– ప్రచారంలో దూసుకుపోతున్న గులాబీ దళం
– ‘కాసాని’కి మద్దతుగా కదం తొక్కుతున్న పార్టీ శ్రేణులు
– బిజినెస్ చేసే రెడ్డిలు కాదు.. సేవ చేసే బీసీ కే జైకొడుతున్న జనం
– గెలుపు ఖాయమని దీమా వ్యక్తం చేస్తున్న చేవెళ్ల చెల్లమ్మ సబితమ్మ
– సేవా కార్యక్రమాలే గెలిపిస్తాయంటూ ‘కాసాని’ కుమారుడు వీరేశ్ ధీమా
– తన తండ్రి జ్ఞానేశ్వర్ ప్రజల కోసం పనిచేసే నాయకుడని వెల్లడి
నేటి ధాత్రి, స్టేట్ బ్యూరో:
చేవెళ్ల ఎంపీ ఎన్నికల ప్రచారం నువ్వా నేనా అనేలా సాగుతోంది. ఇక్కడ బీఆర్ఎస్అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్అభ్యర్థి రంజిత్ రెడ్డి మధ్య త్రిముఖ పోరు నెలకొంది. ముగ్గురి మధ్య ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయన్న దానిపై అంచనా వేయలేకపోతున్నారు. ఆది నుంచి చేవెళ్ల పార్లమెంట్సెగ్మెంట్ సంచలన రాజకీయాలకు కేరాప్అడ్రస్. ఈ నియోజకవర్గంలో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అందులో ముఖ్యంగా పరిగి, తాండూర్, వికారాబాద్ పూర్తిగా గ్రామీణ ప్రాంతాలు. చేవెళ్ల, మహేశ్వరం, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌తో పోలిస్తే.. వెనుకబడిన ప్రాంతాలు. ముఖ్యంగా తాండూర్, పరిగిపై పక్క రాష్ట్ర కర్ణాటక ఇన్ఫ్లుయెన్స్ఉంటుంది. చేవెళ్ల, మహేశ్వరం నియోజకవర్గాలు వీటికంటే కొంత వరకు అభివృద్ధి చెందిన సెగ్మెంట్లు. రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి అయితే.. ఆర్థికంగా బలంగా ఉన్న అర్బన్ప్రాంతాలు. అంతేకాకుండా హైదరాబాద్ కు బార్డర్ఏరియాలు కావడంతో రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి లో విభిన్న మతాలకు చెందిన వారు ఇక్కడ ఓటర్లుగా ఉన్నారు. హిందూ ముస్లిం మైనార్టీ వర్గాల ప్రజలు కూడా ఈ ప్రాంతాల్లో ఎక్కువ. ఈ విభిన్నమైన నియోజకవర్గంలో రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలు బలమైన అభ్యర్థులను ఎన్నికల కదనరంగంలో నిలిపాయి. 7 నియోజకవర్గాల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో నలుగురు బీఆర్ఎస్అభ్యర్థులు గెలవగా, మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్అభ్యర్థులు గెలుపొందారు. మహేశ్వరం, చేవెళ్ల, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి కారు పార్టీ గెలుపొందింది. ఇలా ప్రస్తుతం బీఆర్ఎస్, కాంగ్రెస్మధ్యే పోటీ ఉంటుందని స్థానిక సమీకరణాలు చూస్తే అర్థమవుతోంది.
‘బీఆర్ఎస్పార్టీ ఉద్యమ పార్టీ, తెలంగాణ సాధనలో తమ పార్టీ ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. తెచ్చుకున్న తెలంగాణలో పదేండ్ల పాలన సాగించి దేశానికే తెలంగాణకు రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దింది. గెలుపు మాదే’ అని బీఆర్ఎస్చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ముదిరాజ్ చెప్తుండగా, ఆరు గ్యారంటీల హామీతో బీఆర్ఎస్ను ఓడించి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ దిశగా అడుగులు వేస్తోందని, తమదే విజయమని కాంగ్రెస్అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డి దీమా వ్యక్తం చేస్తున్నారు. మోడీ చరిష్మాతో తనదే విజయమని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అంటున్నారు.
సుదీర్ఘ రాజకీయ అనుభవం గల నేత కాసాని జ్ఞానేశ్వర్
చేవెళ్ల బీఆర్ఎస్ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సీనియర్రాజకీయ నాయకుడు. కాసాని ఏ పార్టీలో ఉన్నా.. బీసీ బడుగు బలహీన వర్గాల వాయిస్‌ను వినిపించే గొంతుక. ముఖ్యంగా బడుగులకు న్యాయం జరగాలంటే అది బీఆర్‌ఎస్ ద్వారానే సాధ్యమని నమ్మి పార్టీలో చేరిన వ్యక్తి. చేవెళ్ల నియోజకవర్గంలో స్థానికుడిగా ఆయన ఈ ప్రాంతానికి ఎంతో సేవ చేశారు. ఓ పక్క రాజకీయ అండదండలు, జ్ఞానేశ్వర్చేసిన సేవా కార్యక్రమాలు ఆయన గెలుపునకు మెట్లుగా ఉపయోగపడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆయన సుదీర్ఘకాలం ఇక్కడి ప్రజలతో మమేకపై ఉన్నారు.
సొంత భూములను దానం చేసిన వ్యక్తి ‘కాసాని’
అంతేకాకుండా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎంతోమందికి తన సొంత భూములను కూడా దానం చేసిన ఉదార స్వభావం గల వ్యక్తిగా కాసాని జ్ఞానేశ్వర్‌కు పేరుంది. నిరుపేదలంటే ఆయనకు ప్రాణం .. వారికి ఏదో రకంగా సేవ చేయాలన్నదే ఆయన అభిమతం. గతంలో కూడా రంగారెడ్డి జడ్పీ చైర్మన్‌గా సంయుక్త ఆంధ్రప్రదేశ్రాష్ట్రంలో ఎమ్మెల్సీగా సేవలందించారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా గతంలో పనిచేసిన అనుభవం కూడా ఆయనకు ఉంది. టీడీపీలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు బీఆర్‌ఎస్ లో తనదైన దూకుడు ప్రదర్శించి గెలుస్తాడని నమ్మకంతోనే బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ఆయనకు టికెట్ కేటాయించారు. ప్రజల మనిషి అయిన కాసాని జ్ఞానేశ్వర్ ని ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించి గెలిపిస్తారని ఆయన కుమారుడు వీరేశ్ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్మహేశ్వరం ఎమ్మెల్యే చేవెళ్ల చెల్లమ్మగా పిలిచే సబితా ఇంద్రారెడ్డి కూడా జ్ఞానేశ్వర్‌కు మద్దతుగా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఆమెతో పాటు బీఆర్ఎస్శ్రేణులు కూడా క్షేత్ర స్థాయిలో చెమటోడుస్తున్నారు. దీంతో జ్ఞానేశ్వర్గెలుపు ఖాయమని సబితమ్మ దీమా వ్యక్తం చేస్తున్నారు.
తండ్రికి కుడి భుజంగా కుమారుడు వీరేశ్
కాసాని జ్ఞానేశ్వర్‌కు కుమారుడు వీరేశ్ అన్నీ తానై వ్యవహరిస్తారు. తండ్రి చూపే దారిలో పేదలకు స్వచ్ఛందంగా సేవ చేస్తూ.. ఎంతోమంది నిరుపేదలకు అప్పన్న హస్తాన్ని అందిస్తూ ముందుకు సాగుతున్నారు. అంతేకాకుండా యూత్ లో మంచి పట్టున్న నాయకుడు కూడా. శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, చేవెళ్ల, నియోజకవర్గాల్లో యూత్ ఫాలోయింగ్ లో కాసాని వీరేశ్దిట్ట అని చెప్పొచ్చు. చేవెళ్ల లో ఎక్కువ శాతం బీసీ బడుగు బలహీన వర్గాల ప్రజలే ఉన్నారని వారు తప్పకుండా తమను, బీఆర్‌ఎస్‌పార్టీని గెలిపిస్తారని వీరేశ్దీమా వ్యక్తం చేస్తున్నారు. చేవెళ్లలో బీఆర్ఎస్కు దీటుగా బరిలో నిలిచిన ఇద్దరు రెడ్డి సామాజిక వర్గ నాయకులను ఓడించి తీరుతామని ఆయన శపథం చేస్తున్నారు. ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం నాయకులతో పోరాటం మామూలు విషయం కాదని, అయినా సరే వెనుకడుగు వేయకుండా సాగుతున్నామన్నారు. బీఆర్ఎస్పార్టీ గెలుపొంది తీరుతుందని వీరేశ్దీమా వ్యక్తం చేస్తున్నారు.
కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి సాఫ్ట్‌కార్నర్
కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్వతహాగా మంచి వ్యక్తిత్వం గల నాయకుడు. ముక్కుసూటి మనిషి. న్యాయం వైపు నిలబడే వ్యక్తి తన సొంత జిల్లా ప్రజలకు ఏదో రకంగా సహాయ సహకారాలు అందించాలని ఉద్దేశంతో రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఆయన గొప్ప సంపన్నుడు. ఆయనకు రాజకీయాల అవసరం కూడా లేదు. ఉన్నత విద్యావంతుడు. విదేశాల్లోనే ఎన్నో ప్రశంసలు అందుకున్న వ్యక్తి కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఆయనను బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి అభ్యర్థిగా ప్రకటించింది. దాంతో ఆయన ప్రజల్లోకి వెళ్లి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
బీఆర్ఎస్నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన రంజిత్‌రెడ్డి
ఒకరకంగా చెప్పాలంటే పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రంజిత్ రెడ్డి పై సొంత పార్టీ నేతలే అంటి ముట్టనట్టు ఉంటున్నారు. ఇదే కాకుండా పరోక్షంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఎంపీగా కొనసాగుతూ బీఆర్ఎస్అధికారం కోల్పోగానే కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ పొందడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇవే కాకుండా ఆయనపై ఎన్నో అవినీతి ఆరోపణలు భూ బకాసురుడు అనే ముద్ర కూడా వేస్తున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన ఒక పౌల్ట్రీ వ్యాపారి అయినా రంజిత్ రెడ్డి వ్యాపార పరంగా అప్పట్లో బీఆర్ఎస్లో ఉన్న ఈటల రాజేందర్ తో ఉన్న సన్నితం మేరకు టిఆర్‌ఎస్ లో చేరాడని చేవెళ్ల ఎంపీ టిక్కెట్ కోసం అప్పట్లోనే కోట్ల రూపాయలు పార్టీకి ఇచ్చాడని ఈయనపై ఆరోపణలు ఉన్నాయి. ఇలా ఒక్కొక్కరి నేపథ్యం ఒక్కొక్క విధంగా ఉంది. మరి చేవెళ్ల ప్రజలు ఎవరికి పట్టం కడ్తారో చూడాలి.