వనపర్తి నేటిదాత్రి ;
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా వనపర్తి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శుక్రవారం నుండి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైనట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ తెలిపారు. అత్యవసర సేవల సిబ్బంది, పోలింగ్ రోజున ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఐ.డి. ఒ.సి. లో ఫెసిలిటేశన్ సెంటర్ ఏర్పాటు చేసి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు.
పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుంది. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కొరకు మొత్తం 8 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందఈ 240 మంది ఉద్యోగులు తమ ఓటు ను పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకున్నార ని కలెక్టర్ తెలిపారు
హోమ్ ఓటింగ్ ద్వారా మొదటి రోజు దివ్యంగుల 40 మంది, 85 సంవత్సరాలు వయస్సు దాటిన ఓటర్లు 75 మంది వెరసి 115 మంది హోమ్ ఓటింగ్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి పర్యవేక్షించారు.
–
