Farmers Say No to NIMZ Land Acquisition
పద్మశాలి ముద్దుబిడ్డ కొండి కుమార్ కు ఘన సన్మానం
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం చెల్పూరు గ్రామ పంచాయతీ ఎన్నికలలో పదవ వార్డు సభ్యునిగా ఘన విజయం సాధించిన పద్మశాలి ముద్దుబిడ్డ కొండి కుమార్ భూపాలపల్లి జిల్లా ప్రాంత పద్మశాలి సంఘం శ్రీ బార్గవ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది.
ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ, ప్రజల ఆశీర్వాదంతో ఎన్నికై ప్రజాసేవకు అంకితమైన కొండి కుమార్ భవిష్యత్తులో గ్రామ అభివృద్ధి, సామాజిక న్యాయం, సంక్షేమ కార్యక్రమాల అమలులో ముందుండాలని ఆకాంక్షించారు. పద్మశాలి సమాజానికి గర్వకారణమైన ఈ విజయం యువతకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
సన్మానం అందుకున్న కొండి కుమార్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రజలకు, తనకు అండగా నిలిచిన పద్మశాలి సంఘం, శ్రీ బార్గవ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ
,ప్రజల సమస్యల పరిష్కారానికి, గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రాంత పద్మశాలి సంఘజిల్లా అధ్యక్షులు గొనే బాస్కర్ తొపాటు జిల్లా నాయకులు బాగవతం బిక్షపతి క్యాతం సతీష్ కుమార్, కుసుమ కృష్ణమోహన్,వీరాస్వామిల తొపాటు శ్రీ బార్గవ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మాటేటి శ్రీనివాస్, ప్రదాన కార్యదర్శి పేరాల వేంకటేషం, శేర్ కుమారస్వామి,దాసరి సుదర్శన్,ఎల్ల శంకరయ్య ,రవిందర్,బడుగు వెంకటేషం,హరి క్రిష్ణ, గుండేటి రాజయ్య పాల్గొన్నారు.
