-రూ. 55 వేల నష్టం
-బోరున విలపిస్తున్న రైతు
-రైతుకు ఆర్థిక సహాయాన్ని అందించి ఆదుకోవాలని ప్రభుత్వానికి రైతుల విజ్ఞప్తి
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని పిడిసిల్ల గ్రామానికి చెందిన గంట రమణారెడ్డికి చెందిన కాడేద్దు సోమవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షానికి పిడుగుపాటుకు గురై మృతి చెందింది. వివరాల్లోకి వెళితే గంట రమణారెడ్డి అనే రైతు సోమవారం వ్యవసాయ పనుల నిమిత్తం కాడేద్దును తన వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లాడు. ఇంతలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం సంబంధించింది. దీంతో పిడుగుపాటుకు గురైన కాడేద్దు అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో ఆ రైతుకు రూ.55 వేల నష్టం వాటిల్లడంతో బోరున విలపించాడు. అక్కడే ఉన్న తాజా మాజీ సర్పంచ్ నైనకంటి ప్రభాకర్ రెడ్డి, ఆ రైతును ఓదార్చారు. ప్రభుత్వ స్పందించి కాడేద్దు మృతితో రూ.55 వేలను నష్టపోయిన ఆ రైతుకు ఆర్థిక సహాయం అందించి ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.