-కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే గండ్ర
-పూర్వవైభవం దిశగా కాంగ్రెస్ అడుగులు
-రాలిపోతున్న గులాబీ రేకులు
-వరుసగా బీఆర్ఎస్ ను వీడుతున్న నేతలు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్
లోక్ సభ ఎన్నికల ముందు భూపాలపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటున్నారు. మొగుళ్లపల్లి మాజీ సర్పంచ్ మోటే ధర్మన్న తన అనుచరులతో కలిసి సోమవారం బీఆర్ఎస్ ను వీడి సొంతగూటికి వెళ్లారు. భూపాలపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మోటే ధర్మన్న చేరికతో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం సంతరించుకునే దిశగా అడుగులు వేస్తోంది. గట్టిపట్టున్ననేతగా..బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి కిరణంగా పేరుగాంచిన..ధర్మన్న చేరికతో..బీఆర్ఎస్ పార్టీకి ఊహించని రీతిలో భారీ షాక్ తగిలినట్లయింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన ధర్మన్న, సర్పంచ్ గా విశేష సేవలందిస్తూ..సౌమ్యుడిగా..పిలిస్తే పలికే ఆపద్బాంధవుడిలా..మండల ప్రజల మన్ననలు పొందారు. ఆయన చేరిక కాంగ్రెస్ పార్టీకి మరింత బలాన్ని చేకూర్చినట్లయింది. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో వార్డు సభ్యులు, బీఆర్ఎస్ నాయకులున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తక్కలపల్లి రాజు ఎర్రబెల్లి పున్నం చందర్ రావు, ఏలేటి శివ రెడ్డి, క్యాతరాజు సాంబమూర్తి తదితరులున్నారు.