తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండలం ఓబులాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వెలిచాలా రాజేందర్ రావు ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామంలోని ఉపాధి హామీ కూలీల దగ్గరికి వెళ్లి ఓటు అభ్యర్థించారు అలాగే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారులకు వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ ప్రకారం శ్రామిక న్యాయం ఉపాధి హామీ కూలీలకు 250 రోజుల పనితో పాటు వారికి కనీస వేతనం 400 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ పార్టీ బలపరిచిన అభ్యర్థిని తమ ఓటు చేతి గుర్తుపై వేసి గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు ఇట్టి కార్యక్రమంలో సిరిసిల్ల అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చుక్క రాజశేఖర్ తంగళ్ళపల్లి మాజీ ఉపసర్పంచ్ పెద్దూరి తిరుపతి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్త రవీందర్ గౌడ్ ఓబులాపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు పోచంపల్లి రమేష్ గోగు తిరుపతి వెంకటేశం అంజిరెడ్డి మల్లేశం తదితరులు పాల్గొన్నారు