ధాన్యం కొనుగోలు వివరాలు ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీలు చేయాలి

అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్

రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 30(నేటి ధాత్రి):

కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీలు చేయాలని అదనపు కలెక్టర్
ఖీమ్యా నాయక్ ఆదేశించారు. ధాన్యం సేకరణ, ట్యాబ్ ఎంట్రీలు ఇతర అంశాలపై అదనపు కలెక్టర్
ఖీమ్యా నాయక్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం లోని తన ఛాంబర్లో పౌర సరఫరాల శాఖ అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకేపీ, డీసీఎంఎస్, ప్యాక్స్, మెప్మా వారి ఆద్వర్యంలో ఇప్పటి దాకా సేకరించిన ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ధాన్యం సేకరించిన వెంటనే వాటి వివరాలను ట్యాబ్ ఎంట్రీ చేయాలని అదనపు కలెక్టర్
ఖీమ్యా నాయక్ సూచించారు. నాణ్యతా ప్రమాణాలు మేరకు ధాన్యం తీసుకువచ్చిన రైతుల నుంచి నిబంధనల ప్రకారం తూకం వేయాలని ఆదేశించారు. ధాన్యం డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో పడేలా చూడాలని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు వివరాలు ట్యాబ్ ఎంట్రీ చేయని వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఐకేపీ, డీసీఎంఎస్, ప్యాక్స్, మెప్మా ల ఆద్వర్యంలో ఇప్పటి దాకా 11,946 మంది రైతుల నుంచి 80,827 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని వెల్లడించారు. మొత్తం రూ. 84 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో వేశామని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ తెలిపారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి జితేందర్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల అధికారి జితేంద్ర ప్రసాద్, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

హ్యాండ్ బాల్ సెలెక్షన్ ట్రాయల్స్ లో శాతవాహన యూనివర్సిటీ జట్టుకు ఎంపికైన రాహుల్ , మహేష్, వంశీ

ఎండపల్లి నేటి ధాత్రి
జగిత్యాల జిల్లా ఎండపెల్లి మండలం లోని గుల్లకోట గ్రామానికీ చెందిన హ్యాండ్ బాల్ క్రీడాకారులు జైనపురం రాహుల్, వనం మహేష్, జైనపురం వంశీ ఈనెల 23న శాతవాహన యూనివర్సిటి పరిధిలో నిర్వహించినటువంటి హ్యాండ్ బాల్ సెలక్షన్ ట్రయల్స్ లో అత్యంత ప్రతిభ కనబరిచి శాతవాహన యూనివర్సిటీ జట్టుకి ఎంపిక కావడం జరిగింది. వీరు మే నెల 2వ తేది నుండి 6 వ తేది వరకు కేరళ రాష్ట్రం కొట్టాయం లోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో నిర్వహిస్తున్న సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ హ్యాండ్ బాల్ పోటీలలో పాల్గొంటారని వ్యాయామ ఉపాధ్యాయులు సాయికుమార్,మహేష్ తెలియజేశారు. వీరి ఎంపిక పట్ల మాజీ సైనికోద్యోగులు ముదిగంటి రమణారెడ్డి ప్రముఖ సినీ నిర్మాత సాన యాదిరెడ్డి ఓజ్జల చారిటబుల్ ట్రస్ట్ ఓజ్జల మహేష్ ,సీనియర్ క్రీడాకారులు బాస మహేష్,మౌనిక,అనూష, అక్షయ్, జీవన్ మరియు ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తూ,అభినందించారు

సామల మల్లేశం మరణం కార్మిక లోకానికి సిపిఐ పార్టీకి తీరని లోటు

సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాలా వెంకట్ రెడ్డి
రాజన్న సిరిసిల్ల,ఏప్రిల్ -30(నేటి ధాత్రి):
ఇటీవల ఆరోగ్యంతో బాధపడుతూ మరణించిన సిపిఐ సీనియర్ నాయకుడు కామ్రేడ్ సామల మల్లేశం కుటుంబ సభ్యులను సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ చాడ వెంకటరెడ్డి కలిసి ఓదార్చారు. ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడాతూ కామ్రేడ్ సామల మల్లేశం మరణం సిపిఐ పార్టీకి కార్మిక లోకానికి తీరని లోటు అన్నారు. రాయిని చెరువులో వేలాది మంది ప్రజలను సమీకరించి ఇళ్ల స్థలాల కోసం నిరంతరం పోరాటం కొనసాగించి వేలాది మందికి ఇళ్ల స్థలాలు ఇప్పించడంలో కీలక పాత్ర పోషించారు అన్నారు. ఈ వాడకు తెలంగాణ సాయుధ పోరాట నాయకుడు కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి పేరును బి వై నగర్ గా నామకరణం చేయడంలో సామల మల్లేశం ఎంతో విశ్వాసంతో దృఢమైన సంకల్పంతో పోరాడారన్నారు. సిరిసిల్ల అంటేనే పారిశ్రామిక రంగంగా బీడీ పరిశ్రమ పవర్లూమ్ పరిశ్రమ అనుబంధముతో లక్షలాదిమంది ఆధారపడి జీవిస్తున్నటువంటి కార్మిక వర్గానికి మూడు దశాబ్దాలుగా కార్మికుల కోసం పోరాటం చేశాడన్నారు. బీడీ పరిశ్రమ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సందర్భంలోనూ బీడీ కార్మికులను పోరాటాలలో సమీకరించి తమ హక్కుల కోసం పోరాటం చేయడంలో గొప్ప పోరాట కార్మికవర్గ నాయకుడిగా కార్మిక వర్గం ముందు నిలబడ్డాడని, అక్రమ కేసులు జైలు జీవితాలను అనుభవించినటువంటి మహోన్నతమైన వ్యక్తి కామ్రేడ్ సామల మల్లేశం అన్నారు. అలాంటి గొప్ప నాయకుడు కోల్పోవడం కార్మిక వర్గానికి తీరని లోటు అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు, జిల్లా కార్యవర్గ సభ్యులు పంతం రవి, కడారి రాములు, అజ్జ వేణు, మీసం లక్ష్మణ్, సోమ నాగరాజు, నల్ల చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

మృతుని కుటుంబానికి 25 కేజీల బియ్యం వితరణ

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో ఇటీవలే బైక్ యాక్సిడెంట్ లో మృతి చెందిన కొలెపాక రాజు కుటుంబాన్ని పరామర్శించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం తెలియజేసి వారి అక్క కొలెపాక అన్నపూర్ణ వారి కుటుంబ సభ్యులు కొలెపాక శంకర్ కు 25 కేజీల బియ్యం అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో సహాయాన్ని అందించిన ఇంజపెల్లి సందీప్ అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు శనిగరపు రాజేందర్ సీనియర్ నాయకులు కట్ల శంకరయ్య గ్రామ కమిటీ అధ్యక్షులు తిక్క సంపత్ ఇంజపెల్లి రవికుమార్ చిలువేరు దయాకర్ మంద మహేష్ ఎండి సైదు ఎండి మౌలా పాల్గొన్నారు

10వ తరగతి ఫలితాలలో మెరిసిన విద్యా కుసుమం

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన చెక్క కవిత-అశోక్ దంపతుల ఏకైక కుమార్తె మంగళవారం వెలువడిన 10వ తరగతి ఫలితాలలో రాణించింది. చెక్క బిందుశ్రీ పెద్దపల్లి జిల్లాలో చదివింది. తన తల్లిదండ్రులు చెక్క కవిత-అశోక్ దంపతుల కోరిక మేరకు ఉన్నత చదువులను చదవాలనే ఆకాంక్ష మేరకు కష్టపడి చదివి 10లో రాణించింది. మరింత ఉన్నత చదువులను చదివి, ఉన్నతమైన స్థానంలో రాణించి తన తల్లిదండ్రుల ఆశయాలను నిర్వహించే దిశగా దివ్యశ్రీ కోరుకుంటుంది. తమ కూతురు మంచి మార్కులను సాధించినందుకు తల్లిదండ్రులు గర్వపడుతున్నారు.

వ్యక్తి మరణానికి కారణమైన వ్యక్తికి జైలు శిక్ష

– 2000 రూపాయల జరిమానా
రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ – 30(నేటి ధాత్రి):
ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన బొమ్మెర అంజయ్య అనే వ్యక్తి మృతికి కారణం అయిన రంగు నాగరాజు అనే వ్యక్తికి సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్ ప్రేమలత గారు 05 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ. 2000 జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు వెల్లడించినట్లు ఎల్లారెడ్డిపేట్ ఎస్.ఐ రమాకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్.ఐ మాట్లాడుతూ…
ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన బొమ్మెర అంజయ్య ఇంటి వద్ద అదే గ్రామానికి చెందిన రంగు నాగరాజు తేదీ 27 జులై 2020 రోజున పెంపుడు కుక్క, అంజయ్య ఇంటి ముందట మూత్ర విసర్జన చేయడంతో బొమ్మెర అంజయ్య అభ్యoతరం వ్యక్తం చేయగా ఇరువురి మధ్య గొడవ జరిగి దీంతో అగ్రహించిన నాగరాజు అంజయ్యపై దాడి చేయగా స్ఫహ కోల్పోయాడు. అప్పటికే గుండె జబ్బుతో బాధ పడుతున్న అంజయ్యని దవాఖానకి తరలిస్తుండగా దారిమధ్యలో చనిపోయాడు. దీంతో అంజయ్య కుమారుడు భీంచంద్ ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్.ఐ. వెంకటకృష్ణ కేసు నమోదు చేసి, అప్పటి సీ.ఐ బన్సిలాల్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ నర్సింగరావు వాదించగా అప్పటి,ప్రస్తుతం సి. ఎమ్.ఎస్ లు శ్రీకాంత్, రవీంద్రనాయుడు ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుళ్లు శ్రీనివాస్, సి. ఎమ్.ఎస్ కానిస్టేబుల్ నరేందర్ లు కోర్టులో 13 మంది సాక్షులను ప్రవేశ పెట్టారు. పూర్వపరాలు పరిశీలించిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో రంగు నాగరాజుకు 05 సంవత్సరాల జైలు శిక్ష ,2000 రూపాయల జరిమానా విధించినట్లు ఎల్లారెడ్డిపేట్ ఎస్.ఐ రమాకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల ప్రభంజనం

100% ఉత్తీర్ణత

శాయంపేట నేటి ధాత్రి:

శాయంపేట మండలం కేంద్రంలో జడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో విద్యార్థులు వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించారని హెచ్ఎం శ్రీలత అన్నారు.
మంగళవారం ప్రకటించిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో కే వర్షిత 9.5 భాను శ్రీ 9.2 గ్రేడ్ తెలిపారు. మిగితా విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించారు.అనంతరం హెచ్ ఎం మాట్లాడుతూ విద్యార్థులు పట్టుదల,శ్రమతో చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించారనిఅన్నారు.విద్యార్థులను,ఉపాధ్యాయులను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాద్యాయులు,విద్యార్ధులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మేరుగు మురళి కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వ విప్ అడ్లూరీ, ఎమ్మేల్యే వివేక్ వెంకట స్వామి!!

వెల్గటూర్ నేటి ధాత్రి
వెల్గటూర్ మండల కేంద్రంలో తాజా మాజీ సర్పంచ్ మేరుగు మురళీ గౌడ్ తండ్రి చిలుకలయ్య గౌడ్ , అనారోగ్యంతో మృతి చెందగా,విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ ,ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరీ లక్ష్మణ్ కుమార్,చెన్నూర్ శాసన సభ్యులు గడ్డం వివేక్ వెంకట స్వామి,వారి ఇంటికి వెళ్లి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు, వారి వెంట పీసీసీ కార్య వర్గ సభ్యులు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శైలెందర్ రెడ్డి,రాష్ట్ర నాయకులు పీఎస్ ఆర్ , కేడిసీసీ బ్యాంక్ మాజి డైరెక్టర్ పోనుగోటి రామ్మోహన్ రావు ,నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు,

హస్తం గుర్తుకే ఓటేద్దాం..కాంగ్రెస్ పార్టీ నే గెలిపిద్దాం: దొడ్ల వెంకటేష్ గౌడ్

కూకట్పల్లి ఏప్రిల్ 30 నేటి ధాత్రి ఇన్చార్జి

చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డిని వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో ఆల్విన్ కాలనీ డివిజన్ తర పున అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపిం చుకో వడానికి 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకు లతో కలిసి డివిజన్ పరిధిలోని కేటీఆర్ నగర్ కాలనీలో పాదయాత్ర చేస్తూ ఇం టింటికి వెళ్లి కాలనీ వాసులను ఆప్యా యంగా పలకరిస్తూ హస్తం గుర్తుకే ఓటు వేయాలని ప్రచారం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కరపత్రాలు పంచుతూ చేవెళ్ల కాంగ్రెస్ పా ర్టీ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డి కి మీ అ మూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు కార్యక్రమంలో యువనే త దొడ్ల రామకృష్ణ గౌడ్,సమ్మారెడ్డి,భాస్క ర్,షౌకత్ అలీ మున్నా,సయ్యద్,సంగ
మేష్,అగ్రవాసు,యాదగిరి,జనార్దన్.శ్రీనివాస్,కరుణాకర్,మహేష్,ఫారూఖ్,ఖలీ మ్,వాలి నాగేశ్వరరావు,సత్యనారాయ ణ,రాజు,బాలస్వామిసాగర్,సన్యాసి
రావు,రాజు,రాజ్యలక్ష్మి,పుట్టందేవి,శ్యా మల,కృష్ణవేణి,సరిత,పర్వీన్,అను రాధ,పద్మావతి నికత్ ఫాతిమా,
యస్మిద్,మహముదా,రాజేశ్వరి, మకాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు,అనుబంధ బస్తి కమిటీ సభ్యులు,పార్టీ శ్రేణులు,కాలనీ వాసులు
తదితరులు పాల్గొన్నారు.

ధర్మసమాజ్ పార్టీ అభ్యర్థి ఎంపీగా మేకల సుమన్ గారిని గెలిపించండి

గణపురం నేటి ధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం పార్లమెంటు ఎన్నికల ప్రక్రియలో భాగంగా ధర్మసమాజ్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మేకల సుమన్ గారి చెప్పుల గుర్తుపై గణపురం మండలం ప్రజలందరూ, ఓటు వేసి గెలిపించాలని ఆ పార్టీ మండల కన్వీనర్ కుర్రి స్వామినాథన్ పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం తమసొంత జాగిరైనట్టు10 సంవత్సరాల బిఆర్ఎస్ పార్టీ అరాచకాలను , భారతరాజ్యాంగాన్నిమారుస్తామంటున్న బిజెపి, ఆచరణకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలకు ఎందుకు ఓట్లు వేయాలని ప్రశ్నించారు. బీసీ ఎస్సీ ,ఎస్టీల పార్టీ ధర్మ సమాజ్ పార్టీ చెప్పుల గుర్తుపై ఓటు వేసి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి మేకల సుమన్ నుగెలిపించాలని కోరారు. 93శాతం ఉన్న బీసీ, ఎస్సీ ,ఎస్టీ ప్రజల పార్టీ ధర్మ సమాజ్ పార్టీ అని ఏడు శాతం లేనీ వెలమరెడ్డి ఆధిపత్య పార్టీలే బిజెపి, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలనీ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలు జిల్లా ప్రధాన కార్యదర్శి, కండె రవి ఉపాధ్యక్షులు కోగిల జితేందర్ ,కార్యదర్శి పోనగంటి సతీష్, చెన్నూరి నరసింహ విక్రమ్ ,సాగర్ మండల గ్రామ నాయకులు పాల్గొన్నారు.

చలివేంద్రం ప్రారంభం

కొత్తగూడ, నేటిధాత్రి :
మహబూబాబాద్ జిల్లా: కొత్తగూడ మండల కేంద్రంలో చలివేంద్రాన్ని ప్రారంభించిన గూడూరు సిఐ కోట బాబురావు, యస్ ఐ దిలీప్. గంగారం ఎస్ఐ రవికుమార్ .అనంతరం మండలం లోని పోలింగ్ కేంద్రాలను సీఐ బాబురావు, కొత్తగూడ. గంగారం ఎస్సై లు దిలీప్ . రవికుమార్ పరిశీలించారు..

కొత్తగూడ మండలం లో
38- పోలింగ్ కేంద్రాలు
4- సెక్టర్లు 4- రూట్లు మొత్తం ఓటర్ల సంఖ్య 23640
ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తుగానే పోలీసులు గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.. గతంలో కొత్తగూడ మండలం లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఏడు ఉండగా ఆ గ్రామాల్లో పోలీసులు ముందస్తుగానే పర్యటించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు
మండల కేంద్రంలో వాహనాలను తనిఖీ చేశారు

హైదరాబాద్ ప్రజా భవన్ లో ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డిని కలిసిన కృష్ణ

వనపర్తి నేటిదాత్రి:
హైదరాబాదులో ప్రజా భవన్ లో ప్లా ని o గ్ బోర్డ్ వైస్ చైర్మన్ జీ చిన్నారెడ్డి ఛాంబర్ లో వనపర్తి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బి కృష్ణ కలిశారు ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు

మేడే ను జయప్రదం చేయండి

 బిఆర్ టియు జిల్లా అధ్యక్షులు శివశంకర్ రావు పిలుపు….

కొల్చారం,(మెదక్) నేటిధా త్రి :-

భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా నిర్వహించే 138 వ మేడే ఉత్సవాలను కార్మిక లోకం జయప్రదం చేయాలని సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శివశంకర్ రావు విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ మరియు బిజెపి అవలంబిస్తున్నాయని అన్నారు. బిజెపి 44 లేబర్ కోడ్ లను 4 చట్టాలుగా మార్చి కార్మికుల నడ్డి విరిచి, ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తుందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ మరియు బిజెపి పార్టీ లను తిరస్కరించి. లోక్ సభ ఎన్నికల్లో కార్మిక లోకం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు తెలిపాలని విజ్ఞప్తి చేశారు. మే 1న ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్ లో కేటీఆర్ అధ్యక్షతన జరిగే కార్యక్రమానికి జిల్లా నుండి కార్మికులు బిఆర్ టి యు నాయకులు పెద్ద ఎత్తున హాజరుకావాలని కోరారు ఈ కార్యక్రమంలో సాబీర్,రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి సమీక్షలో కాంగ్రెస్ పార్టీలో కి భారీ చేరికలు

వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి జిల్లా గోపాల్ పెట్ మండలం తాడిపర్తి నర్సింగాయపల్లి తెలుగుదేశం బిజెపి టిఆర్ఎస్ పార్టీల నుండి హైదరాబాదులో గాంధీభవన్లో ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేరికల కమిటీ చైర్మన్ జగ్గారెడ్డి సమీక్షంలో తాడిపర్తి మాజీ సర్పంచ్ వనపర్తి జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జోగు శాంత న్న ఆధ్వర్యంలో తాడిపత్రి గ్రామానికి చెందిన వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల కు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ఎఐసిసి కోఆర్డినేటర్ ఆదిత్య తాడిపర్తి సర్పంచ్ గణేష్ గౌడ్ వనపర్తి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బి కృష్ణ పరశురాం కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు

స్నేహ నగర్ ఎస్.ఆర్. విద్యార్థుల ప్రభంజనం.

హనుమకొండ లోని స్నేహ నగర్ లో గల ఎస్.ఆర్. పాఠశాల విద్యార్థులు వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించారని ఎస్ ఆర్ పాఠశాలల జోనల్ ఇంఛార్జ్ రమ శరవన్ అన్నారు.
మంగళ వారం ప్రకటించిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో స్నేహ నగర్ ఎస్. ఆర్ పాఠశాల విద్యార్థులు నలుగురు 10/10G.P.A.సాదించారనివారు ఏ.స్పందన, సి. ఎచ్.రూప కృష్ణ, జి. లిపిక, బి.శాంత,అని తెలిపారు.
మిగితా విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించినారని అన్నారు.
అనంతరం ప్రిన్సిపాల్ సరస్వతి మాట్లాడుతూ విద్యార్థులు పట్టుదల,శ్రమతో చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించారని అన్నారు.విద్యార్థులను,ఉపాధ్యాయులను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాద్యాయులు, విద్యార్ధులు,,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పట్టభద్రుల నోట — మల్లన్న మాట.!

అచ్చునూరి కిషన్
ములుగు జిల్లా ఇంఛార్జీ.

హన్మకొండ: ఏటూరునాగారం మండల కేంద్రము’లో పట్టభద్రులతో మాట్లాడుతూ….. మే 27,నా జరిగే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మీ అమ్యూల్యమైనా మొదటి (1) ప్రాధాన్యత ఓటు వేసి “తీన్మార్ మల్లన్న’ను” భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

అలాగే తీన్మార్ మల్లన్న పేద ప్రజల కష్టాలు తెలిసినా వ్యక్తి, నిరుద్యోగుల బాధలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల ఇబ్బందులు చూసిన వ్యక్తిగా, పేద,పిల్లల కష్టసుఖాల్లో అండగా నిలిచి వారికి అన్నితానై ఆసరాగా నిలిచినా వ్యక్తి మల్లన్న అని

గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రజా వ్యతిరేక విధానాలు, రాచరిక, నియంత, కుటుంబ పాలనను నిత్యం తన క్యూ న్యూస్ వేదికగా ప్రజలను చైతన్య పరుస్తూ గత బిఆర్ఎస్ ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా నిలిచి అనేకమైనా దాడులు, అరెస్టులు, అక్రమ కేసులు, వంద రోజుల పై చిలుకు జైలు జీవితం గడిపినా కూడా ఎక్కడ, ఎవరికి లొంగకుండా ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ప్రజల పక్షాన గొంతెత్తు కల్వకుంట్ల కుటుంబ పాలనను అంతం చేసేవరకు వెనకడుగు వేయకుండా ధీరుడిలా పోరాటం చేసిన వ్యక్తి తీన్మార్ మల్లన్న’నే అని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు.

ఇలాంటి పోరాట పటిమ, ప్రశ్నించేతత్వం ఉన్న తీన్మార్ మల్లన్న’కు మీరంతా అండగా నిలిచి మీ గొంతును చట్టసభల్లో వినిపించి, మీ అభివృద్ధి’యే ధ్యేయంగా పనిచేయాలంటే… రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించి ఆశీర్వాదిస్తారని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో బొల్లె రమేష్, సర్వేశ్, విక్రమ్, గౌతమ్, వంశీ, ప్రసాద్, సాయి, తదితరులు పాల్గొన్నారు.

చలో రేగొండ….సభకు బయలుదేరిన కాంగ్రెస్ కార్యకర్తలు

శాయంపేట నేటి ధాత్రి:

శాయంపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో జనజాతర సభకు భారీ ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు బయలుదేరారు. ఈ జన జాతరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి విచ్చేయు చున్నారు. మండలంలోని అన్ని గ్రామాల నుండి 5000 మంది సభకు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో మండలంలోని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ,అన్ని గ్రామాల గ్రామ కమిటీ అధ్యక్షులు మండల యువజన నాయకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రేవంత్ రెడ్డి అభిమానులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

తనకు తానే ప్రకటించున్న ఆ జిల్లా వైద్యాధికారి?

https://epaper.netidhatri.com/view/250/netidhathri-e-paper-1st-may-2024%09/3

`ఆవేశంలో నేటిధాత్రికి లీగల్‌ నోటీసులు పంపి ఇరుక్కుపోయింది?

`అమాత్యా…! కొందరు అధికారులు ఆరోగ్య శాఖను భ్రష్టు పట్టిస్తున్నారు?

`ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు?

`డిప్యూటేషన్ల రద్దు ఆదేశాలు ఉల్లంఘిస్తున్నారు?

`కులాన్ని అడ్డు పెట్టుకొని కుర్చీలలో తిష్ట వేసుకుంటున్నారు!

`వార్తలు రాసిన మీడియా మీద చిర్రుబుర్రులాడుతున్నారు!

`ఆరోగ్య శాఖ మంత్రిగారు ఈ వార్త చూడండి.

`గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుమున్న ఆ అధికారి!

`నేటిధాత్రి చెప్పింది ఒక ఉన్నతాధికారి..అని మాత్రమే చెప్పింది?

`కానీ ప్రధాన అధికారి ఉలికిపాటుతో స్పందించింది?

`డిప్యూటేషన్‌ ఆపుకొని మరీ కొలువు వెలగబెడుతోంది?

`ఎమ్మెల్యేల మద్దతుతో డిప్యూటేషన్‌ ఆపుకున్నది?

`ఆ విషయం తేల్చడానికి డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌కు సమయం లేదట!

`విచారణకు డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌కు సమయం కావాలట?

`ఒక ప్రభుత్వ అధికారి మీడియాకు లీగల్‌ నోటీసు పంపాలంటే పై అధికారి అనుమతి తప్పని సరి?

`డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ అలాంటి అనుమతి ఏదైనా ఇచ్చారా?

`ఇలాంటి వైద్యాధికారుల మూలంగా బద్‌నాం అయ్యేది ప్రభుత్వమే!

`విమర్శల పాలయ్యేది వైద్య మంత్రిత్వ శాఖనే?

`రిజిస్ట్రేషన్‌ శాఖలో అవినీతి అధికారులను ‘‘మంత్రి పొంగులేటి’’ ఏరివేస్తున్నారు?

`వైద్య శాఖలో అవినీతి అధికారులను మంత్రి ఉపేక్షిస్తున్నారా? అన్న ప్రశ్నకు తావివ్వంకండి!

`తెలంగాణలో అందరికీ డిప్యూటేషన్లు రద్దైనా..శిరీషకు మాత్రమే ఎందుకు రద్దు కాలేదు?

`ఆమె వెనుక వున్న పెద్దలెవరు?

`ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నదెవరు?

`అవినీతి అధికారిపై చర్యలు తీసుకోలేనంత బిజీ డిహెచ్‌ కు ఏముంది?

`కనీసం విచారణకు ఆదేశించే సమయం ఎందుకు లేకుండా పోతోంది?

`ఇలాంటి అధికారుల వల్లే ప్రభుత్వం అబాసుపాలయ్యేది?

`వైద్య శాఖను ప్రక్షాళన చేయండి?

`ఏళ్ల తరబడి తిష్ట వేసిన వారిని కదిలించండి?

`వైద్య సేవలు వదిలేసి వ్యాపారాలు చేస్తున్న వారిపై దృష్టి పెట్టండి.

`ప్రైవేటు క్లినిక్‌లు పెట్టి ప్రజలను దోచేస్తున్నారు చూడండి?

`వ్యాపారాల పేరుతో ప్రభుత్వ సొమ్మును కాజేస్తున్న వారినుంచి …తిన్నది కక్కించండి!

`అవినీతి ఆపండి అంటే నేటిధాత్రికి లీగల్‌ నోటీసులా?

`ప్రజా పాలనలో వైద్య శాఖలో అవినీతి అధికారులకు పెద్ద పీటలా?

హైదరాబాద్‌,నేటిధాత్రి:
గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లే వుంది. చట్టం ఎవరికీ చుట్టంకాదు. అందులోనూ అవినీతి అధికారులకు అసలే కాదు. అన్యాయం చేసిన వారికి ఎప్పటికైనా శిక్ష తప్పదు. పరపతితో కొంత కాలం చట్టం చుట్టంలా కనిపించినా , న్యాయ స్ధానంలో తీర్పుతో నీళ్లేమిటో..పాలేమిటో నిజానిజాలు తేలిపోతాయి. అవినీతి బైట పడుతుంది. అయినా ఇక్కడ ముందు చెప్పుకోవాల్సిన విషయం ఒకటుంది. నేటిధాత్రి రాసిన వార్త కథనం ఏదో కట్టు కథ కాదు. పిట్ట కథ అంతకన్నా కాదు. ప్రజలు పన్నుల నుంచి జీతాలు తీసుకుంటూ, ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై రాసిన వార్త. ఆ వార్తను సంబంధిత అధికారి జీర్ణించుకోలేకపోతే, అసలు పొరపాటే చేయకుండా వుండాలి. అవినీతికి పాల్పడకుండా వుండాలి? ఇక్కడ మరో ముఖ్యమైన విషయం. ఆ వార్తలో ఎక్కడా జిల్లా ముఖ్య వైద్యాధికారి అన్న పదం లేదు. జిల్లాలో ఉన్నతాధికారి అన్న పదాన్ని మాత్రమే వాడడం జరిగింది. మరి ఏ ఉన్నతాధికారి ఆ నేటిధాత్రి వార్తకు స్పందించలేదు. కేవలం ఒక్క డాక్టర్‌. శిరీష మాత్రమే స్పందించింది. ఆ వార్త తన గురించే అని తనకు తానే నిర్ధారించుకున్నట్లుంది. అందుకే నేటిధాత్రికి లీగల్‌ నోటీసులు పంపించింది. ఆ వార్తలో వున్నది నేనే అని డాక్టర్‌. శరీష స్వయంగా ప్రకటించుకున్నటైంది. అంటే అవినీతికి పాల్పడినట్లు ఒప్పుకున్నట్లే అయ్యింది. ఇంకా లీగల్‌ నోటీసులకు తావెక్కడుంది. సరే..నోటీసులు పంపించారు…పత్రికలున్నవే సమాజంలో జరిగే అన్యాయాలను ప్రశ్నించడానికి! అవినీతిని ఎండగట్టడానికి! అసమానతలు రూపు మాపడానికి! అంతే కాని అధికారులు అవినీతిని చూస్తూ ఊరుకోవడానికి కాదు. అవినీతిని ఏ మీడియా ఉపేక్షించదు. తన అక్షరాలతో అవినీతి పరులను సమాజం ముందు దోషులుగా నిలబెడుతుంది. ఉన్నత విద్యావంతులకు ఈ మాత్రం తెలియదా? జిల్లాలో ఎంతో మంది వైద్యాధికారులున్నారు. కాని తనకు తానే…అది నేనే అని డాక్టర్‌. శరీష్‌ ఎందుకు స్పందిచించనట్లు? ఆ అధికారి అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? అవినీతికి పాల్పడినప్పుడు ఆత్మాభిమానం గుర్తు రాలేదా? ఆత్మగౌరవం అడ్డు రాలేదా? అసలు ఇక్కడ తేలాల్సింది అవినీతి జరిగిందా? లేదా? అన్నదే ప్రధానాంశం. మేం అవినీతి చేసుకుంటూ పోతాం..వార్తలు రాస్తే మీడియా మీద పరువు నష్టం దావా వేస్తాం…లీగల్‌ నోటీసులు పంపిస్తామంటే తప్పు, ఒప్పుగా మారుతుందా? అన్యాయం మాసిపోతుందా?
అవినీతి మీద వార్తలు రాయొద్దా? అన్యాయాలను ప్రశ్నించొద్దా?
అసలు వార్తల్లో వాస్తవాలు లేకుంటే మీడియా ముఖంగా ఖండిరచుకునే అవకాశం వుంది. ప్రభుత్వాధికారులంటే జవాబుదారులు కాదా? వారు చేసే అవినీతిని ఉపేక్షించాలా? ఆత్మాభిమానం డాక్టర్‌.శీరీషకుమాత్రమే వుంటుందా? ఆమె వల్ల నష్టపోయిన ఉద్యోగులకు లేదా? ఆమె ద్వారా కులం పేరుతో దూషిణలు ఎదుర్కొన్నవారిది ఆత్మ గౌరవం కదా? వారిని కనీసం మనుషులగా చూడా పరిగణించాలన్న ఆలోచన వుండొద్దా? జిల్లాలోని ఆసుపత్రులకు వెల్ల వేసేందుకు వచ్చిన నిధులు దుర్వినియోగం కాలేదా? కాకుంటే ఆ లెక్కలు బైట పెట్టండి? అది జిల్లా ఉన్నతాదికారిగా డాక్టర్‌. శిరీష బాధ్యత. కేంద్ర ప్రభుత్వ నిదులు దుర్వినియోగం కాలేదని ఎందుకు చెప్పడం లేదు? తెలంగాణ వ్యాప్తంగా వైద్య శాఖలో డిప్యూటేషన్లు రద్దు చేసినా, డాక్టర్‌. శిరీష అక్కడే ఎలా ఉద్యోగం చేస్తోంది. ఆమెకు నిబంధలను వర్తించవా? ప్రభుత్వ ఆదేశాలు బేకాతరు చేసినట్లు కాదా? ఒక వేళ ఆమెకు మాత్రమే ప్రత్యేకంగా ఏదైనా జీవో ఇచ్చారా? వుంటే అది బహర్గితం చేయొచ్చు కదా? ప్రభుత్వం మారిన తర్వాత నిబంధనలకు వ్యతిరేకంగా విధులు నిర్వర్తించడాన్ని మీడియా ప్రశ్నించదా? అలా ప్రశ్నిస్తే ఆత్మ గౌరవం దెబ్బతింటున్నట్లా? ప్రజా జీవితంలో వున్నవారు, ప్రజల పన్నులతో జీతాలు తీసుకుంటున్నవారు ఖచ్చితంగా జవాబు దారీ తనంగా వుండాలి.
ఇక్కడ డాక్టర్‌.శిరీష్‌ కొన్ని ప్రశ్నలకు సమాదానం చెప్పాల్సిన అవసరం వుంది.
నేటిధాత్రి రాసిన వార్తను తనకు తానుగానే స్వయంగా ప్రకటిం చుకున్న డాక్టర్‌. శిరీష వివరణ ఇవ్వాల్సిన బాద్యత విస్మరించింది. తన బాద్యతను తప్పించుకునే క్రమంలో నేటిదాత్రికి లీగల్‌నోటీసులు పంపించారు. నేటిధాత్రి మీద పరువు నష్టం దావా వేస్తే నిజం అబద్దమౌతుందా? చేసిన అక్రమాలు సక్రమాలౌతాయా? అంతే కాకుండా నేటిదాత్రి వార్త అధికారి విధినిర్వహణ గురించే తప్ప వ్యక్తిగతం కాదు. ఆ కుర్చీలో కూర్చున్నవారిగానే పరిగణించాలి. అందుకు ఆడ, మగ, కులం, మతం, బాషా బేదాలుండవు. మహిళా ఉద్యోగి అవినీతి సాగిస్తుంటే మీడియా చూస్తూ ఊరుకోవాలా? నిజానికి ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా అవినీతికి పాల్పడడం నేరం. ఆ మాత్రం తెలియకుండానే నిధులు పక్కదారి పట్టించారా? నిబంధనలు తుంగలో తొక్కి కాంట్రాక్టు అప్పగించారా? అది నేరం కాదా? ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగుల మీద ప్రజల్లో సరైన అభిప్రాయం లేదు. కేవలం కొందరు అవినీతి పరుల మూలంగా మొత్తం ఉద్యోగ సమాజమే ఆరోపణలు ఎదుర్కొంటోంది. ప్రజలు చెల్లించే పన్నులతో జీతాలు తీసుకుంటూ, ప్రజలను పీడిరచుకుతింటున్న వాళ్లున్నారు. అలాంటి వారిని ఏరి వేయడం, వారి అవినీతిని వెలుగులోకి తేవడం మీడియా కర్తవ్యం. అవినీతి పరులను పట్టించడమే కాదు, నిజాయితీ పరులను కాపాడడం కూడా నేటిదాత్రికి తెలుసు. ఇటీవల కొందరు ఉద్యోగులు సమావేశాన్ని తప్పు పడుతూ ఎన్నికల సంఘం వారిపై వేటు వేసింది. అప్పుడు ఆ ఉద్యోగులకు అండగా నిలిచింది నేటిదాత్రి మాత్రమే. ఆ ఉద్యోగుల కొలువులు మళ్లీ తెప్పించడంలో నేటిధాత్రి కీలక భూమిక పోషించింది. ఎన్నికల సంఘం నిర్ణయంలో లోపం వుందని తెలియజేయడం జరిగింది. ఇదీ నేటిదాత్రి అక్షరానికి వున్న విలువ.
తప్పుచేసిన వాళ్లే వితండ వాదం చేస్తారు. ఇదే ఉద్యోగులను మరింత కష్టాల్లోకి నెట్టేస్తుంది.
తప్పు చేస్తున్నారని హెచ్చరించే మీడియాను ఎప్పుడైతే తప్పు పడతారో అప్పుడే వారి గోతి వారు తీసుకుంటున్నట్లు లెక్క. గతంలో ఓ సబ్‌ రిజిస్ట్రార్‌ పైకి సమాజ సేవకురాలిగా పేరు కోసం పాకులాడుతూ, విచ్చలవిడి అవినీతికి పాల్పడిరది. ఆ విషయం నేటిధాత్రి వెలుగులోకి తెచ్చింది. వరుస కధనాలు రాయడం జరిగింది. నా అవినీతిని నిరూపిస్తే ఉద్యోగానికి రాజీనామా చేస్తానని ప్రకటించింది. నేటిధాత్రి మూలంగా ఆత్మగౌరవం దెబ్బతిన్నదంటూ లీగల్‌ నోటీసులు కూడా పంపించింది. ఆఖరుకు ఏసిబికి పట్టుబడిరది. ఆమె కూడబెట్టిన ఆస్ధులన్నీ వెలుగులోకి వస్తున్నాయి. అమాయకులను కూడా పీడిరచుకొని తిన్న ఆమె అవినీతి బండారం మొత్తం బైపడిరది. ఇప్పుడు ఆమె బాధితులంతా రోడ్డెక్కుతున్నారు. వారికి జరిగిన అన్యాయం గురించి చెబుతున్నారు. ఆనాడు నేటిధాత్రి రాసిన ప్రతి అక్షరం నిజమైంది. ఆమె ఆస్దులు చిట్టా మొత్తం బైటపడిరది. అలా ఎంతో మంది రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారుల గురించి నేటిధాత్రి రాయడం జరిగింది. వాళ్లపై విచారణలు అనేకం జరుగుతున్నాయి. అదీ నేటిధాత్రి అక్షరం నిబద్దత. అంతే గాని చేసేదిచేస్తాం…అవినీతిని ప్రశ్నిస్తే నోటీసులిస్తామనే వారిని నేటిధాత్రి ఇరవై ఏళ్లలో ఎంతో మందిని చూసింది. వారి జీవితాలు సమాజం ముందు నిలిపింది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. జిల్లా వైద్యాధికారి వల్ల నష్టపోయిన, జీవితాలు ఆగమైన చిరుద్యోగులు నేటిధాత్రికి చెప్పుకొని తన గోడు వెళ్లబోసుకున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. జరుగుతున్న అక్రమాలపై వివరాలు అందించారు. గిరిజన బిడ్డలను ఎలా సంబోదిస్తారో..పూ స గుచ్చినట్లుచెప్పారు. అవే విషయాలను, వివరణాత్మకంగా నేటిధాత్రి పాఠకుల మందుంచింది. ఆ వార్త డాక్టర్‌. శిరీషకు నచ్చలేదు. నోటీసులు పింపించారు. నోటీసులు పంపించినంత మాత్రాన అవినీతి మాసిపోతుందా? అక్రమాలు వెలుగుచూడకుండా వుంటాయా? ఉద్యోగ నిర్వహణలో అవకతవకలకు పాల్పడడం నేరం. ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేయడం అంతకన్నా నేరం. ప్రభుత్వ వైద్య సేవలందించే గురుతర బాద్యతలో వుండి, సేవకు ప్రాదాన్యత నివ్వకపోవడం తప్పు. ప్రభుత్వ జీతం తీసుకుంటూ, ప్రైవేటు ఆసుపత్రి నిర్వహణ చట్ట విరుద్దం. ఇవన్నీ తప్పులు కళ్లముందు కనిపిస్తుంటే… మీడియా ప్రశ్నించదా? వార్తలు ప్రచురించదా? అయినా ఒక ప్రభుత్వాధి కారి మీడియాకు లీగల్‌ నోటీసులు పంపాలంటే పై అధికారుల అనుమతి తప్పనిసరి. మరి సంబంధిత అధికారికి ఏ అధికారి అనుమతినిచ్చాడన్నది కూడా తేలాల్సివుంది.
అమాత్యా…కొంతమంది వైద్యాధికారులు ఆరోగ్యశాఖను భ్రష్టుపట్టిస్తున్నారు…?
ఒక్కసారి సమీక్ష నిర్వహించడండి. ప్రభుత్వ ఆదేశాలను బేకాతరు చేస్తూ, నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఏళ్ల తరబడి కుర్చీలను అంటిపెట్టుకుంటున్నారు. డిప్యూటేషన్ల మీద వచ్చి కూడా సంవత్సరాల కొద్ది పాతుకుపోతున్నారు. వారిని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వచ్చిన వెంటనే రద్దుచేసింది. భద్రాద్రి జిల్లా వైద్యాధికారికి మాత్రం ప్రభుత్వ ఆదేశాలు చెల్లవా? ప్రభుత్వమేమైనా ఆ అదికారి కోసం నిబంధనలు సడలిలించిందా? ప్రత్యేకంగా జీవోలు ఏమైనా జారీ చేసిందా? అంతే కాదు కులాన్ని అడ్డం పెట్టుకొని కుర్చీలో తిష్టవేసుకొని కూర్చుంటున్నారు. గత ప్రభుత్వంలో ఆ అధికారి కుల పెద్దల ఆశీస్సులతో ఇంత కాలం సాగారు. ఇప్పుడు కూడా అదే కులపెద్దలు అండతో అక్కడే కొనసాగుతున్నారు. డిప్యూటేషన్‌ వర్తించకుండా నిబంధనలు పాతర వేశారు. ఈ విషయాన్ని డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ దృష్టికి తీసుకెళ్తే ఆయన సమయం లేదంటూ దాట వేస్తున్నారు. అంటే ఎక్కడో తేడా కొడుతోంది. ప్రభుత్వాధికారులు ఒకే చోట పాతుకుపోవడానికి కారణం ఏమిటి? అందులోనూ వైద్య సేవలు అందించే వ్యవస్ధలో ఒకే చోట పని చేయడం ఏమిటి? వైద్య రంగం సేవ రంగంలో ఎంతో గొప్పది. అందులో ఎంతో మంది గొప్ప గొప్ప వైద్యులు ప్రజలకు సేవలందిస్తున్నారు. అలాంటి వ్యవస్ధ కొంత మంది వల్ల అబాసుపాలౌతోంది. ప్రజాస్వామ్య వ్యవస్ధలో అధికారులకు మితిమీరిన స్వేచ్చ అంత మంచిది కాదు. ప్రభుత్వాలెప్పుడూ కొంత మంది అధికారుల తీరు వల్ల కూడా బద్‌నాం అయిన సందర్భాలు కోకొల్లలు. అవినీతి అదికారుల మూలంగా ప్రజలు పార్టీలను తిరస్కరించిన సందర్భం బిఆర్‌ఎస్‌ విషయంలో చూశాం. ఏ ప్రభుత్వంలో అదికారులు ఎక్కువ నిజాయితీగా పనిచేస్తారో ఆ ప్రభుత్వంపై ప్రజలు ఎక్కువ విశ్వాసం పెంచుకుంటారు. గత బిఆర్‌ఎస్‌ తెచ్చిన ధరణి మూలంగా అటు రెవిన్యూ, ఇటు రిజిస్ట్రేషన్‌ శాఖల అదికారుల తీరుతో ఎంతో మంది ఇబ్బందులు పడ్డారు. అది పరోక్షంగా బిఆర్‌ఎస్‌ మీద తీవ్ర ప్రభావం చూపింది. అలా కాంగ్రెస్‌ ప్రభుత్వంలో జరగకూడదనుకుంటే అధికారుల తీరుపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తుండాలి. అవినీతికి పాల్పడిన అదికారులను ఉపేక్షించొద్దు. తాజగా రిజిస్ట్రేషన్‌ శాఖలో అవినీతికి పాల్పడిన అధికారులపై సంబంధింత మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కొరడా రaులిపిస్తున్నారు. ఆ శాఖను ప్రక్షాళన చేస్తున్నారు. అలాగే ప్రజల జీవితాలతో ముడిపడిన ఆరోగ్య శాఖపై కూడా మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టిపెట్టి, వైద్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్న వారిని గుర్తించాలి. మీడియాలో వస్తున్న వార్తలను పరిగణలోకి తీసుకొని ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలి. తమకు ఎదురులేదు..మంత్రుల అండదండలు వున్నాయని ప్రచారం చేసుకొనే కొంత మంది అధికారులు కొన్నేళ్లుగా తిష్ట వేసుకొని వుంటున్నారు. గత ప్రభుత్వంలో పెద్దల ఆశీస్సులతో తిష్ట వేసుకున్నవాళ్లే, కొత్త ప్రభుత్వంలో కూడా కొనసాగుతున్నారు. కొత్త ప్రభుత్వంలో మంత్రులను కూడా ప్రసన్నం చేసుకుంటున్నారన్న అపవాదులు వస్తున్నాయి. అలాంటివి విసృత ప్రచారం కాకముందే, పాతుకుపోయిన వారిని తప్పించే ప్రయత్నం చేయండి. ఏ అధికారి రెండేళ్ల కంటే ఎక్కువ కాలం కొనసాగ కూడదు. కాని వైద్య శాఖలో కొంత మంది కొన్నేళ్లుగా పాతుకుపోయినవారున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి వారి డిప్యూటేషన్లు రద్దు చేయబడ్డాయి. కాని కొందరు వెరీ వెరీ స్పెషల్‌ అన్నట్లు కొనసాగుతున్నారు. పైగా వారి ఆగడాలపై వార్తలు రాస్తే లీగల్‌ నోటీసులు పంపిస్తున్నారు. అంటే వారి వెనక ఈ ప్రభుత్వ పెద్దలు కూడా వున్నారా? అన్న అనుమానం కలుగకమానదు. కాస్త భద్రాద్రి జిల్లా వైద్య శాఖ మీద దృష్టిపెట్టండి. మీడియా కథనాలు చూడండి. ప్రక్షాళన చేయండి.

ప్రాథమిక పశువైద్య కేంద్రం ఆకస్మికంగా తనిఖీ

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
గుండాల మండల ప్రాథమిక పశువైద్య కేంద్రంలో ఆకస్మికంగా తనిఖీ నిర్వహించిన జిల్లా డివిఏహెచ్ఓ అధికారి డాక్టర్ పురేందర్ గుండాల పశువుల డాక్టర్ రాజేష్ కు సంబందించిన పలు రిజిస్టర్ లను తనిఖీ చేసారు. అదేవిదంగా సమ్ముర్ సిసన్ లో పశువుల కు వచ్చే దొబ్బ వాపు, జబ్బ వాపు వంటి వ్యాధుల పట్ల అప్రమత్తం గా ఉండాలని అన్నారు. అదేవిదంగా సమ్ముర్ లో పశువులను మేపే పలు యాజమాన్య పద్ధతులను రైతులకు అవగాహనా సదస్సులను నిర్వహించాలని వైద్య సిబ్బంది కి సూచించారు.
ఈ కార్యక్రమం లో వెటర్నరీ అసిస్టెంట్ బి హరికిరణ్ సిబ్బంది పాల్గొన్నారు.

అభినందనలు తెలియజేసిన విద్యాధికారి నీలకంఠం

పదవ తరగతి పరీక్షల్లో మండల్ టాపర్ గా నిలిచిన నస్కల్ విద్యార్థి

నిజాంపేట: నేటి దాత్రి ,ఏప్రిల్ 30

గురువారం తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ పదవ తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేసింది.. ఈ సందర్భంగా మండల విద్యాధికారి నీలకంఠం మాట్లాడుతూ నిజాంపేట మండల వ్యాప్తంగా గవర్నమెంట్ పాఠశాలకు సంబంధించి అత్యధిక మార్కులు సాధించినటువంటి జెడ్ పి హెచ్ ఎస్ నస్కల్ విద్యార్థి 9.7 జిపిఏ వై. సుదిష్ణకు అభినందనలు తెలిపారు అలాగే మండల వ్యాప్తంగా ఉత్తీర్ణత శాతం 99% గా ఉన్నది అన్నారు. మండల వ్యాప్తంగా పరీక్షకు హాజరైన బాలుర సంఖ్య 108, బాలికల సంఖ్య 87 ఉంది అని ఆయన తెలిపారు అలాగే 100% ఉత్తీర్ణత సాధించినటువంటి పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు, విద్యార్థులకు అభినందనలు తెలిపారు

error: Content is protected !!
Exit mobile version