జాతీయ మాల మహానాడు రాష్ట్ర ప్రచార కార్యదర్శి పెంటయ్య
కొల్చారం,( మెదక్) నేటిధాత్రి :-
భారతదేశంలో కొనసాగుతున్న అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థకు రక్షణ కవచంలా ఉన్న భారత రాజ్యాంగాన్ని మార్చితే సహించబోమని జాతీయ మాల మహానాడు ప్రచార కార్యదర్శి ఆకుల పెంటయ్య, జిల్లా అధ్యక్షుడు సంజీవ అన్నారు. మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారంలో మాట్లాడుతూ జాతీయ మాల మహానాడు రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఆకుల పెంటయ్య జిల్లా అధ్యక్షుడు సంజీవల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిజెపి నాయకులు 400 ఎంపీ సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తాం అంటున్నారని, అలా మారిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అన్యాయం జరుగుతుంది కావున రాజ్యాంగం మార్పును సహించబోమని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జాతీయ మాల మహానాడు రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఆకుల పెంటయ్య, జిల్లా అధ్యక్షులు సంజీవ, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు దాడి నరేష్, ఉపాధ్యక్షుడు తాళ్ల ఆనంద్, నర్సాపూర్ అధ్యక్షుడు గోవు యాదగిరి, కేశవులు, లక్ష్మణ్, రవి, వినోద్ తదితరులు పాల్గొన్నారు.