ఎండపల్లి నేటి ధాత్రి
జగిత్యాల జిల్లా ఎండపెల్లి మండలం లోని గుల్లకోట గ్రామానికీ చెందిన హ్యాండ్ బాల్ క్రీడాకారులు జైనపురం రాహుల్, వనం మహేష్, జైనపురం వంశీ ఈనెల 23న శాతవాహన యూనివర్సిటి పరిధిలో నిర్వహించినటువంటి హ్యాండ్ బాల్ సెలక్షన్ ట్రయల్స్ లో అత్యంత ప్రతిభ కనబరిచి శాతవాహన యూనివర్సిటీ జట్టుకి ఎంపిక కావడం జరిగింది. వీరు మే నెల 2వ తేది నుండి 6 వ తేది వరకు కేరళ రాష్ట్రం కొట్టాయం లోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో నిర్వహిస్తున్న సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ హ్యాండ్ బాల్ పోటీలలో పాల్గొంటారని వ్యాయామ ఉపాధ్యాయులు సాయికుమార్,మహేష్ తెలియజేశారు. వీరి ఎంపిక పట్ల మాజీ సైనికోద్యోగులు ముదిగంటి రమణారెడ్డి ప్రముఖ సినీ నిర్మాత సాన యాదిరెడ్డి ఓజ్జల చారిటబుల్ ట్రస్ట్ ఓజ్జల మహేష్ ,సీనియర్ క్రీడాకారులు బాస మహేష్,మౌనిక,అనూష, అక్షయ్, జీవన్ మరియు ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తూ,అభినందించారు
