌ఱశీఅం శీఅ అవవస పaంఱం ష్ట్రవఅషవటశీత్‌ీష్ట్ర, షఱ్‌ష్ట్ర ్‌ష్ట్రవ షతీఱ్‌్‌వఅ aజూజూతీశీఙaశ్రీ శీట ్‌ష్ట్రవ తీవంజూవష్‌ఱఙవ ణఱర్‌తీఱష్ జశీశ్రీశ్రీవష్‌శీతీం/Gశీఙవతీఅఎవఅ్ శీఅశ్రీవ్ణ అనే నాలుగో పాయింట్‌ను ఆధారంగా చేసుకొని, ముఖ్యంగా చాలామంది జిల్లా వైద్యశాఖాధికార్లు తమ జిల్లాలకు చెందిన మంత్రుల నుంచి ‘విల్లింగ్ లెటర్స్’ తెచ్చుకొని తమస్థానాల్లోనే కొనసాగుతున్నారు. ఇది సరిగ్గా ‘తాళము వేసితిని గొళ్లెమే మరచితిని’ అన్న చందంగా ‘ఉత్తర్వులు జారీచేశాం, పర్యవసానం మరిచాం’ అన్నట్టుగా వున్నది ఉన్నతాధికార్ల వైఖరి! ప్రభుత్వం ఒక ఉత్తర్వును జారీచేసినప్పుడు, అందులో పేర్కొనే అంశాలు కచ్చితంగా తన లక్ష్యం నెరవేరేలా ఉండాలి తప్ప, ‘ఐ తే’, ‘కానీ’, ‘అవసరాన్ని బట్టి’, ‘తప్పనిసరి పరిస్థితుల్లో’ వంటి పాయింట్లతో కూడిన అంశాలను కూడా చేరిస్తే పర్యవసానం ఇట్లాగే వుంటుంది. ప్రభుత్వ ఉత్తర్వుల్లో ‘సందిగ్ధాలు’, ‘మినహాయింపులు’ ఉండటం వల్లనే ఆక్రమాలకు దారి ఏర్పడుతోంది. నిజం చెప్పాలంటే ఈ ఉత్తర్వులు జారీచేసేది కూడా ‘ఉన్నత’ స్థాయిలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులే కదా! ఒకప్పుడు ఈ విల్లింగ్ లెటర్ల ప్రహసనం పోలీసుశాఖలో విపరీతంగా ఉండేది. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం ఈ విల్లింగ్‌లకు చాలావరకు అడ్డుకట్ట వేసింది. గత కె.సి.ఆర్. ప్ర భుత్వం ఎమ్మెల్యేలను నియోజకవర్గంలో ‘సుప్రీం’లుగా భావించడంతో, వారు తమ ఇష్టానుసారంతమకు అనుకూలమైన పోలీసు అధికార్లను నియమించుకొని యదేచ్ఛగా అధికారం చెలాయిం చారు. అటువంటి ఎమ్మెల్యేల కారణంగానే కె.సి.ఆర్. ప్రభుత్వం అప్రతిష్ట మూటకట్టుకొని, చేసిన మంచిపనులు తెరమరుగై అధికారాన్ని కల్పోవాల్సి వచ్చిందనేది నిష్టుర సత్యం. బహుశా దీన్ని గుర్తించే రేవంత్‌రెడ్డి ప్రభుత్వ విల్లింగ్ లెటర్ల విషయంలో కఠినవైఖరిని అవలంబిస్తున్నదని భా వించాలి. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ (హెచ్.ఎంÊ ఎఫ్.డబ్ల్యు) ఫిబ్రవరి 7నజారీ చేసిన ఉత్తర్వుల పుణ్యమాని, ఇప్పుడు ఈ విల్లింగ్ లెటర్ల గోల వైద్యఆరోగ్యశాఖకు పాకింది. ముఖ్యంగా తెలంగాణలోని వివిధ జిల్లాల్లో చాలాకాలంగా డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న జిల్లా వైద్యశాఖాధికార్లు ఇప్పటికే తాము పనిచేస్తున్న కేంద్రానికి సమీపంలో ఆసుపత్రులను ఏర్పాటు చేసుకోవడమో లేక ప్రైవేటు ఆసుపత్రులకు అనుగుణంగా పనిచేస్తుండటమో జరుగుతూ వచ్చింది. ఇప్పుడు తాజా ఉత్తర్వుల నేపథ్యంలో డిప్యుటేషన్లు రద్దయితే తాము గతంలో పనిచేసిన స్థానాలకు తిరిగి వె ళ్లాలి. అప్పుడు తాము నడుపుతున్న ప్రైవేటు ఆసుపత్రుల నిర్వహణ దెబ్బతింటుంది కనుక, అ క్కడే ఏదోవిధంగా కొనసాగాలనుకుంటున్న వైద్యాధికార్లకు ఉత్తర్వుల్లోని పైన పేర్కొన్న 4వ నిబంధన వరంగా మారింది. దీని ఆధారంగా వారు తమ ప్రాంతానికి చెందిన మంత్రులను కలుసుకొని ‘విల్లింగ్ లెటర్లు’ తెచ్చుకొని, కలెక్టర్లకు సమర్పించి యథాతథంగా కొనసాగుతున్నారు. ఈ ప్రహసనంలో లక్షల్లో చేతులు మారుతున్నట్టు ఆరోపణలున్నాయి. ఆయా వైద్యాధికార్లు తాము కో ల్పోయే ఆదాయాన్ని బట్టి ఈ ముడుపులు సమర్పించుకొని, ‘మమ’ అనిపించుకుంటున్నట్టు స మాచారం. ప్రభుత్వంలో బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న మంత్రులు లేదా ఎమ్మెల్యేలు ఇక్కడ తెలుసుకోవాల్సిన సత్యం ఒకటుంది. కొత్త ప్రభుత్వం ఏర్పడి నిండా నాలుగు నెలలు కూడా పూర్తికాలేదు. తమ అక్రమార్జనా పాటవాన్ని ప్రదర్శిస్తే, ప్రజల్లో ప్రభుత్వం విలువ కోల్పోతుంది. ఇప్పటికే విద్యుత్ కోతలు, సాగునీరు, తాగునీరు విషయంలో ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటున్నది. లసుగులు ఎన్నున్నా, కె.సి.ఆర్. ప్రభుత్వం విద్యుత్, నీరు, రైతుల సమస్యలపై రాజీపడలేదు. దీన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తించుకోవాలి. వైద్య ఆరోగ్యశాఖ అత్యంత కీలకమైందిగా ప్రభుత్వం పరిగణిస్తుంది. ఎందుకంటే నిరుపేదలతో సహా ప్రజలందరికి 24గంటల వైద్యసదుపాయం అందుబాటులో ఉండాలి. ఈ కారణంచేతనే వైద్య ఆరోగ్యశాఖలో పనిచేసే డాక్టర్లను రెండేళ్లకు మించి ఒకేచోట పనిచేయడానికి సాధారణంగా పభుత్వం అనుమతించదు. అటువంటిది డిప్యుటేషన్‌పై వచ్చిన వైద్యాధికార్లు ఏళ్లకు ఏళ్లు తిష్టవేసుకొని ఒకేచోట పనిచేస్తుంటే ఇప్పటివరకు పట్టించుకోకపోవడమే విచిత్రం. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దీన్ని పట్టించుకొని సరిచేయాలనుకుంటే, ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే జారీచేసిన ఉత్తర్వు లు బూమరాంగ్ అయినట్టే భావించాల్సి వస్తున్నది. ప్రస్తుతం ఒకచోటే పనిచేస్తున్న వైద్యాధికార్లలో చాలామంది ‘ప్రైవేటు’ సంపాదన మరగడంతో అక్కడినుంచి బయటకు వెళ్లడానికి ఇష్టపడటంలేదు. వీరు యదేచ్ఛగా ప్రభుత్వ వైద్యాన్ని నిర్వీర్యం చేస్తూ, ప్రైవేటు వైద్యాన్ని ప్రోత్సహించే రీతిలో పనిచేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రజల్లో ఎం తమాత్రం మంచిపేరు లేని కొందరు వైద్యాధికార్లు తమ అక్రమాలను యదేచ్ఛగా కొనసాగించు కోవడానికి మంత్రులను ఆశ్రయించి పనికానిచ్చుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. సదరు మంత్రులపై కూడా ప్రజల్లో క్రమంగా ప్రతికూలత వ్యక్తమవుతోంది. అందువల్ల మంత్రులు కూ డా తమ వైఖరిని విడిచిపెట్టి, ప్రభుత్వ ప్రతిష్టను పెంచేలా పనిచేయాల్సిన అవసరం ఉంది. ‘అవినీతి’ అనే అనారోగ్యంతో ఇప్పుడు రాష్ట్రంలోని ‘వైద్య ఆరోగ్యశాఖ’ ఇబ్బంది పడుతోంది. ఖమ్మం జిల్లాలో కూడా కేవలం ఒక్క వైద్యాధికారి కారణంగా ఆ జిల్లాకు చెందిన మంత్రులు ఇప్పుడు బ దనాం అవుతున్నారు. అధికారం ఉన్నది కదా అని ఇష్టంవచ్చినట్టు వ్యవహరిస్తే, భవిష్యత్తులో ప్రజలు తమ ఓటుహక్కు ద్వారా తగిన గణపాఠం నేర్పక మానరు. తమకు ఏమీ కాదన్న ధీమాతోవ్యవహరించిన కె.సి.ఆర్. ప్రభుత్వం పతనమైన తీరే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఎవరైనా అనారోగ్యం పాల్కెనప్పుడు, ప్రాణం కాపాడుకోవడానికి ఎంత్కెనా ఖర్చుపెట్టడానికి వెనుకాడరు. ఆరోగ్యశాఖలో అవినీతి రాజ్యమేలడానికి ఇదొక్కటే ప్రధానకారణం. ప్రజల ప్రాణాలను కాపాడే వైద్యాన్ని అడ్డంపెట్టుకొని అవినీతికి పాల్పడటం అన్కెతికం మాత్రమే కాదు అత్యంత ప్రమాదకరం. వైద్యశాఖ ఉన్నది వైద్యాన్ని అందించడానికి తప్ప దండుకోవడానికి కాదన్న సత్యాన్ని గుర్తించాలి. నీతులు మాట్లాడే అవినీతిపరులు సమర్థించుకోవడానికి అనేక మాటలు చెప్పవచ్చుగాక! ప్రజావైద్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్న జిల్లా వైద్యాధికార్ల వైఖరికి మాత్రం ప్రభుత్వం కచ్చితంగా అడ్డుకట్ట వేయాల్సిందే. ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు చిత్తశుద్ధితో పనిచేసినప్పుడే ఇది సాధ్యం!
5 ఇల్లు, 6 ఓపెన్ ప్లాట్స్, 3 ఎకరాల వ్యవసాయ భూమి ప్రభుత్వ విలువ ప్రకారమే సబ్ రిజిస్ట్రార్ తస్లీమా ఆస్తులు రూ. 2.94 కోట్ల రూపాయలు గా గుర్తించిన ఏసీబీ అధికారులు. మార్కెట్ విలువ వీటికి 10 రెట్లు ఎక్కువ.
`ప్రజాస్వామ్యంలో కొత్త పరిణామంతో సరికొత్త ఇబ్బందులు
`దిశారహిత రాజకీయాలవైపు ప్రజాస్వామ్యం
`‘లౌక్యం’ దిశగా కార్యకర్తలు మళ్లాల్సిన పరిస్థితి
హైదరాబాద్,నేటిధాత్రి:
ప్రజాస్వ్యామంటేనే ప్రజల భాగస్వామ్యానికి పెద్దపీట వేసే వ్యవస్థ. కానీ దేశ, రాష్ట్ర రాజకీయాల ను పరిశీలిస్తే ప్రజాస్వామ్య నిర్వచనమే మారిపోతోంది. అధికార పరమావధి, కెరీర్‌కు ప్రాధాన్య మిచ్చే రాజకీయాల్లో, నిబద్ధంగా పార్టీని అంటిపెట్టుకొని పనిచేస్తున్న కార్యకర్తలు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి అయోమయానికి గురవుతున్నారు. ఉన్న సారాయే సీసాలు మారుతోంది తప్ప, కొత్త నీరు రావడం కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి కార్యకర్తల సమస్యలపై ఈ కథనం. సైద్ధాంతిక ప్రాతిపదికన రాజకీయాలు నెరపడం అనేది కాలగతిలో చరిత్రపుటల్లో కలిసి పోయి, కేవలం రాజకీయాలను తమ కెరీర్ అభివృద్ధికి ఒక సాధనంగా చూసే రోజులు వచ్చేశాయి. ప్రజాస్వామ్యంలో ఈ మార్పు ఆరోగ్యకరమా లేక ఆనారోగ్య ధోరణా అన్న మాట అట్లా ఉంచితే, గెలుపే లక్ష్యంగా ముందుకెళుతున్న రాజకీయ పార్టీలు ఏ అభ్యర్థివల్ల తమకు విజయావకాశాలుంటాయన్న బేరీజుతో పావులు కదుపుతుండటం ఈ వర్త మాన పరిణామానికి ప్రధాన కారణమన్నది మాత్రం అక్షరసత్యం. ఈ రాజకీయ భేతాళ పంచవింశతిలో కొన్ని నష్టాలు, కొన్ని లాభాలు రెండూ ఉన్నాయి. దేని పాలు అధికమనేది ఎప్పటికప్పుడు పరిస్థితులను బట్టి మారుతుంటుంది. అయితే వాటిల్లుతున్న నష్టం ఆయా పార్టీల కార్యకర్తలకు మాత్రమేనన్నది సుస్పష్టం! ప్రస్తుత రాజకీయ పరిణామల్లో బి.ఆర్.ఎస్, భాజపా, కాంగ్రెస్ లేదా మరే ఇతర పార్టీల్కెనా గతంలో తాము అనుసరించిన వ్యూహాల్లో సమూల మార్పులు తీసుకొచ్చాయి. ఈ మార్పుల ప్రతికూల ప్రభావం మొద ట్నుంచీ పార్టీని నమ్ముకొని, జెండాలు మోసి పాటుపడిన కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నా యకులపై ప్రధానంగా పడుతోంది. ఈ మార్పు వల్ల సైద్ధాంతికత కనుమరుగైపోయి, సం క్షేమం పేరుతో విచ్చలవిడిగా తాయిలాలు పంచడం, బుజ్జగింపు అనే రాజకీయ ధోరణులు మొదలయ్యాయి. ఇది క్రమంగా గెలుపు గుర్రాలు లేదా బలమైన నాయకులను ఆక ర్షించే దశకు తీసుకెళ్లడం, రాజకీయాలను ఒక కెరీర్‌గా మలచుకోవడానికి దారితీసింది. ఫలితంగా సిద్ధాంతం స్థానాన్ని, సంక్షేమం పేరుతో విచ్చలవిడి ‘ఉచితాలు’ ఆక్రమించేశా యి. సమాజంలో బలీయమైన ఓటుహక్కు ఉన్న వర్గాలకు పరిమితికి మించిన ‘ఉచితా’లను ప్రకటించడమే కాదు, ఆయా వర్గాలకు చెందిన నాయకులకు పార్టీలు ప్రాధాన్యత నివ్వడం, దీనివల్ల కలిగిన తాజా పరిణామం. ఈ విపరిణామాల్లో ప్రధానంగా చెప్పుకోవలసింది ఆయా పార్టీలకు చెందిన కార్యకర్తల ఎదుర్కొంటున్న దుస్థితి గురించి! సుదీర్ఘకాలంగా పార్టీని నమ్ముకొని, జెండాను మోసి, అనుకూల ప్రచారం చేసిన కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నాయకులు ఆయా పార్టీల అధిష్టానాలు తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలకోసం తీసుకునే నిర్ణయాలవల్ల క్షేత్ర స్థాయిలో విపరీతమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎన్నికల సీజన్ దగ్గరపడే కొద్దీ బలమైన నాయకుల ఎంపిక అనేది ‘ఐ.పి.ఎల్ వేలం’ మాదిరిగా మారిపోయింది. తమ పార్టీలో టిక్కెట్ దొరకని నాయకులు వేరే పార్టీలవైపు చూడటం, తమ పార్టీలో సరైన నాయకులు లేరని భావించిన పార్టీలు ఇతర పార్టీలనుంచి గట్టి నాయకులను ఆకర్షించడానికి ప్రయత్నించడం సర్వసాధారణం కావడం, దిశా రహిత రాజకీయాలకు దారితీసింది. ఫలితంగా ఏనాయకుడు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియని పరిస్థితి! క్షేత్రస్థాయి కార్యకర్తలు తాము ఒకప్పుడు వ్యతిరేకంగా ప్రచారం చేసిన నాయకులకు అనుకూలంగా ఓట్లడుగుతూ ని యోజవర్గాల్లో తిరగాల్సిన పరిస్థితికి ఈ పరిణామాలు దారితీస్తున్నాయి. ఉదాహరణకు గత ఎన్నికల్లో భారాసా తరపున పోటీచేసిన అభ్యర్థి ఇప్పుడు టిక్కెట్ దొరక్క లేదా మరే ఇతర కారణంవల్లనో కాంగ్రెస్‌లోనే భాజపాలోనే చేరి ఎన్నికల బరిలో దిగితే, గత ఎన్నికల్లో సదరు నాయకుడికి అనుకూలంగా ప్రచారం చేసిన కార్యకర్తలు ఇప్పుడు ఆయనకు వ్యతి రేకంగా ప్రజల్లోకి వెళ్లి ఏవిధంగా ప్రచారం చేయగలుగుతారు? ‘అధిష్టాలనాల రాజకీయ వైకుంటపాళి’లో ఈవిధమైన సంకట పరిస్థితిని కార్యకర్తల నెత్తిమీదికి తెచ్చిపెట్టే వైఖరి విచిత్రమే! తెలంగాణలో తామే ప్రత్యేక రాష్ట్రం తెచ్చామని భారాసా చెబుతుంది లేదు తామే తెలంగాణ ఇచ్చామని కాంగ్రెస్ వాదిస్తుంది. మా సహాయం లేకుండా ప్రత్యేక రాష్ట్రం సాధ్యమయ్యేదా అని భాజపా అంటుంది! ఇక్కడ ముగ్గురి వాదనా కరక్టేననుకుందాం. ప్రస్తుతం ఈ మూడు పార్టీల మధ్య నాయకులు మార్పిడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా రాజకీయాలను కెరీర్‌గా భావించే నాయకులు, అధికారమే పరమావధిగా రాజకీయాలు నడిపే పార్టీల వల్ల ఈ పరిస్థితి దాపురించింది. అయితే ఈ ‘మార్పిడు’ల వల్ల ఈ పార్టీలకు చెందిన క్షేత్రస్థాయి కార్యకర్తల్లో అయోమయం నెలకొంటున్నది. ఎప్పుడు ఎవరికి అనుకూలంగా ప్రచారం చేయాలో తెలియని దుస్థితి! ఒకప్పుడు తాము తీవ్రంగా వ్యతిరేకించిన నాయకుడే ఇప్పుడు తమ నెత్తినెక్కి కూర్చుంటే, కక్కలేక మింగలేక స్తబ్దంగా ఉండలేక కార్యకర్తలు తీవ్ర మనోవ్యధకు లోనవుతున్నారు. ఈవిధంగా తాము ఒకప్పుడు వ్యతిరేకించిన వారికి ఇప్పుడు అనుకూలంగా, ఒకప్పుడు అనుకూలంగా వ్యవహరించినవారికి ఇప్పుడు వ్యతిరే కంగా ప్రచారం చేయాల్సి రావడం కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నది. మానవ శరీరానికి ‘అస్తిపంజరం’, భవనానికి ‘స్టీలు’ ఎంతటి దృఢత్వాన్ని ఇస్తాయో, పార్టీకి కార్యకర్తలు కూడా అంతే! వారి ఆధారంపైనే పార్టీల మనుగడ ఆధారపడి వుంటుంది. ముఖ్యంగా సైద్ధాంతిక నిబద్ధతపై పార్టీలు కొనసాగినప్పుడు, ఆయారాం గయారాంల సంఖ్య తక్కువగా ఉండేది. కానీ ‘కెరీర్ రాజకీయాలు’ ఆధిపత్యం వహిస్తున్ననేటి కాలంలో ‘సిద్ధాంతాల’ స్థానాన్ని ‘అధికారం’ ఆక్రమించింది. ఈ నేపథ్యంలో పార్టీల కార్యకర్తలు తప్పనిసరి పరిస్థితుల్లో తమ ప్రచార వ్యూహాలను కూడా మార్చుకోవలసి వస్తోంది. ఏ నాయకుడిని వ్యతిరేకించకుండా, తమ నాయకుడికి అనుకూలంగా ప్రచారం చేసుకోక తప్పడంలేదు. తమ పార్టీకి ప్రత్యర్థిగా ఉన్నాడని గుడ్డిగా అతనికి పూర్తి వ్యతిరేక ప్రచారం చేస్తే, రేపు ఆయనే తమపార్టీలో చేరినట్లయితే తమ పరిస్థితేంటనేది ఆలోచిం చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అందువల్లనే కొన్ని ప్రాంతాల్లో కార్యకర్తలు ‘లౌక్యం’గా వ్యవహరించడం కనిపిస్తోంది. కానీ మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం, చేరిన కొత్తనాయకు లు వారి అనుచరగణం ఆధిపత్యం, మొదట్నుంచీ పార్టీని నమ్ముకున్న పార్టీలకు పెను సంకటంగా మారింది. ఫలితంగా ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. ‘కెరీర్’కు ప్రాధాన్యం ఇచ్చే నాయకులు తమతోపాటు తమకు నమ్మకస్తుల్కెన వారిని కూడా వెంటబెట్టుకు వెళు తుంటారు. వీరు కొత్తగా చేరిన పార్టీలో తమ నాయకుడి అండ, అధిష్టానం తీసుకున్న నిర్ణయం ఇచ్చిన దన్నుతో స్థానిక కార్యకర్తలపై ఆధిపత్యం అవసరమైనే జులుం ప్రదర్శిస్తుండటం వర్తమాన చరిత్ర! ఈ పరిణామాలు ఆయా పార్టీల అధినాయకత్వాలకు తెలియవా? అంటే తప్పక తెలుసుననే సమాధానం వస్తుంది. కానీ వారి పరస్థితి వారిది! అధికారం పరమపద సోపానమైన ప్పుడు ఈ పరిణామాన్ని ఆహ్వానించక తప్పదు. ఇక్కడ వారికి కార్యకర్తలు కాదు, గెలిపించే దమ్మున్న నాయకుడు ముఖ్యం! సదరు నాయకుడు ఆ భారాన్ని నెత్తిన వేసుకున్నప్పుడు ఇక కార్యకర్తలతో పనేంటి? నిజంగా ఇది విచిత్ర పరిస్థితి! ఈ పరిణామాలు క్షేత్రస్థాయి కార్యకర్తల్లో కూడా గాలివాట అనుకూల వైఖరిని ప్రోత్సహిస్తున్నాయి. అంటే ఎవరూ ఎవరికీ వ్యతిరేకం కాదు! అంతా మనవాళ్లే! పార్టీ ప్రధానం కాదు, భవిష్యత్తు ప్రధానం! ప్రజాస్వామ్యంలో చోటుచేసుకుంటున్న ఈ విపరిణామం వల్ల కొత్తవారికి ఛాన్స్ మాట అట్లా వుంచి, ఉన్న నాయకులే వేర్వేరు పార్టీల జెండా కింద పోటీచేయడం, వున్న కొద్దిమందిలోనే ఎవరినో ఒకరిని ఎన్నుకోవాల్సి రావడం ప్రజలెదుర్కొంటున్న దుస్థితి! ఇక్కడ సీసాలు పాతవే, సారా పాతదే…కాకపోతే సారా సీసాలు మారుతుంది! అంతే! ఇటువంటి పరిస్థి తుల్లో కార్యకర్తలు రాజకీయాల్లో ఎదగడం చాలా కష్టమే! వీరు తమ మనుగడకోసం రంగులు మార్చే రాజకీయాలకు అలవాటు పడితే తప్ప, ఈ వైకుంఠపాళిలో ‘పాము కాటు’ కు గురికాక తప్పదు. దురదృష్టవశాత్తు నిబద్ధత కలిగిన కార్యకర్తలకు ఇదే అనుభవం ఎదురవుతోంది! ఫలితంగా కార్యకర్త అనే పదానికి ‘నిర్వచనం’ మారిపోతున్నది. ప్రజాస్వా మ్య మనుగడ, దాని దిశ కొత్తపుంతలు తొక్కుతోంది. ఇది మంచికా, చెడుకా అన్నది కాలం నిర్ణయించాల్సిందే!
చిన్నారి అక్షయ తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రాకు కృతజ్ఞతలు తెలిపారు. భూపాలపల్లి పట్టణంలోని ఎల్బీనగర్ కు చెందిన కాజిపేట నరేష్, సుమలత దంపతుల కుమార్తె అక్షయ(7)గత సంవత్సరం దీపావళి వేడుకలులో ప్రమాద వశాత్తూ గాయపడడంతో మంచానికే పరిమితమైంది. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న అక్షయ గురించి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలుసుకొని చిన్నారి వైద్య చికిత్సలు అందిస్తామని ఆదివారం ప్రకటించిన నేపథ్యంలో సోమవారం సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అక్షయ తండ్రి నరేష్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాను కలసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ చిన్నారి అక్షయకు వైద్యసేవలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. తల్లిదండ్రులు ధైర్యంగా ఉండాలని అన్నారు. తక్షణమే అక్షయ ను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. ఎంజిఎం ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి అక్షయకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. అక్షయ వైద్య సేవలపై ఎప్పటికప్పుడు తనకు తెలుసుకోవాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్ కు సూచించారు. చిన్నారి ఆరోగ్యం మెరుగుపడే వరకు నిరంతర పర్యవేక్షణ చేయాలని తెలిపారు. ఎంజిఎం లో వైద్య సేవలు లేకపోతే హైదరాబాద్ సిఫారసు చేస్తామని అన్నారు. అక్షయ తల్లిదండ్రులు అధైర్య పడవద్దని చిన్నారి అక్షయ త్వరగా కోలుకుంటుందని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.