ఇంటర్ విద్యార్థుల ను సన్మానముచేసిన పెండం నాగన్న

వనపర్తి నేటిదాత్రి :

వనపర్తి పట్టణంలో 32 వ వార్డుకు చెందిన చాతుర్య, గౌతమ్ యాదవ్ లను వార్డు కౌన్సిలర్ పెండెం నాగన్న యాదవ్, సగర సంగం రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలుక సత్యం సాగర్, మానవపాడు వెంకటయ్య, కురుమన్న, శ్రీనివాసులు శాలువాతో సన్మానించారు విద్యార్థుల ను అభినందించారు.


సురేష్ యాదవ్,సుజాత దంపతుల కుమార్తె చాతుర్య యాదవ్ ఇంటర్మీడియట్ ఎంపీసీ మొదటి సంవత్సరం 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించడం ఎంతో సంతోషదాయకమన్నారు. అలాగే పల్లవి, కృష్ణ యాదవుల కుమారుడు గౌతమ్ యాదవ్ పదవ తరగతిలో 10/10 సాధించడం పట్ల సంతోషంతో వారిని అభినందిస్తూ భవిష్యత్తు లో కూడా విద్యలో ప్రగతి సాధించాలని సూచిం చారు

బి ఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ప్రచారం

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో పార్టీ ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ పార్టీ బలపరిచిన కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి వినోద్ కుమార్ నీ గెలిపించాలని బి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినోద్ కుమార్ ని గెలిపించి మన కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవాలని ఆయన ఎంపీగా ఉన్న సమయంలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని ఎన్నో నిధులు తీసుకొచ్చి నియోజకవర్గన్ని అభివృద్ధి పరిచారని అలాంటి వ్యక్తికి కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ఇట్టి కార్యక్రమంలో బి ఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు నాయకులు యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మునుగోడు నియోజకవర్గం చండూర్ మండలంలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్ రావు.

నల్గొండ, నేటిధాత్రి:

హరీశ్ రావు కామెంట్స్:

మీ అందరి ఉత్సాహం చూస్తుంటే భువనగిరిలో ఎగిరేది గులాబీ జెండానే అనిపిస్తోంది.

భూములు, ఆస్తులు కాపాడుకోవడానికి ఇసుక కంకర దొంగతనాలు చేయడానికి పార్టీలు మారవచ్చు కానీ నిజమైన ఉద్యమకారులు కార్యకర్తలు బీఆర్ఎస్ తోనే ఉన్నారు.

కాంగ్రెస్ వాళ్లు అధికారంతో కళ్ళు నెత్తికెక్కి గాలిలో ఉన్నారు.
మంత్రి కోమటిరెడ్డి అహంకారంతో విర్రవీగుతూ రైతుబంధు అడుగుతే రైతులను చెప్పుతో కొట్టాలి అంటున్నాడు.

వీళ్ళ అహంకారం దింపాలంటే క్యామ మల్లేష్ గారిని గెలిపించి పార్లమెంటుకు పంపించాలి.

వంద రోజుల్ల ఆరు గ్యారంటీలు 13 హామీలు నెరవేరుస్తామని బాండ్ పేపర్లు రాసిచ్చిన కాంగ్రెస్ నాయకులు తప్పించుకొని తిరుగుతున్నారు.

ఎందుకు అమలు చేయలేదని అడిగితే దేవుళ్ళ మీద ఒట్టేస్తూ మళ్లీ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు ప్రామిసరీ నోట్లు ఇప్పుడు దేవుళ్ళ మీద ప్రామిస్‌లు. మళ్లీ మోసపోదామా?

మొదటి హామీ అక్కచెల్లెళ్లకు మొదటి తారీకు 2500 ఇస్తామన్నారు, ఎవరికైనా 2500 పడ్డాయా.?
నాలుగు నెలలకు 2500 రూపాయలు లెక్కన అక్క చెల్లెళ్లకు పదివేల రూపాయలు కాంగ్రెస్ బాకీ పడింది.

రెండో హామీ రైతులకు 15000 రైతుబంధు. కెసిఆర్ ఇచ్చిన 10000 రైతుబంధు కూడా ఇప్పటికి పూర్తిగా వేయలేదు.
కరోనా కష్టకాలంలో కూడా కేసీఆర్ రైతులకు రైతుబంధు ఇచ్చి రైతులను కాపాడుకున్నాడు.

వడ్లకు మక్కలకు మద్దతు ధరపైన 500 బోనస్ ఇస్తామని రైతులను మోసం చేసింది కాంగ్రెస్.
500 బోనస్ పక్కన పెడితే మద్దతు ధరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనట్లేదు.

ఆసరా పింఛన్ 4000 చేస్తా అని మాటతప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ఇచ్చిన 2000 కూడా ఒక నెల ఎగ్గొట్టింది.

భద్రాచలం పోయి రాముడు మీద ఒట్టు, మెదక్ వై చర్చ్ మీద ఒట్టు, సిద్దిపేటకు వచ్చి మల్లన్న మీద ఒట్టు అని ఒట్ల రాజకీయం చేస్తున్నారు.

ఆగస్టు 15 వరకు ఆరు హామీలు 13 గారెంటీలు అమలు చేస్తే నా ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేస్తా చేయకపోతే నీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తావా రేవంత్ రెడ్డి!

నా సవాలును ఇంకా రేవంత్ రెడ్డి స్వీకరించలేదంటే ఆరు గ్యారెంటీలు 13 హామీలు అమలు చేయమని చెప్పకనే చెప్తున్నట్టే.

మళ్లీ మనం నమ్మి కాంగ్రెస్కు ఓటేస్తే ఈ ఐదు సంవత్సరాలు చూద్దామంటే కూడా దొరకరు.

ప్రజల కోసం కొట్లాడాలంటే ప్రశ్నించే గొంతును గెలిపించాలి. భువనగిరిలో క్యామ మల్లేశ్‌ను మీరు గెలిపిస్తే రేపు అసెంబ్లీలో కాంగ్రెస్‌ను నిలదీస్తాం.

ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే ప్రభుత్వమేం పడిపోదు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేపిస్తాం.

ఆడపిల్లల పెళ్ళికి కెసిఆర్ కళ్యాణ లక్ష్మి ఇస్తే లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తా అన్న కాంగ్రెస్ ప్రజలను మోసం చేసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక జరిగిన లక్ష పెళ్లిళ్లకు లక్ష తులాల బంగారం బాకీ పడింది.

ఆరు గ్యారెంటీల్లో ఐదు గ్యారంటీలు చేశామని మోసం చేస్తున్నారు రేవంత్ రెడ్డి.
మహాలక్ష్మి కింద 2500 మహిళలకు వచ్చిందా, ఆసరా పెన్షన్ 4000 కి వచ్చాయా, 15000 రైతుబంధు వచ్చిందా, నిరుద్యోగులకు 4000 నిరుద్యోగ భృతి వచ్చిందా, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం వచ్చిందా?

భువనగిరిలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మంత్రి పదవి వస్తుందని ఆశపడి రాజగోపాల్ రెడ్డి పాకులాడుతున్నారు.

భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిలో ఏ గుణగణాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది?
రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేశాడని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వ్యక్తికి టికెట్ ఇచ్చిర్రు.

మొన్ననే భూకబ్జాలు చేశాడని కేసు కూడా నమోదయింది.

బీసీ బిడ్డను క్యామ మల్లేశ్‌ను ఆశీర్వదించి భువనగిరి నుంచి గెలిపించాలని మీ అందర్నీ కోరుకుంటున్నాను.

కాంగ్రెస్‌కి ఓటు వేయొద్దని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ కు ఓటు వేయకుండా బీజేపీకి ఓటేస్తే పెనం మీదనుండి పొయ్యిలో పడ్డట్టు అయితది.

బిజెపి వచ్చి పది సంవత్సరాల్లో ఎవరికి ఏం చేసింది.
ప్రజల మీద అధిక ధరలు మోపి జిఎస్టి వేసి నడ్డి విరిచింది. పెట్రోల్ గ్యాస్ ధరలు పెంచి ప్రజలను ఆగం చేసింది.

మునుగోడు బైఎలెక్షన్లో ప్రభాకర్ అన్న గెలిపిస్తే చండూరు రెవెన్యూ డివిజన్ చేస్తానని మాట ఇచ్చిన కేసిఆర్ రెవెన్యూ డివిజన్ చేసి చూపించారు.

వరంగల్ పార్లమెంట్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయం.. ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి

కాజీపేట ప్రజలు కడియం కావ్య ని అత్యధిక మెజారిటీతో గెలిపించండి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి.

కాజీపేట పట్టణ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి.

కాజీపేట బస్టాండ్ నిర్మాణం అతి త్వరలో నెరవేరుస్తా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

కాజీపేట ప్రజలు కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి కడియం కావ్య ని అత్యధిక మెజారిటీతో గెలుస్తుంది

“నేటిధాత్రి” హనుమకొండ

కాజీపేట పట్టణ అభివృద్ధి విషయంలో BRS-BJP పార్టీలు గత పది ఏళ్లుగా నిర్లక్ష్యం చేశాయని కాంగ్రెస్ ప్రభుత్వం 25 ఏళ్ల క్రితం స్థానిక నాటి ఎమ్మెల్యే పివి రంగారావు గారి హయాంలో చేసిన (జరిగిన) అభివృద్ధి మాత్రమే ఉన్నదని మళ్లీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రమే అభివృద్ధి జరుగుతుందని గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సుమారు నాలుగు నెలల్లోనే కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించామని పనులు కూడా జరుగుతున్న తీరు స్థానిక కాజీపేట ప్రజలు గమనిస్తున్నారని ఇచ్చిన మాటకు కాంగ్రెస్ పార్టీ మాత్రమే కట్టుబడి ఉంటుందని గత బిఆర్ఎస్ పాలనలో కాజీపేట పట్టణ అభివృద్ధిని పట్టించుకోలేదని ఈ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య ని గెలిపిస్తే రానున్న కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు నాంది పలుకుతుందని తద్వారా రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే డివిజన్ కేంద్రం చేసుకొనుటకు పునాది వేసినట్లు అవుతుందని ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

కాజీపేట ప్రజల చిరకాల వాంఛ “కాజీపేట బస్టాండ్” అతి తొందరలోనే నెరవేరుస్తానని గతంలో కాజీపేట బస్టాండ్ ఉద్యమం పేరుతో ఎమ్మెల్యేలు, మంత్రులుగా అయిన వ్యక్తులు నాడు పట్టించుకోలేదని నేను నా ఆధ్వర్యంలో అతి త్వరలో కాజీపేట బస్టాండ్ కల నెరవేరుస్తానని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.

కాజీపేట చౌరస్తా అభివృద్ధి మరియు ఉత్తర దక్షిణాది రాష్ట్రాలకు వారధిగా ఉన్న కాజీపేట జంక్షన్ అభివృద్ధి పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నానని కృత నిశ్చయంతో ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి మాట నిలబెట్టుకుంటామని లేనియెడల మళ్లీ కాజీపేట ప్రజలను ఓట్లు అడగనని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.

కాజీపేట చౌరస్తా నుండి సోమిడి రోడ్డు పనులు ఎన్నికల నోటిఫికేషన్ ముందే ప్రారంభించామని పనులు కూడా నడుస్తున్న విషయం ప్రజలు గమనిస్తున్నారని సెంటర్ లైటింగ్ ద్వారా రోడ్డు పూర్తి చేయడం జరుగుతుందని వరంగల్ పట్టణ అభివృద్ధి మాస్టర్ ప్లాన్ ద్వారా చేస్తున్నామని గత ప్రభుత్వం విజన్ లేకుండా మాస్టర్ ప్లాన్ అమలు చేయకుండా ఇష్టానుసారంగా వరంగల్ పట్టణాన్ని మొక్కలు చేసి వరంగల్ చరిత్రను సర్వనాశనం చేశారని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.

BRS-BJP నాయకులు వారి అభ్యర్థులు భూకబ్జాలకు చెరువులను, కుంటలను, నాళాలను కబ్జాలు చేసి వరంగల్ పట్టణాన్ని దోచుకున్నారని మతం పేరుతో ఒక పార్టీ ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతూ మరో పార్టీ ఓట్లను దండుకున్నారని 10 సంవత్సరాలు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వారి అభివృద్ధికి మాత్రమే ఉపయోగించారని కాజీపేట పట్టణ అభివృద్ధిని విస్మరించారని ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు.

కాజీపేట లో కార్నర్ మీటింగ్ విజయవంతం చేయాలని పట్టణ ప్రజలు అందరూ రేపు ఉదయం కాజీపేట పోలీస్ స్టేషన్ సమీపంలో సోమిడి రోడ్ ఆటో స్టాండ్ సమీపంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్నర్ మీటింగ్ ఉన్నదని ఈ మీటింగ్ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఈ విలేకరుల సమావేశంలో స్థానిక కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్, విజయశ్రీ రజాలి, ఎలకంటి రాములు, మాజీ కార్పొరేటర్లు గుంటి కుమారస్వామి, సుంచు అశోక్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మహమ్మద్ అంకుస్, టిపిసిసి మాజీ కార్యదర్శి సయ్యద్ రజాలి, డివిజన్ అధ్యక్షులు షేక్ హస్గర్, పాలడుగుల ఆంజనేయులు, పోగుల సంతోష్, గజపాక రమేష్, సీనియర్ నాయకులు మేకల ఉపేందర్, పసునూరి మనోహర్, క్రాంతి భరత్, తదితరులు పాల్గొన్నారు.

విస్తృతంగా ఇంటింటికీ కాంగ్రెస్ ప్రచారం

నేటిధాత్రి కమలాపూర్ (హన్మకొండ)

కరీంనగర్ పార్లమెంటు కాంగ్రెస్స్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును బారి మెజారిటీ తో గెలిపించాలని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యములో విస్తృతంగా ఇంటింటి ప్రచారం చేపట్టారు.శనివారం కమలాపూర్ మండల కేంద్రంలో పార్టీ నాయకులు,కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్స్ ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు వివరిస్తూ పార్టీ అభ్యర్థి నీ భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా ఓటర్లను అభ్యర్తిస్తున్నారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలసాని రమేష్ గౌడ్, పెరుమాండ్ల పరశురాములు ,గంధసిరి బిక్షపతి,పుల్ల మహేందర్,అదేపు శ్రీకాంత్, మాట్ల మనోజ్,మాట్ల రాజేష్,పుల్లా సుభాష్ ,శనిగరపు రమేష్, వైనాల సుభాష్, వైనాల సాంబయ్య, తరిగొప్పుల నరేష్, తదితరులు పాల్గొన్నారు.

జూనియర్ కాలేజ్ లో అకాడమీలు నడిపిస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి

స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు :ఎల్తూరి సాయికుమార్ స్వేరో

హన్మకొండ, నేటిధాత్రి:

స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఎల్తూరి సాయికుమార్ మాట్లాడుతూ వేసవికాలంలో హనుమకొండ నగరంలో ఎటువంటి పర్మిషన్స్ లేకుండా నడుపుతూ అకాడమీ పేరు మీద జూనియర్ కాలేజ్ నడిపిస్తూ ఎంసెట్ నీట్ జేఈఈ మెయిన్స్ అని పేద విద్యార్థుల దగ్గర డబ్బులు తీసుకుని ఇటు ప్రభుత్వాన్ని అటు పేరెంట్స్ ను మోసం చేస్తున్న అకాడమీ చైర్మన్ లు అదేవిధంగా తీవ్రంగా 48 డిగ్రీల ఎండలు కొడుతున్న ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోని అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకుండా మాకు ఎటువంటి సంబంధం లేదు అనే విధంగా వ్యవహరిస్తున్నటువంటి అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతోంది చర్యలు తీసుకుని ఎడల తీవ్రమైనటువంటి ఉద్యమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో జీడి అభిషేక్, ఉదయ్, సాయి మరియు హరీష్ తదితరులు పాల్గొన్నారు.

ఉపాధి హామీ కూలీలతో పని చేసిన ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి

జైపూర్, నేటి ధాత్రి :

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలో చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పర్యటించారు. మే 13న జరగబోయే పార్లమెంట్ ఎన్నికల ఇంటింటి ప్రచారంలో భాగంగా పెద్దపెల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా ప్రచార కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి శనివారం రోజున ఇందారం గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలతో ముచ్చటించి వారితో పాటు కలిసి పని చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన 6 హామీలు పేదలపాటి వరంగా మారాయని, త్వరలోనే హామీలన్నీ నెరవేరుస్తామని, రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశగా దూసుకెళుతుందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ను ఆశీర్వదించి హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, కాంగ్రెస్ జైపూర్ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సుభాష్ నగర్ లో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఇంటింట ప్రచారం

హన్మకొండ, నేటిధాత్రి:

హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ సూచనల మేరకు హన్మకొండ 5వ డివిజన్ అధ్యక్షుడు పున్నం చందర్ ఆధ్వర్యంలో సుభాష్ నగర్ లో బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రతి ఇంటికి తిరిగి ప్రచారం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో 5వ డివిజన్ అధ్యక్షుడు పున్నం చందర్ మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికలలో అన్ని చోట్లల్లో బిఆర్ఎస్ పార్టీ మంచి విజయం సాధిస్తుందని ప్రజలందరూ బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆదరిస్తున్నారని మళ్లీ పాత రోజులు రాబోతున్నాయని రైతుల జీవితాలు బాగుపడాలంటే బిఆర్ఎస్ ని ఆదరించాలని ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో పండగ సాగర్ నారాయణగిరి రాజు నలబోల వినయ్ విశాల్ సాయి వినో ద్ రవీందర్ మూల ప్రభాకర్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

తల్లిదండ్రుల జ్ఞాపకార్థం అంబలి పంపిణీ

నెన్నల్, నేటి ధాత్రి ,:

మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం చిత్తాపూర్ గ్రామంలో మాజీ సర్పంచ్ బత్తిని పద్మ, వెంకటేష్ గౌడ్ వారి తల్లిదండ్రులు బత్తిని రాజవ్వ,ఓదే గౌడ్ గార్ల జ్ఞాపకార్థం శనివారం రోజున అంబలి పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. విపరీతమైన ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని బయట పనులకు వచ్చే కూలీలకు, ప్రయాణాలు చేసే ప్రయాణికులకు, బాటసారులకు దాహార్తిని తీర్చడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. వేసవి తాపానికి ఎంతో ఉపశమనం కలిగించే అంబలి పంపిణీ కార్యక్రమం చేయడాన్ని గ్రామస్తులు, ప్రయాణికులు అభినందించారు.

దేశ సంపదను ఆదాని, అంబానీలకు దోచిపెడుతున్న మోడీ

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నాలుగు ముక్కలవుతుంది

భద్రాచలం నేటి ధాత్రి

కష్టపడీ చెమట చిందించే కార్మికులకు న్యాయం చేసేందుకే శ్రామిక న్యాయాన్ని మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పొందుపరిచింది

మాజీ గ్రంథాలయ చైర్మన్ భోగాల శ్రీనివాస్ రెడ్డి

మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ విజయాన్ని కోరుకుంటూ మాజీ గ్రంథాల చైర్మన్ బోగల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో భద్రాచలం నియోజకవర్గం ముమ్మరంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా భోగాల శ్రీనివాస్ రెడ్డి ప్రజలతో మాట్లాడుతూ

మోడీ ప్రభుత్వం దేశ సంపదనంతా ఆదాని, అంబానీలకు దోచిపెడుతునడని అన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాసంక్షేమ ధ్యేయంగా ముందుకు పోతుందని అన్నారు. ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తున్నామని అన్నారు.
అధికారం కోల్పోయిన తర్వాత కెసిఆర్ ,కేటీఆర్ లు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ఎద్దేవ చేశారు.
ఉపాధి హామీ పథకాన్ని తీసుకువచ్చే కాంగ్రెస్ పార్టీ ఎంతోమంది కార్మికులకు ఉపాధి కల్పించిందని, కష్టాన్ని నమ్ముకుని జీవించే శ్రామికులకు న్యాయం చేసేందుకే శ్రామిక న్యాయాన్ని మేనిఫెస్టోలో పొందుపరిచి తగిన విధంగా న్యాయం చేయడానికి ముందుకు వచ్చిందని ఆయన అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆ పార్టీ నాలుగు ముక్కలవుతుందని వ్యాఖ్యానించారు.
అధికారంలో ఉన్నప్పుడు కెసిఆర్ ప్రజల సొమ్మును దోచుకోవడంతో కూతురు కవిత జైలుకెళ్ళిందని, వారు కూడా జైలుకెళ్లక తప్పదని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తూ ముందుకు పోతుందని అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి, బీఆర్ఎస్ లకు ఒక్క సీటు కూడా రాదని తెలిపారు.

ఈ ఎన్నికల ప్రచారంలో
ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు రాస మల్ల రాము, కాంగ్రెస్ నాయకులు అన్నేం రామిరెడ్డి, షాబీర్ భాష, జిల్లా కాంగ్రెస్ నాయకులు తుమ్మల రాణి, రూపా దేవి, కట్ట కళ్యాణి, పద్మప్రియ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

శ్రీవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే గండ్ర

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి మంజూరు నగర్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి భక్తితో వేడుకున్నారు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నియోజకవర్గం ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని దేవుడిని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో పూర్ణచందర్ పొలసాని లక్ష్మీనరసింహ నూనె రాజు భూపాలపల్లి నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు స్వామి వారిని దర్శించుకున్నారు

కడియం కావ్య గెలుపు ఖాయం

ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్న పరకాల కాంగ్రెస్ శ్రేణులు

పరకాల నేటిధాత్రి
వరంగల్ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కడియం కావ్య గెలుపే లక్ష్యంగా ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.శనివారం రోజున పరకాల శాసనసభ సభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆదేశాలమేరకు స్థానిక పరకాల మున్సిపాలిటీ పట్టణంలో 47వ బూత్ అధ్యక్షుడు పసుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పట్టణంలో గడపగడపకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పాంచ్ న్యాయ సూత్రాలు ఓటర్లకు అవగాహన చేస్తూ 47వ బూత్ లో ప్రచారం జోరుగా సాగుతోంది.ఈ సందర్బంగా పట్టణంలో 18,19వ వార్డుల ఇంచార్జి పావశెట్టి సునీల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంతో ప్రజలలో జోష్ పెరిగిందని టిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అవినీతిని ప్రజలు గమనించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని తెలిపారు అదేవిధంగా ఉత్సాహంలో వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్యను గెలిపించు కొవాలని హస్తం గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరారు.కాంగ్రెస్‌ పార్టీ ఐదు హామీల గురించి వివరించారు.రెండు లక్షల రైతు రుణమాఫీ,ప్రతి కుటుంబంలో మహిళకు నెలకు రూ.8,333, ఉపాధి హామీ కూలీలకు కనీస వేతనం రూ.400,ఐదు లక్షలతో పేదలకు గహ నిర్మాణం, వద్ధులకు పెన్షన్‌ రూ.4వేలు, వికలాంగులకు రూ.6వేలు రాష్ట్రానికి ప్రత్యేక హౌదా, రైతులకు గిట్టుబాటు ధర, ఉచిత విద్య తదితర పథకాలను వివరించారు.మే 13న నిర్వహించబోయే సార్వత్రిక లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తున్న వరంగల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యను గెలుపే ధ్యేయంగా ప్రతి ఒక్కరు నిమగ్నమయ్యారు కేంద్రంలో బిజెపి మతతత్వ పార్టీతో దేశ ప్రజలను మభ్యపెట్టి మళ్లీ ఓట్లు అడగడానికి వస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరులు కోరుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒంటేరు కుమార్,ఒంటేరు చరణ్ రాజ్, ఒంటేరు రమేష్,మచ్చ సందీప్,గోపి,సమంత్, గంగరాజు తదితరులు పాల్గొన్నారు.

పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం

వనపర్తి నేటిదాత్రి ;
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా వనపర్తి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శుక్రవారం నుండి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైనట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ తెలిపారు. అత్యవసర సేవల సిబ్బంది, పోలింగ్ రోజున ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఐ.డి. ఒ.సి. లో ఫెసిలిటేశన్ సెంటర్ ఏర్పాటు చేసి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు.
పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుంది. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కొరకు మొత్తం 8 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందఈ 240 మంది ఉద్యోగులు తమ ఓటు ను పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకున్నార ని కలెక్టర్ తెలిపారు
హోమ్ ఓటింగ్ ద్వారా మొదటి రోజు దివ్యంగుల 40 మంది, 85 సంవత్సరాలు వయస్సు దాటిన ఓటర్లు 75 మంది వెరసి 115 మంది హోమ్ ఓటింగ్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి పర్యవేక్షించారు.

వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి మారేపెళ్లి సుధీర్ కుమార్ ను గెలిపించండి

మాజీ సర్పంచ్ నరహరి పద్మ వెంకట్ రెడ్డి
మొగుళ్ల పెళ్లి నేటి ధాత్రి న్యూస్
జయ శంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళ పల్లి మండలం మోట్లపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ నరహరి పద్మ వెంకట్ రెడ్డి. ఉపాధి హామీ కూలీల దగ్గరికి వెళ్లి బిఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చి గెలిపించాలని ఆయన కోరారు. ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదాని మహిళలకు 2500 రూపాయలు ఇస్తానని ఇవ్వలేదని రుణమాఫీ చేయలేదని రైతుబంధు ఇవ్వలేదని ఆయన అన్నారు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి మారేపల్లి సుధీర్ కుమార్ ను అత్యధిక మెజార్టీతోగెలిపించాలని ఆయన అన్నారు. ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ విష్ణు. మాజీ ఉపసర్పంచ్ ఆళ్ల గోపాల్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

పరకాలలో బిఆర్ఎస్ ఇంటింటి ప్రచారం

పరకాల నేటిధాత్రి
వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మారేపల్లి సుధీర్ కుమార్ గెలుపు కోసం శనివారం రోజున పరకాల మున్సిపల్ 12 వ వార్డు పరిధిలోని 58వ బూత్ లో ఇంటింటి ప్రచారం బూత్ ఇంచార్జి గంట కళావతి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.పట్టణంలో ప్రజల నుండి స్పందన లభించిందని ఎవ్వరినోటినుండి అయినా కారు గుర్తుకే ఓటు వేసి గెలిపిస్తామని అంటున్నారని,కెసిఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు గెలిపిస్తాయి అని గంటా కళావతి అన్నారు.ఈ కార్యక్రమంలో పరకాల పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ జయపాల్ రెడ్డి,మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బండి సారంగపాని, కుంకుమేశ్వరా దేవస్థాన మాజీచైర్మన్ గందే వెంకటేశ్వర్లు,సమన్వయ సమితి సభ్యులు,12వ వార్డు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.

మార్నింగ్ వాకo గు లో ఎమ్మెల్యే తూడి

వనపర్తి నేటిదాత్రి ;
పార్లమెంట్ ఎన్నికలలో ప్రచారంలో భాగంగా డాక్టర్ మల్లు రవి ని గెలిపించాలని వనపర్తి పట్టణంలో పలు వార్డులలో శనివారం ఉదయం నుండి మార్నింగ్ వాకింగ్ లో ఎమ్మెల్యే తూ డి మేగారెడ్డి ప్రజలను కలుసుకొని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్మన్ పుట్టపాకల మహేష్ వైస్ చైర్మన్ మున్సిపల్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు 33వ వార్డుకు చెందిన సీనియర్ నాయకుడు కూరగాయల రవీందర్ ఉన్నారు

అసద్​ను హడలెత్తిస్తున్న నారీ శక్తి!

– పాతబస్తీలో మాధవీ లత వర్సెస్ అసదుద్దీన్​

– ఎంఐఎంకు చుక్కలు చూపుతున్న బీజేపీ

– హైదరాబాద్‎ సెగ్మెంట్ లో టఫ్‎గా పొలిటికల్ ఫైట్

– ఎన్నికల ప్రచారంలో చెమటలు కక్కుతున్న ఓవైసీ

– జై శ్రీరాం నినాదాలతో హోరెత్తుతున్న మజ్లిస్​కంచుకోట

– వినూత్న రీతిలో ప్రచారంలో దూసుకెళ్తున్న మాధవీలత

– ఎదురు లేని నేతను ఇంటికి పంపిస్తానంటూ సవాల్​

– విల్లు ఎక్కుబెడుతూ.. పతంగి కట్​చేస్తూ క్యాడర్​లో జోష్​

నేటి ధాత్రి, స్టేట్​బ్యూరో:

బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీ లత ఎంట్రీతో.. పాతబస్తీలో బస్తీ మే సవాల్ అన్నట్లు పోరు సాగుతోంది. ఎన్నికల ప్రచారంలో రోజుకో వినూత్న రీతిలో, ఆమె తీసుకుంటున్న నిర్ణయాలతో ఎంఐఎం పార్టీ నేతలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇటీవల దర్గాలో మాధవీలత ప్రార్థనలతో కొత్త దుమారం రేగింది. ఆ సంఘటన హైదరాబాద్‎ను పొలిటికల్‎గా మరింత హీటెక్కిస్తోంది. దీంతో మాధవీ లత.. మజాకా! అంటున్నారు హైదరాబాద్ సెగ్మెంట్​ఓటర్లు. మాధవీలత ఎంట్రీతో పాతబస్తీలో ప్రచారం తీరే మారిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్​పార్లమెంట్​కు ఎన్నడూ లేనంత క్రేజ్​వస్తోంది. గతంలో లేని విధంగా అసదుద్దీన్ తో ఢీ అంటే ఢీ అంటున్నారు మాధవీలత. ప్రచారంలో భాగంగా, పాతబస్తీలో గల్లీగల్లీని చుట్టేస్తున్నారు. మొన్న బాణం ఎక్కుపెట్టి, పతంగిని కట్ చేసిన హావభావాలతో కేక పుట్టించిన మాధవీలత.. ప్రచారంలో వేద మంత్రాలు చదువుతూ.. గణపతి, శివలింగానికి పూజలు చేస్తూ.. దర్గాకు వెళ్లి ప్రార్థనలు చేస్తూ.. సమ్మర్​టైమ్ లో​ఎంఐఎంకు రాజకీయ వేడి సెగలు చూపుతున్నారు.

ఇటీవల ప్రచారం సందర్భంగా పాతబస్తీలోని ఓ దర్గాకు వెళ్లిన మాధవీలత, అక్కడ చాదర్ సమర్పించారు. దువా చేయాలని విజ్ఞప్తి చేస్తే, ఆమె సమాధిపై చాదర్ సమర్పించి దండం పెట్టుకొని తన గెలుపు కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆమె దర్గాలో చాదర్ సమర్పించడంపై ముస్లిం మత పెద్దలు మండిపడడంతో ఇదో వివాదంగా మారింది. ఇక ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ కూడా పాతబస్తీలో ఎలక్షన్ హీట్ పెంచుతున్నారు. ప్రచారం సందర్భంగా అక్కడే ఉన్న స్థానికులతో ముచ్చటించారు. మరోవైపు కార్యకర్తలు పెద్దకూర తింటాం.. ఓవైసీని గెలిపిస్తామంటూ నినాదాలు చేస్తూ హల్చల్ చేశారు. ఇది కూడా మరో కాంట్రోవర్సీకి దారితీసింది. ఇక హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సమీర్ మాత్రం.. బీజేపీ, ఎంఐఎం రెండూ కలిసి మత రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించినంత స్థాయిలో ఫలితాలు రాబట్టలేకపోయిన బీజేపీ.. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం సత్తా చాటాలని భావిస్తోంది. మెుత్తం 17 ఎంపీ సీట్లకు గాను మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగా బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపింది. ఈ సారి ఎంఐఎం కంచుకోటను బద్దలు కొట్టాలని మాధవీలతను బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు.

హైదరాబాద్ పార్లమెంట్ స్థానం మజ్లిస్ పార్టీకి కంచుకోట. 2004 నుంచి ఈ నియోజకవర్గంలో అసదుద్దీన్ ఓవైసీ వరుసగా ఎంపీగా గెలుస్తున్నారు. ఈ ఎన్నికల్లో అసద్‌కు చెక్ పెట్టాలని బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే అందులో భాగంగానే నర నరాన హిందూత్వంతో నిండిని, పవర్​ఫుల్​లేడీ మాధవీలతను బరిలోకి దింపింది. అయితే చాలా మందికి మాధవీలత గురించి తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు.

మాధవీలత నేపథ్యం ఏమిటీ?
ప్రముఖ విరించి హాస్పిటల్స్ చైర్ పర్సనే కొంపెల్ల మాధవీ లత. ఈమె రిలిజీయస్ యాక్టివిటీస్‌లో చురుగ్గా పాల్గొంటున్నారు. హైదరాబాద్ యాకుత్‌పురా నియోజకవర్గం సంతోష్​నగర్‌లో పుట్టి పెరిగిన మాధవీలత ఓయూలో ఉన్నత విద్యను అభ్యసించారు. భరతనాట్య నృత్యకారిణి, ఆర్టిస్ట్‌, ఫిలాసఫర్‌, ఎంటప్రిన్యూర్‌. ‘విరించి’ గ్రూఫ్‌ ఫౌండర్‌ కొంపెల్ల విశ్వనాథ్‌‌ను 2001లో వివాహం చేసుకున్నారు. కొంపెల్ల విశ్వనాథ్, మాధవీ లత దంపతులకు ముగ్గురు సంతానం. విరించి ఆస్పత్రి సీఎండీగా మాధవీ లత ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈమె లతామా ఫౌండేషన్‌ చైర్​పర్సన్‌ కూడా. హిందుత్వం, భారతీయ సంస్కృతిపై అనర్గళంగా మాట్లాడగలరు. రెండేళ్లుగా పాతబస్తీ వేదికగా గోశాలతో పాటు భారీ యజ్ఞశాల ఏర్పాటు చేసి హిందూ వైదిక కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు.

కాగా.. ఇన్ని రోజులు కేవలం సామాజిక సేవలు చేసిన మాధవీ లత తొలిసారిగా రాజకీయంగా.. హైదరాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. హైదరాబాద్ పార్లమెంట్ ఎంఐఎం అడ్డా. 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో అసదుద్దీన్ వరుసగా ఎంపీగా గెలిచారు. అంతకు ముందు 1984 నుంచి 2004 వరకు ఆయన తండ్రి సుల్తాన్ సలాఉద్దీన్ ఓవైసీ ఆరు పర్యాయాలు ఎంపీగా విజయం సాధించారు.

అయితే.. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అసదుద్దీన్‌కు చెక్ పెట్టాలని బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఎదురులేని నేత ఓవైసీని గట్టి దెబ్బ కొట్టాలన్నది బీజేపీ ప్లాన్. అందుకే ఈసారి అసద్‌ను ఓడించాలని నారీ శక్తిని రంగంలోకి దింపింది. ఇప్పటికే రెండు మూడు సార్లు బీజేపీ అభ్యర్థి ఇక్కడ రెండో స్థానం దక్కించుకున్నారు. దీంతో.. ఈ ఎన్నికల్లో ఎలాగైనా సరే అసదుద్దీన్‌ను ఓడించాల్సిందేనని అన్ని విధాలుగా సరైన వ్యక్తిగా ఉన్న మాధవీ లతను బీజేపీ బరిలోకి దింపింది. మరి కమలం పార్టీ ఫ్లాన్ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి మరి.

బార్డర్ సెగ్మెంట్​లో.. కౌన్​బనేగా ఎంపీ?

– జహీరాబాద్​లో బీజేపీ బలాబలాలు ఎంత?

– బీజేపీ నుంచి బరిలో సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్​

– కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్

– బీఆర్ఎస్ నుంచి నాన్​లోకల్ ​గాలి అనిల్ కుమార్

– బీఆర్ఎస్​లో ఉన్నప్పుడే బీబీ పాటిల్​పై ప్రజాగ్రహం

– కమలం గూటికి చేరగానే ప్రజలు మళ్లీ కనికరిస్తారా?

– సురేశ్​షెట్కార్ ​సీనియారిటీ పనిచేస్తుందా?

– ‘హస్తం’ పార్టీ నూతనోత్సాహం మేలు చేస్తుందా?

– ‘హస్తం’ హవాలో బీఆర్ఎస్ ​‘గాలి’ వీస్తుందా?

– నాన్ ​లోకల్ అనిల్​ను ప్రజలు అంగీకరిస్తరా?

నేటి ధాత్రి, స్టేట్​ బ్యూరో:
తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల బార్డర్​లో ఉన్న జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్​లో మూడు ప్రధాన పార్టీల్లో త్రిముఖపోరు నెలకొంది. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్, కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్, బీఆర్ఎస్ నుంచి గాలి అనిల్ కుమార్ పోటీపడుతున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్​లో మొత్తం 7 అసెంబ్లీ స్థానాలు ఉండగా సంగారెడ్డి జిల్లాలో 3, కామారెడ్డి జిల్లాలో 4 అసెంబ్లీ సెగ్మెంట్లు విస్తరించి ఉన్నాయి. మూడు పార్టీల క్యాండిడేట్స్​గెలుపు తమదేనన్న దీమాతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. సెకండ్ క్యాడర్ లీడర్లను కలుస్తూ మద్దతు కోరుతూ వ్యూహాత్మక రాజకీయాలతో ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు.

జహీరాబాద్ లోక్ సభ నియోజకవర్గం తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఒకటి. 2002లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా పార్లమెంటరీ నియోజకవర్గాల విభజనలో భాగంగా.. 2008లో జహీరాబాద్ నియోజకవర్గం ఏర్పడింది. ఈ నియోజకవర్గంలో.. సంగారెడ్డి జిల్లా నుంచి మూడు శాసనసభ నియోజకవర్గాలు, కామారెడ్డి జిల్లా నుంచి నాలుగు అసెంబ్లీ సెంగ్మెంట్లు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్, ఆందోల్, జహీరాబాద్ శాసనసభ నియోజకవర్గాలు, కామారెడ్డి జిల్లా నుంచి జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్లు కలిసి జహీరాబాద్ లోక్ సభ నియోజకవర్గంగా ఏర్పాటు చేశారు.

బీజేపీకి సంపూర్ణ మద్దతు?
బీజేపీ క్యాండిడేట్​గా బరిలోకి దిగుతున్న సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ గెలుపుపై దీమాతో ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచిన బీబీపాటిల్​ఎన్నికలకు రెండు నెలల ముందు ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరి టికెట్ దక్కించుకున్నారు. మొదట్లో అసమ్మతి రాగం వినిపించిన జహీరాబాద్ బీజేపీ శ్రేణులు ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. రెండు పర్యాయాలు బీఆర్ఎస్ ఎంపీగా కొనసాగిన బీబీ పాటిల్ పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో ఆయన వెంటనే బీజేపీలో చేరి ప్రధాని మోదీ చరిష్మాపైనే ఆధారపడ్డారనే ప్రచారం జరుగుతోంది. అయితే బీజేపీలో చేరగానే ఆయనపై ప్రజల్లో ఆగ్రహం తగ్గి సానుభూతి ఏర్పడుతుందా? అన్నీ మరిచిపోయి మోడీ మానియా, బీజేపీ హవాలో ఆయనను కనికరిస్తారా? అన్న చర్చ సాగుతోంది. ఏదేమైనా ఉన్న అభ్యర్థులలో స్థానికంగా పాటిల్​కే కొంత సాఫ్ట్ కార్నర్​ఉన్నట్లు పరిస్థితులు చూస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో పాటిల్ కు వ్యతిరేక పవనాలు కనిపిస్తున్నప్పటికీ పార్లమెంట్ ఓటింగ్ కు వచ్చేసరికి బీజేపీకి సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆ పార్టీ నాయకులు ధీమాతో ఉన్నారు. ఇక కామారెడ్డి జిల్లాలోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీకి అనుకూల పవనాలు ఉంటాయని పార్టీ క్యాడర్ భావిస్తోంది. ఈ ఈక్వేషన్లలో బీబీ పాటిల్ పావులు కదుపుతూ ఎన్నికలకు సిద్దమవుతున్నారు. దీంతో ఆయనకే మెజారిటీ విజయావకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం
రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. మాజీ ఎంపీ సురేశ్ షెట్కర్ కాంగ్రెస్ నుంచి పోటీ పడుతున్నారు. ఈ సెగ్మెంట్ లో మొదటి ఎంపీగా గెలిచిన అనుభవం ఆయనకు కలిసొచ్చే అంశంగా ఉంది. ఈ లోక్ సభలోని అసెంబ్లీల వారీగా బలాబలాలు చూస్తే ఆందోల్, నారాయణఖేడ్, జుక్కల్, ఎల్లారెడ్డి సెగ్మెంట్లలో కాంగ్రెస్ హవా చాటింది. జహీరాబాద్, బాన్సువాడ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలుపొందగా, కామారెడ్డి ఒకచోట బీజేపీ గెలిచింది. ఈ పార్లమెంట్ పరిధిలో పార్టీల వారీగా వచ్చిన మొత్తం ఓట్లను పరిశీలిస్తే కాంగ్రెస్ కు 5,49,143 ఓట్లు పోలవగా, బీఆర్ఎస్ కు 5,30,499, బీజేపీకి 1,72,66 ఓట్లు వచ్చాయి. 2019 ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీగా ఉండి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన బీబీ పాటిల్ అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ రావుపై కేవలం 6 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. బీఆర్ఎస్ హయంలోనే పుంజుకున్నా కాంగ్రెస్ తాజాగా మరింత ఓటు బ్యాంకు సాధించి గెలుస్తుందని ఆ పార్టీ నాయకత్వం ధీమాగా ఉంది.

బీఆర్ఎస్ కొత్త పరిచయం
బీఆర్ఎస్ అభ్యర్థిగా గాలి అనిల్ కుమార్ బరిలో ఉన్నారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న బీబీ పాటిల్ ఆ పార్టీ నుంచి బరిలో నిలుస్తారని అందరూ ఆశించారు కానీ ఆయన బీజేపీలో చేరడంతో బీఆర్ఎస్ సందిగ్ధంలో పడింది. మెదక్ టికెట్ ఆశించిన గాలి అనిల్ కుమార్ కు పార్టీ హై కమాండ్ జహీరాబాద్ నుంచి పోటీ చేసే అవకాశం కల్పించింది. మొదట్లో అనిల్ వ్యతిరేకించినప్పటికీ తప్పని పరిస్థితుల్లో జహీరాబాద్ నుంచి పోటీ చేసేందుకు అంగీకరించినట్టు తెలిసింది. ఎక్కడి నుంచైనా పోటీ చేసి గెలుస్తానన్న విశ్వాసంతో అనిల్ పార్టీ ముఖ్య నేతలను కలుస్తూ మద్దతు కోరుతున్నారు. సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ పార్టీ మార్పుతో పాటు ప్రజల్లో ఆయనకు ఉన్న వ్యతిరేకతను అనిల్ కుమార్ క్యాచ్​చేసుకుని ఓటు బ్యాంకును పెంచుకునేందుకు రాజకీయ సమీకరణాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ శ్రేణులు అనిల్ కు సంపూర్ణ మద్దతు తెలుపుతూ బహిరంగ సభలు ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

బీజేపీ, కాంగ్రెస్​మధ్యనే పోటీ..
బీజేపీ, కాంగ్రెస్​అభ్యర్థులిద్దరూ లింగాయత్ సామాజికవర్గానికి చెందిన వారు. దీంతో బీఆర్ఎస్ కాపు సామాజికవర్గానికి చెందిన గాలి అనిల్ కుమార్‌‌కు టికెట్ ఇచ్చింది. పటాన్‌చెరు ప్రాంతానికి చెందిన అనిల్ కుమార్ మెదక్ టికెట్ ఆశించగా.. బీఆర్ఎస్ హైకమాండ్​ఆయనకు జహీరాబాద్ టికెట్ ఇచ్చింది. 2024 ఏప్రిల్ నాటికి జహీరాబాద్ లోక్ సభ స్థానం పరిధిలో మొత్తం 16.39 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 8,00,841 మంది ఉండగా.. 8,38,333 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు
జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్‌లో మొత్తం 7 శాసనసభ నియోజకవర్గాలు ఉండగా.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అందులోని నాలుగు స్థానాల్లో కాంగ్రెస్‌, రెండింట్లో బీఆర్ఎస్, మిగిలిన ఒక్క నియోజకవర్గంలో బీజేపీ గెలించింది. కామారెడ్డి జిల్లాలోని జుక్కల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి తోట లక్ష్మీకాంత రావు, ఎల్లారెడ్డి స్థానం నుంచి మదన్ మోహన్ రావు గెలిచి హస్తవాసి చూపించారు. ఇక అదే జిల్లాలోని బాన్సువాడ నియోజవర్గం నుంచి ఏడోసారి ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఇక రాష్ట్రం మొత్తం షేక్ అయ్యేలా షాక్‌ చేశాయి కామారెడ్డి నియోజవర్గం ఫలితాలు. ఓ వైపు రెండు సార్లు సీఎంగా చేసిన కేసీఆర్, ఇంకోవైపు కాంగ్రెస్ సీఎం అభ్యర్థి రేవంత్ రెడ్డి.. ఇలా ఇద్దరినీ ఒంటి చేత్తో ఓడగొట్టి.. కామారెడ్డి గడ్డపై బీజేపీ జెండా ఎగరేశారు కాటిపల్లి వెంకట రమణారెడ్డి. ఇక.. సంగారెడ్డి జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండింట కాంగ్రెస్ జెండా ఎగిరింది. నారాయణఖేడ్‌లో పటోళ్ల సంజీవరెడ్డి, ఆంధోల్ నుంచి దామోదర రాజనర్సింహా కాంగ్రెస్ అభ్యర్థులుగా నిలిచి గెలిచారు. దామోదర రాజనర్సింహా.. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక జహీరాబాద్ అసెంబ్లీ నియోజవర్గం నుంచి బరిలో దిగిన బీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్ రావు గెలిచారు.

Kavya will win the Warangal Parliament seat


click on the below link for E-Paper
https://epaper.netidhatri.com/view/254/netidhathri-e-paper-special-edition

·Kavya win is like cakewalk

·All sections are supporting her

·Women folk fully supporting Kavya

·It is difficult for BRS & BJP to win the seat.

·Warangal became strong hold for Congress

·No address for BRS

·BJP show is very limited

·Kavya has in forefront in her campaign

·Women giving her grand welcome

·Villages showing mark of celebrations

·Not caring the scorching sun, party workers participating in campaign.

·There are no differences

·When party is strong, such type of allegations are common

·Congress don’t want to lose these elections

·Being in power Congress intend to get victory in every seat

·Cleaver strategy of Kadiyam will make Congress to gain all seats

·Srihari raised on his own talent

·Srihari has no corruption allegations

·Srihari’s strait-forwardness is boon to Kavya

·Kavya’s victory shows the unity in Warangal Congress

HYDERBAD,NETIDHATHRI:
Kavya’s victory as Congress candidate from Warangal Parliamentary seat looks likes a cakewalk. She has very good reputation as doctor and social worker added to her father Kadiyam Srihari known for his strong leadership qualities. Now there have been intensive discussions on Kavya victory. When Kavya name came into forefront, immediately expectations on her reached to high level. Her father Kadiam Srihari has been playing key role in Warangal politics and has the name as timely and strong leader. He knows well the problems faced by the people of Warangal and he can show the solutions for the plights of the masses. This is the main reason for him to get the name as good political leader in all parties. Leaders belong to all parties always respects him by keeping aside their ideological differences. In whatever party he joined, there he treated in respectful manner and gave him posts those suitable to his qualities. He not only commanded the district politics but also played a key role in the development of Warangal. Such standard political career of Kadiyam now became advantageous for his daughter Kavya who has been contesting in these elections. Since her child hood she participated in social service activities. As a doctor she has been giving relentless services to poor people. She always shows her affection and love for poor. In previous, people used to exhibit their indifference towards government treatments. When Kavya entered into this medical profession, she successfully transformed the opinion of people on government treatment and made them to attract towards it. As a teacher Kadiyam Srihari shaped the future generations. As a successful leader he has shown right path to youth. As responsible father he made his daughter to know well about social service and social responsibility. The training given by her father, shaped her as an efficient leader and able to attract the people with her good qualities. With the backing of strong national party Congress, support of leaders and with good family background the victory becomes like cakewalk for her in these elections.

In Warangal Parliamentary Constituency now only the name of Kavya is well known to everybody. Other leaders don’t have either such reputation or strong leadership qualities. In Warangal politics Kadiyam Srihari is being treated as ‘Bhishma’. Number leaders have grown under the shadow of Srihari. Kadiyam is nothing but a ‘political school’. He has got well reputation and strength. Now in the state Congress is in power. Warangal has become strong hold for this party because the six guarantees given are successfully being implemented in the district. This caused to raise confidence among people on Congress Party. After coming to power under the leadership of Revanth Reddy, Congress party is giving a responsible and transparent rule to the state. This made the people to extend their full support for this party. So as a party candidate Kavya receiving grand welcome from women where ever she went to participate in campaign. When ticket announced for Kavya, at a time political atmosphere totally changed in the district and leaders of other parties began to feel like oppressively sultry. Now all district level, regional level leaders are being working hard for the victory of Kavya. Victory is confirmed, but all of them have been trying to get thumping majority.
The response coming to Kavita causing other party leaders to fell in distress and they have been losing their hopes on their victory. Every where Kavya’s swift actions and new techniques following in campaign making other party leaders to fell in dilemma and making them unable to come to one conclusion on how to resist her in these elections. BRS lost its strong hold in the district which treated as strong fort for it. In previous elections BRS lost number of MLA seats to Congress. Now Congress occupied the once BRS position and keeping its strength in the district. After ten years in opposition, Congress now gained advantageous position in the district. This will facilitate Kavya to win the elections very easily. Now all Assembly segments in Warangal are now in the hands of Congress party. That is why Kavya victory is confirmed. When we come to BJP, it has no potential voters in the districts. So we can’t take this party as strong rival. Being National Party it has been contesting the seat. That’s all! It has either strong leaders or party workers in the district.
At National level also Congress is showing very good performance. During the ten years rule BJP squeezed the people with high prices for all types’ commodities. Immediately after coming to power BJP Government raised the petrol and diesel prices. Majority projects now present in the country were built by Congress only. Devadula project which treated as life line for North Telangana had the key role of Kadiyam Srihari. Since Independence Congress party gave its services to people in all fronts of life. During the ten years of rule of BJP, people have fed up with its policies and decided to send it back to ‘political garage’. The advent of Congress only can transform the state and country into green carpet. Medical and farming sectors will show remarkable growth. It will provide food to poor. Hegemony caused by the people supported by BJP will exploit the poor. Such issues turn into advantageous for Congress Party.
Kavya has grown in the support and guidance of her father Kadiyam Srihari, developed serving nature in inherent manner. She very much likes the poor and always ready to serve them. Kavya now adopted two children belong to inavolu who lost their both parents. This is the best example of her kindly nature towards destitute. Now she stood in support of these two children and wanting to give them better future. People of Warangal know well the service activities done by Kavya. That is why they are positively responding towards her. Now Kavya victory confirmed but how much majority she will get is the question.

ఎన్నికల ప్రచారంలో Z స్పీడుతో దూసుకెళ్తున్న బూర

భువనగిరి పార్లమెంట్ అభివృద్ధి నా లక్ష్యం: *డాక్టర్ బూర నర్సయ్య గౌడ్*

*పోచంపల్లి పట్టణ కేంద్రంలో భారీ ర్యాలీ*

*నేటిధాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా…*

భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పోచంపల్లి పట్టణ కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుత బిజెపి ఎంపీ అభ్యర్థి *డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారు*
అనంతరం వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.

మోసపోతే గోసపడతాం
అభివృద్ధిని చూసి ఓటెయ్యండి
దొంగ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
రైతులకు డిసెంబర్ 9న 2లక్షల రుణమాఫీ ?
రైతులకు రైతుబంధు 15000 రూపాయలు?
పౌలు రైతులకు రైతుబంధు ?
ఆసరా పింఛన్లు 4000 రూపాయలు ?
18 సంవత్సరాలు నిండుగా మహిళలకు 2500 ?
విద్యార్దులకు స్కూటిలు ?
కల్యాణలక్ష్మి 1 లక్ష రూపాయలు తులం బంగారం?
ఇందిరమ్మ ఇండ్లకు 5 లక్షలు ?
ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయకుండా దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నైన నన్ను కమలం పువ్వు గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు *పాశం భాస్కర్ గారు* రాష్ట్ర నాయకులు *గూడూరు నారాయణ రెడ్డి గారు* బిజెపి జిల్లా మరియు మండల గ్రామస్థాయి నాయకులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Exit mobile version