కచ్చితముగా కారు గుర్తుకే ఓటు వేస్తాం అంటున్న ఓటర్లు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
చుంచుపల్లి మండలం గౌతమ్ పూర్. గ్రామపంచాయతీలో భువనగిరి శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఖమ్మం ఎంపీ టిఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపే లక్ష్యంగా ఇంటింటికి తిరుగుతూ వాల్ పోస్టర్స్ అంటిస్తూ నామా నాగేశ్వరరావు కారు గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్న శ్రీకాంత్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రచార సమయంలో ప్రజల నుంచి బిఆర్ఎస్ పార్టీకి మంచి స్పందన లభిస్తుందని, కెసిఆర్ పాలనలో అందిన సంక్షేమ పథకాలే బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా ను గెలిపిస్తాయని చెప్పారు. ఆరు గ్యారెంటీలు, హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరని, ప్రజలే స్వయంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీరును విమర్శిస్తున్నారని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి అసలు ఖమ్మం జిల్లాకు ఏం చేసిందో చెప్పి ఓట్లు అడిగితే బాగుండేదని, కాంగ్రెస్ బిజెపిలకు తెలంగాణ ప్రజల ఓట్లను అడిగే కనీస అర్హత లేదని బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకోవడం జరిగిందని కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ దళిత బందు బీసీ బందు మైనార్టీ బందు ఇంకా అనేక సంక్షేమ పథకాల ద్వారా అనేకమంది లబ్ధి పొందినారని మే 13వ తారీకు జరగబోతున్న ఎంపీ టిఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుని అత్యధిక మెజారిటీతో గెలిపించి గౌతమ్ పూర్ కాలనీలో అత్యధిక ఓటు శాతం అయ్యే విధంగా ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఒక్కరిని ఓటు అభ్యర్థించడం జరుగుతుందని వారు అన్నారు ఖమ్మం జిల్లాలో నామ నాగేశ్వరరావుకి తిరుగులేదని వారు ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో గెలుపొందుతారని వారన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి శ్రీకాంత్ రాజు దానియేలు వసంత రాధమ్మ లక్ష్మి కనకం శాంత శ్వేత సింగరి లక్ష్మి మంగాదేవి ఫక్రుద్దీన్ చాకలి పాపయ్య రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.