Padmaja Takes Oath as Lingayat Samaj Women Secretary
లింగాయత్ సమాజ్ మహిళా కార్యదర్శిగా పద్మజ ప్రమాణం
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలో జహీరాబాద్ లింగాయత్ సమాజ్ మహిళా ప్రధాన కార్యదర్శిగా ఉల్లిగడ్ల పద్మజ ప్రమాణ స్వీకారం చేశారు. లింగయత్ సమాజ అభివృద్ధి కోసం మహిళలను ఏకతాటిపైకి తీసుకొచ్చి పనిచేస్తానని, మహిళల సమస్యలు, హక్కుల సాధనకు ప్రాధాన్యత ఇస్తానని, సమాజ సంక్షేమ కార్యక్రమాల్లో మహిళల పాత్రను మరింత బలోపేతం చేయడమే తన లక్ష్యమని ఆమె తెలిపారు. ఈ ప్రమాణ స్వీకారం లింగాయత్ సమాజంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచే దిశగా ఒక ముఖ్యమైన అడుగు.
