దుగ్గొండి మండల కేంద్రంలో నర్సంపేట పోలీస్ శాఖ సబ్ డివిజన్ ఫోర్స్ ఆధ్వర్యంలో రాబోయే పార్లమెంటు ఎన్నికల దృశ్య పోలీస్ ఫ్లాగ్ మార్చి నిర్వహించారు. దుగ్గొండి మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై సుమారు కిలోమీటర్ మేర పోలీసులు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సంపేట ఏసిపి కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా ఉన్నారు జరిగేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఎలాంటి ప్రలోభాలకు లోనవ్వకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల్లో ఓటు హక్కు శాతాన్ని పెంచుకోవాలని ప్రజలను కోరారు. శాంతి భద్రతలపై ప్రజల్లో నమ్మకం కలిగేందుకు పోలీస్ కవాతు నిర్వహించినట్లు ఏసిపి తెలిపారు. ఈ కార్యక్రమంలో దుగ్గొండి సిఐ రాజగోపాల్,నర్సంపేట టౌన్ సిఐ రమణ మూర్తి,నెక్కొండ సిఐ చంద్రమోహన్,దుగ్గొండి ఎస్సై పరమేష్ లతో పాటు నల్లబెల్లి, నర్సంపేట, చెన్నారావుపేట, నెక్కొండ, ఖానాపురం మండలాల ఎస్సైలు రామారావు, అరుణ్ కుమార్, ప్రవీణ్, రఘుపతి, ఏఎస్ఐ లు, సిబ్బంది పాల్గొన్నారు.
`గెలవని రాజకీయం కోసం ఆరాటం అవసరమా? అని ‘‘నామా’’ అనుకుంటున్నారా!
`కేసీఆర్ రోడ్ షో ఊపు తెచ్చినా ‘‘నామా’’ నిస్తేజంలోనే వున్నారా?
`‘‘నామా’’ వ్యవహారం బిఆర్‌ఎస్‌కు గండమేనా!
హైదరాబాద్,నేటిధాత్రి:
ఖమ్మం జిల్లా అంటేనే కాంగ్రెస్‌కు కంచుకోట. ఆది నుంచి అక్కడ పాగా వేసిన పార్టీలలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు, తర్వాత తెలుగు దేశం పార్టీలకు ఆదరణ ఎక్కువ వుంటుంది. తెలంగాణ వచ్చినా అక్కడ బిఆర్‌ఎస్‌కు పెద్దగా గుర్తింపు లేదు. ప్రజల ఆదరణ అంతగా ఎప్పుడూ లేదు. బిఆర్‌ఎస్‌ను ఖమ్మంలో విస్తరించాలని, బలపడాలని కేసిఆర్ చాలా ప్రయత్నం చేశారు. కానీ కుదరలేదు. ప్రజలు తెరాస వైపు చూడలేదు. ఖమ్మం జిల్లా ఒక రకంగా చెప్పాలంటే ఎంతో చైతన్యవంతమైన జిల్లా. ప్రజా పోరాటాల జిల్లా. సామాజిక చైతన్యం ఎక్కువగా వున్న జిల్లా. అణచివేతను ప్రశ్నించిన జిల్లా. అలాంటి జిల్లాలో తెలంగాణ ఉద్యమం ఎంత సాగినా బిఆర్‌ఎస్‌ను మాత్రం ప్రజలు ఏనాడు ఆదరించలేదు. అది ఆ పార్టీకి తీరని నష్టాన్నే మిగిల్చింది. పార్టీని పటిష్ఠం చేసే నాయకులను కాదని, పార్టీని బ్రష్టు పట్టించే వారిని ఏరి కోరి కేసిఆర్ అందలమెక్కించాడు. ఇప్పుడు అనుభవిస్తున్నాడు. అలాంటి నిరసనల నుంచి, తిరుగుబాటు నుంచి తనదైన శైలిలో రాజకీయం నెరిపిన నాయకుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులలో ఖమ్మం జిల్లా రాజకీయాలను శాసిస్తున్న నాయకుడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అలాంటి నాయకుడి హవా నడుస్తున్నప్పుడు ఇతర పార్టీల నాయకుల మనుగడ ఎంతైనా ప్రశ్నార్థకమే. అందుకే ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్ మరింత బలపడుతోంది. బిఆర్‌ఎస్ రోజు రోజుకూ దిగజారుతోంది. ఎన్నికలంటే నామినేషన్ వేసిన రోజు నుంచి చివరి ఓటు ఈవిఎంలో నిక్షిప్తమయ్యే దాకా పోరాటం చేయడమే అసలైన పరీక్ష. కానీ ఈసారి పార్లమెంటు ఎన్నికలలో ప్రకార సమయంలోనే ఖమ్మంలో బిఆర్‌ఎస్ పార్టీ చేతులెత్తేసినట్లుంది. ఖమ్మం పార్లమెంటు సీటు మీద బిఆర్‌ఎస్‌కు ఆశలు లెనట్లే! కనిపిస్తోంది. బిఆర్‌ఎస్ అభ్యర్థి బలమైన నాయకుడుగా పేరు మాత్రం వుంది. గతంలో పార్టీ పేరు చెప్పుకొని రాజకీయాలు చేసిన నామా నాగేశ్వరరావు గడ్డు రోజులను ఎదుర్కొంటున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన పోటీ చేసేందుకు విముఖత చూపించాడు. తన వల్ల కాదని బిఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు చెప్పడం జరిగింది. అయినా ఆ పార్టీకి దిక్కు లేక, తప్పని పరిస్థితులలో నామా నాగేశ్వరరావు ను బిఆర్‌ఎస్ బరిలో నిలిపింది. అయినా ఆయనకు ఎలాంటి నమ్మకం లేదు. కనీసం రెండో స్థానం కూడా దక్కదని నామాకు తెలుసు. అందుకే బిఆర్‌ఎస్ పెద్దగా ప్రచారం కూడా చేయడం లేదు. ఏదో నామ మాత్రపు ప్రచారం మాత్రమే సాగిస్తున్నారు. తాను గెలిచే పరిస్థితులు లేనప్పుడు నాయకులను పిలిచి, కార్యకర్తలకు ఖర్చు చేయడం వృధా అనుకుంటున్నారట. ఎగిరెగిరి దుంకినా అదే కూలి…ఎగరకుండా దుంకినా అదే కూలి అన్నట్లు, ఎంత ప్రచారం చేసినా పడే ఓట్లే పడతాయి. గెలిచే అవకాశం ఎలాగూ లేదని నామా నిర్థారించుకున్నాడట. అందుకే ప్రచారం తూతూ మంత్రంగానే సాగిస్తున్నట్లు సమాచారం. ఖమ్మంలో ఎటు చూసినా కాంగ్రెస్ ప్రచరమే కనిపిస్తోంది. కాంగ్రెస్ గెలుపు గురించే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి గెలుపు గురించే చర్చ జరుగుతోంది. పైగా ఖమ్మంలో కాంగ్రెస్ పటిష్ఠంగా వుంది. కమ్యూనిస్టుల మద్దతు కూడా వుంది. ఖమ్మం జిల్లా నుంచి ఒక్క బిఆర్‌ఎస్ అభ్యర్థిని అసెంబ్లీ గెటు తాకనివ్వను అని శపధం చేసి మరీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌కు ఎదురులేదని, తనకు తిరుగులేదని నిరూపించాడు. ఇప్పుడు జిల్లా మంత్రిగా వున్నారు. ఖమ్మం పార్లమెంటు గెలుపును తన భుజ స్కందాల మీద వెసుకున్నాడు. శాసనసభ ఎన్నికలలో ఎలాగైతే అన్నీ తానై చూసుకున్నాడో..ఇప్పుడు కూడా అదే బాధ్యతను తీసుకున్నాడు. కాంగ్రెస్‌ను గెలిపించి తీరుతానంటున్నాడు. అందుకే ఖమ్మంలో ఎగిరేది మూడు రంగుల జెండానే అన్నది అందరికీ అర్థమైంది. ప్రజల నాడి కూడా అలాగే వుంది. పైగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నాయకత్వం మీద ప్రజలకు అచెంచలమైన నమ్మకం, విశ్వాసం వుంది. అందుకే ఖమ్మంలో కాంగ్రెస్‌కు ఎదురులేకుండా తయారైంది! తిరుగులేని శక్తిగా పొంగులేటి నాయకత్వంలో పటిష్ఠంగా వుంది. జిల్లా వ్యాప్తంగా పొంగులేటి మాటంటే ప్రజలకు వేదంగా మారిపోయింది. అదే ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తుండడం గమనార్హం. సీనియర్ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు వున్నారు. జిల్లా రాజకీయాల మీద ఆయనకు కూడా తిరుగులేని పట్టుంది. ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క కూడా అదే జిల్లా కావడం, జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే వుండడం కాంగ్రెస్ గెలుపు నల్లేరు మీద నడకే అవుతుంది. ఇన్ని సానుకూల అంశాల మధ్య బిఆర్‌ఎస్‌కు చోటు దొరకడం అంటే అంత సులభం కాదు. అసలు బిఆర్‌ఎస్ జెండా పట్టుకునే వాళ్లే ఖమ్మంలో లేరు. నాయకులే ప్రచారం చేయడానికి ముందుకు రావడం లేదు. అభ్యర్థి నామా నాగేశ్వరరావు ప్రచారం చేసుకోవడానికే పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కేసిఆర్ బలవంతం మీద, అభ్యర్థులు దొరక్క నామాను బరిలో నిపిరారు. సిట్టింగ్ ఎంపిగా వుండి పోటీ చేయకపోతే పరువు పోతుందని కేసిఆర్ ఒప్పించి నామాను బరిలో నిలిపారు. అప్పటికే బిఆర్‌ఎస్ సిట్టింగ్ ఎంపిలు కొందరు కారు దిగి వెళ్లిపోయారు. వరంగల్ లో కావ్యకు బిఆర్‌ఎస్ టికెట్ ప్రకటించిన తర్వాత ఆమె కారు దిగారు. హస్తం గూటికి చేరారు. వరంగల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఏ లెక్కన చూసినా బిఆర్‌ఎస్ ఎప్పుడో డీలా పడిపోయింది. అందువల్ల ఖమ్మంలో బిఆర్‌ఎస్ ఆశలు ఆవిరే! అన్నది అందరూ చర్చించుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ పార్లమెంటు ఎన్నికలలో కూడా అసెంబ్లీ ఫలితాలే పునరావృతం కానున్నాయి. పార్లమెంటు ఎన్నికలలో కూడా తొలి బోణీ ఖమ్మం నుంచే వుంటుందని అందరూ అనుకుంటున్నారు. ఇదిలా వుంటే ఖమ్మంలో ఇప్పట్లో కారు కదలడం కష్టమే. మొత్తంగా కారుకు ఈ ఐదేళ్లూ కష్టకాలమే! ముఖ్యంగా ఖమ్మంలో బిఆర్‌ఎస్ కోలుకోడం అంటూ జరిగే సూచనలు భవిష్యత్తులోనూ కనిపించేలా లేదు. అంతే కాకుండా బిఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నామాను నమ్మినందుకు కారు నామాలే! మిగిలే అవకాశం వుందని సెటైర్లు వేస్తున్నారు. నామా వల్ల బిఆర్‌ఎస్ పరువు గోదారి పాలే! అని బిఆర్‌ఎస్ మీద సానుభూతి చూపిస్తున్నారు. ఇక ఖమ్మంలో కారుకు చోటులేనట్లే! కారు కాంగ్రెస్ జోరు తట్టుకోవడం కష్టమే! అసలే బిఆర్‌ఎస్ ఓడిపోయి వుంది. ఓడిపోయిన తర్వాత ఒక్కొక్కరూ కారు దిగుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే బిఆర్‌ఎస్ పుట్టెడు కష్టాలలో వుంది. అలాంటి సందర్భంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముందు నిలబడడం అంటేనే ఫలితాలు ఎలా వుంటాయన్నది ఎన్నికల దాకా ఆగాల్సిన పని లేదు. ఎన్నికల నాటికి నామాకు మిగిలేవి నామాలే! అంటున్నారు. ఇప్పటి వరకు ఖమ్మంలో మంత్రి పొంగులేటిదే హవా! మామూలుగా నడవడం లేదు. ఆయన ఒక్క పిలుపిస్తే జిల్లా మొత్తం కదిలేలా వుంది. అంతగా ఆయన నాయకత్వం పెరిగిపోయింది. ఇలాంటి సందర్భంలో కేసిఆర్ రోడ్ షో కష్టం వృధాయే! అనే మాటలే వినిపిస్తున్నాయి. ఎన్నికల పరుగు పందెంలో బిఆర్‌ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఎప్పుడో వెనుకబడి పోయాడు. ఆయనకు గెలవాలన్న కసి లేదు. గెలుస్తానన్న నమ్మకం లేదు. గెలిపించే యంత్రాంగం లేదు. ఆయన వెంట నడిచే నాయకులు లేరు. ముందుకు నడిపించేంత పెద్దలు లేదు. అందుకు అవరమయ్యే ఖర్చు చేసేందుకు నామా సిద్ధంగా లేడు. ఖర్చు పెట్టాలన్న ఆలోచన ఎలాగు లేదు. ఓడిపోయే సీటుకు ఖర్చు పెట్టినా ఒకటే, పెట్టకపోయినా ఒకటే అంటున్నారు. గెలవని రాజకీయం కోసం ఆరాటం అవసరమా? అనుకుంటున్నారా! అన్న మాటలే జిల్లా వ్యాప్తంగా సర్వత్రా వినిపిస్తున్నాయి. కేసిఆర్ రోడ్ షో ఊపు తెచ్చినా నామా నిస్తేజంలోనే వున్నారని, ఇప్పుడున్న పరిస్థితులలో జనం రావడం వేరు…ఓట్లు వేయడం వేరు. వచ్చిన జనం ఓటు బ్యాంకు అనుకుంటే కష్టమనే సత్యం నామా నాగేశ్వరరావుకు తెలియంది కాదు. శని వారం నామా నాగేశ్వరరావు టిడిపి కార్యాలయానికి వెళ్తే పెద్ద ఎత్తున నిరసన సెగ కూడా తగిలింది. ప్రజలు ఆదరించకపోయినా ఫరవా లేదు. కానీ అడుగడుగునా ఎదురు తిరిగి ప్రశ్నిస్తే, నిరసన గళం వినిపిస్తే వున్న పరువు కాస్త పోతుందని నామా నాగేశ్వరరావు గ్రహించారు. అసలు ఈ పార్లమెంటు ఎన్నికల మూలంగా బిఆర్‌ఎస్ వల్ల నామా సుడిగుండాలా లేక, నామా వల్ల బిఆర్‌ఎస్‌కు గండమా? అన్నది కూడా తేలిపోతుంది. ఎందుకంటే నామాకు చెప్పుకోదగ్గ ఓట్లు వస్తాయా? అన్నది కూడా ఆందోళన కలిగిస్తున్న అంశమే కావడం గమనార్హం. ఏది ఏమైనప్పటికీ ఖమ్మం లో పార్లమెంటు సీటు కాంగ్రెస్ గెలుచుకొని గులాబీ జెండాకు జిల్లాలో చోటు లేకుండా చేస్తుందని చెప్పడంలో సందేహం లేదు. రామసహాయం రఘరాం రెడ్డి విజయం నభూతో నభవిష్యతి అనేలా వుంటుందని అంచనా వేస్తున్నారు.
శనివారం భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జి మునుగోడు ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజాగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు నాంపల్లి మండల కేంద్రం రేవెల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపుకై గ్రామ శాఖ అద్యక్షుడు బట్టు శ్రీశైలం ఆధ్వర్యంలో గడపగడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్బంగా మునుగోడు నియోజక వర్గ కోఆర్డినేటర్ బట్టు జగన్ యాదవ్ గారు మాట్లాడుతు గడచిన పది సంవత్సరాలలో అబద్ధాలతో మోసపూరిత మాటలతో మోసం చేసిన బిఆర్ఎస్ , బిజెపి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ వచ్చిన 100 రోజుల్లోనే ఇచ్చిన 6 గ్యారంటీలో ఐదు గ్యారంటీలు అమలు చేసిందనీ పాంచ్ న్యాయ్ ద్వారా రైతులకు, మహిళలకు, యువకులకు, శ్రామికులకు సమగ్రన్యాయం అందుతుందనీ రాహుల్ గాంధీ ప్రధానిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొన్రెడ్డి వెంకటయ్య , చంద్ర రెడ్డీ, లింగ రెడ్డీ నాంపల్లి కాంగ్రెస్ పార్టీ ఓబీసీ అద్యక్షుడు బట్టు శ్రీను , మేకల రాములు కష్పాక రవి , బట్టు రవి, సన్నాయిల కొండల్ వెంకటమ్మ, శివలింగం అయ్యమ్మ, ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉపాధి హామీ కూలీలకు రోజుకు ₹400 రూపాయలకు పెంపు
మాజీ జడ్పీటీసీ చొప్పరి సధానందం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దొడ్డ బాలాజీ
ముత్తారం :- నేటి ధాత్రి
ముత్తారం మండలం ఓడేడు గ్రామం లో ఉపాధి హామీ కూలీలకు, ప్రజలకు పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ను గెలిపించాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ మాజీ జడ్పీటీసీ చొప్పరి సధానందం మాట్లాడుతూ ఎన్నికలు కోడ్ తరువాత 2 లక్షల రైతు రుణమాఫీ అమలు చేయడం జరుగుతుందనీ అన్నారు సోనియా గాంధీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా 5 న్యాయ గ్యారంటీలను ప్రవేశపెట్టడం జరిగింది -కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి పంటకు కనీస మద్దతు ధర,ఉపాధి హామీ కూలీలకు రోజుకు రూపాయలు 400 పెంపు, ప్రతి పేద కుటుంబ మహిళకు ఏటా 1 లక్ష రూపాయలు, ఆరోగ్య బీమా 25 లక్షలు, యువతకు 30 లక్షల ఉద్యోగలు కలిపించడం జరుగుతుంది అని కాంగ్రెస్ నాయకులు అన్నారు -కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 5 న్యాయ గ్యారంటీలను అమలు చేయడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ముత్తారం మండల మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు గోవిందుల పద్మ ఆనంద్ ముత్తారం సింగల్ విండో చైర్మన్ అల్లాడి యాదగిరిరావు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు మద్దెల రాజయ్య ముత్తారం మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు వాజిద్ పాషా ముత్తారం మండల కిసాన్ సెల్ అధ్యక్షులు గాదం శ్రీనివాస్ ఓడేడు గ్రామ శాఖ అధ్యక్షుడు దాసరి చంద్రమౌళి కాంగ్రెస్ సీనియర్ నాయకులు తీగల సత్యనారాయణ రావు కోటగిరి శ్రీనివాస్ రత్న రవీందర్ నాగరాజు దేవుని సది ఎమ్ డి రజాక్ రత్న శంకర్ జిల్లెల్ల రాకేష్ కొలిపాక రవి మంగలి రమేష్ పాల్గొన్నారు
పరకాల నేటిధాత్రి తెలంగాణలో రైతు రుణమాఫీ కావాలంటే కాంగ్రెస్ పార్టీని ఓడించాలని పరకాల పట్టణ బిఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు గంట కళావతి అన్నారు.ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం రైతు బంధు రైతు,రైతు బీమా, మహిళల కోసం కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రపంచంలోనే లేనివిధంగా మన రాష్ట్రంలో అమలుపరిచి ప్రజల సంక్షేమం కోసం కృషి చేశారని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతోనే ఈ సంక్షేమ పథకాలన్నీ బూజు పట్టాయని అన్నారు.పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతేనే రైతన్నలకు రుణమాఫీ జరుగుతుందని, లేకుంటే ఆగస్టు 15 తారీకును మళ్లీ రేవంత్ రెడ్డి పెంచుతాడని గుర్తు చేశారు.రైతన్నలు అందరు ఒక్కసారి ఆలోచించి రైతు పక్షపాతి కెసిఆర్ బలపరిచిన బిఆర్ఎస్ ఎంపి అభ్యర్థి సుధీర్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
బీజేపీ మంథని పార్టీ ఆఫీస్ లో తమిళనాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వినోద్ సెల్వం జిల్లా అధ్యక్షులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి కాటారం సింగిల్ విండో చైర్మన్ చల్ల నారాయణ సమక్షంలో ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామ తాజా మాజీ సర్పంచ్ సముద్రాల రమేష్ బీజేపీ లో చేరారు వారికీ చంద్రు పట్ల సునీల్ రెడ్డి పార్టీ కండువా వేసి పార్టీ లోకి ఆహ్వానించారు ఈకార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబెర్ కొండా పాక సత్యప్రకాష్ కన్వినర్ మల్కామోహన్ రావ్ కో కన్వినర్ నాంపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు….
హన్మకొండ :ములుగు జిల్లా కేంద్రము’లో తీన్మార్ మల్లన్న టీమ్ ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా ఇంఛార్జీ అచ్చునూరి కిషన్ మాట్లాడుతూ మే 27,నా జరిగే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మీ అమూల్యమైనా మొదటి (1) ప్రాధాన్యత ఓటు వేసి “తీన్మార్ మల్లన్న’ను” భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రజా వ్యతిరేక విధానాలు, రాచరిక, నియంత, కుటుంబ పాలనను నిత్యం తన క్యూ న్యూస్ వేదికగా ప్రజలను చైతన్య పరుస్తూ గత బిఆర్ఎస్ ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా నిలిచి అనేకమైనా దాడులు, అరెస్టులు, అక్రమ కేసులు, వంద రోజుల పై చిలుకు జైలు జీవితం గడిపినా కూడా ఎక్కడ, ఎవరికి లొంగకుండా ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ప్రజల పక్షాన గొంతెత్తు కల్వకుంట్ల కుటుంబ పాలనను అంతం చేసేవరకు వెనకడుగు వేయకుండా ధీరుడిలా పోరాటం చేసిన వ్యక్తి తీన్మార్ మల్లన్న’నే అని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. మల్లన్న’కు మీరంతా అండగా నిలిచి మీ గొంతును చట్టసభల్లో వినిపించి, మీ అభివృద్ధి’యే ధ్యేయంగా పనిచేయాలంటే… రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించి ఆశీర్వాదిస్తారని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న టీమ్ వర్ధన్నపేట నియోజకవర్గ ఇంచార్జీ గొర్రె సందీప్ సీనియర్ నాయకులు శేఖర్ నాని, దుర్గం రఘునాథ్, తరుణ్, భాస్కర్, సురేందర్, శ్రీనివాస్, రమేష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
.. ఓట్లు తిట్లు తప్ప చేసిందేమీ లేదు. .. సంక్షేమ పథకాల అమలులో పూర్తిగా విఫలం.
.. బిఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎస్.కె హైమద్.. / రామాయంపేట (మెదక్) నేటి ధాత్రి. / కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి పరిపాలనపై ఏమాత్రం దృష్టి పెట్టడం లేదని బి ఆర్ ఎస్ పార్టీ నాయకుడు ఎస్.కె హైమద్ ఆరోపించారు. బి ఆర్ ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ఏ ఒక్కటి కూడా ఇప్పటివరకు అమలు చేయడం లేదని ఆయన ఆరోపించారు. కేవలం ఓట్లు తిట్లు తప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజా పరిపాలన పై దృష్టి పెట్టడం లేదని అన్నారు. ఎన్నికల్లో వచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా ప్రభుత్వం విఫలమైందని, ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు ఏ ఒక్కటి కూడా అందడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు రైతు బీమా గాని, కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకా లతోపాటు మరిన్ని సంక్షేమ పథకాలు అమలు కావడం లేదన్నారు. ఉచిత బస్సు పేరిట ఆర్టీసీని నష్టాల్లోకి నెట్టి సకాలంలో ప్రయాణికులకు బస్సులు అందని దుస్థితి తీసుకురావడం జరిగిందన్నారు. చాలా చోట్ల మహిళలు బస్సులోని కొట్టుకునే పరిస్థితి దాపురించిందన్నారు. అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తానని మాయమాటలు చెప్పి ఇప్పటివరకు రుణమాఫీ చేయలేదని, రైతుల గురించి పట్టించుకోవడం ప్రభుత్వ మర్చిపోయిందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజలకు కాంగ్రెస్ పార్టీపై ప్రస్తుతం నమ్మకం పోయిందన్నారు. ఇప్పటికైనా కొందరు ఇట్లు తిట్లు మానుకొని ప్రజల సంక్షేమ కోసం ఆలోచించాలని అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం వేములవాడ నియోజకవర్గం చెందుర్తి మండలంలోని మూడపల్లి మర్రి గడ్డ జోగాపూర్ గ్రామలలో ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. చేతి గుర్తుకే ఓటు వేసి రాజేందర్ రావుని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి నాగం కుమార్ పార్టీ మండల అధ్యక్షుడు చింతపండు రామస్వామి పులి సత్యం దారం చంద్రం గుట్ట ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో టిఆర్ఎస్ పార్టీ పాత్ర అజరామరం. రాష్ట్ర సాధన ఏకైక ధ్యేయంగా పార్టీ స్థాపించిన కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను, ఆంధ్ర ప్రాంత నాయకుల పెత్తనంలో తెలంగాణ రాష్ట్రం నిధులు, నియామకాలు, నీళ్లు తరలిపోవడంతో ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని తట్టి లేపారు. దీనికిగాను ప్రతి గ్రామంలోని వివిధ పార్టీలకు చెందిన లీడర్లు అందరూ ఏకతాటి పైకి వచ్చి తెలంగాణ రాష్ట్రం కోసం చివరి వరకు కొట్లాడారు. అందులో ఒకరు చందుర్తి మండల కేంద్రానికి చెందిన మాజీ ఎంపీపీ చిలుక పెంటయ్య. దాదాపు 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో చొక్కా రావు సహచరుడుగా పనిచేసిన ఆయన ఉద్యమ కాలంలో టిఆర్ఎస్ లో చేరి తెలంగాణ రాష్ట్ర సాధన కాంక్షతో కెసిఆర్ నాయకత్వంలోని ఉద్యమంలో పాలుపంచుకున్నారు. ఈ క్రమంలో ఎన్నో సవాలను ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. పలు కేసులు కూడా ఎదుర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా సాగిన ఉద్యమంలో రుద్రంగి మండల కేంద్రానికి చెందిన వెంగల కొమురయ్య దాదాపు 100కు పైగా వివిధ రకాల నిరసనలు తెలుపగా ఆయన వెన్నంటి ఉన్నారు. ఇలా ఉద్యమ కాలంలో మొక్కవోని దీక్షతో కేసీఆర్ ఇచ్చిన ప్రతి పిలుపు స్పందిస్తూ జనాలని పోగుచేస్తూ రోడ్లపై వంటావార్పు నిరసన కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి టిఆర్ఎస్ ప్రభుత్వం మొదటిసారి పగ్గాలు చేపట్టాక పార్టీలోనే ఉంటూ పలు రకాల సమస్యలపై స్పందించారు. అధికార పార్టీకి చెందిన వారైనప్పటికీ మండలంలోని వివిధ రకాల సమస్యలపై గొంతు ఎత్తారు. ముఖ్యంగా మండల కేంద్రం నుండి మోత్కరావుపేట గ్రామానికి వెళ్లే రహదారి సాధనకై అతని కృషి అంతా కాదు. టిఆర్ఎస్ నాయకురాలు తులా ఉమాకి కుడి భుజంగా ఉన్న ఆయన తదనంతరం పలు కారణాలవల్ల టిఆర్ఎస్ పార్టీని విడి తుల ఉమా తో కలిసి బిజెపిలో చేరారు . అయినప్పటికీ ప్రజల కోసం పనిచేయాలని ఉద్దేశంతో మండల రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులుగా ఎన్నికై రైతుల సమస్యలపై పోరాటాలు జరిపారు. తగినంతరం జరిగిన పరిణామాల వల్ల మళ్లీ తుల ఉమా తో కలిసి బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇలాంటి నుండి నేటి వరకు పార్టీ కోసం పనిచేస్తూనే వస్తున్నారు. ప్రస్తుతం జరగనున్న ఎంపీ ఎన్నికలలో బిఆర్ఎస్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ గెలుపే లక్ష్యంగా అలుపెరగని కృషి చేస్తున్నారు. ఈ విధంగా నాటినుండి నేటి వరకు తాను గులాబీ జెండాకు చెందిన వాడిని, దానికోసమే పని చేస్తానని నిరూపిస్తున్నారు. ఈ ఎన్నికలలో వినోద్ కుమార్ గెలుపు కోసం పనిచేస్తున్న అతని కృషి ఫలించాలని ఆశిద్దాం…
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో ఇటీవల కొందరు ఉద్యోగులు ప్రచారంలో పాల్గొంటున్నారని తెలిసింది వారు ఎన్నికల నియమావళి తెలిసి ఉల్లంఘిస్తున్నారా, లేదా తెలవకనా, మాకు రాజకీయ బలం ఉందని అనుకుంటున్నారా, లేదా ఆ నాయకులకు భయపడి ప్రచారంలో పాల్గొంటున్నారా అనేది మండలంలో ప్రస్తుతం చర్చించుకుంటున్న విషయం, ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు ప్రచార కార్యక్రమంలో పాల్గొనకూడదని ఎన్నికల నియమావళి చెబుతుంది కానీ మండలంలో ఆ నియమావళి వీళ్లకు వర్తించటం లేదా అనేది సందేహం, గతంలో సిద్దిపేట జిల్లాలో కొందరు ఉద్యోగులు సస్పెండ్ అయిన విషయం తెలిసిందే, అది తెలిసి కూడా ఉద్యోగులు ప్రచారంలో పాల్గొంటున్నారంటే వారికి ఎంత ధీమా ఉందో తెలుస్తుంది ఏది ఏమైనా ఎన్నికల ప్రచారాలలో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడం అనేది ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుంది, ఇప్పటికైనా ఎలక్షన్ అధికారులు మండలంలో ప్రభుత్వ ఉద్యోగులు ఏ ఏ ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటున్నారు వారిపై నిఘ పెట్టవలసిన అవసరం ఉంది అని ప్రజలు అనుకుంటున్నారు. ఈ విషయంపై ఇప్పటికే జిల్లా కలెక్టర్కు ఉన్నతాధికారి సమాచారం పంపించారనేది విశ్వనీయ సమాచారం, ఏది ఏమైనా తదుపరి చర్య ఉంటుందా చర్యలు ఉండవా అనేవి వేచి చూడడమే.
బిజెపి భూపాలపల్లి అర్బన్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాశీంపల్లిలో వరంగల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి ఆరూరి రమేష్ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది అనంతరం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఈరోజు దేశం లో ఉన్న ప్రజలు సంతోషంగా ఉన్నారంటే దానికి కారణం నరేంద్ర మోడీ అని వారన్నారు 500 సంవత్సరాల కల రామ మందిర నిర్మాణం అయోధ్యలో సహకారం మోడీతో జరిగింది 370 ఆర్టికల్ రద్దుతో కాశ్మీర్ సస్యశ్యామలమైంది త్రిబుల్ తలాక్ రద్దుతో ఎంతోమంది ముస్లిం మహిళలకు న్యాయం జరిగింది అదేవిధంగా అంగన్వాడి సెంటర్లో పౌష్టికాహారం పంపించేది నరేంద్ర మోడీ అని వారన్నారు కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని ఐదు గ్యారంటీలని ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తారు ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచన చేసి వరంగల్ పార్లమెంటు బిజెపి పార్టీ అభ్యర్థి ఆరూరి రమేష్ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని సామల మధుసూదన్ రెడ్డి ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో అర్బన్ ప్రధాన కార్యదర్శి జోరు కృష్ణ కాంత్ బిజెపి నాయకులు మారెళ్ళ సేనాపతి బూత్ అధ్యక్షులు తోటి రాజు అనిల్ మహేష్ సాయి తదితరులు పాల్గొన్నారు
నడి కూడ,నేటి ధాత్రి: వరంగల్‌లో వంద శాతం విజయం బీఆర్‌ఎస్‌దేనని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నడికూడ మండలం వరికోల్,పులిగిల్ల,రాయపర్తి,నర్సక్కపల్లి,నడికూడ గ్రామాలలో బిఆర్ఎస్ కార్యకర్తలతో గ్రామాల వారిగా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో వరంగల్ లో భారీ మెజారిటీతో బిఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ గెలుస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు.ఇటు కాంగ్రెస్‌కు.. అటు బీజేపీకి రాష్ట్రంలో ఒకేసారి ఎదురుదెబ్బ తగలబోతోందని అన్నారు.
మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుచేయడంలో అధికార కాంగ్రెస్‌పై విఫలమైందని అన్నారు. ఇప్పటికే ఆ పార్టీపై ప్రజాగ్రహం పెరుగుతోందని తెలిపారు. తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు బీజేపీకి లేదని విమర్శించారు. వరంగల్‌లో చివరి క్షణంలో కడియం శ్రీహరి కుటుంబం పార్టీకి మోసం చేసిన వ్యవహారంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని అన్నారు. అసెంబ్లి ఎన్నికల సందర్భంగా నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారని వెల్లడించారు. ఇటు రాష్ట్రంలో, అటు దేశంలో చెప్పుకోవడానికి బీజేపీకి ఎజెండానే లేదని, అందుకే మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి గట్టెక్కాలని చూస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నడి కూడ గ్రామ మాజీ సర్పంచ్ ఊర రవీందర్ రావు,మండల అధ్యక్షులు దురిశెట్టి చంద్రమౌళి,నాయకులు నందికొండ గణపతిరెడ్డి, నందికొండ జైపాల్ రెడ్డి,భీముడి నాగిరెడ్డి,తిప్పర్తి సాంబశివ రెడ్డి, నల్లెల లింగమూర్తి, గురిజపల్లి ప్రకాష్ రావు,మేడిపల్లి శోభన్, సుదాటి వెంకటేశ్వర్ రావు, చందా కుమారస్వామి,మాజీ ఎంపిటిసిలు,సర్పంచులు,యూత్ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
శాయంపేట మండలంలోని పదో తరగతి పూర్తయిన విద్యార్థులు ఇంటర్మీడియట్ విద్య కోసము ప్రభుత్వ జూనియర్ కళాశాల అడ్మిషన్ అవ్వడానికి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి, కరపత్రాలతో ఇంటింటా విస్తృత ప్రచారం ప్రచారం చేసినారు.కళాశాల ప్రిన్సిపాల్ శ్రీధర్ మాట్లాడుతూ మా కళాశాలలో ఇంట ర్మీడియట్ కోర్సులు ఎంపీసీ ,బై పిసి ఎంఈసి, సిఇసి ,హెచ్ఇసి, ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగుమీడియం ఉన్నాయి. మా కళాశాలలో ఇంటర్ పూర్తయిన విద్యార్థులు నర్సింగ్, ఉన్నత చదువుల్లో ఉత్తీర్ణత సాధించడమే తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. అదేవిధంగా విద్యార్థి జైన్ అయిన వెంటనే వేల రూపాయల తెలుగు అకాడమీ పుస్తకాలు ఇవ్వబడునని అర్హులైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు ప్రతి సంవత్సరం స్కాలర్షిప్ సౌకర్యం ఉంటుందని, కెరియర్ గైడెన్స్, ప్రతి వారం విద్యార్థులకు ఆటలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందము హిమబిందు, సునీల్ , శైలేందర్, వేణు, కల్పన, మల్లికార్జున్ , డాక్టర్ రవీంద్ర నాయక్, శ్రీనివాస్ సౌజన్య విద్యార్థులు పాల్గొన్నారు.
భద్రాచలం నియోజకవర్గం లో మహబూబాబాద్ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న పోరిక బలరాం నాయక్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించి తీరుతామని దుమ్మగూడెంకాంగ్రెస్ పార్టీ మండలఅధ్యక్షులు లంక శ్రీనివాసరావు (అబ్బులు అన్నారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదేళ్లుగా ప్రజలను దోచుకున్న దుష్ట బీజేపీ పాలనను గద్దెదించి ప్రజా శ్రేయస్సును కోరే కాంగ్రెస్‌కు పట్టం కట్టాలని కాంగ్రెస్ పార్టీ దుమ్మగూడెం అధ్యక్షులులంక శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.దుమ్మగూడెం మండలంలోని వివిధ ప్రాంతాలను సందర్శిస్తూ ఈసారి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మాదిరిగానే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
మహబూబాబాద్ పార్లమెంట్ నుండి ఎంపీ గా పోటీ చేస్తున్న పోరిక బలరాం నాయక్ను అత్యంత భారీ మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపించాలని కోరారు. ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్లి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన మూడు నెలల నుంచి జరుగుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చేయి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలనికోరి ప్రాదిస్తున్నాను భద్రాచలం నియోజకవర్గంలో గతం లోకాంగ్రెస్. పార్టీ చేసిన అభివృద్ధిని సంక్షేమాన్ని పథకాలను నాశనం చేసి దేశాన్ని దివాలా తీసిన బీజేపీ, దుష్టపాలనను అంతమందించాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలని పిలుపునిచ్చారు.దుమ్మగూడెం మండలఅధ్యక్షులు లంక శ్రీనివాసరావు (అబ్బులు )
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల బీఎస్పీ అధ్యక్షులు గుండు ప్రేమ్ కుమార్ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ జిల్లా నాయకులకు లేఖను పంపించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ పరంగా నామీద ఉంచిన నమ్మకాన్ని నాకు ఇచ్చిన పనులను సక్రమంగా నిర్వహించారు ఇప్పుడు ఉన్న అవసరాదృష్ట నేను అధ్యక్ష పదవికి అలాగే పార్టీ క్రియాశీ ల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని దయచేసి జిల్లా అధ్యక్షులకు విన్నపం నా రాజీనామా నీ ఆమోదించగలరని మా యొక్క విన్నపం ఇట్టి రాజీనామాకార్యక్రమంలో పొన్నాల నర్సింలు మునిగే రాజకుమార్ యాదగిరి మహేష్ కిషన్ సురేష్ అజయ్ ప్రేమ్ కుమార్ రాజశేఖర్ వెంకటేష్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట‌్యాల మండలంలోని జూకల్, గ్రామాలలో పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉపాధి హామీ పనులు చేస్తున్న ప్రజలను కలిసి బిఆర్ఎస్ పార్టీ ఎంపి అభ్యర్థి డాక్టర్ మారపల్లి సుధీర్ కుమార్* కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు, అలాగే తెలంగాణా రాష్ట్రంలో గతంలో బిఆర్ఎస్ పార్టీ రైతుల సంక్షేమం కోసం రైతు బంధు, రైతు భీమా లాంటి అద్బుతమైన పథకాలు ఇవ్వడం జరిగిందని వివరించారు కళ్యాణ లక్ష్మితో ఆడబిడ్డల తల్లిదండ్రులకు అండగా నిలబడ్డారని వృద్ధులకు వికలంగులకు ఒంటరి మహిళలకు ఆసరా ఫించన్లతో అండగా నిలబడ్డారని గుర్తు చేసారు గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బోగస్ హామీలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని ఎన్నికల హామీలు అమలు చేయడంలేదని ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఎంపి ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్, మారపల్లి సుధీర్ కుమార్ గారిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మడికోండ రవీందర్ రావు,పుట్టపాక మహేందర్ ఎంపీటీసీల ఫోరం ప్రెసిడెంట్ జంబులా తిరుపతి పిట్ట సురేష్ బాబు గ్రామా శాఖ అధ్యక్షుడు కోడారి రవి డైరెక్టర్స్ గుర్రం మహేందర్ దామెర రాజు జంబుల చంద్రమౌళి చాడ ఆనంద్ రెడ్డి మదాసు సామీదాసు అన్నం సంతోష్ మేకల సాంబయ్య సుర శామ్ శిలపాక అంజి కవాటి రమేష్ ఎలగొండ తిరుపతి కసిరెడ్డి మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు ప్రవీణ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎంపీ అభ్యర్థి రాజేంద్ర రావు గెలుపు కోసం ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని ఆరోగ్యారంటీలలో ఐదు గ్యారంటీలను అమలు చేశామని మిగతా ఆగస్టు లోపు అమలు చేసి తీరుద్దామని ప్రభుత్వ రంగ సంస్థల నమ్ముతూ ప్రజా సంక్షేమాన్ని కుంటూ పడేటట్లు చేసిన ఘనత బిజెపి ప్రభుత్వానిదని అలాగే రాష్ట్రంలో ప్రజలు బి ఆర్ఎస్ బిజెపి పార్టీలను నమ్మే పరిస్థితిలో లేరని రానున్న పార్లమెంటు ఎన్నికల్లో చేతి గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వేలిచాల రాజేంద్ర రావు ను భారీ మెజార్టీతో గెలిపించాలని మండలంలో ప్రతి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తూ ఓటర్లను అభ్యర్థించారు ఇట్టి కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రెటరీ లింగాల భూపతి పట్టణ అధ్యక్షులు నరసింగం గౌడ్ శ్రీకాంత్ గౌడ్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
తంగళ్ళపల్లి మండల నుంచి హైదరాబాదులో ఇందిరా పార్కులో జరిగే మహాధర్నా కార్యక్రమానికి మండలం నుండి ఎమ్మార్పీఎస్పీ నాయకులు బయలుదేరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి బొల్లారం చంద్రం ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు హైదరాబాదులో జరిగే మహా ధర్నా కార్యక్రమానికి బయలుదేరుతూ మొన్న జరిగిన ఎంపీ టికెట్ల విషయంలో కాంగ్రెస్ బి ఆర్ ఎస్ పార్టీ మాదిగల టికెట్లు ఇవ్వకుండా మోసం చేసిందని దాని తీరుకు వ్యతిరేకంగా అలాగే మాదిగ జాతిని మోసం చేస్తున్న తీరుకువ్యతిరేకంగా ఎంపీ సీట్లు మాదిగలకు కేటాయించకుండా మన జాతిని అవమానిస్తున్న తీరుకు నిరసనగా ఈరోజు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో మరియు మోత్కుపల్లి నర్సింలు ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహిస్తున్నారని ఇట్టి కార్యక్రమానికి తంగళ్ళపల్లి మండలం నుండి ముఖ్య కార్యకర్తలు మహా ధర్నా సభకు బయలుదేరుతున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు
వనపర్తి పట్టణంలో 15వ వార్డులో మున్సిపల్ కౌన్సిలర్ బండారు కృష్ణ కొత్తగా బోర్ మోటర్ స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో న్యాయవాది అయిత కృష్ణ మోహన్ పాపిశెట్టి శ్రీనివాసులు కొండ రాము ఆవుల భరత్ ముంత మన్యం మున్నూరు సురేందర్ బండారు రాజు మోహన్ చారి సయ్యద్ ఇంతియాజ్ ఉల్లిగడ్డల వ్యాపారులు కొండ కిషోర్ కొండ మహేష్ వార్డు ప్రజలు పాల్గొన్నారు బోర్ లో కొత్తగా బోరు మోటర్ వేయించినందుకు 15వ వార్డు ప్రజలు మున్సిపల్ కౌన్సిలర్ బండారు కృష్ణ కు ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు . వేసవిని దృష్టిలో ఉంచుకొని బోరు మోటర్ కొత్తగా ఏర్పాటు చేయించినందుకు వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.