నర్సంపేట పిఎసిఎస్ చైర్మన్ గా బొబ్బల రమణారెడ్డి

పిఎసిఎస్ చైర్మన్ ను అభినందించిన ఎమ్మెల్యే మాధవరెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి :

నర్సంపేట మండల వ్యవసాయ సహకార సంఘం (పిఎసిఎస్) గత చైర్మన్ పై మార్చి12 న అవిశ్వాసం కాంగ్రెస్ పార్టీ నెగ్గింది.అనంతరం గత చైర్మన్ మోరాల మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడంతో తదుపరి చైర్మన్ ఎన్నికను హైకోర్టు వాయిదా వేయడంతో ఈ నెల 21న మోహన్ రెడ్డి పిటిషన్ ను రద్దుపరిచిన కోర్టు వైస్ చైర్మన్ మెరుగు శ్రీనివాస్ ను చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఐదు రోజుల తర్వాత గురువారం చైర్మన్ ఎన్నికను నిర్వహించగా 13 మంది సభ్యుల గాను 9 మంది సభ్యులు పాల్గొని బొబ్బల రమణారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డిస్టిక్ కోపరేటివ్ సొసైటీ ఆఫీసర్ సంజీవరెడ్డి ఎన్నికల నిర్వహణ అధికారిగా పాల్గొని అధికారికంగా రమణారెడ్డి ఎన్నికను ఏకగ్రీవంగా జరిగినట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు 9 మంది డైరెక్టర్లు మెరుగు శ్రీనివాస్, గుజ్జుల మాధవరెడ్డి, బైరి జనార్దన్ రెడ్డి, దామెర రవి, బానోతు లక్ష్మణ్, తిరుపతి హాజరయ్యారు. అనంతరం రమణారెడ్డి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి వద్దకు వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు గాను చైర్మన్ ను ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నర్సంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అభినందించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తక్కలపల్లి రవీందర్ రావు, టిపిసిసి సభ్యులు రామానంద్, మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బానోతు లక్ష్మణ్ నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ కత్తి కిరణ్, మహేశ్వరం సర్పంచ్ నిరంజన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు దండెం రతన్ కుమార్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

నిప్పుకు ఆహుతి అవుతున్నహరితహారం మొక్కలను పట్టించుకోని అధికారులు

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల మైలారం గ్రామంలో గ్రామ పంచాయతీ పరిధిలో హరితహారం మొక్కలకు బుధవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతానా నిప్పు అంటుకొని దగ్నం అవుతున్నాయి. గ్రామపంచాయతీ అధికారులు, అటవీ శాఖ అధికారులు గాంధీ నగర్, మైలారం గ్రామంలో ప్రజలకుఅవగాహన సదస్సు పెట్టకపోవడం హరితహారం మొక్కలు మంటల్లో కాలిపోతున్నాయి. ఈ రెండు గ్రామాలకు అధికారులు కచ్చితంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి గ్రామ రైతులకు ప్రజలకు ముఖ్యంగా రైతులు పంట పొలాలను సదును చేసుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా నిప్పు అంటిస్తున్నారు. ఇంతకముందు ఒకసారి ఇలానే కాలుతుండగా ధర్మ సమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కండే రవి మహారాజ్ అప్పుడే రోడ్డు వైపు నుండి వస్తుండగా మంటలు అంటుకోవడం చూచి మంటలను ఆర్పేయడం జరిగింది ఇప్పుడు హరితహారం మొక్కలు సుమారు 100కు పైగా కాలిపోయాయి దీనిపై విచారించి అధికారులు చర్యులు తీసుకోవాలి.

మోడీ ప్రభుత్వాన్ని ఢిల్లీ నుండి తరిమికొట్టాలి

# బీజేపీ అబద్ధపు ప్రచారాలు నమ్మొద్దు
# ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి :

మోడీ ప్రభుత్వాన్ని ఢిల్లీ నుండి తరిమికొట్టాలని బీజేపీ అబద్ధపు ప్రచారాలు ప్రజలు నమ్మొద్దని ప్రభుత్వ సంస్థలను అమ్మే బీజేపీ కావాలా దేశ అభివృద్ధికి పాటుపడే కాంగ్రెస్ పార్టీ కావాలో ప్రజలే ఆలోచన చేయాలని స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు.నర్సంపేట పట్టణానికి చెందిన మాజీ వార్డు సభ్యులు సీనియర్ నాయకుడు గండి గిరి తోపాటు 30 కుటుంబాలు గురువారం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పేదలకు ఏడాదికి 100 రోజులు పని కల్పించాలని ఉపాధి హామీ చట్టం తీసుకచ్చిందని కానీ ఇప్పుడున్న బిజెపి ప్రభుత్వం కేవలం ఏడాదికి 42 రోజులె పని కల్పిస్తుందని మళ్ళీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏడాదికి 100 రోజులు పని కల్పించడంతో పాటు గతంలో మాదిరిగానే పని ముట్లు అందిస్తూ ఉపాధి హామీ కూలీలకు రోజుకు 400 రూపాయలు అందిస్తామని అన్నారు. మహిళలు, యువకులు, శ్రామికులు, రైతులతో పాటు ప్రతీ ఒక్కరికి సమన్యాయం అందించాలన్నదే రాహుల్ గాంధీ లక్ష్యం అని చెప్పారు. యువకుల బలిదానాలు చూసి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని, కానీ ఇచ్చిన తెలంగాణను కెసిఆర్ దుర్మార్గపు పాలనతో సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోచుకున్నారని ఆరోపించారు.రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన కేసీఆర్ 10ఏళ్ల పాలనలో అవినీతి, ఆక్రమాలు చేశారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన 6 గ్యారంటీలలో ఇప్పటికే 5 గ్యారంటీలను అమలు చేశామని చెప్పారు.రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయం అని అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందించడానికి కృషి చేస్తామని మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొరిక బలరాం నాయక్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో టిపిపిసి సభ్యులు పెండెం రామానంద్, జిల్లా అధికార ప్రతినిధి తక్కళ్లపెల్లి రవీందర్ రావు, మాజీ మార్కెట్ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, నర్సంపేట మండల అధ్యక్షులు బానోతు లక్ష్మణ్ నాయక్, మున్సిపల్ ప్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ చింతల సాంబరెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్ర యాకుబ్ రెడ్డి, 16 వ వార్డు అధ్యక్షులు బాణాల శ్రీనివాస్-ప్రసన్న, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తుమ్మలపెల్లి సందీప్, పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కొంకిస మదన్ కుమార్ గౌడ్, పంబి వంశీకృష్ణ, మాజీ వార్డు మెంబర్ పేరం బాబురావు, దండెం రతన్ కుమార్, కోయ్యడి సంపత్, మైదం రాకేష్, మేడం కుమార్, తదితరులు పాల్గొన్నారు.

బిజెపి ఎంపీ అభ్యర్థిగా ఆరురి రమేష్ గారి గెలుపే లక్ష్యంగా పనిచేయాలి.

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రం నుండి వరంగల్ బిజేపి ఎంపీ అభ్యర్థి అరురి రమేష్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలనీ బీజేపీ మండల అద్యక్షుడు జిట్టబోయిన సాంబయ్య, బిజెవైమ్ రాష్ట్ర కళాశాల కన్వీనర్ మంద మహేష్ లు పేర్కోన్నారు. వరంగల్ బిజేపి ఎంపీ అభ్యర్థి రమేష్ నామినేషన్ సంధర్బంగా గణపురం మండలము నుండీ 300 మంది తరలివెళ్లారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ దేశంలో మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. అంతేగాక ప్రధాని నరేంద్ర మోడీ అధికారం చేపట్టడం ఖాయమని పేర్కోన్నారు. పదేళ్ల బిజెపి పాలనలో దేశం అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లడం జరిగిందనీ అన్నారు. పేదల కోసం ప్రత్యేకంగా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అందరికీ న్యాయం జరుగుతుంది అన్నారు. వరంగల్ బిజేపి ఎంపీ అభ్యర్థి రమేష్ ను అత్యదిక మెజార్టీ తో గెలిపించి, ఢిల్లీకి పంపాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మండల ప్రథాన కార్యదర్శి మాదాసు మోగిలి గౌడ్, చింతి రెడీ పాపిరెడ్డి, చందు, చెలుమల్ల ప్రవీణ్, శేషు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన పిఎసిఎస్ చైర్మన్

గణపురం పిఎసిఎస్ చైర్మన్ కన్నేబోయిన కుమార్

గణపురం నేటి ధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా
గణపురం మండల కేంద్రంలో పిఎసిఎస్ చైర్మన్ కన్నెబోయిన కుమార్ విలేకరులతో మాట్లాడుతూ గణపురం మండలానికి చెందిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో 4461 మంది సభ్యులు ఉన్నారని రెండు లక్షల రుణమాఫీ కోసం రైతులు ఎదురుచూస్తున్నారనిమండలంలో పదకొండు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు రైతులు పండించిన వరి ధాన్యాన్ని సొసైటీ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు వరి ధాన్యాన్ని అమ్ముకోవాలని దళారులను బ్రోకర్లను నమ్మి మోస పోకుండా ప్రభుత్వం పిఎసిఎస్ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు కొనుగోలు కేంద్రాల వద్ద ప్రభుత్వం నిర్ణయించిన మొదటి రకం వరి ధాన్యానికి 2203 రూపాయలు రెండవ రకం వరి ధాన్యానికి 2183 ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర చెల్లిస్తుందని అన్నారు రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఏర్పాటు చేసిన కేంద్రాలలో వరి ధాన్యాన్ని అమ్మడం వల్ల సొసైటీ అభివృద్ధి చెందుతుందని దీనితో రైతులు అభివృద్ధి చెందుతారని అన్నారు రైతులు అభివృద్ధి చెందితే సొసైటీ అభివృద్ధి చెందుతుందని దీనికి రైతులు సహకరించాలని కోరారు సహకార సంఘం ప్రభుత్వం రైతులకు ఎలక్షన్ కోడ్ వల్ల నిలిచిపోయిన రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు 15 తర్వాత రైతులకు అందే విధంగా బ్యాంకు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు మిల్లర్లకు ప్రభుత్వం రైతుల దగ్గర వరి ధాన్యాన్ని కటింగ్ లేకుండా కొనుగోలు చేయాలనిభూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాలు జారీ చేశారని ఎలాంటి తూకంలో మోసం జరిగినా మిల్లర్లపై తగిన చర్య తీసుకోబడునని అన్నారు.

మెదక్ బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి నామినేషన్ కు

భారీగా బయలుదేరిన కొల్చారం మండలం బి ఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు…

కొల్చారం (మెదక్) నేటిధాత్రి :-

మెదక్ బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి నామినేషన్ వేస్తున్న సందర్భంగా కొల్చారం మండలం నుంచి అన్ని గ్రామాల నుండి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున బయలుదేరారు. ఈ సందర్భంగా పోతన శెట్టిపల్లి చౌరస్తా వద్ద కొల్చారం మండల యువత విభాగం అధ్యక్షుడు తుంకలపల్లి సంతోష్ రావు విలేకరులతో మాట్లాడుతూ కోనాపూర్, పైతర , కొల్చారం, పోతం శెట్టిపల్లి, చిన్నగనాపూర్ వివిధ గ్రామాల నుండి తరలి వెళ్లడం జరుగుతుందని ఆయన అన్నారు. వెంకట్రాంరెడ్డి గెలుపు కోసం కొల్చారం మండలం బి ఆర్ఎస్ పార్టీ కార్యకర్త లందరము కలిసికట్టుగా పనిచేసి కొల్చారం మండలం నుండి భారీ మెజార్టీ వచ్చేలా కృషి చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తుంకలపల్లి సంతోష్ రావు , రవితేజ రెడ్డి, ఎల్లేశం, మోత్కు మల్లేశం, సీనియర్ నాయకుడు చిట్యాల యాదయ్య, అన్ని గ్రామాల బిఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు.

ఇళ్ళందలో ఘోర రోడ్డు ప్రమాదం

ఒకే బైకుపై నలుగురు విద్యార్థులు

ప్రమాదంలో నలుగురు విద్యార్థులు మృతి

నేటిధాత్రి, వరంగల్

వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వర్దన్నపేట మండలంలోని ఇల్లంద గ్రామ శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రైవేట్ బస్సును, బైక్ ఢీకొనడం వల్ల నలుగురు విద్యార్థులు మృతి చెందారు. ముగ్గురు విద్యార్థులు స్పాట్ లోనే మరణించగా, తీవ్ర గాయాల పాలైన ఒక యువకుడిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఆ యువకుడు ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతులు నలుగురు ఇల్లంద గ్రామానికి చెందినవారుగా తెలిసింది. ఇంటర్ ఫలితాల్లో పాస్ కావడంతో పొన్నం గణేశ్, తన ముగ్గురు స్నేహితులైన వరుణ్ తేజ్, పొన్నాల అనిల్, సిద్ధులకు సాయంత్రం పార్టీ ఇచ్చాడు. అనంతరం ఒకే బైకుపై నలుగురు ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాశిమల్ల వరుణ్ తేజ, మల్లెమాక సిద్దు, గణేష్, పొన్నాల అనిల్ కుమార్ మృతుల్లో ఉన్నట్లు సమాచారం. ఈ నలుగురిలో అనిల్ కుమార్ ఎంజీఎం తరలించిన తర్వాత ప్రాణాలు కోల్పోయాడు. ఈ దుర్ఘటనతో ఇల్లంద గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

గొర్రెకుంట పాఠశాలలో వేసవి క్రీడా శిక్షణా శిబిరం.

వరంగల్/నర్సంపేట,నేటిధాత్రి :

క్రీడాజ్యోతి స్పోర్ట్స్ ఫౌండేషన్ వారి సహాయ సహకారాలతో గొర్రెకుంట పాఠశాలలో వాలీబాల్ వేసవి క్రీడా శిక్షణ శిబిరం ప్రారబం అయ్యింది.ఈ సందర్భంగా క్రీడాజ్యోతి స్పోర్ట్స్ ఫౌండేషన్ వారు సమకూర్చిన క్రీడా సామాగ్రిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నళిమెల జ్యోతిర్మయి, ఉపాధ్యాయులు విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ వేసవి సెలవులలో క్రీడా శిక్షణా శిబిరంలో పాల్గొని క్రీడా సామర్ధ్యాన్ని పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ శిబిరం మే 30 వరకు కొనసాగుతుందని,క్రీడల్లో మంచి ఫలితాలు సాధించిన వారికి భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు ఉంటాయని పాఠశాల పిఇటి,కోచ్ జె.రఘువీర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో గొర్రెకుంట పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

ప్రభుత్వ భూములను కాపాడడంలో అధికారుల నిర్లక్ష్యం

# పేదవారికి ఒక న్యాయం… ధనవంతులకు ఒక న్యాయం..!
# నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నర్సంపేట మున్సిపాలిటీ రెవెన్యూ అధికారులు.
# సిపిఎం నర్సంపేట పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్..

నర్సంపేట,నేటిధాత్రి :

రోజురోజుకు నర్సంపేట పట్టణం జిల్లా స్థాయిలో ఎదుగుతున్న నేపథ్యంలో భూములకు రెక్కలు వచ్చాయని దీంతో అక్రమాలకు పాల్పడుతున్న కొందరు ప్రభుత్వ భూములను కబ్జాలకు చేస్తున్నారని ఆ కాపాడడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సిపిఎం నర్సంపేట పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్ ఆరోపించారు.నర్సంపేట పట్టణంలోని 702 సర్వేనెంబర్ ప్రభుత్వ భూమిలో అక్రమంగా కట్టడాలు జరుగుతున్న ప్రాంతాన్ని సిపిఎం పట్టణ కమిటీ అధ్వర్యంలో పరిశీలించారు.ఈ సందర్భంగా హన్మకొండ శ్రీధర్ మాట్లాడుతూ పేదవారు ఇండ్ల నిర్మాణం చేపడితే వాటిని కూల్చివేస్తూ ఒక న్యాయంగా అదే ఆర్థికంగా ఉన్నవారు అక్రమంగా ఇండ్లు,కమర్షియల్ ఇండ్లు నిర్మాణం చేసుకుంటే వాటికి ఒక న్యాయంగా నర్సంపేట పట్టణంలో మున్సిపాలిటీ, రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.నర్సంపేట పట్టణంలో 111 సర్వే నెంబర్ లో నిరుపేద కుటుంబం స్థలం కొనుగోలు చేసి నివాసం ఉండడానికి ఇల్లు కట్టుకుంటుంటే ప్రభుత్వ భూమి అని అనుమతులు లేవని ఆ ఇంటిని రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులు కూల్చివేయడం జరిగిందన్నారు. అదే
ప్రభుత్వ భూమి 702 సర్వే నంబర్ లో ఓ ఉన్నత వ్యక్తి రాత్రికి రాత్రి రేకుల షెడ్డు నిర్మిస్తే,అక్రమ నిర్మాణం చేస్తుంటే ఫిర్యాదు చేసి రోజులు గడుస్తున్న పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వెనుక ఉన్న మతలాబు ఏమిటి అని ప్రశ్నించారు.
111 సర్వే నెంబర్ లో ఇల్లు కట్టుకునే వ్యక్తి పేదోడు కాబట్టి అతని నుండి ముడుపులు రావు కాబట్టి కూల్చి వేశారని,అలాగే సర్వే నంబర్ 702 ప్రభుత్వ భూమిలో మొరంపోసి చదును చేసి ఫ్లాట్లు చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడం ఆర్థికంగా బలమైన వ్యక్తి కాబట్టి అతని నుండి ముడుపులు వస్తాయని ఉద్దేశంతో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు.పట్టణంలో ఇండ్లు లేనీ అనేకమంది నిరుపేదలు ఇళ్ల స్థలాలు కావాలని ఎన్ని సార్లు విన్నపాలు చేసిన కనీసం స్పందించని అధికారులు, పేదలు ఇంటి స్థలాలు కావాలని ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకుంటే దాడులు చేసి కేసులుపాలు చేస్తున్నారని పేర్కొన్నారు.అవే ప్రభుత్వ భూములను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే వారి మీద ఎలాంటి చర్యలు, కేసులు పెట్టకుండా భూకబ్జాదారులకు వంత పాడడం సరికాదని హితవు పలికారు.నర్సంపేట పట్టణంలో ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సొంత భవనాలు నిర్మాణాలు లేక అద్దె భవనాలల్లో విధులు నిర్వహిస్తున్నారని, అనేక మంది నిలువ నీడ లేని పేదలు ఉన్నారని అన్నారు. కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను గుర్తించి ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించాలని 702 సర్వే నంబర్ లో అక్రమ కట్టడాలను నిలిపివేయాలని శ్రీదర్ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు కందికొండ రాజు, నాయకులు మొలుగూరి రాజు, దాసరి నరేష్, మద్దెల నాగరాజు, వీరన్న, వేములపల్లి సుధాకర్, పులి చేరు చందు, జార్జ్ విక్టర్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

జేఈఈ ఫలితాల్లో 13వ ర్యాంక్ సాధించిన మణిదీప్

నేటిధాత్రి, వరంగల్

ఇటీవల విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా ఓబిసి కేటగిరీలో 13వ ర్యాంక్, జనరల్ కేటగిరీలో 78వ ర్యాంక్ సాధించారు వరంగల్ కి చెందిన విద్యార్థి సాంబారి మణిదీప్ కుమార్. విద్యార్థి మణిదీప్ వాళ్ల నాన్న సాంబారి సంజయ్ కుమార్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు. ఆల్ ఇండియా లెవల్ లో 13వ ర్యాంక్ సాధించిన మణిదీప్ ను తోటి స్నేహితులు, బందువులు అభినందించారు.

సజావుగా పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్

# నిబంధనల ప్రకారం నామినేషన్ల స్క్రుటిని ప్రక్రియ

# ఇంటి వద్ద ఓటింగ్ నిర్వహణకు అవసరమైన బృందాలను సన్నద్దం చేయాలి

# ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాల ఏర్పాటు

# ప్రతి ఓటరుకు ఓటర్ స్లిప్పు అందేలా పక్కా చర్యలు

# పార్లమెంట్ ఎన్నికల నిర్వహణపై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్

ములుగు జిల్లా నేటిధాత్రి

ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి నామినేషన్ల స్క్రూటీని, బ్యాలెట్ పేపర్ ముద్రణ, హోం ఓటింగ్, ఓటర్ స్లిప్పుల పంపిణీ, తదితర అంశాలపై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారిని ఇలా త్రిపాఠి ఐటిడిఏ పిఓ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిని చిత్ర మిశ్రా, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు అదనపు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిని పి. శ్రీజ లతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా *రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించి ఓటరు తుది జాబితా రూపొందించాలని ఎన్నికలలో పోటీ చేసే ప్రతి అభ్యర్థికి తుది ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాల వివరాలు అందించాలని, ప్రతి ఓటర్ కు ఓటర్ స్లిప్పు పంపిణీ కోసం నిర్దేశిత షెడ్యూల్ రూపొందించి బూత్ స్థాయి అధికారుల ద్వారా ప్రతి ఓటర్ కు ఓటర్ స్లిప్పు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు పోలింగ్ కేంద్రాలలో అవసరమైన మౌళిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని, వేసవి కాలంలో పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఓటింగ్ లైన్ల వద్ద నీడ కల్పించేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లకు త్రాగునీరు అందుబాటులో ఉండేలా చూడాలని, జిల్లాలో వెబ్ క్యాస్టింగ్ చేస్తున్న పోలింగ్ కేంద్రాల వివరాలు సమర్పించాలని, మిగిలిన పోలింగ్ కేంద్రాల బయట సిసి కేమేరాలు ఏర్పాటు చేయాలని అన్నారు నామినేషన్ల స్వీకరణ చివరి రోజు అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో రిటర్నింగ్ అధికారుల కార్యాలయం వద్ద అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆర్. ఓ. కార్యాలయం బయట, లోపల గడియారం ఏర్పాటు చేయాలని, ఏప్రిల్ 25 మధ్యాహ్నం 3 గంటల లోపు రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చిన ప్రతి అభ్యర్థికి నామినేషన్ వేసే అవకాశం కల్పించాలని అన్నారు ఏప్రిల్ 26న నామినేషన్ల స్క్రూటీని ప్రక్రియ భారత ఎన్నికల కమీషన్ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం పక్కాగా నిర్వహించాలని అన్నారు. ఖచ్చితమైన కారణాలు ఉంటే మాత్రమే నామినేషన్ తిరస్కరణ చేయాలని అన్నారు.నామినేషన్ స్క్రుటిని ప్రక్రియ ముగిసిన తర్వాత ఆమోదించిన నామినేషన్ వివరాలు హార్డ్, సాఫ్ట్ కాపీలు సమర్పించాలని అన్నారు ఏప్రిల్ 29 నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత పోటిలో ఉన్న అభ్యర్థుల వివరాలను హర్డ్,సాఫ్ట్ కాపీలు సమర్పించాలని అన్నారు. పోటిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు పారదర్శకంగా నిర్వహించాలని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ పేపర్ల ముద్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు ఈవిఎం యంత్రాలపై బ్యాలెట్ పత్రాల కమీషనింగ్ కు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఫారం 12డీ కింద ఇంటి వద్ద ఓటు హక్కు వినియోగించు కునేందుకు దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు, పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించు కునేందుకు దరఖాస్తు చేసుకున్న అత్యవసర విధుల నిర్వహణ వివరాలు పకడ్బందీగా నమోదు చేయాలని అన్నారు ఇంటి వద్ద నుంచి దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ల ఓట్ల స్వీకరణకు అవసరమైన మేర బృందాలను ఏర్పాటు చేయాలని, పక్కా షెడ్యూల్ రుపోందించి ఆ సమాచారం దరఖాస్తుదారులకు అందించాలని అన్నారు ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ వద్ద పోస్టల్ బ్యాలెట్ ఓట్ల నమోదుకు ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ సిద్దం చేయాలని అన్నారు.
మే 13న పకడ్బందీగా పోలింగ్ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. పోలింగ్ విధులలో పాల్గొనే సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించాలని, అసెంబ్లీ సెగ్మెంట్ వారీగా డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు రిసెప్షన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలిపారు మే 13న ఉదయం మాక్ పోల్ నిర్వహించాలని, ప్రతి రెండు గంటలకు పోలింగ్ వివరాలను ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని, పోలింగ్ ప్రక్రియలో ఈవీఎం యంత్రాలు ఇబ్బందులకు గురైతే వెంటనే రిజర్వ్ ఈవిఎం యంత్రాలను సెక్టార్ అధికారులు మార్చే విధంగా సన్నద్ధంగా ఉండాలని అన్నారు పోలింగ్ ముగిసిన తర్వాత ప్రతి పోలింగ్ కేంద్రం నుంచి అవసరమైన నివేదికలు పకడ్బందీగా నమోదుచేసి అందించేలా జాగ్రత్తలు వహించాలని, పోలింగ్ శాతంపై అందించే నివేదికలు పక్కాగా ఉండాలన్నారు ఎన్నికల నేపథ్యంలో వచ్చే ఫిర్యాదుల సత్వర పరిష్కారం అందేలా చూడాలని అన్నారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్క సిబ్బందికి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు అందించాలని అన్నారు వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ ఓటర్ల తుది జాబితా రూపొందించి రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారికి అందించాలని అన్నారు ఓటర్ స్లిప్పుల పంపిణి పకడ్బందిగా జరిగేలా చూడాలని అన్నారు. పోలింగ్ సిబ్బంది రెండవ ర్యాండమేషన్ ప్రక్రియ సకాలంలో జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ సిబ్బందికి అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా ఉండేలా చూడాలని అన్నారు ఈ సమావేశంలో ఆర్ డి ఓ కే. సత్య పాల్ రెడ్డి, డి ఈ ఓ పాణిని, కలేక్టరేట్ ఏ ఓ రాజ్ కుమార్, బి సి వెల్ఫేర్ అధికారి రవీందర్ రెడ్డి, తహశీల్దార్లు విజయ భాస్కర్, జగదీశ్వర్, ఎలక్షన్ సెల్ డి టి లు, తదితరులు పాల్గొన్నారు.

ఉపాధి లేక నేత కార్మికుని ఆత్మహత్య

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీకి చెందిన అoకారపు మల్లేశం ఆత్మహత్య చేసుకున్నారు కుటుంబ సభ్యులు తెలిసిన సమాచారం ప్రకారం గత కొన్ని నెలలుగా పవర్ రూంలు పనిచేయకపోవడంతో ప్రతి కార్ఖానాలో పని కావాలని తిరుగుతూ తన భార్య అనారోగ్యం కావడంతో.కొన్ని రోజులుగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఈరోజు మల్లేశం ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అలాగే మృతి చెందిన కుటుంబానికి పరామర్శించడానికి వెళ్లిన బి బిఎస్ పార్టీ సీనియర్ నాయకులు బోల్లి రామ్మోహన్ సంఘట న స్థలానికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేత కార్మికుల ఆత్మహత్యలు కారణం మమ్ముట్టికి సీఎం రేవంత్ రెడ్డి అని సీఎం రేవంత్ రెడ్డి పై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి కూడా వెనుకాడబోమని ఈ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం నేత కార్మికులను ఆదుకొని వారి భవిష్యత్తుకు కావలసిన అభివృద్ధి పనులు చేపట్టాలని దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మృతుని కుటుంబానికి అండగా ఉండి ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని భవిష్యత్తులో ఇలాంటి సంఘటన జరగకుండా కార్మికులకు భరోసా కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేశారు

కాంగ్రెస్ పాలనలో తీరని మంచినీళ్ల కష్టాలు

అధికారులను నిలదీసిన గుడితండా గ్రామప్రజలు

కారేపల్లి నేటి ధాత్రి

ఖమ్మం జిల్లా సింగరేణి మండలం మాణిక్యారం గ్రామం.గుడితండా లో మెషిన్ భగీరథ నీళ్లు గత 20 రోజుల నుంచి గ్రామం లోని ఇండ్ల ల్లోకి రావటం లేదని నీళ్లు రాకపోవడంతో గ్రామాల్లో ప్రజలు అనెక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని. గ్రామప్రజలు ఆందోళనకు దిగగా
విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు అక్కడకు చేరుకొని మాణిక్యారం గ్రామ స్పెషల్ ఆఫీసర్ ఎ ఈ నరేందర్ కి ఫోన్ ద్వారా అక్కడ జరిగిన సమాచారాన్ని తెలియపరచగ అదికారులు గుడి తండా కు రాగ అక్కడ ప్రజలు మంచినీటి సమస్యలు పరిష్కారం చెయ్యాలని అధికారులను నిలదీసి సమస్యను ఎలాగైనా పరిష్కరించాలని అధికారులకు తెలిపారు ప్రజల సమస్యలు విన్న అధికారులు 24 గంటల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమం లో మాణి క్యారం మాజీ సర్పంచ్ భూక్యా రంగారావు ధరావత్ వికాస్ భూక్యా పాప భూక్యా సురేష్ అజ్మీర సంజీవ్ వర్మ భూక్యా శ్రీనివాస్ అజ్మీరా శ్రీనివాస్ భూక్యా వచ్చాయా భూక్యా పిచ్చయ భూక్యా శోభన్ భూక్యా జిందా గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

చేర్యాల శ్రీవిoద్య ఒకేషనల్ ప్రభంజనం

చేర్యాల నేటిధాత్రి…

ఇంటర్ ఫలితాలలో చేర్యాలలోని శ్రీవిoద్య ఒకేషనల్ జూనియర్ కళాశాలలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ప్రథమ సంవత్సరం ఒకేషనల్ విభాగంలో పన్యాల శైలజ ఎం పి హెచ్ డబ్ల్యు(ఎఫ్) లో 471/500 మార్కులు వచ్చాయని ఆయన అన్నారు. ప్రిన్సిపాల్ సత్య వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ శైలజకు చిన్నతనంలోనే పెళ్లి జరగడంతో పదవ తరగతి వరకే చదువుకొని పెళ్లి కారణంగా మధ్యలోనే చదువు ఆపేసింది. 10 సంవత్సరముల గ్యాబ్ తర్వాత ఆమె చదువుపై ఉన్న శ్రద్ధతో వారి భర్త సహకారంతో శ్రీ వింధ్య వోకేషనల్ కాలేజీ లో చేరడం జరిగిందని శైలజ ముందు నుండే ఎంతో చురుగ్గా ఉంటూ బాగా చదివేదని కళాశాల ప్రిన్సిపల్ అన్నారు.కాలేజీ విద్యార్థిని శైలజ మాట్లాడుతూ మా ఇంట్లో గొడవల కారణంగా నాకు చిన్నతనంలోనే పెళ్లి చేయడం జరిగింది. పెళ్లి అయిన తర్వాత చదువుకోడానికి వీలు కాకుండా పోయింది పిల్లలు కూడా స్కూలుకు వెళుతూ ఉండటంతో నేను కూడా చదువుకోవాలని మా భర్తతో చెప్పడంతో అతను కూడా ఒప్పుకోవడంతో నేను శ్రీవిoద్య ఒకేషనల్ కాలేజీలో చేరాను. చదువు అనేది ఒక్కరి సొంతమే కాదు కానీ ఎంతో శ్రద్ధతో చదివితే కానీ మంచి మార్కులు రావన్నారు. ఈ రోజుల్లో ఫోన్లు, సినిమాలు, అంటూ విద్యార్థులు చదువుపై శ్రద్ధ చూపడం లేదు అని శైలజ అన్నారు. నేను కళాశాల ఫస్టు రావడం వల్ల నాకు ఎంతో సంతోషంగా ఉందని ఆమె అన్నారు.

ఓటు హక్కు పై అవగాహన కార్యక్రమం

నిజాంపేట, నేటి ధాత్రి, ఏప్రిల్ 25

మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో తెలంగాణ సాంస్కృతిక సారధి కళాబృందం ఆధ్వర్యంలో ఓటు హక్కు పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహు ల్ రాజ్ ఆదేశాల మేరకు కళాబృందం సభ్యులు పాటల రూపంలో ఓటు హక్కు పై అవగాహన కల్పించారు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కును నమోదు చేసుకోవాలని వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు

తుప్పు పడుతున్న గ్రామ పంచాయతీ చెత్త తరలింపు బండ్లు!!

మరమ్మతులు చేయించి వాడుకుంటే ఉపయోగం అంటున్న ప్రజలు!!
ఎండపల్లి నేటి ధాత్రి
ఎండపల్లి మండలం గుల్ల కోట గ్రామంలో గ్రామపంచాయతీ సంబంధించిన చెత్త తరలింపు బండ్లు ,ఏదైనా మరమ్మతులకు నోచుకుంటే అవి గ్రామ పంచాయతీ ఆవరణలో ఉండాలి కానీ అవి బస్టాండ్,సమీపంలో సంవత్సరాలకొద్దీ మూలన పడి ఉంటున్నాయి అని ఒకవైపు ప్రభుత్వం స్వచ్ఛభారత్ కింద స్వచ్ఛ సర్వేక్షన్ వివిధ కార్యక్రమాలు చేపడుతూ పరిశుద్ధ కార్యక్రమాలు చేపడుతూ ప్రభుత్వం చేస్తుంటే కిందిస్థాయి అధికారులు వాటిని మరచి మరమ్మతులు చేయకుండా సంవత్సరాల కొద్దీ చెత్త తరలింపు బండ్లు బస్టాండ్ ప్రక్కన మూలాన పడి ఉండడం చూస్తే అధికారుల నిర్లక్ష్యం కన బడుతుందని, ఈ సంఘటన చూసి గ్రామస్తులు తమ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ప్రభుత్వం పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ గ్రామాలుగా చేయడమే ధ్యేయంగా చెత్త తరలింపు కొరకు ప్రభుత్వ నిధులతో వివిధ చెత్త తరలింపు బండ్లు కేటాయిస్తే, అధికారుల నిర్లక్ష్యం వల్ల మరమ్మతులకు నోచుకోకుండా ఎండకు ఎండుతూ వానకు నానుతూ వాటి భాగాలు తుప్పు పడుతూ వృధాగా ఉన్నాయి ఇప్పటికైనా అధికారులు స్పందించి మరమ్మతులు చేపించి చెత్త తరలించేందుకు వీటిని వాడుకుంటే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు,

ఈవీఎంలు, రద్దుచేసి బ్యాలెట్ విధానాన్ని కొనసాగించాలి…

– 10 పది సంవత్సరాలు ఏబిసిడి తో, మాదిగలను మోసం చేసింది బిజెపి ,మళ్లీ మోసం చేయాలని చూస్తుంది…..

– మాదిగలు ఎవరు బిజెపికి ఓటు వేయద్దు….

– ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు పుర్ర ప్రభాకర్….

కొల్చారం (మెదక్) నేటిధాత్రి :-

భారత ప్రధానమంత్రికి మాదిగలు ఓటు వేయద్దని ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు పుర్ర ప్రభాకర్ అన్నారు. ఓ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ , నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ దేశంలో లోకు సభ ఎన్నికలు జ రుగుతున్నాయి, ఈవీఎంతో జరిగిన 10% శాతం మిగిలిన రాష్ట్రాలకు ఈవీఎం కాదు, బ్యాలెట్ విధానంతో ఎన్నికలు జరిపించాలి, ఈ దేశంలో సబండ వర్గాల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్ప చదువులు చదివి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసిలు, లందరికీ ప్రతివారికి రిజర్వేషన్లు కల్పించిండు అందులో నువ్వు బీసీ కాదా ఎంపీల కోరం ఉంటేనే కదా ఈదేశానికి ప్రధానవి అయింది నీ రాజకీయ వెనుక ఏముందో ఈ దేశంలో 140 కోట్ల జనాభా ప్రజలు అందరూ చూస్తున్నారు. ఇంకా మా తెలంగాణకు వచ్చేసరికి మా మాదిగ అధినాయకుని (మా పెద్దమనిషిని) అడ్డుపెట్టుకొని మాదిగ మాదిగ ఉపకులాల ఓట్లను ఏబిసిడి పేరుతోని కొల్లగొట్టాలని చూస్తున్నావ్, ఇంకొకటి కూడా చూడు మా పెద్దమనిషి మాట అట్టే మాటే ఆయనను మోసం చేస్తే నీకు ఉంటుంది, ఆసమయం అప్పుడు తెలుస్తుంది మాదిగల శక్తి ఆ శక్తికి నీవు పాతాళలోకం పోవాల్సిందే,అని చెప్తున్నాం ఇప్పటికైనా నిన్న గజేంద్ర సింగ్ రాజ్యాంగం మారిస్తే తప్పేంటి అన్నాడు మీ గజేంద్ర సింగ్ ను తోక ముడుచుకుమని చెప్పు లేదా , రాజకీయ భవిష్యత్తు ఉండదని గుర్తుచేస్తున్నాం , మోడీ ఎన్నికల బ్యాలెట్ తేండ్రి, ఈవీఎంలు రద్దు చేయండి, ప్రజలకు వచ్చే 5 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఓటును దోసుకొని రాజ్యం ఏళ్తున్నారు ఈవీఎంలకు ఖర్చు పెట్టి ధనం బ్యాలెట్ పేపర్ కు ఎందుకు పెట్టరు, ఈ ప్రధానమంత్రి, భోజన చేసేది ఇతర అతర ఖర్చు 100 కోట్లు, చిల్లర ఒక వ్యక్తికి 1కోటి రూపాయల కలదు,
50 లక్షల రైతులపైన కార్పొరేషన్లు ఏర్పాటు చేయనంటివి నల్లధనాన్ని తెచ్చి దేశ ప్రజలకు అదేవిధంగా చూస్తానన్నావు ఆ నల్లధనం ఎవరి ఇల్లు చేరింది చెప్పాలి, 140 కోట్ల జనం కంటే రెంటింపు మోడీ దగ్గర ఉన్నది, రేపు మళ్లీ బిజెపి వస్తే ఈ దళిత వర్గాల పైన దాడులు జరిగే అవకాశం ఉంటుంది, మాదిగలు బిజెపికి ఓటు వేయదని కోరుతున్నాం, మీ ఇష్టం ఉన్న పార్టీకి ఓటు వేయండి కానీ బిజెపికి ఓటు వేయదని ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు ప్రభాకర్ అన్నారు.

ఉపాధి హామీ పనులు నర్సరీలను తనిఖీ చేస్తున్న జడ్పీ సీఈవో.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నైన్ పాక గ్రామంలోని పెద్దచెరువు పని ప్రదేశాన్ని గురువారం రోజు న జెడ్పీ సీఈవో విజయలక్ష్మి తనిఖీ చేయడం జరిగింది, అనంతరం ఆమె మాట్లాడుతూ కొలతల ప్రకారం పని చేస్తే రోజుకు 300 రూపాయలు వస్తాయని చెప్పడం జరిగింది మరియు ఓటు హక్కును ప్రతీ ఒక్కరు వినియోగించుకోవాలని కూలీలకు అవగాహన కల్పించడం జరిగింది. వీరి వెంట పంచాయితీ రాజ్ డి ఈ రవి కుమార్, ఏ పీ ఓ అబ్దుల్ అలీం, ఇ. సి. సుధాకర్, టి.ఎ. స్వామి, పంచాయతి కార్యదర్శి విష్ణు, మేట్ రాజు మరియు కూలీలు పాల్గొన్నారు.

పిల్లలను జలాశయాల, చెరువులు, వద్దకు వెళ్లకుండా జాగ్రత్త లు తీసుకోవాలి ఎస్పీ

వనపర్తి నేటిదాత్రి :
వేసవికాలంలో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు రావడంతో పిల్లలు యువకులు ఎండ వేడి నుంచి సేద తీరటానికి, ఈత నేర్చుకోవడానికి జలాశయాల వద్దకు ఈతకు వెళ్లే అవకాశం ఉన్నందున ప్రమాదాలు జరిగి నీటిలో మునిగి ప్రాణ నష్టం జరుగుతుండటం వల్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈత సరదా విషాదం కాకూడదు వనపర్తి జిల్లా ఎస్పీ శ్రీమతి రక్షిత కే మూర్తి సూచించారు. ఈత రానివారు బావులు, చెరువుల వద్దకు ఒంటరిగా వెళ్లకూడదని ఈత ను నేర్చుకునే వారు వారి తల్లిదండ్రుల సమక్షంలో నేర్చుకోవాలని సూచించారు. ముఖ్యముగా తల్లిదండ్రులు తమ పిల్లలను జలాశయాల వద్దకు చెరువుల కాలువల కుంటలు వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

అంత్యక్రియలకు బీజేపీ లక్ష్మీనారాయణ ఆర్థిక సహాయం..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం కొండాపూర్ గ్రామనికి చెందిన మాజీ వార్డ్ మెంబర్ బుడ్డమ్మ భర్త హాజీలాపూర్ లక్ష్మయ్య అకాల మరణం చెందినాడు మరణ వార్త తెలుసుకున్న బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు లక్ష్మీనారాయణ
వారి అంత్యక్రియలకు ఆర్థిక సాయం 5000/- రూపాయలు వారి కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు జిల్లా కార్యవర్గ సభ్యులు లక్ష్మీనారాయణ, బూతు అధ్యక్షులు రాఘవేంద్ర చారి, రామకృష్ణ, ఆంజనేయులు, కృష్ణయ్య, సత్యనారాయణ కోస్గి సహదేవ్ కల్మకాల చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Exit mobile version